కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 9/15 పేజీలు 3-5
  • అసూయను గురించి మీరేమి తెలుసుకోవాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అసూయను గురించి మీరేమి తెలుసుకోవాలి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఈర్ష్యపడే స్వభావం’
  • పాపభరితమైన అసూయలేని లోకం
  • ప్రేమ అయుక్తమైన అసూయపై విజయం సాధిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా యొక్క పవిత్రారాధన నిమిత్తం అసూయ కలిగి ఉండుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యోసేపు తన అన్నల అసూయకు బలయ్యాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • క్రైస్తవులు అసూయాపరులుగా ఉండాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 9/15 పేజీలు 3-5

అసూయను గురించి మీరేమి తెలుసుకోవాలి

అసూయ అంటే ఏమిటి? అది, ఒక వ్యక్తి చింతించి, బాధపడి, లేక కోపడేలా చేయగల తీవ్రమైన భావోద్రేకం. ఒక పని చేయడంలో ఎవరైనా మనకంటే ఎక్కువ విజయవంతంగా ఉన్నట్లు కనిపిస్తే మనం అసూయను అనుభవించవచ్చు. లేక ఒక స్నేహితుడు మనకంటే ఎక్కువ ప్రశంస పొందితే మనం అసూయపడవచ్చు. అయితే, అసూయ పడటం ఎల్లప్పుడూ తప్పేనా?

అసూయపడే ప్రజలు తమకు పోటీగా వస్తారని భావించే వారిని అనుమానిస్తారు. ప్రాచీన ఇశ్రాయేలు యొక్క రాజైన సౌలు దీనికి ఒక ఉదాహరణ. మొదట్లో తన ఆయుధాలను మోసేవాడైన దావీదును అతనెంతగానో ప్రేమించాడు, అతన్ని సైన్యాధికారిగా కూడా నియమించాడు. (1 సమూయేలు 16:21; 18:5) తర్వాత ఒక దినాన “సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిర”న్న మాటలతో స్త్రీలు దావీదును పొగడటం రాజైన సౌలు విన్నాడు. (1 సమూయేలు 18:7) దావీదుతో తనకున్న మంచి సంబంధాన్ని ఇది ప్రభావితం చేయడాన్ని సౌలు అనుమతించకుండా ఉండాల్సింది. అయితే, అతను కోప్పడ్డాడు. “కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపుచూపు నిలిపెను.”—1 సమూయేలు 18:9.

అసూయపడే వ్యక్తి మరొక వ్యక్తికి హాని జరగాలని కోరుకోకపోవచ్చు. అతను లేక ఆమె తమ తోటి వారి విజయాన్నిబట్టి కేవలం ఆగ్రహించవచ్చు మరి అదే లక్షణాలను లేక పరిస్థితులను కలిగివుండాలని ఆశించవచ్చు. మరోవైపు, ఈర్ష్య అనేది ప్రత్యేకంగా అసూయకుగల ప్రతికూల రూపం. ఈర్ష్యపడే వ్యక్తి తనకు అసూయ కలిగించే వ్యక్తినుండి రహస్యంగా మంచిని అందకుండా ఉంచవచ్చు లేక వారికి హాని జరగాలని కోరుకోవచ్చు. కొన్నిసార్లు, ఈర్ష్యపడే వ్యక్తి తన భావాలను రహస్యంగా ఉంచలేడు. రాజైన సౌలు దావీదును హత్య చేయాలని ప్రయత్నించినట్లే, అతను మరొకరికి బాహాటంగా హాని చేయాలని పురికొల్పబడవచ్చు. “దావీదును గోడకు పొడుచుదునన్న” ఉద్దేశంతో సౌలు అనేకసార్లు ఈటె విసిరాడు.—1 సమూయేలు 18:11; 19:10.

‘అయితే నేను అసూయపడే వ్యక్తిని కాదని’ మీరనవచ్చు. నిజమే అసూయ మీ జీవితాన్ని అదుపు చేయక పోవచ్చు. అయితే, కొంతమేరకు మనందరం అసూయ చేత ప్రభావితం చెందుతాము—అవి మన స్వంత అసూయా భావాలు కావచ్చు మరి ఇతరులవి కూడా కావచ్చు. ఇతరుల్లోని అసూయను మనం ఇట్టే గుర్తించగలిగినా, దాన్ని మనలో మనం త్వరగా గుర్తించలేకపోవచ్చు.

‘ఈర్ష్యపడే స్వభావం’

దేవుని వాక్యమైన బైబిలులో బయల్పర్చబడిన పాపభరిత మానవ ప్రవృత్తి రికార్డు తరచూ ఈర్ష్య యొక్క పాపాలను విశదపరుస్తుంది. కయీను మరియు హేబెలుల వృత్తాంతం మీకు జ్ఞాపకముందా? ఆదాముహవ్వల ఈ ఇద్దరు కుమారులూ దేవునికి బలులర్పించారు. హేబెలు విశ్వాసంగల వ్యక్తి గనుక బలి అర్పించాడు. (హెబ్రీయులు 11:4) భూమిని గురించిన దేవుని మహిమాన్విత సంకల్పాన్ని నెరవేర్చగల ఆయన సామర్థ్యంలో అతనికి విశ్వాసం ఉంది. (ఆదికాండము 1:28; 3:15; హెబ్రీయులు 11:1) రాబోవు భూపరదైసులో జీవాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు నమ్మకస్థులైన మానవులకు ప్రతిఫలమిస్తాడని కూడా హేబెలు విశ్వసించాడు. (హెబ్రీయులు 11:6) అలా, దేవుడు హేబెలు బలియందు తాను ఆనందించానని చూపాడు. కయీను ఒకవేళ తన తమ్మున్ని నిజంగా ప్రేమించి ఉంటే, దేవుడు హేబెలును దీవించాడని అతను సంతోషించి ఉండేవాడే. బదులుగా, కయీనుకు “మిక్కిలి కోపము వచ్చి”నది.—ఆదికాండము 4:5.

