కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 9/15 పేజీలు 5-6
  • అసూయ నా జీవితాన్ని దాదాపు నాశనం చేసింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అసూయ నా జీవితాన్ని దాదాపు నాశనం చేసింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేమ అయుక్తమైన అసూయపై విజయం సాధిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా యొక్క పవిత్రారాధన నిమిత్తం అసూయ కలిగి ఉండుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • అసూయను గురించి మీరేమి తెలుసుకోవాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • క్రైస్తవులు అసూయాపరులుగా ఉండాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 9/15 పేజీలు 5-6

అసూయ నా జీవితాన్ని దాదాపు నాశనం చేసింది

నేను నా రెండవ భర్త అయిన మార్క్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు అసూయ నన్ను చాలా తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించింది.a మేము మా సవతి పిల్లలపట్ల శ్రద్ధ వహించాల్సి వచ్చింది మరియు మా గత వివాహ సహచరులతో వ్యవహరించవలసి వచ్చింది. పరిస్థితి కొన్నిసార్లు భరించరానిదిగా ఉండేది. కుటుంబ గొడవలు వచ్చినప్పుడల్లా, మార్క్‌ నాకు మద్దతు ఇవ్వడం లేదనిపించేది. ఆయనింకా తన మాజీ భార్యను ప్రేమిస్తున్నారని నేను భావించడం ప్రారంభించాను. నా అసూయను అదుపు చేసుకునే బదులు అది నా జీవితాన్ని అదుపు చేసేలా నేను అనుమతించాను. మార్క్‌ మాజీ భార్య సమక్షంలో నేను భావోద్రేకంగా భయభీతి చెందేదాన్ని.

నేను మార్క్‌ను తదేకంగా గమనించేదాన్ని, చివరకు ఆయన ఎక్కడ చూస్తున్నాడో తెలుసుకునేందుకు ఆయన కళ్లను కూడా గమనించేదాన్ని. ఆయన ఊహించని విషయాలను ఆయన కళ్లలో నేను చదివేదాన్ని. కొన్నిసార్లు తన మాజీ భార్యను ఇంకా ప్రేమిస్తున్నాడని ఆయనను బాహాటంగా నిందించేదాన్ని. ఒక సందర్భంలో ఆయనెంతగా విసుగు చెందారంటే ఆయన ఒక క్రైస్తవ సమావేశం మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారు. నేను యెహోవా ఎదుట తప్పిదస్థురాలిగా భావించాను. నేను నా కుటుంబ జీవితాన్ని కూడా దయనీయం చేసుకున్నాను, ఎందుకంటే తుదకు పిల్లలు కూడా ప్రభావితం చెందారు. నేను చేస్తున్న దాన్నిబట్టి నన్ను నేను ద్వేషించుకున్నాను, కానీ నేనెంత ప్రయత్నించినా నా అసూయను నేను అదుపు చేసుకోలేకపోతున్నట్లు అనిపించింది.

నాకు సహాయం చేసే బదులు, మార్క్‌ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించారు. నేను ఆయనను నిందించినప్పుడు, ఆయన, “అసూయ, నీకు చాలా అసూయ” అని నాపై కేకలేసేవారు. నాకు అసూయ కలిగించడానికి ఆయన ఉద్దేశపూర్వకంగా కొన్ని పనులు చేసే వారనిపించేది. అది నా అసూయను నయం చేస్తుందని ఆయన భావించారేమో, అయితే విషయాలు ఇంకా ఎక్కువ చెడిపోయాయంతే. ఆయన ఇతర స్త్రీలను చూసి వాళ్లెంత అందంగా ఉన్నారో వ్యాఖ్యానించడం ప్రారంభించారు. అది నేనింకా అల్పురాలినని మరి అనవసరమైన దాన్నని భావించేలా చేసింది. పరిస్థితి ఎక్కడకు దారి తీసిందంటే, మరో భావోద్రేకం—ద్వేషం—తన నీచమైన తల పైకెత్తింది. ఆ స్థితిలో, నేనెంతగా కలత చెందానంటే నేను కేవలం ఆయనను, ఆయన కుటుంబాన్ని నా జీవితంలోనుండి తొలగించుకోవాలని కోరుకున్నాను.

“మత్సరము [“అసూయ,” NW] ఎముకలకు కుళ్లు” అని బైబిలు చెబుతున్నప్పుడు, అది కచ్చితంగా నిజం. (సామెతలు 14:30) నా ఆరోగ్యం ప్రభావితం చెందటం ప్రారంభించింది. నాకు కడుపులో అల్సర్లు వచ్చి అవి నయమవ్వడానికి చాలా కాలం పట్టింది. మార్క్‌ చేసిన ప్రతిదాన్ని అనుమానిస్తూ నేను నా జీవితాన్ని దయనీయం చేసుకోసాగాను. నేను ఆయన జేబులు వెదకేదాన్ని, ఒకవేళ టెలిఫోన్‌ నంబర్లు కనుగొంటే అటువైపున ఎవరుంటారో చూడటానికి నేను ఫోన్‌ చేసేదాన్ని. నా మనస్సులో నేనెంతో సిగ్గుపడేదాన్ని, యెహోవా ఎదుట నాకు కలుగుతున్న అవమాన భావాలనుబట్టి నేను ఏడ్చేదాన్ని. అయినా నన్ను నేను ఆపుకోలేక పోయాను. నాకు నేనే ఒక నీచమైన శత్రువును.

నా ఆత్మీయత ఎంతగా దెబ్బ తిన్నదంటే నేను ఇక ఎంతమాత్రం ప్రార్థించలేక పోయాను. నేను యెహోవాను ప్రేమించాను మరి సరైనది చేయడానికి వాస్తవంగా ఇష్టపడ్డాను. భార్యాభర్తలకు సంబంధించిన లేఖనాలన్నీ నాకు తెలుసు, అయితే నేను వాటిని అన్వయించుకోలేక పోయాను. నాకు చక్కని పిల్లలున్నా, నా జీవితంలో మొదటిసారిగా, నేను చనిపోవాలనుకున్నాను.

సంఘంలోని పెద్దలు ఎంతగానో ప్రోత్సహించారు వారు వీలైనంత శ్రేష్ఠంగా నాకు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే నా అసూయను గురించిన ప్రస్తావన వారు తెచ్చినప్పుడు, నాకు అలాంటి సమస్య ఉందని అంగీకరించడానికి ఇష్టపడక నేను ఇబ్బందిపడుతూ దాన్ని నిరాకరించే దాన్ని.

తుదకు, నా ఆరోగ్యం ఎంతగా క్షీణించిందంటే నేను శస్త్రచికిత్స కొరకు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు జీవితం ఇలా ఇక కొనసాగలేదని నేను గ్రహించాను. అంత భావోద్రేకంగా ఇమిడిపోకుండా ఉంటూ మా పరిస్థితిని పరీక్షించుకోవడానికి మార్క్‌, నేను మూడు నెలల వరకు విడిగా ఉండాలని నిర్ణయించుకున్నాము. ఈ సమయంలోనే ఎంతో అద్భుతమైనది జరిగింది. “త్రాగుబోతుల పెద్దవయస్కులైన పిల్లలకు సహాయం” అనే పేరుతో ఒక శీర్షిక తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికలో వచ్చింది.b

అసలు విషయమేంటంటే, నా తల్లి త్రాగుబోతు. నేను శారీరకంగా హింసింపబడనప్పటికీ, నా తలిదండ్రులు ఒకరిపట్ల ఒకరు లేక నా పట్ల ఆప్యాయతను ఎన్నడూ కనపర్చలేదు. మా అమ్మ నన్ను ఎత్తుకోవడం లేక నన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పడం నాకు జ్ఞాపకం లేవు. కావున వాస్తవానికి ఎలా ప్రేమించాలి అంతే ప్రాముఖ్యంగా ఎలా ప్రేమింపబడాలి అనేవి అసలు తెలియకుండానే నేను పెరిగాను.

నా తండ్రి ప్రేమ కలాపాల గురించి నా తల్లి నాకు తరచూ చెబుతూ తాను అతన్ని నమ్మలేనని చెప్పేది. కావున బహుశా పురుషులను సాధారణంగా నమ్మని దానిగా నేను పెరిగి పెద్దయ్యాననుకుంటా. నేను పెంచబడిన రీతినిబట్టి, నేను ఎప్పుడూ ఇతరులకంటే అల్పురాలినని, ప్రాముఖ్యంగా ఇతర స్త్రీలకంటే అల్పురాలినని భావించేదాన్ని. ఆ తేజరిల్లు! శీర్షికను చదవడం, ఈ విషయాల ప్రాముఖ్యతను గుర్తెరగడానికి నాకు సహాయం చేసింది. అసూయవలన నాకున్న సమస్యలకుగల అసలు కారణాలను మొట్టమొదటిసారిగా నేను అర్థం చేసుకున్నాను.

ఆ తేజరిల్లు! శీర్షికను నేను నా భర్త మార్క్‌కు చూపించాను, నన్ను శ్రేష్ఠంగా అర్థం చేసుకోవడానికి అది ఆయనకు కూడా సహాయం చేసింది. విడిపోవాలని ఆలోచిస్తున్న దంపతులకు బైబిలిస్తున్న సలహాను వెంటనే ఆయనా నేను పాటించగలిగాము. మేము సమాధానపడ్డాము. (1 కొరింథీయులు 7:10, 11) మా వివాహబంధం ముందెన్నటికంటే ఇప్పుడు ఎంతో శ్రేష్ఠంగా ఉంది. మేము చాలా పనులు కలిసి చేస్తాం, ప్రాముఖ్యంగా క్రైస్తవ కార్యకలాపాలు ఇమిడి ఉన్నప్పుడు అలా చేస్తాము. మార్క్‌ ఇప్పుడు ఎక్కువ జాలి చూపుతున్నారు. దాదాపు ప్రతిరోజు ఆయన నన్నెంత ప్రేమిస్తున్నారో చెబుతారు, మరి నేను ఇప్పుడు దాన్ని వాస్తవంగా నమ్ముతున్నాను.

మార్క్‌ మాజీ భార్యను కలుస్తామని నాకు తెలిసినప్పుడల్లా, నేను పరిపక్వమైన క్రైస్తవ పద్ధతిలో ప్రవర్తించడానికి నాకు సహాయం చేయమని అడుగుతూ, శక్తి కొరకు యెహోవాకు ప్రార్థిస్తాను. అది పని చేస్తుంది కూడా. ఆమెపట్ల నాకున్న వ్యతిరేక భావాలు కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. నేను ఇప్పుడు ప్రతికూల భావాలపై ఎక్కువ అవధానం నిలుపను లేక నా ఊహలు అదుపు తప్పేలా నేను అనుమతించను.

అయుక్తమైన అసూయా భావాలు నాకు ఇప్పుడు కూడా కలుగుతాయి. దేవుని నూతన లోకంలోని పరిపూర్ణ జీవితమే నాకు అయుక్తమైన అసూయ లేకుండా పూర్తిగా తీసివేస్తుంది. ఈ మధ్యలో, అసూయ నన్ను అదుపు చేయడానికి అనుమతించే బదులు నేను దాన్ని అదుపు చేయడానికి నేర్చుకున్నాను. అవును, అసూయ నా జీవితాన్ని దాదాపు నాశనం చేసింది, అయితే యెహోవా మరియు ఆయన సంస్థ సహాయం వలన నేనిప్పుడు ఎంతో సంతోషంగల వ్యక్తిని, నా ఆరోగ్యం కూడా మళ్లీ మామూలుగా అయ్యింది. మళ్లీ ఒకసారి నా దేవుడైన యెహోవాతో నాకు బలమైన సంబంధం ఉంది.—ఉచితవ్యాసం.

[అధస్సూచీలు]

a పేరు మార్చబడింది.

b మే 22, 1992 తేజరిల్లు! (ఆంగ్లం) 8-12 పేజీలను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి