శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
ఏప్రిల్ 2తో ఆరంభమగు వారము
పాట 108 (95)
7 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు. ఇప్పటికే ఈ మాసములో ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనిన ప్రచారకులను మెచ్చుకొనుము. మరియు అందరిని ఏప్రిల్ నెలలో ఆసక్తితో ప్రాంతములో పాల్గొనమని ప్రోత్సహించుము. సంఘ ప్రాంతీయ సేవా ఏర్పాట్లనుగూర్చి ప్రచారకులకు గుర్తు చేయుము.
18 ని: “అభివృద్ధికర కార్యమునకు సమయము.” శీర్షిక యొక్క ప్రశ్నా సమాధానముల చర్చ. ఏప్రిల్ మరియు మే మాసములకు ఇప్పటికే ఆక్సిలరీ పయినీర్లుగా చేరినవారి సంఖ్యను తెలుపుము. 5వ పేరాను చర్చించునప్పుడు 1990 మార్చి మన రాజ్య పరిచర్యలోని “ప్రత్యేక ఆసక్తిగల పత్రికలు సిద్ధముగా యున్నవి” అను శీర్షికను సూచించుము. ది వాచ్‌టవర్ ఏప్రిల్ 1వ సంచిక ముట్టియున్నట్లయిన అందులోని మాట్లాడదగు అంశములను క్లుప్తముగా ప్రస్తావించుము. జ్ఞాపకార్థదిన ఆచరణ సందర్భముగాను రెండు మాసముల సమయములలోను కార్యమును వృద్ధిచేయు సాధ్యతను పరిశీలించమని అందరిని ఉత్సాహపూరితముగా ప్రోత్సహించుము.
20 ని: “ఏప్రిల్‌లో సర్వైవల్ పుస్తకమును అందించుము” సేవాకాపరిద్వారా ప్రసంగము. మాట్లాడదగు అంశములను ఉన్నతపరచుచు సర్వైవల్ పుస్తకమును ఫలవంతముగా అందించుటకు ప్రచారకులకు సహాయపడుము. 1 నుండి 7 అధ్యాయములు ప్రత్యేకంగా బయటి ప్రజలకొరకు తయారు చేయబడినవి. ఈ అధ్యాయములలోని మొదటిపేరాలలో ఇతరగ్రంథములనుండి ఎత్తివ్రాయబడిన ఏ విషయమునైనను మన సంభాషణా అంశమునకు సరిపడుచున్నట్లయిన యింటివారికి చదివి వినిపించవచ్చును.
పాట 23 (40) ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 9తో ఆరంభమగు వారము
పాట 192 (10)
7 ని: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. మార్చిలో పంపిన చందాలు ఏవైనవుంటే సొసైటి వ్యక్తపరచిన దానిని చేర్చుము. తమ ద్రవ్యసంబంధమైన చందాల ద్వారా రాజ్యపనికి ఉదార మద్దుతునందించినందుకు సంఘమునకు ఉల్లాసముతో మెచ్చుకొనుము. సంఘసేవా ఏర్పాట్లను పునఃసమీక్షించి, తమతమ సేవాగుంపులతో వారంతమున పనిచేయుమని ప్రోత్సహించుము.
10 ని: ప్రశ్నాభాగము. శీర్షికలోని సమాచారముతో పెద్దచే ప్రసంగము. మరియు సొసైటిచే అందించబడియున్న బహు శ్రేష్టమైన టేపురికార్డింగులను నిర్దిష్టముగా సూచించుచు వ్యక్తిగతముగాను, మరియు క్రైస్తవ గృహములయందును వీటిని ఎట్లు ఉపయోగించవచ్చునో సహోదరులకు సహాయపడుము.
18 ని: “సువార్తనందించుట—వివేకముతో.” ప్రశ్నా సమాధానములు. 3వ పేరాను పరిశీలించిన తరువాత యింటివారి పరిస్థితులకు తగినట్లు ఎలా అందింపును మలచవచ్చునో చూపు రెండు క్లుప్తమైన ప్రదర్శనలను చేర్చుము. పరిచయము చేసుకొన్న తరువాతనో లేక మధ్యలోనో అలా చేసిన తరువాత ప్రదర్శనలను మెప్పును వ్యక్తపరచుము.
పాట 225 (117) ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 16తో ఆరంభమగు వారము
పాట 208 (6)
10 ని: స్థానిక ప్రకటనలు. వారాంతపు ప్రాంతీయ సేవా ఏర్పాట్లను చేర్చుము. ప్రస్తుత పత్రికలలోని ఏ శీర్షికలు స్థానిక ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా వచ్చునో సలహాలనిమ్ము.
20 ని: తదుపరి ఆసక్తిని రేకెత్తించుటకు తిరిగి కలియుము. సర్వైవల్ పుస్తకముయందు ఆసక్తి చూపిన వారిని వెంటనే పునర్దర్శించమని ప్రచారకులందరిని ప్రోత్సహించుము. ముందటి భాగము ఆసక్తి చూపినవారిని తిరిగి దర్శించి, బైబిలు పఠనములను ప్రారంభించు అవసరతను ప్రస్తావించెను. ఆసక్తి చూపిన వారిని తిరిగి దర్శించు అవసరతను, ప్రోత్సాహమును క్లుప్తముగా చర్చించిన తరువాత, పుస్తకమును అందించినచోట పునర్దర్శనములను ఎలా చేయవచ్చునో చూపు ఒకటి లేక రెండు ప్రదర్శనలను అందించుము.
15 ని: స్థానిక అవసరమును లేక క్రమముగా దినవచనమును దాని వ్యాఖ్యానమును పరిశీలించుటలోని విలువను ఉన్నతపరచు ప్రసంగము. మరియు ప్రదర్శన. దీనిని ఎట్లు చేయవచ్చునో సలహానిమ్ము. ప్రసంగమును 1990 ఎక్జామినింగ్ ది స్క్రిప్చర్స్ డైలీ—1990 నందలి ముందు మాటపై (ఫోర్ వర్డ్) ఆధారపడియుండునట్లు చూడుము.
పాట 46 (20) ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 23తో ఆరంభమగు వారము
పాట 126 (25)
10 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. వారంత సేవలో పాల్గొనగలవారందరిని ప్రోత్సహించుము. మే మాసములో ఆక్సిలరీ పయినీరింగ్ చేయువారందరు ప్రిసైడింగు ఓవర్సీర్ దగ్గరనుండి అప్లికేషన్లను తీసుకొని పూర్తి చేసియివ్వవలెను. సమయము అనుమతించుకొలది ప్రస్తుత పత్రికలలోనుండి తగిన అందింపులను సూచించుము.
20 ని: “మన పరిచర్యను మానక కొనసాగించుట” ప్రశ్నాసమాధానములు. సామర్థ్యముగల సహోదరుడు పేరాగ్రాఫ్‌లను చదువునట్లు చేయుము. ప్రేక్షకులలోని యితరులు చూపబడిన లేఖనములను చదివి వ్యాఖ్యానించవచ్చును. ప్రాంతములోని సమస్యలను ఎదుర్కొంటూ, అనుకూల దృక్పథమును కాపాడుకొనుటకు ప్రచారకులకు సహాయపడునట్లు సమాచారమును స్థానికముగా అన్వయించుము. అంతము వరకు యెహోవాను ఆసక్తితో సేవించుటకు అందరము తీర్మానించుకొనవలెను.
15 ని: వాచ్‌టవర్ చందాలను అందించుము. యెహోవా యొక్క నూతనలోకములో జీవమును వెదకువారందరికి వాచ్‌టవర్ చందా ప్రాముఖ్యతను క్లుప్తముగా చర్చించుము. చందా అందింపును ప్రదర్శించుము. ది వాచ్‌టవర్ ఏప్రిల్ సంచికలను ఉపయోగించునప్పుడు త్వరలో దేవుడు సమాధానము తెచ్చునను విషయమును సూచిస్తూ ఆసక్తిని రేకెత్తించుటకు ప్రచారకులు ప్రయత్నించవచ్చును. సమాధానముకొరకైన దేవుని వాక్య వాగ్దానములకు కీర్తన 72:7ను ఉపయోగించవచ్చును. సమాధానము త్వరలో వస్తుందని తెల్పు కీర్తన 37:10, 11లోని వాగ్దానమును చూచి సమాధానప్రియులు ప్రోత్సహింపబడుదురు. సమయము అనుమతించిన క్లుప్తమైన మరియు సూటియైన చందా అందింపును ప్రదర్శించుము.
పాట 71 (92) ముగింపు ప్రార్థన.