కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 9/15 పేజీ 7
  • ఈర్ష్యపడే వ్యక్తి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈర్ష్యపడే వ్యక్తి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈర్ష్యతో పోరాడుతూ శాంతిని నెలకొల్పండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • మన మనసులను విషపూరితం చేసే అసూయ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • అసూయను గురించి మీరేమి తెలుసుకోవాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 9/15 పేజీ 7

ఈర్ష్యపడే వ్యక్తి

హెబ్రీ భాషలో “అసూయ” అనే పదానికి కేవలం ఒకటే మూలపదం ఉంది. పాపభరితులైన మానవులను సూచిస్తున్నప్పుడు ఆ హెబ్రీ పదాన్ని “ఈర్ష్య” లేక “రోషము” అని అనువదించవచ్చు. (ఆదికాండము 26:14; ప్రసంగి 4:4) అయితే, గ్రీకు భాషలో “అసూయ”కు అనేక పదాలున్నాయి. జీʹలోస్‌ అనే పదం, దాని హెబ్రీ పదంవలెనే, నీతియుక్త మరియు పాపభరిత అసూయను సూచిస్తుంది. ఫితోʹనోస్‌ అనే మరో గ్రీకు పదానికి పూర్తిగా ప్రతికూల భావముంది.

ఫితోʹనోస్‌ అనే పదం ప్రాచీన గ్రీకుభాషలో ఎలా ఉపయోగింపబడేది? ది ఆంకర్‌ బైబిల్‌ డిక్షనరీ ఇలా పేర్కొంటుంది: “పేరాశగల వ్యక్తివలెకాక, ఫితోʹనోస్‌ వల్ల పీడింపబడుతున్న మనిషి ఇతరులకుందని మత్సరపడుతున్న వస్తువులను తాను కావాలని కోరుకోకపోవచ్చు; అయితే అతను కేవలం ఆ వేరే వ్యక్తికి అవి ఉండకూడదని కోరుకొనవచ్చు. అతను పోటీపడే మనిషినుండి కూడా భిన్నంగా ఉంటాడు, అంటే అతని ధ్యేయం పోటీపడే మనిషివలె గెలవాలన్నది కాక ఇతరులు గెలవకుండా వారిని ఆపాలన్నదే అతని ఉద్దేశం.”

తన స్వంత స్వభావమే తన సమస్యలకు కారణమని ఈర్ష్యపడే వ్యక్తికి తెలియదు. “ఫితోʹనోస్‌ యొక్క విశేషతల్లో ఒకటి ఏమంటే దాని స్వయం అజ్ఞానమే, ఫాతోనెరోస్‌ ఉండే మనిషిని, తన ప్రవర్తనను వెనకేసుకురమ్మని అడిగితే, తాను దాడి చేసే వారికి అది తగినదేనని మరి పరిస్థితుల అన్యాయ ప్రభావం విమర్శించేందుకు తనను కదిలిస్తుందని తనకు తాను, అలాగే ఇతరులకు ఎల్లప్పుడూ చెప్పుకుంటాడు. ఒక స్నేహితుని గురించి అలా ఎలా మాట్లాడగలడని అడిగితే, తన విమర్శలు స్నేహితుని శ్రేయస్సు కోరి చేయబడినవేనని అతను చెబుతాడని” అదే నిఘంటువు వివరిస్తుంది.

సువార్త రచయితలైన మత్తయి మరియు మార్కులు, యేసు హత్యకు కారకులైన వారి సంకల్పాన్ని వివరించేందుకు గ్రీకు పదమైన ఫితోʹనోస్‌ను ఉపయోగించారు. (మత్తయి 27:18; మార్కు 15:10) అవును వారు ఈర్ష్యచేత ప్రేరేపించబడ్డారు. మతభ్రష్టులైన వారు తమ పూర్వపు సహోదరులను విషపూరితంగా ద్వేషించేందుకు, ఆ హానికరమైన భావోద్రేకమే కారణం. (1 తిమోతి 6:3-5) ఈర్ష్యపడే మనుష్యులు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డగించబడ్డారంటే అందులో ఆశ్చర్యంలేదు! ‘ఈర్ష్యతో నిండి’ ఉండే వారందరూ “మరణమునకు తగినవారు” అని యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడు.—రోమీయులు 1:29, 32; గలతీయులు 5:21.

[7వ పేజీలోని చిత్రాలు]

ఈర్ష్య మీ జీవితాన్ని నాశనం చేయనివ్వకండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి