శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
ఏప్రిల్ 8తో ఆరంభమగు వారము
పాట 4 (19)
10 ని: స్థానిక ప్రకటనలు. మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకొనబడిన ప్రకటనలు. ఈ వారాంతమునకు ప్రాంతీయ సేవా ఏర్పాట్లను సూచించుము.
23 ని: “సమీపించుచున్న శ్రేష్టమైన పరిస్థితులనుగూర్చిన సువార్తను చెప్పుము.” ప్రశ్నా సమాధానములు. పేరాగ్రాఫ్ 6ను చర్చించునపుడు ఫలవంతమైన ప్రచారకులను ప్రేక్షకులలోనుండి నిర్దిష్టమైన సూచనలను ఇచ్చి, ప్రాంతీయసేవలో ఉపయోగించగల మాట్లాడదగు అంశములపై వ్యాఖ్యానించనిమ్ము. ఈ వ్యాఖ్యానములను ముందుగనే సిద్ధపడియుండునట్లు చూడుము.
12 ని: ఆసక్తిని ఇంకా ఎక్కువగా పురికొల్పునట్లు తిరిగివెళ్లి కలువుము. లివ్ ఫరెవర్ పుస్తకముపై ఆసక్తి చూపిన వారినందరిని జాగుచేయక సరైన సమయమునకు తిరిగి దర్శించుమని ప్రచారకులను ప్రోత్సహించుము. ఆసక్తి చూపినవారిని తిరిగి దర్శించు అవసరతను చర్చించి, అట్లు చేయుటకు అందరికి ఉత్తేజకరమైన ప్రోత్సాహమునిచ్చిన తరువాత, పుస్తకమును అందించినచోట పునర్దర్శనమును ఎట్లు చేయవచ్చునో క్లుప్తమైన ప్రదర్శనను అందించుము.
పాట 6 (4) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 15తో ఆరంభమగు వారము
పాట 87 (47)
10 ని: స్థానిక ప్రకటనలు అకౌంట్స్ రిపోర్టు. చందాముట్టినట్లు తెలియజేసినవాటిని చేర్చుము.
15 ని: స్థానిక అవసరతలు లేక ది వాచ్‌టవర్ నవంబరు 1, 1990 లోని “కంటిన్యూ టు బి రీఅడ్జ్స్టెడ్” అను శీర్షికపై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో ది వాచ్‌టవర్ నవంబరు 1, 1990 లోని “దేవుని వినుటకు మీరు యిష్టపడుచున్నారా?”)
20 ని: ఫలవంతమైన ఉపోద్ఘాతములను సిద్ధపడుము. ప్రాంతీయ పరిచర్యలో ఫలవంతముగా ఉన్న పెద్ద స్థానిక ప్రాంతమునకు తగిన ఉపోద్ఘాతములను సిద్ధపడునట్లు ప్రచారకులకు సహాయముచేయును. రీజనింగ్ పుస్తకమునందలి 9-15 పేజీలపై ఆధారపడి సూచనలిమ్ము. ప్రస్తుత సంభాషణ అంశముతో లేక ఇతర సమయానుకూలమైన అంశముతో ఉపయోగించగల రెండు లేక మూడు ఉపోద్ఘాతములను చర్చించుము. అనుభవముగల ప్రచారకులు రెండు ఇంటింటి సేవా ప్రసంగములను ప్రదర్శించనిమ్ము. సమయము అనుమతించుకొలది ఇంటివారి ఆసక్తిని ఆకట్టుకొనగల ఉపోద్ఘాతములయొక్క విలువను వివరించు స్థానిక అనుభవములను క్లుప్తముగా తెలియజేయుము.
పాట 129 (66) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 22తో ఆరంభమగు వారము
పాట 135 (72)
10 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. సేవా ఏర్పాట్లను తెలియజేసి, ప్రస్తుత పత్రికలనుండి పత్రికా సేవలో ఉపయోగించబడగల ఉన్నతాంశములను చర్చించుము. ప్రస్తుత అందింపును అందించుటలోని అనుభవములను తెలియపరచవచ్చును. మే నెల కొరకు ఆక్సిలరీ పయినీరు సేవను ప్రోత్సహించుము.
15 ని: “మే నెల కొరకు మీ పథకములేమి?” సేవా కాపరిచే ప్రసంగము. ఈ ప్రత్యేక మాసములో వారము మధ్యలో చేయు సేవ మరియు సాయంకాలపు సేవ మొదలగువాటితో కార్యమును విస్తరింపజేసుకొనగల మార్గములను సూచించుము. పయినీర్లు మరియు పరిపక్వతకెదిగిన ప్రచారకులు ఏర్పాటు చేయబడిన సమూహపు కార్యమును (గ్రూప్ ఆక్టివిటి) బలపరచుటకు కొన్ని దిద్దుబాటులను చేసికొనగలరా?
20 ని: “సువార్తను అందించుట-ఆనందముతో.” ప్రశ్నాసమాధానములను పరిశీలన. పేరాగ్రాఫ్ 3 సంబంధముగా పరిపక్వతగల ప్రచారకుడు సంభాషణ అంశమును లేక రీజనింగ్ పుస్తకమును ఉపయోగించి ఇంటింటి సేవా ప్రసంగమును సిద్ధపడునట్లు క్రొత్తవ్యక్తికి సహాయపడుటను ప్రదర్శించుము.
పాట 126 (25) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 29తో ఆరంభమగు వారము
పాట 168 (84)
10 ని: స్థానిక ప్రకటనలు. “మీ సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.” అను దానినుండి ముఖ్యాంశములను ఉన్నతపరచుము. మరియు వారంతపు ప్రాంతీయ కార్య క్రమములో పాల్గొనమని అందరిని ప్రోత్సహించుము.
15 ని: “సమావేశములో నూతనముగా విడుదలైన ప్రచురణలతో పరిచయము కలిగియుండుము.” స్థానికముగా సహాయకరమగు కొన్ని కీలకాంశములను ప్రతి ప్రచురణనుండి నొక్కి తెలుపుతూ ప్రేక్షకులతో సూటిగా చర్చ. ఈ సమాచారమును తమ స్వంతముగా చేసికొనుటలో సహోదరులు ఆలస్యము చేయకూడదు.
20 ని: “పరిచర్యలో అభివృద్ధి చేసికొనుట.” అనుభవముగల ఒక పెద్ద మరియు కొంతకాలము సత్యములో ఉండియు అభివృద్ధి చేసికొనని సహోదరుని పాత్రను నటించు ఒక సహోదరుని మధ్య చర్చ. పేరాగ్రాఫ్ 3 నందు సూచించబడిన అభ్యాస కార్యక్రమమును వారిని క్లుప్తముగా ప్రదర్శించనిమ్ము. పేరాగ్రాఫ్ 4 చర్చించునపుడు ఒక పయినీరు మరియు ఫలవంతమైన ఇంకొక ప్రచారకుడు తక్కువ అనుభవము కలిగిన ఒక ప్రచారకునికి అప్పుడప్పుడు స్థానిక ప్రాంతములో ఎదురయ్యే సమస్యను ఎట్లు ఎదుర్కొని దానితో వ్యవహరించవచ్చునో చూపించనిమ్ము. ది వాచ్‌టవర్ ఆగస్టు 1, 1985 పేజీలు 15-20 నందు హృదయములను చేరుటయందు కనుగొనబడు సూచనలను చర్చలో చేర్చుము. ప్రజలతో సంభాషించు విషయములోను, ప్రజలు ఆసక్తిని చూపిన వెంటనే దానిని అనుసరించుటలోను అభివృద్ధి చెందుటకు ఖచ్చితమైన పథకములను వేసుకొనుమని అందరిని ప్రోత్సహించుటతో భాగమును ముగించుము.
పాట 123 (63) మరియు ముగింపు ప్రార్థన.