తాను కూడా దీవెన పొందేలా మంచి చేయాలని దేవుడు కయీనును పురికొల్పాడు. తర్వాత దేవుడిలా హెచ్చరించాడు: ‘సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువు.’ (ఆదికాండము 4:7) దుఃఖకరంగా, కయీను తన అసూయతో కూడిన కోపాన్ని అదుపు చేసుకోలేదు. నీతిమంతుడైన తన తమ్మున్ని హత్య చేయడానికి అది అతన్ని నడిపింది. (1 యోహాను 3:12) అప్పటినుండి, పోరాటాలు మరియు యుద్ధాలు కోట్లకొలది ప్రాణాలను బలిగొన్నాయి. “యుద్ధం జరగడానికి గల సాధారణ కారణాల్లో కొన్ని ఎక్కువ భూమి కావాలన్న కోరిక, ఎక్కువ సంపద కావాలన్న కోరిక, ఎక్కువ అధికారం కావాలన్న కోరిక, లేక భద్రత కావాలన్న కోరిక అయ్యుండవచ్చని” ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా వివరిస్తుంది.

నిజ క్రైస్తవులు ఈ లోక యుద్ధాల్లో పాల్గొనరు. (యోహాను 17:16) అయితే, దుఃఖకరంగా, క్రైస్తవులు ఆ యా వ్యక్తులుగా కొన్నిసార్లు మాటల పోరాటాల్లో చిక్కుకు పోతారు. ఒకవేళ సంఘంలోని ఇతర సభ్యులు కూడా అందులో పక్షాలు వహిస్తే, ఈ పోరాటాలు హానికరమైన వాగ్యుద్ధాలుగా మారగలవు. “మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి?” అని బైబిలు రచయితైన యాకోబు తోటి విశ్వాసులను అడిగాడు. (యాకోబు 4:1) వారు “మత్సరపడుదురు” లేక “అసూయపడుదురు” అని అంటూ, వారి వస్తుదాయక పేరాశను బహిర్గతం చేస్తూ ఆ ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాడు. (యాకోబు 4:2) నిజమే, వస్తుదాయక పేరాశ శ్రేష్ఠమైన పరిస్థితులను అనుభవిస్తున్నట్లు కనిపించే వారిని చూసి మత్సరపడి మరి అసూయగా భావించడానికి దారి తీయవచ్చు. ఈ కారణం చేతనే, మానవుని ‘ఈర్ష్యపడే స్వభావానికి’ విరుద్ధంగా యాకోబు హెచ్చరించాడు.—యాకోబు 4:5.

అసూయకుగల కారకాలను విశ్లేషించడంలో ఉన్న ప్రయోజనమేమిటి? వాస్తవానికి, ఇది మనం యథార్థంగా ఉండడానికి సహాయం చేస్తుంది మరి ఇతరులతో శ్రేష్ఠమైన సంబంధాలను వృద్ధిపరుస్తుంది. మనం ఎక్కువ అర్థం చేసుకునే వారిగా, సహించే వారిగా, మరి క్షమించే వారిగా ఉండటానికికూడా సహాయం చేయగలదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, పాపభరితమైన మానవ ప్రవృత్తులనుండి మానవుడు పొందాల్సిన దేవుని ప్రేమపూర్వకమైన రక్షణ మరియు విడుదల ఏర్పాటు యొక్క గొప్ప అవసరతను అది ఉన్నతపరుస్తుంది.—రోమీయులు 7:24, 25.

పాపభరితమైన అసూయలేని లోకం

మానవ దృష్టినుండి చూస్తే, పాపభరితమైన అసూయలేని లోకం అసాధ్యమని అనిపించవచ్చు. రచయితైన రామ్‌ లండావు ఇలా ఒప్పుకుంటున్నాడు: “అనేక తరాలుగా గడించిన జ్ఞానం, ఆ అంశాన్ని గురించి వేదాంతులు . . . మరియు మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పినదంతా అసూయచేత పీడింపబడే మనిషికి ఎలాంటి నడిపింపును అందించడం లేదు. . . . అసూయపడే మనిషిని ఏ వైద్యుడైనా ఎప్పుడైనా బాగుచేశాడా?”

అయితే, దైవ విరుద్ధమైన అసూయ లేక ఈర్ష్యతో ఎవరూ ముట్టడింపబడని నూతనలోకంలో పరిపూర్ణ మానవ జీవితాన్ని పొందగల నిరీక్షణను దేవుని వాక్యం అందజేస్తుంది. అంతేకాకుండా, ఆ నూతన లోకంలోని శాంతి, అలాంటి దుష్ట గుణాలను ప్రదర్శించే ప్రజల చేత విఘ్నపర్చబడదు.—గలతీయులు 5:19-21; 2 పేతురు 3:13.

అయిననూ, అన్ని రకాలైన అసూయ తప్పైనది కాదు. వాస్తవానికి, యెహోవా “రోషముగల [“అసూయగల,” NW] దేవుడు” అని బైబిలు చెబుతుంది. (నిర్గమకాండము 34:14) దాని భావమేమిటి? యుక్తమైన అసూయను గురించి బైబిలేమి చెబుతుంది? అదే సమయంలో, ఒక వ్యక్తి అయుక్తమైన అసూయపై ఎలా పట్టు సాధించగలడు? తరువాతి శీర్షికలను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి