మీ సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి
1 గతములోవలెనే దేవుని సేవకులకు నేడు పరిశుద్ధత దైవికముగా కోరబడునదైయున్నది. అందువలన మనలో ప్రతి ఒక్కరికి పరిశుద్ధత ఏమైయున్నదనేదే గాక ఎట్లు మరియు ఎందుకు యెహోవాయొక్క మన ఆరాధనలో అది ఆవరించినదైయుండవలెనో అర్థము చేసికొను అత్యంత అవసరత ఉత్పన్నమైయున్నది. అందుకొరకే 1991వ సేవా సంవత్సరపు ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమమందు “మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి” అను అంశము చర్చించబడుచున్నది.—1 పేతు. 1:15.
2 పరిశుద్ధుడైన దేవునిగా నీతియుక్తమైన సూత్రములు, మరియు ఆజ్ఞలు ఆయననుండే ఉత్పన్నమగుచున్నవి గనుక మనము ఆనందించు నీతియుక్తమైన స్థానము, ఆయనతో మనకుగల సన్నిహిత, వ్యక్తిగత సంబంధము యొక్క ప్రత్యక్ష ఫలితమైయున్నది. అందుకొరకే కార్యక్రమము దేవునితో మనకుగల సంబంధమును ఎట్లు వృద్ధిచేసికొనవచ్చునో అను అనేక రీతులను కార్యక్రమము చూపించును. ఇందులో ఆయన పరిశుద్ధ కట్టడలకు, అనగా మనము స్వల్పమైనవిగా పరిగణించు వాటియందును విధేయత చూపుట ఇమిడియున్నది. (లూకా 16:10) యెహోవా కోరు పరిశుద్ధమైన వాటియెడల లోతైన మెప్పును పెంపొందిచుకొనుటకు సహాయము చేయబడి, ఇవి మన ఆలోచనా, దృక్పథములు, మార్గములపై ఎందుకు ప్రభావము చూపవలెనో గుర్తుచేయబడుదుము.
3 ఇందులో విశదీకరించబడు రెండు ముఖ్యమైన ప్రసంగములేమనగా “అంతకంతకు శుద్ధిచేయబడునట్లు అప్పగించుకొనుట” మరియు యెహోవా పరిశుద్ధ ప్రజల యొక్క విస్తరింపబడిన కార్యములు.” ఉద్రేకభావములను ప్రేరేపించు లోక సంఘటనలు ప్రతిదినము మన కాలములయొక్క అత్యవసరతను మన మనస్సులపై ముద్రవేయుచుండగా క్రొత్త సేవా సంవత్సరముకొరకైన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమము మనలను మనము పరిశుద్ధతయందు నడిపించుకొనుటద్వారా మార్గదర్శకత్వము కొరకు యెహోవాతట్టు చూచుచు, ఆయనకు ప్రీతికరమైన వారిగా ఉండులాగున చూచుకొనుటకు మనలను ప్రేరేపించును.—1 పేతురు 1:14, 16.