సమావేశములో నూతనముగా విడుదలైన ప్రచురణలతో పరిచయము కలిగియుండుము
1 నూతనముగా విడుదలైనట్టి రెండు ప్రచురణలు అనగా ఒక పుస్తకము. ఒక బ్రోషూరు విస్తారంగా మనం పొందు ఆత్మీయ ఆహారపు సరఫరాకు అదనంగా వచ్చిచేరినవి. “స్వచ్ఛమైన భాష” అను జిల్లా సమావేశములలో విడుదలైన ఈ నూతన ప్రచురణలు మనందరికి స్వచ్ఛమైన భాషను మరెక్కువ విశిష్టతతో మాట్లాడుటకు సహాయపడుటయేగాక ప్రాంతీయ పరిచర్యయందును నిశ్చయముగా ఇవి శక్తివంతమైన ప్రభావమును కలిగియుండగలవు.—జెఫ. 3:9.
2 వాటిలో ఒకటగు ఈ నూతన బ్రోషూరును విడుదల చేయునప్పుడు సమావేశపు ప్రసంగీకుడు ఇలా చెప్పాడు: “ప్రాంతీయ పరిచర్యలో—ఇంటింటిపనియందును, పునర్దర్శనములందును, బైబిలు పఠనములందును—మనము తరచుగా మీరెందుకు రక్తమును తీసుకొనరని అడుగబడుచున్నాము. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చునట్లు మీకు సహాయపడుటకే ఒక నూతన ప్రచురణను విడుదలచేయుట ఆనందముగా ఉన్నది. అదేమనగా హౌ కెన్ బ్లడ్ సేవ్ యువర్ లైఫ్ అను పత్రిక సైజు ఈ బ్రోషూరు.” దానిని జాగ్రత్తగా చదువుట ద్వారా ఈ బ్రోషూరులోని ప్రాముఖ్యమైన సమాచారమును మీరు మీ స్వంతముగా చేసికొనియున్నారా? మీ స్వంత విశ్వాసమును బలపరచుకొనుటకును రక్తమును గూర్చిన క్రైస్తవ దృక్పథమును అర్థము చేసుకొనునట్లు ఇతరులకు సహాయపడుటకు సిద్ధపడియుండుటకును అట్లు చేయుట మీకు ప్రాముఖ్యము.—అ. కార్య. 15:28, 29.
3 ఈ బ్రోషూరులో చక్కగా వ్రాయబడియున్న సమాచారము ఏ వైద్యునికైనను మీ స్థానమును మరియు అభీష్టమును వివరించునట్లు మిమ్ములను ఇంకా ఎక్కువగా సిద్ధము చేయును. అయితే, ఈ బ్రోషూరు ముఖ్యముగా వైద్యులకు లేక న్యాయవాదులకు కాదు. ప్రత్యేకంగా అది ప్రజల కొరకు వ్రాయబడి రూపించబడి యున్నది. దానియొక్క రెండు విధములైన ఉద్దేశ్యము ఈ సమయములో దానినెట్లు అత్యంత విలువైన పనిముట్టుగా చేయుచున్నదో మీరు చూడవచ్చును. దానియొక్క ఒకటి లేక రెండు కాపీలను మీతోపాటు ప్రాంతములోకి తీసుకెళ్లమని సూచించబడుతుంది. మీ వ్యక్తిగత ప్రయోజనముకొరకు మరియు రక్తముయెడల తగిన మర్యాదను చూపునట్లు ఇతరులకు సహాయపడుటకును ఈ విలువైన సమాచారమును పూర్తిగా ఉపయోగించుము.
ఒక క్రొత్త పుస్తకము
4 మనకు పరిచర్యలో సహాయపడుటయందు మ్యాన్కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ అను క్రొత్త పుస్తకపు విలువను ఊరక తలంచుము. దానిని పఠించుటయనునది ఇతర మతములను గూర్చిన స్పష్టమైన గ్రహింపు మరియు వాటి చారిత్రాత్మకమైన వెనుకటి ఆధారమును మనకు ఇచ్చును. క్రీస్తు మత సామ్రాజ్యపు వారికిని అలాగే ఇతర మతములను హత్తుకొనియున్న వారికిని ప్రకటించునట్లు మనము బాగుగా సిద్ధపడియుండుటకు అది మనకు సహాయము చేయును. ఈ 20వ శతాబ్దములో అధికసంఖ్యలో జనాభా ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు తరలివెళ్లుట ఎక్కువగా ఉన్నందున ఇంటింటికి ప్రకటించునపుడు వివిధ భాషలు మరియు మతములవారిని మనము కనుగొనవచ్చును. అప్పుడు ఈ ప్రజలయొక్క నమ్మకములు మరియు ఆచారములను ప్రజలయొక్క నమ్మకములు మరియు ఆచారములను మనము ఎరుగని వారమైయుంటే అది నిజముగా మనకు ఒక సవాలైయుండును. అయితే మన ప్రాంతములో విభిన్న మతములకు సంబంధించిన ప్రజలను ఎదుర్కొనినప్పుడు ఈ క్రొత్త పుస్తకపు సహాయముతో మనము తెలియని వారముగా ఉండనవసరములేదు.
5 ఈ క్రొత్త పుస్తకములోని సమాచారము అందు చర్చించబడిన అంశములందు మంచి పరిచయముగలిగిన వ్యక్తులచే పరిశోధించబడి పునఃసమీక్షించబడినది. కావున ఆ పుస్తకములో కనుగొనబడు వాక్యములను ఉపయోగించునప్పుడు మనము ఎంతో అధికారపూర్వకముగా మాట్లాడవచ్చును. ఈ సమయంలో అటువంటి సమాచారమును అనుగ్రహించుట సమస్త జనాంగముల ప్రజల యెడల యెహోవా కలిగియున్న గొప్ప ప్రేమకు మరొక నిదర్శనమైయున్నది. కావున ఈ క్రొత్త ప్రచురణతో మంచి పరిచయమేర్పరచుకొని విభిన్న జాతి మరియు మత చరిత్రగల వ్యక్తులకు సహాయము చేయుటకై దానిని ఉపయోగించుదము. ఔను, ఈ క్రొత్త ప్రచురణను ఫలవంతముగా ఉపయోగించుటయనునది మనము మన ప్రాంతములో కనుగొనబడు అన్ని విధములైన ప్రజలకు సువార్తను అందిస్తున్నామని గ్రహించుకొనునట్టి తృప్తిని కలుగజేయును.—మత్త. 28:19, 20; తీతు 2:11.