కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/10 పేజీ 2
  • కొత్త బ్రోషురును అందించాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొత్త బ్రోషురును అందించాలి
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2013
  • ఇతరుల ఎడల యథార్థంగా శ్రద్ధవహించడం ద్వారా యెహోవాను అనుకరించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • బ్రోషూర్లతో రాజ్య సువార్తను ప్రకటించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • విభిన్న బ్రోషూర్‌లను మీ పరిచర్యలో ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—1995
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 10/10 పేజీ 2

కొత్త బ్రోషురును అందించాలి

1. మనం నవంబరు నెలలో ఏమి ఇవ్వబోతున్నాం?

1 ‘మెలకువగా ఉండండి!’ అనే ముఖ్యాంశంతో 2009లో జరిగిన జిల్లా సమావేశంలో, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే కొత్త బ్రోషురు విడుదల చేయబడింది. ప్రపంచవ్యాప్తంగావున్న సంఘాలన్నీ నవంబరు నెలలో దీన్ని మొదటిసారిగా ఇవ్వబోతున్నాయి. ఈ బ్రోషురు మన ప్రాంతంలోని ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలామందికి, ముఖ్యంగా క్రైస్తవులుకాని వారికి బైబిలు గురించి అంతగా తెలియదు. కాబట్టి, “బైబిలు సారాంశాన్ని” తెలియజేసేందుకే ఈ బ్రోషురు తయారు చేయబడిందని 3వ పేజీ వివరిస్తోంది.

2. మనం ఈ బ్రోషురును ఎలా ఇవ్వవచ్చు?

2 ఎలా ఇవ్వాలి? క్రైస్తవమతానికి చెందినవారితో ఇలా మాట్లాడవచ్చు: “ఈ లేఖనంపై మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. [2 తిమోతి 3:16 చదవండి.] చాలామంది ఈ మాటలను ఒప్పుకుంటారు, కొందరేమో బైబిలు కేవలం ఓ మంచి పుస్తకమని అనుకుంటారు. బైబిలు గురించి మీరు ఏమనుకుంటున్నారు? [వాళ్లు ఏమి చెప్తారో వినండి.] మన మత నమ్మకాలు ఏవైనా బైబిలును స్వయంగా పరిశీలించడం మంచిది. [3వ పేజీ పైభాగంలో ఉన్న పేరాను చదవండి.] ఈ బ్రోషురులోని బైబిలు సారాంశాన్ని చదువుతున్నప్పుడు, బైబిలంతటిలో ఒకే ముఖ్యాంశం, ఒకే సందేశం ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాన్ని మీరు గమనిస్తారు.”

3. ముఖ్యంగా క్రైస్తవులుకాని ప్రజలే ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రకటిస్తున్నప్పుడు ఈ బ్రోషురును ఇవ్వడానికి ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు?

3 ముఖ్యంగా, క్రైస్తవులు కాకపోయినా బైబిలుపై కొంత గౌరవం ఉన్నవారికి ప్రకటిస్తున్నప్పుడు, ఈ బ్రోషురును ఇవ్వడానికి మరో పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. మీరిలా అనవచ్చు: “తరచూ అణచివేతను, అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మంచి ప్రజలను దేవుడు పట్టించుకుంటాడని మీరనుకుంటున్నారా? [వాళ్లు ఏమి చెప్తారో వినండి.] మీకు ఇష్టమైతే, దేవుడు వారికి ఎలాంటి ఉపశమనాన్ని ఇస్తాడో బైబిలు నుండి చదివి వినిపిస్తాను. [వారు ఒప్పుకుంటే కీర్తన 37:11 చదవండి.] ఇలా జరిగితే, భూమి ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు? [వాళ్లు ఏమి చెప్తారో వినండి.] అన్ని సంస్కృతుల, మతాల ప్రజలకు బైబిలు ఎలాంటి భవిష్యత్తును, ఉపశమనాన్ని వాగ్దానం చేస్తుందో చూపించేందుకు ఇది ఓ ఉదాహరణ.” 3వ పేజీ పైభాగంలో ఉన్న పేరాను చదివి బ్రోషురును ఇవ్వండి.

4. ఈ బ్రోషురుతో మనం బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించవచ్చు?

4 బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించండి: వారి దగ్గరకు తిరిగి వెళ్లినప్పుడు, మొదటిసారి వారితో మీరు ఏమి మాట్లాడారో గుర్తుచేయండి. ఆ అంశం గురించి వివరించే పేజీలో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ ఒకట్రెండు పేరాలు చర్చించండి. ఒకవేళ బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఇవ్వడం మంచిదనిపిస్తే, పుస్తకాన్ని వారి చేతికిచ్చి ఏ అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. తర్వాత ఆ అధ్యాయాన్ని తెరిచి ఒకట్రెండు పేరాలు చర్చించండి. నవంబరులో, ఈ బ్రోషురును ఇచ్చే పనిలో మనమందరం పూర్తిగా పాల్గొందాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి