కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 4/1 పేజీలు 10-15
  • నిత్యత్వం యొక్క రాజును స్తుతించుడి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిత్యత్వం యొక్క రాజును స్తుతించుడి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నిరంతరము రాజైయున్నాడు”
  • ఒక అద్భుతమైన జీవిత ఉత్తరాపేక్ష
  • యెహోవా యొక్క సృజనాత్మక జ్ఞానం
  • అత్యుత్తమ భూ సృష్టి
  • మరింత బలమైన కార్యాలు
  • “యెహోవాను స్తుతించుడి!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని దేవునితో నడవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మన మహోన్నత సృష్టికర్త, ఆయన కార్యములు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘ఆహా! దేవుని తెలివి ఎంత లోతైనది!’
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 4/1 పేజీలు 10-15

నిత్యత్వం యొక్క రాజును స్తుతించుడి!

“యెహోవా నిరంతరము రాజైయున్నాడు.”—కీర్తన 10:16.

1. నిత్యత్వానికి సంబంధించి ఏ ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?

నిత్యత్వం—మీరు దాన్నెలా నిర్వచిస్తారు? కాలం నిజంగా నిరంతరంగా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? నిజమే, కాలం గతంలోకి నిరంతరంగా కొనసాగుతుందనడంలో ఏ సందేహమూ లేదు. కాబట్టి, అది భవిష్యత్తులోకి నిరంతరంగా ఎందుకు కొనసాగలేదు? వాస్తవానికి, దేవుడు “అనిర్దిష్టిత కాలం నుండి అనిర్దిష్టిత కాలం వరకు” స్తుతింపబడుతున్నట్లు బైబిలు యొక్క నూతన లోక అనువాదము (ఆంగ్లం) తెలియజేస్తుంది. (కీర్తన 41:13) ఈ పదబంధ భావమేమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి, సంబంధిత అంశమైన అంతరిక్షం గురించి మనం పరిశీలిస్తే మనకు సహాయం లభించవచ్చు.

2, 3. (ఎ) అంతరిక్షానికి సంబంధించిన ఏ ప్రశ్నలు మనం నిత్యత్వాన్ని గుణగ్రహించడానికి తోడ్పడతాయి? (బి) నిత్యత్వం యొక్క రాజును ఆరాధించాలని మనం ఎందుకు కోరుకోవాలి?

2 అంతరిక్షం ఎంత విశాలంగా ఉంది? దానికేదైనా పరిధి ఉందా? 400 సంవత్సరాల క్రితం వరకు, మన భూమి విశ్వానికి కేంద్రంగా ఉందని భావించబడేది. అప్పుడు, ఆకాశాన్ని విస్తృత దృక్కోణంలో వీక్షించడాన్ని సాధ్యపరుస్తూ గెలీలియో దుర్బిణి యంత్రాన్ని రూపొందించాడు. దానితో గెలీలియో ఇంకా అనేక నక్షత్రాలను చూడగలిగాడు, భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయని చూపించగలిగాడు. పాలపుంత ఇక ఎంతమాత్రం పాలవలె కనిపించలేదు. అది, దాదాపు పది వేల కోట్ల నక్షత్రాలుగల నక్షత్ర వీధి అని నిరూపించబడింది. అన్ని అసలైన నక్షత్రాలను మనం ఎన్నటికీ, మన జీవిత కాలమంతటిలో కూడా లెక్కించలేము. ఆ తర్వాత, ఖగోళ శాస్త్రజ్ఞులు కోట్లాది నక్షత్ర వీధులను కనుగొన్నారు. ఇవి, అత్యంత శక్తివంతమైన దుర్బిణి యంత్రాలు పరికించగలంత మేరకు అంతరిక్షంలోకి అనంతంగా వ్యాపించివున్నాయి. అంతరిక్షానికి అవధులు లేనట్లు అనిపిస్తుంది. నిత్యత్వం విషయంలో కూడా అదే నిజం—దానికి అవధులు లేవు.

3 నిత్యత్వాన్ని గూర్చిన తలంపు పరిమితి గల మన మానవ మెదడుల అవగాహనను మించివున్నట్లు కనిపిస్తుంది. అయితే, దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొనగలవారు ఒకరున్నారు. కోట్లకొలది నక్షత్ర వీధుల్లోవున్న లెక్కలేనన్ని కోటానుకోట్ల నక్షత్రాలను ఆయన లెక్కించగలడు, అవును, ఆయన వాటికి పేర్లు పెట్టగలడు కూడా! ఆయనిలా చెబుతున్నాడు: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.” (యెషయా 40:26, 28) ఎంత అద్భుతమైన దేవుడు! నిజంగా, మనం ఆరాధించాలని కోరుకొనే దేవుడు ఈయనే!

“నిరంతరము రాజైయున్నాడు”

4. (ఎ) నిత్యత్వం యొక్క రాజు ఎడల దావీదు మెప్పును ఎలా వ్యక్తపర్చాడు? (బి) చరిత్రలోని గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరు విశ్వ ఆవిర్భావానికి సంబంధించి ఏమని తేల్చి చెప్పాడు?

4 కీర్తన 10:16నందు, సృష్టికర్తయైన దేవుని గురించి దావీదు ఇలా చెబుతున్నాడు: “యెహోవా నిరంతరము రాజైయున్నాడు.” కీర్తన 29:10నందు ఆయన ఇలా పునరుద్ఘాటిస్తున్నాడు: “యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.” అవును, యెహోవా నిత్యత్వం యొక్క రాజు! అంతేగాక, కీర్తన 19:1 నందు దావీదు, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” అని చెబుతూ, అంతరిక్షంలో మనం చూసేదానినంతటినీ రూపొందించినవాడు, సృజించినవాడు ఉన్నతపర్చబడిన ఈ రాజు అని ధృవపరుస్తున్నాడు. దాదాపు 2,700 సంవత్సరాల అనంతరం, ప్రముఖ శాస్త్రజ్ఞుడైన సర్‌ ఐజక్‌ న్యూటన్‌ దావీదుతో ఏకీభవిస్తూ, ఇలా వ్రాశాడు: “సూర్యుళ్లు, గ్రహాలు, తోకచుక్కలతో కూడిన ఈ అత్యంత శోభాయమానమైన విధానం ఒక జ్ఞానవంతమైన, శక్తివంతమైన వ్యక్తి యొక్క సంకల్పం మరియు సర్వాధిపత్యం నుండి మాత్రమే ఉత్పన్నం కాగలదు.”

5. జ్ఞానానికి మూలమైన వాన్ని గూర్చి యెషయా మరియు పౌలు ఏమి వ్రాశారు?

5 విశాలమైన ‘ఆకాశ మహాకాశములు సహితము . . . పట్టజాల’ని సర్వోన్నత ప్రభువైన యెహోవా నిరంతరం జీవిస్తాడని తెలుసుకోవడం మనల్ని ఎంతగా దీనుల్ని చేయాలి! (1 రాజులు 8:27) యెషయా 45:18నందు “ఆకాశములకు సృష్టికర్త . . . భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను” అని వర్ణించబడిన యెహోవా, మర్త్యమైన మానవ మెదళ్లు అవగాహన చేసుకొనగల్గిన దానికంటే ఎంతో విస్తృతమైన జ్ఞానమునకు మూలం. 1 కొరింథీయులు 1:19 నందు ఉన్నతపర్చబడినట్లుగా, యెహోవా ఇలా చెప్పాడు: “జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును.” 1 కొరింథీయులు 1:20వ వచనంలో అపొస్తలుడైన పౌలు దానికిలా జతచేశాడు: “జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?” అవును, మూడవ అధ్యాయము 1 కొరింథీయులు 1:19వ వచనంలో పౌలు ఇలా కొనసాగించాడు: “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.”

6. “శాశ్వతకాల జ్ఞానము” గురించి ప్రసంగి 3:11 ఏమి సూచిస్తుంది?

6 “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును [దేవుడు] నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు” అని రాజైన సొలొమోను సూచించిన సృష్టిలో అంతరిక్ష సమూహాలు ఒక భాగమే. (ప్రసంగి 3:11) “శాశ్వతకాల జ్ఞానము” అంటే నిత్యత్వము యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలనేది నిజంగానే మానవుని హృదయంలో పొందుపర్చబడి ఉంది. అయితే అలాంటి జ్ఞానాన్ని అతడు ఎన్నటికైనా పొందగలడా?

ఒక అద్భుతమైన జీవిత ఉత్తరాపేక్ష

7, 8. (ఎ) మానవజాతి కొరకు ఏ అద్భుతమైన జీవిత ఉత్తరాపేక్ష వేచి ఉంది, దాన్ని ఎలా పొందవచ్చు? (బి) దైవిక విద్యాభ్యాసం నిరంతరం కొనసాగుతుందనే విషయం గురించి మనం ఎందుకు ఆనందించాలి?

7 యేసుక్రీస్తు తాను యెహోవాకు చేసిన ప్రార్థనలో ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను గూర్చిన, నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానమును వారు పొందుటయే నిత్యజీవము.” (యోహాను 17:3, NW) అలాంటి జ్ఞానాన్ని మనమెలా పొందగలము? మనం దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును పఠించవలసిన అవసరం ఉంది. తద్వారా మనం, తన కుమారుని ద్వారా పరదైసు భూమిపై నిత్యజీవం కొరకు చేసిన ఏర్పాటుతో సహా దేవుని ఘనమైన సంకల్పాల గురించిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందగలము. అది, 1 తిమోతి 6:18 నందు సూచించబడిన “వాస్తవమైన జీవము” అవుతుంది. “దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము” అని ఎఫెసీయులు 3:11 వర్ణిస్తున్న దానితో అది పొందిక కల్గివుంటుంది.

8 అవును, పాపభరిత మానవులమైన మనం దైవిక విద్య ద్వారా, యేసు యొక్క విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచడం ద్వారా నిత్యజీవాన్ని పొందవచ్చు. ఈ విద్య ఎంత కాలం కొనసాగుతుంది? మన సృష్టికర్తను గూర్చిన జ్ఞానం మానవజాతికి క్రమంగా బోధింపబడుతుండగా, అది నిరంతరం కొనసాగుతుంది. యెహోవాను గూర్చిన జ్ఞానానికి అవధులు లేవు. దీన్ని గుర్తించి అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.” (రోమీయులు 11:33) వాస్తవానికి, 1 తిమోతి 1:17, NW యెహోవాను “నిత్యత్వం యొక్క రాజు” అని పిలవడం తగినదే!

యెహోవా యొక్క సృజనాత్మక జ్ఞానం

9, 10. (ఎ) భూమిని మానవజాతి కొరకు తన బహుమానంగా సిద్ధం చేయడంలో యెహోవా ఏ ఘనమైన కార్యాలను నెరవేర్చాడు? (బి) యెహోవా యొక్క అద్భుతమైన జ్ఞానం ఆయన సృష్టి కార్యాల్లో ఎలా వెల్లడవుతుంది? (బాక్సు చూడండి.)

9 నిత్యత్వం యొక్క రాజు మానవులమైన మనకు అందజేసిన అద్భుతమైన సంపదను పరిశీలించండి. కీర్తన 115:16 మనకిలా చెబుతుంది: “ఆకాశములు యెహోవావశము, భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” అది అద్భుతమైన సొత్తని మీరు భావించరా? కచ్చితంగా! భూమిని మన గృహంగా సిద్ధపర్చడంలో మన సృష్టికర్త చూపించిన విశిష్టమైన ముందు చూపును మనం ఎంత విలువైందిగా ఎంచుతామో కదా!—కీర్తన 107:8.

10 ఆదికాండము మొదటి అధ్యాయంలోని, ఒక్కో దినం వేల సంవత్సరాల నిడివిగల ఆరు సృష్టి ‘దినాల్లో’ భూమిపై అద్భుతమైన అభివృద్ధులు సంభవించాయి. దేవుని ఈ సృష్టి కార్యాలు చివరికి యావత్‌ భూమిని పచ్చని గడ్డితోకూడిన తివాచీతో, విశాలమైన అడవులతో, రంగురంగుల పువ్వులతో కప్పుతాయి. ప్రతిదీ “వాటి వాటి జాతి ప్రకారము” ఉత్పత్తి చేసే అత్యంత విభిన్నమైన సముద్ర జీవులతో, అందమైన రెక్కలుగల పక్షులతో అలాగే వివిధ సాధు, మచ్చిక చేయబడని జంతువులతో అది నింపబడుతుంది. స్త్రీ పురుషుల సృష్టిని గూర్చిన వివరణ తర్వాత ఆదికాండము 1:31 ఇలా తెలియజేస్తుంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” ఆ మొదటి మానవుల చుట్టూ ఎంత ఆనందభరితమైన పర్యావరణం ఉండేదో కదా! ఈ సృష్టి కార్యాలన్నిటిలో మన ప్రేమగల సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని, ముందు చూపును, శ్రద్ధను మనం కనుగొనమా?—యెషయా 45:11, 12, 18.

11. యెహోవా యొక్క సృజనాత్మక జ్ఞానాన్ని సొలొమోను ఎలా మహిమపర్చాడు?

11 నిత్యత్వం యొక్క రాజు జ్ఞానానికి ఆశ్చర్యచకితులైన వారిలో సొలొమోను కూడా ఉన్నాడు. ఆయన సృష్టికర్త జ్ఞానంవైపుకు పదే పదే ధ్యానాన్ని మళ్లించాడు. (సామెతలు 1:1, 2; 2:1, 6; 3:13-18) “భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది” అని సొలొమోను మనకు అభయమిస్తున్నాడు. మన భూమిని సేదదీర్చడంలో వర్ష మేఘాలు నిర్వహించే పాత్రతోపాటు సృష్టిలోని అనేక అద్భుతాలను ఆయన గుణగ్రహించాడు. అందుకే, ఆయనిలా వ్రాశాడు: “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును.” (ప్రసంగి 1:4, 7) ఆవిధంగా వర్షాలు, నదులు భూమిని సేదదీర్చిన తరువాత వాటిలోని నీరు సముద్రాలలో నుండి మేఘాలలోకి తిరిగి చేరుతుంది. ఈ శుద్ధీకరణ మరియు నీటి పరిభ్రమణ చక్రం లేకుండా ఈ భూమిఎలా ఉండి ఉండేది, మన పరిస్థితెలా ఉండేది?

12, 13. దేవుని సృష్టి ఎడల మనం మెప్పును ఎలా చూపించగలము?

12 “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని, తీర్పులోనికి తెచ్చును” అని రాజైన సొలొమోను ప్రసంగిలోని చివరి మాటల్లో తెలియజేసినట్లుగా, సృష్టిలోని సమతూకం ఎడల మనకుగల మెప్పు క్రియ ద్వారా బలపర్చబడాలి. (ప్రసంగి 12:13, 14) దేవునికి అప్రీతికరమైనదేదైనా చేయడానికి మనం భయపడాలి. బదులుగా, పూజ్యనీయమైన భయంతో మనం ఆయనకు విధేయత చూపించేందుకు ప్రయత్నించాలి.

13 అవును, ఆయన అద్భుతమైన సృష్టికార్యాలనుబట్టి నిత్యత్వం యొక్క రాజును స్తుతించే కోరికను మనం కల్గివుండాలి! కీర్తన 104:24 ఇలా ప్రకటిస్తున్నది: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” మనకు మనం ఇలా చెప్పుకోవడం ద్వారా, ఇతరులకు చెప్పడం ద్వారా మనం ఈ కీర్తనకీర్తన 104:35 లోని ఈ చివరి వచనాన్ని ఆనందదాయకంగా అన్వయించుకొందాము: “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి.”

అత్యుత్తమ భూ సృష్టి

14. దేవుని మానవ సృష్టి జంతువుల కన్నా ఏయే విధాలుగా శ్రేష్ఠమైనది?

14 యెహోవా సృష్టి యావత్తు అత్యుత్తమమైనది. అయితే భూ సంబంధమైన సృష్టిలో అత్యంత విశిష్టమైన సృష్టి మనమే—మానవజాతి. యెహోవా యొక్క ఆరవ సృష్టి దిన పరాకాష్ఠగా ఆదాము హవ్వలు సృష్టించబడ్డారు, వారు చేపలు, పక్షులు, జంతువులకన్నా ఎంతో శ్రేష్ఠమైన సృష్టి! వీటిలోని అనేకం సహజసిద్ధమైన జ్ఞానం గలవి, అయితే మానవజాతి వివేచనా శక్తితోను, తప్పొప్పుల మధ్య తారతమ్యాన్ని గ్రహించగలిగే మనస్సాక్షితోను, భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేసుకొనే సామర్థ్యంతోను, ఆరాధించాలనే స్వాభావికమైన కోరికతోను ఆశీర్వదించబడింది. ఇవన్నీ ఎలా వచ్చాయి? క్రూరమైన మృగాలనుండి పరిణామం చెందడానికి బదులు మానవుడు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాడు. అందుకే, “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా” అని తనను తాను గుర్తించుకొనిన మన సృష్టికర్త లక్షణాలను మానవుడు మాత్రమే ప్రతిబింబించగలడు.—నిర్గమకాండము 34:6.

15. మనం యెహోవాను వినయంగా ఎందుకు స్తుతించాలి?

15 మన దేహాల అసాధారణమైన నమూనాను బట్టి యెహోవాకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. జీవానికి ఆవశ్యకమైన మన రక్తప్రవాహం ప్రతి 60 క్షణాలకు దేహమంతా ప్రవహిస్తుంది. ద్వితీయోపదేశకాండము 12:23 చెబుతున్నట్లుగా, ‘రక్తమే ప్రాణము’—మన జీవము—దేవుని దృష్టిలో అమూల్యమైనది. దృఢమైన ఎముకలు, మృదువైన కండరాలు, ప్రతిస్పందించే నాడీమండల వ్యవస్థ, వీటన్నింటికిపైగా ఏ జంతు మెదడుకన్నా మరియు ఆకాశ హార్మ్యం అంతటి పరిమాణంవున్న ఒక కంప్యూటరు సామర్థ్యాలకన్నా ఎంతో శ్రేష్ఠమైన మెదడు ఉంది. ఇది, మీరు వినయం కల్గివుండాలని భావించేలా చెయ్యడం లేదా? చెయ్యాలి. (సామెతలు 22:4) దీన్ని కూడా పరిశీలించండి: మన ఊపిరితిత్తులు, స్వరపేటిక, నాలుక, దంతాలు, నోరు వేలాది భాషల్లోని ఏ భాషలోనైనా మాట్లాడగలిగేలా కలిసి పనిచేయగలవు. ఇలా చెబుతూ దావీదు యెహోవాకు సముచితంగానే స్తుతి చెల్లించాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” (కీర్తన 139:14) మన అద్భుతమైన రూపకర్తయు దేవుడును అయిన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దావీదుతోపాటు మనమూ చేరుదాం!

16. ఒక పేరు పొందిన సంగీతకారుడు యెహోవాను స్తుతిస్తూ ఏ గీతమాలపించాడు, మనం పురికొల్పే ఏ ఆహ్వానానికి ప్రతిస్పందించవచ్చు?

16 యోసఫ్‌ హైడన్‌ రూపొందించిన, 18వ శతాబ్దానికి చెందిన సంగీత సంకీర్తనంలోని గీతం యెహోవాను స్తుతిస్తూ ఇలా తెలియజేస్తోంది: “ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన కార్యములెంతో అద్భుతము! ఆయన ఘనతను కీర్తించుడి, ఆయన మహిమను కీర్తించుడి, ఆయన నామాన్ని సన్నుతించి మహిమపరచుడి! యెహోవా స్తుతి ఎల్లకాలము నిలిచియుండును ఆమేన్‌, ఆమేన్‌!” అయితే 107వ కీర్తన 107:8, 15, 21, 31 లో నాలుగుసార్లు అందజేయబడిన ఆహ్వానం వంటి, కీర్తనల్లో తరచూ పునరుద్ఘాటింపబడే ఈ ప్రేరేపిత పదాలు ఇంకా ఎంతో రమ్యమైనవి: “ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.” ఆ స్తుతిలో మీరూ చేరుతారా? చేరాలి, ఎందుకంటే నిజంగా అందంగా ఉన్నదానికంతటికీ మూలం నిత్యుడగు రాజైన యెహోవాయే.

మరింత బలమైన కార్యాలు

17. ‘మోషే కీర్తన, గొఱ్ఱెపిల్ల కీర్తన’ యెహోవాను ఎలా ఘనపరుస్తున్నాయి?

17 గత ఆరువేల సంవత్సరాల కాలంలో, నిత్యత్వం యొక్క రాజు మరింత బలమైన కార్యాలను చేయనారంభించాడు. దయ్యాలైన శత్రువులపై జయించిన, పరలోకంలోనున్న వారి గురించి బైబిలులోని చివరి పుస్తకంలో, ప్రకటన 15:3, 4నందు మనమిలా చదువుతాము: “వారు—ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా (“యెహోవా”, NW) నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు, దేవునిదాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.” ఇది ‘మోషే కీర్తన, గొఱ్ఱెపిల్ల కీర్తన’ అని ఎందుకు పిలువబడింది? మనం చూద్దాము.

18. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఏ శక్తివంతమైన కార్యం కీర్తన రూపంలో పొందుపర్చబడింది?

18 దాదాపు 3,500 సంవత్సరాల క్రిందట, ఎర్ర సముద్రంలో ఫరో బలమైన సైన్యం నాశనమైనప్పుడు, ఇశ్రాయేలీయులు కీర్తనలో యెహోవాను కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించారు. నిర్గమకాండము 15:1, 18నందు మనమిలా చదువుతాము: “అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి—యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవా నిరంతరమును ఏలువాడు.” ఈ నిత్యత్వం యొక్క రాజు నీతియుక్తమైన శాసనములు ఆయన తీర్పులోను, తన సర్వాధిపత్యాన్ని ఆక్షేపించిన శత్రువులను నాశనం చేయడంలోను ప్రత్యక్షపర్చబడ్డాయి.

19, 20. (ఎ) యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు ఏర్పరచాడు? (బి) సాతాను సవాలుకు గొఱ్ఱెపిల్ల మరియు ఇతరులు ఎలా సమాధానమిచ్చారు?

19 ఇది ఎందుకు అవసరమయ్యింది? ఏదెను తోటలో, కుయుక్తిగల సర్పం మన ఆది తలిదండ్రులను పాపంలోకి నడిపించింది. దీని ఫలితంగా పాపభరితమైన అపరిపూర్ణత యావత్‌ మానవజాతికి సంక్రమించింది. అయితే, నిత్యత్వం యొక్క రాజు తన ఆది సంకల్పానికి అనుగుణ్యంగా, భూమిపై నుండి తన శత్రువులందరినీ తొలగించి, పరదైసు పరిస్థితులను పునరుద్ధరించడానికి నడిపించే చర్యలను వెంటనే తీసుకున్నాడు. నిత్యత్వం యొక్క రాజు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచి, దీనిని తాను ఎలా నెరవేరుస్తాననే దానికి ముంగుర్తుగా తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.—గలతీయులు 3:24.

20 అయితే చివరికి, ఇశ్రాయేలీయులే అవిశ్వాస్యతలోనికి జారిపోయారు, వారి నాయకులు దేవుని అద్వితీయ కుమారుని భయంకరంగా హింసించి చంపడానికి రోమీయులకు అప్పగించినప్పుడు ఈ విచారకరమైన స్థితి పరాకాష్ఠకు చేరుకుంది. (అపొస్తలుల కార్యములు 10:39; ఫిలిప్పీయులు 2:8) అయినప్పటికీ, తీవ్రంగా శోధింపబడినప్పుడు భూమిపైనున్న ఏ మానవుడూ దేవుని ఎడల విశ్వాసం కల్గివుండలేడని దేవుని ప్రాచీన శత్రువైన సాతాను చేసిన సవాలుకు “దేవుని” బలిపూర్వకమైన “గొఱ్ఱెపిల్ల”గా మరణం వరకు యేసు కలిగివున్న యథార్థత ఒక విశిష్ఠమైన రీతిలో జవాబునిచ్చింది. (యోహాను 1:29, 36; యోబు 1:9-12; 27:5) ఆదాము నుండి అపరిపూర్ణతను వారసత్వంగా పొందినప్పటికీ, దేవునికి భయపడే లక్షలాదిమంది ఇతర మానవులు సాతాను దాడులను ఎదుర్కొనేటప్పుడు యథార్థతను కాపాడుకోవడం ద్వారా యేసు అడుగుజాడల్ని అనుసరించారు.—1 పేతురు 1:18, 19; 2:19, 21.

21. అపొస్తలుల కార్యములు 17:29-31కు అనుగుణ్యంగా, తర్వాత ఏమి చర్చించబడుతుంది?

21 యెహోవా ఇప్పుడు అలాంటి విశ్వాసులైన వారికి ప్రతిఫలమివ్వడానికి మరియు సత్యానికి, నీతికి శత్రువులైన వారందరికీ తీర్పుతీర్చడానికి సమయం ఆసన్నమైంది. (అపొస్తలుల కార్యములు 17:29-31) ఇది ఎలా జరుగుతుంది? మా తరువాతి శీర్షిక తెలియజేస్తుంది.

పునఃసమీక్ష బాక్సు

◻ యెహోవా “నిత్యత్వం యొక్క రాజు” అని ఎందుకు తగినట్లుగానే పిలువబడ్డాడు?

◻ యెహోవా జ్ఞానం ఆయన సృష్టి కార్యాల్లో ఎలా వ్యక్తమౌతుంది?

◻ మానవజాతి ఏయే విధాలుగా సృష్టి యొక్క ఉత్కృష్టమైన కార్యమైవుంది?

◻ ‘మోషే కీర్తన, గొఱ్ఱెపిల్ల కీర్తన’ ఏ కార్యాలు చేయడానికి పురికొల్పుతాయి?

[12వ పేజీలోని బాక్సు]

యెహోవా యొక్క విశేషమైన జ్ఞానం

నిత్యత్వం యొక్క రాజు యొక్క జ్ఞానం భూమిపై ఆయన ఉత్పత్తి చేసిన వాటిలో అనేక రీతుల్లో ప్రతిబింబించబడుతున్నది. ఆగూరు మాటలను గమనించండి: “దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.” (సామెతలు 30:5) అటుతరువాత, దేవుని జీవ సృష్టిలో పెద్దా చిన్నా అనేకమైన వాటిని గురించి ఆగూరు తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు, 24 నుండి 28 వచనాల్లో ఆయన ఇలా వర్ణిస్తున్నాడు, “భూమి మీద చిన్నవి నాలుగు కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము (“సహజసిద్ధమైన జ్ఞానం,” NW) గలవి.” ఇవి చీమలు, కొండచరియలలో నివసించు చిన్న కుందేలు, మిడుతలు, మరియు బల్లి.

“సహజసిద్ధమైన జ్ఞానం”—అవును, జంతువులు ఆవిధంగానే రూపించబడ్డాయి. మానవులు ఆలోచించినట్లుగా అవి విషయాలను ఆలోచించలేవుగాని తమలో నిక్షిప్తమైవున్న జ్ఞానంపై ఆధారపడతాయి. దీని గురించి మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? అవి ఎంతటి క్రమంగల సృష్టో కదా! ఉదాహరణకు, చీమలు వర్గాలుగా సంస్థీకరించబడ్డాయి, వాటిలో రాణీ చీమలు, పనిచేసే చీమలు, మగ చీమలు ఉంటాయి. కొన్ని జాతులలో, పనిచేసే చీమలు తాము నిర్మించిన ఆవరణల్లోకి ఎఫిడ్లను గుంపులుగా చేరుస్తుంటాయి. అక్కడ అవి ఎఫిడ్లను పితుకుతుండగా, దాడి చేయడానికి వచ్చే ఏ శత్రువునైనా సైనిక చీమలు పారద్రోలుతాయి. సామెతలు 6:6నందు ఈ ఉపదేశం ఇవ్వబడింది: “సోమరీ చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.” అలాంటి ఉదాహరణలు, ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎక్కువ చేయడానికి’ మానవులమైన మనల్ని ప్రేరేపించవద్దా?—1 కొరింథీయులు 15:58.

మానవుడు పెద్దపెద్ద విమానాలను నిర్మించాడు. కాని 30 గ్రాముల కంటే తక్కువ బరువుండే తేనెపిట్టవంటి చిన్నపిట్టతోపాటు పక్షులు మరెంత సునిశితమైనవో కదా! బోయింగ్‌ 747 విమానం 1,80,000 లీటర్ల ఇంధనాన్ని మోసుకు వెళ్లాలి, తర్ఫీదు పొందిన చోదక సిబ్బంది చేత నడిపింపబడాలి, మహా సముద్రాన్ని దాటడానికి సంక్లిష్టమైన నావికా పద్ధతులు ఉండాలి. అయితే, అతి చిన్నదైన తేనెపిట్టవంటి చిన్నపిట్ట ఉత్తర అమెరికా నుండి మెక్సికో సింధుశాఖ మీదుగా దక్షిణమెరికాకు ప్రయాణించడానికి ఈ మార్గమంతటిలో ఎగరడానికి కేవలమొక గ్రాము క్రొవ్వు నుండి వచ్చే శక్తిపైనే ఆధారపడుతుంది. బరువైన ఇంధనంలేదు, నౌకాయానంలో తర్ఫీదులేదు, సంక్లిష్టమైన చార్టులు లేక కంప్యూటర్లు లేవు! ఈ సామర్థ్యం పరిణామం యొక్క ఆకస్మిక ప్రక్రియ నుండి ఆవిర్భవించిందా? ఎంత మాత్రం కాదు! ఈ అతిచిన్న పక్షి దాని సృష్టికర్తయైన యెహోవా దేవుని చేత రూపొందించబడిన సహజసిద్ధమైన జ్ఞానం గలది.

[10వ పేజీలోని చిత్రం]

“నిత్యత్వం యొక్క రాజు” యొక్క విభిన్నమైన సృష్టి కార్యాలు ఆయన మహిమను ఘనపరుస్తున్నాయి

[15వ పేజీలోని చిత్రం]

ఎర్ర సముద్రం వద్ద మోషే మరియు ఇశ్రాయేలీయులు యెహోవా విజయాన్ని ఉత్సవం చేసుకున్నట్లే, అర్మగిద్దోను తర్వాత గొప్ప ఆనందం ఉంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి