కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/91 పేజీ 1
  • పరిచర్యలో అభివృద్ధి చేసికొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిచర్యలో అభివృద్ధి చేసికొనుట
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు సహాయపడుటకు స్నేహితులు
  • చూపిన ఆసక్తిని వెంబడించుట
  • గురులను పెట్టుకొని వాటిని చేరుకొనుము
  • సిద్ధంగా ఉండడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తి చూపించండి
    మన రాజ్య పరిచర్య—2006
  • ఇంకను అభివృద్ధి చెందుటకు అనుకూలమైన చర్య
    మన రాజ్య పరిచర్య—1992
  • ప్రకటనాపనిలో అంతకంతకూ నైపుణ్యవంతులవండి
    మన రాజ్య పరిచర్య—2008
  • అది ఫలితాల్ని తెస్తే, దాన్నే ఉపయోగించండి!
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 4/91 పేజీ 1

పరిచర్యలో అభివృద్ధి చేసికొనుట

1 అభివృద్ధి చేసికొను విషయంలో ఒక పాత సామెత ఇట్లు చెప్పుచున్నది: “మీరు ఉన్నస్థానముననే ఉండవద్దు. ఉన్న స్థానమునుండి ముందుకు కదలండి.” ఆ సామెత పరిచర్య యందు అభివృద్ధిచేసుకొను విషయంలో ఎంతగా అన్వయించును! మీరు పరిచర్యలో మొదట ప్రారంభమైనప్పుడు రాజ్య వర్తమానముయొక్క క్లుప్తమైన ప్రసంగమును అందించియుండవచ్చును. అయితే కొన్ని సంవత్సరములు గడచినను, ఆ స్థితి నుండి మీరు ఇంకా ముందుకు వెళ్లక, ఉన్న స్థానముననే ఉన్నట్లయిన, మీరేమి చేయవచ్చును?

2 మొదటి మెట్టెమనగా నైపుణ్యముతో బోధించుటకు అవసరమైన జ్ఞానమునివ్వమని యెహోవాపై అడుగుటయైయున్నది. (సామె. 15:14; యాకో. 1:⁠5) రెండవ మెట్టెమనగా మీ ప్రార్థనకు అనుగుణ్యముగా పనిచేయటము, రీజనింగ్‌ పుస్తకములోని చిన్న ప్రసంగములను చదువుచుండుటకు కొంత సమయమును కేటాయించుకొనుము. మీరు ఎక్కువ ఫలవంతంగా ఉపయోగించగలరను ఒకదానిని ఎన్నుకొని అది మీ మనస్సులో స్పష్టముగా ఉండేంతవరకు ఆ ప్రసంగమును పదేపదే చదువుకొనుము. మూడవ మెట్టెమనగా మీరు సిద్ధపడిన ప్రసంగమును అందించునట్లు ప్రాంతములో మీ సహోదరులతోపాటు వెళ్లుము.

మీకు సహాయపడుటకు స్నేహితులు

3 “చేసేదానికంటే చెప్పేది సులభము” అని మీరు అనవచ్చును. నిజమే, కాని అందుకొరకే సహాయము చేయుటకై మీకు స్నేహితులున్నారు. మీరు యౌవనులైనట్లయిన, మీ తల్లిదండ్రులతో లేక ఫలభరితులైన పరిచారకులుగా ఉన్నట్టి అనుభవముగల ప్రచారకులతో మాట్లాడుము. ఇండ్లయొద్ద ప్రజలతో ఎట్లు సంభాషించవచ్చునను దానిని గూర్చి వారిని సలహాలనడుగుము. మీరు ప్రసంగమును అందించునట్లు అభ్యాసముచేయు కార్యక్రమములను వారు సూచించవచ్చును. ఇంటివారివలె నటించి ఇండ్లయొద్ద ఎదురయ్యే సామాన్యమైన ఆటంకములను వారు లేవదీయవచ్చును. అభ్యాసము ద్వారా ప్రజలతో నైపుణ్యవంతముగా సంభాషించుటను మీరు నేర్చుకొనగలరు.

4 మీకు సహాయపడగల ఇతర స్నేహితులను కూడా మీరు కలిగియున్నారు. పయినీరు సేవా పాఠశాలకు హాజరైనందువలనను మరియు అనుభవమువలనను ప్రకటనపనియొక్క కీలకములను తెలుసుకొనియున్న పయినీర్లు ఉన్నారు. మీ పుస్తక పఠనమును నడిపించు సహోదరుడు మరియు సేవాకాపరి కూడా మీతోపాటు ఇంటింటి పనిలో భాగము వహించి ప్రజలతో ఎట్లు మాట్లాడవచ్చునో, వారితో ఎట్లు తర్కించవచ్చునో చూపించు స్థానములో ఉండవచ్చును.

చూపిన ఆసక్తిని వెంబడించుట

5 మన సాహిత్యములను అంగీకరించు ప్రజలకు ఇంకా ఎక్కువ ఆత్మీయ సహాయమును అందించుటలో మనము శ్రద్ధ కలిగియున్నాము. అనగా తదుపరి ఆసక్తిని రేకెత్తించుటకు మనము తప్పక తిరిగి దర్శించవలెను. పునర్దర్శనము చేయుటకు ముందుగా మీరు మొదటిసారి కలిసినప్పుడు ఏమి చెప్పారో దానిని పునర్విమర్శించు కొనినయెడల ఆసక్తిని ఆకట్టుకొనిన ఆ అంశమును ఫలవంతంగా వివరించగలుగుదురు. మనము నాటుచున్నను, నీరు పోయుచున్నను వృద్ధి కలుగజేయువాడు యెహోవాయే అను దానిని మనస్సునందుంచుకొనుము. మాట్లాడుటకు కలిసే ముందు ఆయన నడిపింపుకొరకు అడుగుము. (1 కొరిం. 3:6; 2 కొరిం. 9:10) నేర్చుకొనుటకు మనము ఇతరులకు సహాయము చేయుకొలది, మనము వ్యక్తిగత అభివృద్ధిని చేసుకొందుము.

6 తదుపరి ప్రాముఖ్యమైన మెట్టెమనగా బైబిలు పఠనమును ప్రారంభించి దానిని చేయుట. మీ పరిచారక అభివృద్ధిలో అంత స్థితికి మీరు ఎదగనట్లయిన ప్రార్థనలో యెహోవాను సమీపించుటను కొనసాగించి ఒక గొర్రెలాంటి వ్యక్తిని కనుగొని మేపునట్లు సహాయము చేయుమని ఆయనను అడుగుము. ఒక ఫలవంతమైన బోధకుడు బైబిలు పఠనమును ఎట్లు చేయునో గమనించి ఆయన బోధనా పద్ధతులను అనుకరించుటను మీరు సహాయకరముగా కనుగొనవచ్చును. బోధించుటపైన ది వాచ్‌టవర్‌ ఆగస్టు 1, 1984, పేజీలు 8-17 నందలి సమాచారములాంటి దానిని పునఃసమీక్షించవచ్చును. ఆ విధంగా మీకై మీరు సిద్ధపాటు చేసుకొనుట ద్వారా మీ ప్రార్థనలకు జవాబివ్వబడినప్పుడు పఠనమును జరిపించుటకు మీరు సిద్ధముగా ఉందురు.

గురులను పెట్టుకొని వాటిని చేరుకొనుము

7 ఎక్కువ ఫలవంతమైన బోధ, పునర్దర్శనములను చేయుట, పఠనములను చేయుట మొదలగు గురులను చేరుకొనుటకు సమయము పట్టును. ఆక్సిలరీ పయినీరు, లేక రెగ్యులర్‌ పయినీరు అగు మరొక గురిని మీరు పెట్టుకొనగలరా? పరిచర్యలో అభివృద్ధిని చేసుకొనుటయందు మీరు కొనసాగుకొలది ఇతరులకు మీరు ప్రోత్సాహకరమగు మూలముగా ఉండగలరు. మీరు ఉన్నచోటనే ఉండకుండా స్థిరముగా అభివృద్ధిని చేసుకొనుచుండిన యెహోవానుండి వచ్చు అనేక ఆశీర్వాదములు మీవి కాగలవు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి