ఏప్రిల్లో సర్వైవల్ పుస్తకమును అందించుము
1 ఒక మంచికారణముతో నేడు లక్షలాది మంది ప్రజలు రక్షణను గూర్చి శ్రద్ధ కలిగియున్నారు. ఆహారకొరత, కలుషితము, బలత్కారము, మరియు జీవితమును భయపరచు అనేక యితర పరిస్థితులు భవిష్యత్తు ఏమి కలిగియుంటుందా అని మనుష్యులు భయమునొందుటకు కారణమైయున్నవి. అయితే ఈ రక్షణనుగూర్చి చింతించు అనేకమంది ప్రజలు మరియెక్కువ అపాయమును గూర్చి ఏమియు తెలియనివారును లేక ఏదో కొంత తెలిసినవారైయున్నారు. దానిని యేసు “లోకారంభమునుండి ఇప్పటివరకును కలుగనట్టి శ్రమ” యని పిలిచెను. (మత్త. 24:21) కావున రక్షణకు మించి మానవజాతిని యెదుర్కొను అత్యవసర ప్రశ్న ఇంకొకటి ఏమైన ఉన్నదా?
2 ఆ అత్యవసరమైన ప్రశ్నకు సమాధానముగా సర్వైవల్ ఇంటు ఎ న్యూ ఎర్త్? అను మన పుస్తకముకన్న సమయానుసారమైనది వేరే యేమున్నది? “రాజ్యాభివృద్ధి” అను జిల్లా సమావేశములో దానిని విడుదల చేసిన తరువాత ప్రసంగీకుడు యిలా చెప్పెను: “రక్షింపబడుట మన దినములలో ముఖ్యమైన శ్రద్ధయైనది. అయితే మానవజాతిని యెదుర్కొనబోవునది న్యూక్లియర్ యుద్ధముకన్న ఎంతో భీతికరమైనది. అది సృష్టికర్తకే సమాధానము చెప్పుట. అద్భుతకరమైన బైబిలు ప్రవచనములు రక్షింపబడువారుందరని చూపుచున్నవి. . . . మీరు వారిలో యుండులాగున సహాయము చేయుటకే ఈ పుస్తకము ప్రచురింపబడినది.”
అత్యవసరమును తీర్చు సహాయము
3 ప్రజల అత్యంత అవసరమును తీర్చుటలో రక్షణపైన ఒక పుస్తకమును ప్రచురించుటకంటె ఎంతో ఎక్కువ యిమిడియున్నది. వారు దానినిగూర్చి విని, పొంది, చదివి అర్థము చేసుకొని, ఆ తరువాత అందులోని ప్రాముఖ్య సమాచారమునకు తగినట్లు ప్రవర్తించవలసియున్నారు. ఈ ఉద్దేశ్యముతోనే జిల్లా సమావేశపు ప్రసంగీకుడు యిలా చెప్పెను: “రక్షింపబడగోరు వారందరియెడల అత్యవసర చర్యను ఉన్న పరిస్థితి కోరుచున్నది. . . . ఈ సాహిత్యము మన ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించుటకును, మరియు మన స్వంతపఠనము నిమిత్తమును తయారు చేయబడినది.” ఔను, సహోదరులారా, ‘ప్రకటించువాడు లేక వారెట్లు విందురు?’—రోమా. 10:14.
4 ఒక ప్రాణమును రక్షించుటకంటె ఎక్కువ పులకరింత కలుగజేయునది. ఎక్కువ తృప్తికరమైనది వేరే ఏమైన ఉందని నీవు ఊహింతువా? అట్లయిన ఒకరి ప్రాణముతో పాటు నీ స్వంత ప్రాణమును కూడా రక్షించుకొను విషయమేమి? ఇది ఇంకను ఎక్కువ ప్రతిఫలదాయకమైనది కాగలదు.—1 తిమో. 4:16.
5 ఈ పుస్తక సహాయము ద్వారా ప్రజలు సత్యమును నేర్చుకొనుటనుబట్టి ఎంతమంది ప్రాణములు రక్షింపబడును? ఎక్కువ మట్టుకు ఈ పుస్తకమును పంచుటలో మనము చేయు ప్రయత్నములపైన, మనము అందించు ఫలవంతమైన ప్రసంగములపైన ఆ సమాధానము ఆధారపడియున్నది. ఆ పుస్తకమును ఏప్రిల్ నెల మన సాహిత్యపు అందింపుగా 10 రూ. చందా క్రింద మనము అందించుచున్నాము. మన పొరుగువారికి, బంధువులకు, తోటిపనివారికి, తోటి విద్యార్థులకు, లేక ఇతరులకు దానిని పంచుట అనేక విషయములపైన అనగా ఆరోగ్యము, వయస్సు, బలము, కుటుంబ బాధ్యతలపైన ఆధారపడియున్నది. ఎక్కువ మట్టుకు ఇతరులపైనగల మన ప్రేమ మరియు వారి రక్షణ విషయములో మనము భావించు అత్యవసరస్థితిపై ఆధారపడియున్నది.—2 తిమో. 4:2.
6 తరచు మన పరిచర్యయొక్క ఫలవంతమైన స్థితి మనము అందించు పుస్తకమును మనమెంత బాగా ఎరిగియున్నామను దానిపై ఆధారపడియుండును. మనము ఇప్పుటికే దానిని చదువు అవకాశమును కలిగియున్నాము. అయితే అందులోని మాట్లాడదగు అంశములకు, కొటేషన్స్కు, ఉపమానములకు తగిన అవధానము నిచ్చియున్నామా? 1914 గుర్తింపబడిన సంవత్సరమని చూపుతున్న 27వ పేజీలోని చార్టుతో పాటు, చరిత్రకారులు ఆ సంవత్సరమును ఎట్లు దృష్టించారో తెలుపు 29వ పేజీలోని కొటేషన్స్ రక్షణనుగూర్చి శ్రద్ధగల ప్రజలకు యిష్టకరముగా యుండును. రక్షింపబడుటకు అవసరమైన “గురుతు”ను పొందుటకు ఏమి చేయవలెనో తెలుసుకొను ఆతురతను 95వ పేజీలోని చిత్రమును చర్చించుట ద్వారా పెంచవచ్చును.—యెహెజ్కేలు 9:4, 6ను పోల్చుము.
7 అందులోని అధ్యాయముల పేర్లు ఆలోచనాపరులైన వ్యక్తుల ఆసక్తిని రేకెత్తించును. “భూ గ్రహము దేనిగా మారును?,” “ప్రస్తుత విధానము ఎంతకాలము నిలుచును?,” “విపత్తును ఎదుర్కొనుచున్న తరుణమున తెలివిగా ప్రవర్తించుము,” “కాల లెక్కింపు దాని తుది ఘడియకు చేరుచున్నది” అనునవి అందులో చర్చించబడిన ఆసక్తికర అంశములలో కొన్నైయున్నవి. పుస్తకమును యింటివారి చేతిలోపెట్టుటకు ప్రయత్నించి ఏ అధ్యాయముల పేర్లు తమకు ఎక్కువ ఆసక్తి కలిగించునో అడుగుము. ఇతర సాహిత్యములతో ఈ విధముగా ప్రయత్నించినవారు తరచు మంచి ఫలతములను పొందినట్లు కనుగొనిరి.
ఆపు చేయబడవద్దు
8 సమావేశపు ప్రసంగీకుడు తన తుది పలుకులను ఈ విధముగా అన్నప్పుడు మనమందరము శ్లాఘించితిమి: “ఇంకను సమయముండగా, పెరుగుతున్న సంతోషకరమైన సాక్షులలో ఇంకను ఎక్కువమంది భాగమగునట్లు సహాయపడగల అవకాశమును మనమందరము విడువకుందము. . . . ఈ దుష్టలోకమును ఆయన నాశనము చేయునప్పుడు దేవుని మితిలేని కృపచేత మహిమగల ‘నూతనభూమి’లోకి రక్షింపబడువారిలో ఉందుముగాక!” కాబట్టి ఏప్రిల్లో సర్వైవల్ పుస్తకమును పంచుటలో పూర్తిభాగము వహించుటద్వారా యింకను అనేకులకు సహాయము చేయు అవకాశమును గట్టిగా పట్టుకొందము.