సమీపించుచున్న శ్రేష్టమైన పరిస్థితులను గూర్చిన సువార్తను చెప్పుము
1 సమీపించుచున్న నూతనలోకపు వార్తను ప్రకటించుటలో క్రమముగా పాల్గొనుట ఎంతటి ఆనందదాయకమైన ఆధిక్యతయైయున్నది! ఈ వార్తను ఇతరులయొద్దకు తీసుకు వెళ్లుటకు మనమెంతగా ఆశీర్వదింపబడిన వారమైయున్నాము! రాబోవు శ్రేష్టమైన సంగతులనుగూర్చిన ఈ సువార్తను పంచుకొనుకొలది మన స్వంత విశ్వాసము మరియు ఆసక్తి బలపరచబడుతుంది. “యెహోవా మీద పాడుచు ఆయన నామమును స్తుతించుడి” అను హెచ్చరికను గైకొనుకొలది మన హృదయములు ఆనందించును.—కీర్త. 96:2-4.
2 ఈ రాజ్యవర్తమానమును అనుదినము మాట్లాడుటను మీరు మీ గురిగా చేసుకొనుచున్నారా? ఆక్సిలరీ లేక రెగ్యులర్ పయినీరు పనిలో పాల్గొనువారు సాధారణముగా ఈ సువార్తను చెప్పుటలో అనుదిన వంతును కలిగియున్నారు. దీనిని మీరు చేయగలిగియున్నారా? లేనట్లయిన ఏదో కొంత భాగమునైనను, చివరకు తటస్థంగానైనా కొద్ది భాగమును ప్రతిదినము కలిగియున్నారా? దీనిని మనమందరము చేయగలిగినట్లయిన యెహోవాను స్తుతించుటలో అది ఎంత గొప్ప స్వరమైయుండును! రాజ్య నిరీక్షణను ప్రతి దినము ప్రకటించుకొలది యెహోవాయొక్క నిండైన దీవెనలను మీరు అనుభవించుదురు.
3 పరిచర్యయెడల మనకుగల దృక్పథము ఇతరులలో మనము ఎంత తరచుగా సువార్తను పంచుకొనుచున్నామను దానిపై ప్రభావమును చూపగలదు. ప్రజలు జవాబ్వికుండుటనుబట్టి రాజ్యవర్తమానమును అందించుటలో మనము నిరుత్సాహపడుట లేక నిదానించుట జరగకూడదు. బదులుగా, అనుకూల దృక్పథము మరియు రానైయున్న పరిస్థితులను గూర్చిన క్షుణ్ణమైన మెప్పుదలయనేది సువార్తను చెప్పుటలో ప్రతి దినము పాల్గొనుటకు మనము చేయు కృషిని బలపరచగలదు.—లూకా 6:45.
4 ‘యెహోవాకు మహిమ బలములు చెల్లించుట’లో కుటుంబ సభ్యులు కలసి ఐక్యముగా పనిచేయుకొలది అనేక నిండైన దీవెనలను అనుభవించవచ్చును. (కీర్త. 96:7) పరిచర్యలో ఒక కుటుంబముగా పనిచేయుటకు కాలపట్టికను వేసుకొనుటనుబట్టి ఆత్మీయమైన మరియు కుటుంబసంబంధమైన బంధములు బలపరచబడగలవు. రాజ్య నిరీక్షణనుగూర్చి చెప్పుటలో కుటుంబ సభ్యులు సంఘములోని ఇతర కుటుంబములతో కలసి పనిచేయుటకు శనివారములు మరియు ఆదివారములు అత్యంత శ్రేష్టమైన అవకాశములను దయచేయును.
లివ్ ఫరెవర్ పుస్తకమును ఉపయోగించుము
5 ఏప్రిల్ మాసములో మనము లివ్ ఫరెవర్ పుస్తకమును అందించుదుము. ప్రజలు అనుదిన జీవితమునుగూర్చి శ్రద్ధ కలిగియుండి, ఒక సంతోషకర భవిష్యత్తును ఆశిస్తున్నారు. యథార్థహృదయముగల ప్రజలు మానవజాతికి నేడు అతి సామాన్యమైయున్న సమస్యలు ఉండనట్టి దీర్ఘకాల జీవిత ఉత్తరాపేక్షను గూర్చి నేర్చుకొనుటకు ఆనందించుదురు. ఈ నిరీక్షణను గూర్చిన ఖచ్చితమైన జ్ఞానము మరియు త్వరలో అది వాస్తవమౌచున్నదను దానియందలి విశ్వాసము రాజ్యవర్తమానమును అందించుటలో అనుకూలమైన చర్యను గైకొనుటకు మనలను పురికొల్పవలెను.
6 మీ అందింపును ప్రీతికరమైన దానిగా చేయునట్లు మీరు ఏమి చెప్పవలెననుదాన్ని గూర్చి ముందుగనే ప్రార్థన పూర్వకముగా ఆలోచించుము. మిమ్ములను మీరు పరిచయము చేసికొనిన తరువాత మీరు ఈలాగున చెప్పవచ్చును: “మీకు మీ కుటుంబమునకు ఎటువంటి భవిష్యత్తును కలిగియుండాలని మీరు కోరుకొనుచున్నారు? [సమాధానము చెప్పనిమ్ము] మనమందరము జీవితమును ఆనందించుటయేగాక, సాధ్యమైనంత దీర్ఘకాలము జీవించవలెనని మనము కోరుకొందుము. అయినను అనేక సమస్యలు ఉత్పన్నమగుట మన జీవితములకే ప్రమాదకరముగా తయారగుచున్నవి. ఇందువలన దివ్యమైన భవిష్యత్తును నొక్కి తెలియజేయు నిర్దిష్టమైన మాట్లాడదగు అంశములను అనగా లివ్ ఫర్వర్ పుస్తకములోని 9, 11, 13, 161 మరియు 162 పేజీలలోని అంశములవంటి వాటిని ఉపయోగించుము.
7 ప్రకటించుటకు ఎంతటి ఆనందము మరియు విశ్వాసమును బలపరచు వర్తమానము యెహోవా మనకు ఇచ్చియున్నాడు. యెహోవాయొక్క మహత్తైన సంకల్పములయెడల లోతైన మెప్పుగల ఇతరులతో సన్నిహితంగా పనిచేయు గొప్ప ఆధిక్యతను కూడా మనము కలిగియున్నాము. ప్రస్తుతము మనము చేయుపని ఎప్పటికిని తిరిగి చేయబడనిదై, త్వరలో సమాప్తమగునది కావున రాబోవు శ్రేష్టమైన సంగతులను గూర్చిన సువార్తను చెప్పుటకు మనకు దొరకు సమయమును, మూలములను మనము ప్రతిదినము ఉపయోగించవద్దా?