కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 11/1 పేజీలు 30-31
  • యథార్థత మరియు స్వయంత్యాగ స్ఫూర్తికి మాదిరి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యథార్థత మరియు స్వయంత్యాగ స్ఫూర్తికి మాదిరి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏలియా వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు
  • మన కొరకు పాఠాలు
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు మరి మీరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • చివరి వరకు సహించాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • వృద్ధులైన తోటి విశ్వాసులను మీరు విలువైనవారిగా ఎంచుతారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 11/1 పేజీలు 30-31

వారు యెహోవా చిత్తం చేశారు

యథార్థత మరియు స్వయంత్యాగ స్ఫూర్తికి మాదిరి

ఎలీషా అనే యౌవనుడైన వ్యవసాయదారునికి, పొలందున్నడంతో ఆరంభమైన ఆ దినం, ఆయన జీవితంలో అత్యంత విశేషమైన దినంగా మారింది. ఎలీషా పొలములో పనిచేస్తుండగా, ఇశ్రాయేలీయుల ప్రధాన ప్రవక్తయైన ఏలీయా అనుకోని రీతిగా ఆయనను సందర్శించాడు. ‘నా నుండి ఆయనకు ఏమి కావాలి?’ అని ఎలీషా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఆయన జవాబు కోసం ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకపోయింది. ఒకరోజు ఎలీషా తన వారసుడవుతాడని సూచిస్తూ, ఏలియా తన దుప్పటి ఎలీషాపై వేశాడు. ఎలీషా ఆ ఆహ్వానాన్ని అల్పమైనదిగా ఎంచలేదు. వెంటనే ఆయన తన పొలము వదిలేసి ఏలియా సేవకుడయ్యాడు.—1 రాజులు 19:19-21.

ఆరు సంవత్సరాల తరువాత, ఏలియా వెళ్లిపోయే సమయం వచ్చింది. ఆయన వెళ్లిపోవడాన్ని గురించిన వృత్తాంతం హెబ్రీ లేఖనాల్లో “అత్యంత ఉత్తేజకరమైన కథనాల్లో ఒకటి” అని పిలువబడింది.

ఏలియా వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు

ఏలియా బేతేలును, యెరికోను మరియు యొర్దానును చివరిగా సందర్శించాలని అనుకున్నాడు. దానికొరకు ఎన్నో కిలోమీటర్లు నడవవలసి ఉంది, కొన్నిసార్లు ఎగుడుదిగుడుగా ఉన్న కొండ ప్రాంతంలో నడవవలసి ఉంది. ప్రయాణంలోని ప్రతీ స్థలం వద్ద, ఏలియా ఎలీషాను ఆ స్థలంలో ఉండిపొమ్మని ప్రోత్సహించేవాడు. కాని ఎలీషా చివరి వరకు తన యజమానితోనే ఉంటానని పట్టుబట్టాడు.—2 రాజులు 2:1, 2, 4, 6.

బేతేలులో మరియు యెరికోలో ఉన్నప్పుడు, “ప్రవక్తల శిష్యులు” ఎలీషాను సమీపించారు.a “నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా” అని వారు ఆయనను అడిగారు. “నేనెరుగుదును, మీరు ఊరకుండుడ”ని ఆయన జవాబిచ్చాడు.—2 రాజులు 2:3, 5.

ఏలియా మరియు ఎలీషా తరువాత యొర్దాను నదికి ప్రయాణమయ్యారు. వాళ్లు యొర్దాను నదిని చేరినప్పుడు, దాదాపు 50 మంది ప్రవక్తల శిష్యులు దూరం నుండి గమనిస్తుండగా ఏలియా ఒక అద్భుతం చేశాడు. “ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడి పోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.”—2 రాజులు 2:8.

వారు దాటిన తరువాత, ఏలియా ఎలీషాను చూచి: “నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని” చెప్పాడు. ఎలీషా ఏలియాకున్న ఆత్మలో “రెండుపాళ్లు” అడిగాడు—అది సాధారణంగా మొదటి కుమారునికి చెందే దానికి రెట్టింపు. నిజానికి, మొదటి కుమారుడు తన తండ్రిని ఘనపర్చినట్లు ఎలీషా, ఏలియాను ఘనపర్చాడు. అంతేకాకుండా, ఆయన ఇశ్రాయేలులో యెహోవా ప్రవక్తగా ఏలియా వారసుడయ్యేందుకు అభిషేకించబడ్డాడు. కాబట్టి ఆయన అభ్యర్థన స్వార్థపూరితమైనది కాదు, అయుక్తమైనదీ కాదు. అయినప్పటికీ, ఆయన అభ్యర్థించిన దానిని యెహోవా మాత్రమే ఇవ్వగలడని తెలుసుకొని, ఏలియా వినయంగా ఇలా జవాబిచ్చాడు: “నీవు అడిగినది కష్టతరముగా నున్నది.” “అయితే నీ యొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని” కూడా ఆయన అన్నాడు.—2 రాజులు 2:9, 10; ద్వితీయోపదేశకాండము 21:17.

ఎలీషా మునుపెన్నటికంటే ఎక్కువగా తన యజమానుని హత్తుకొని ఉండాలని నిశ్చయించుకున్నాడనడంలో సందేహం లేదు. అప్పుడు “అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును” కనబడ్డాయి. ఆశ్చర్యచకితుడైన ఎలీషా కళ్ళ ఎదుట, ఏలియా సుడిగాలిలో కలిసిపోయాడు—అద్భుతరీతిగా మరో స్థలానికి తీసుకువెళ్లబడ్డాడు.b ఎలీషా ఏలియా దుప్పటిని తీసుకొని యొర్దాను నది ఒడ్డువైపుకు నడిచాడు. “ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని” అంటూ ఎలీషా నీటిని కొట్టాడు. ఏలియా వారసునిగా ఎలీషాకు కూడా దైవీక నడిపింపు ఉందనడానికి స్పష్టమైన రుజువునిస్తూ నీళ్ళు రెండు భాగాలయ్యాయి.—2 రాజులు 2:11-14.

మన కొరకు పాఠాలు

ఏలియాకు ప్రత్యేక పనికై ఆహ్వానం ఇవ్వబడినప్పుడు, ఇశ్రాయేలీయుల ప్రధాన ప్రవక్తకు పరిచారము చేయడానికి ఎలీషా తన పొలమును వెంటనే విడిచివచ్చేశాడు. స్పష్టంగా, ఆయన పనులలో కొన్ని హీనమైనవి, ఎందుకంటే ఆయన “ఏలియా చేతుల మీద నీళ్ళు పోయుచు వచ్చిన” వ్యక్తిగా గుర్తించబడ్డాడు.c (2 రాజులు 3:11) అయినప్పటికీ, ఎలీషా తన పనిని ఒక ఆధిక్యతగా భావించి, ఏలియాను యథార్థంగా హత్తుకొని ఉన్నాడు.

నేడు దేవుని సేవకులలో అనేకులు అటువంటి స్వయంత్యాగ స్ఫూర్తిని కనపరుస్తున్నారు. దూర ప్రాంతాలలో రాజ్య సువార్తను ప్రకటించడానికి లేదా ఒక బేతేలు గృహంలో సభ్యులుగా సేవచేయడానికి కొందరు తమ “భూముల”ను జీవనాధారాలను విడిచిపెట్టారు. కొంతమంది సంస్థ యొక్క నిర్మాణ పనులు చేయడానికి విదేశాలకు ప్రయాణించారు. హీనమైనవిగా పరిగణించబడే పనులను అనేకమంది అంగీకరించారు. అయినా, యెహోవాకు సేవ చేస్తున్న వారు నిరర్ధకమైన సేవచేస్తున్నట్లు కాదు. యెహోవా తనను ఇష్టపూర్వకంగా సేవించేవారందర్నీ మెచ్చుకుంటాడు, మరియు వారి స్వయంత్యాగ స్ఫూర్తిని ఆయన ఆశీర్వదిస్తాడు.—మార్కు 10:29, 30.

ఎలీషా చివరివరకు ఏలియాను హత్తుకొని యున్నాడు. ఆయనకు అవకాశం ఇవ్వబడినప్పటికీ వృద్ధ ప్రవక్తను విడనాడడానికి నిరాకరించాడు. నిస్సందేహంగా, ఆయన ఏలియాతో పెంచుకున్న సన్నిహిత సంబంధం అలాంటి యథార్థమైన ప్రేమను ఆనందదాయకమైనదిగా చేసింది. నేడు, దేవుని సేవకులు దేవునితో తమ సంబంధాన్ని బలపరచుకోవడానికి మరియు తమ తోటి విశ్వాసులకు సన్నిహితమవ్వడానికి కృషిచేస్తున్నారు. ఐక్యత యొక్క సన్నిహిత బంధం ఆశీర్వదింపబడుతుంది, ఎందుకంటే బైబిలు యెహోవా గురించి ఇలా చెబుతుంది: “యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడుగా నుందువు.”—2 సమూయేలు 22:26.

[అధస్సూచీలు]

a కొన్నిసార్లు “ప్రవక్తల పుత్రులు” అని అనువదించబడిన “ప్రవక్తల శిష్యులు” అనే పదబంధం ఈ వృత్తికొరకు పిలువబడినవారి కొరకైన బోధనా పాఠశాలను లేదా ప్రవక్తల సహకార సంఘాన్ని సూచించవచ్చు.

b యూదా రాజైన యెహోరాముకు ఏలియా ఇచ్చిన వర్తమానము కొన్ని సంవత్సరాల తరువాత వ్రాయబడింది.—2 దినవృత్తాంతములు 21:12-15.

c ప్రాముఖ్యంగా భోజనం చేసిన తరువాత యజమాని చేతులు కడుక్కోవడానికి ఆయన చేతుల మీద సేవకుడు నీళ్ళు పోయడం ఆచారముగా ఉండేది. ఈ ఆచారము ఆతిథ్యానికి, గౌరవానికి సూచనగా కాళ్ళుకడిగే చర్యను పోలినదే. కొంతమంది బంధువుల్లో అలా కాళ్ళు కడగటం దీనత్వంతో కూడిన చర్యయై ఉన్నది.—ఆదికాండము 24:31, 32; యోహాను 13:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి