కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 8/15 పేజీలు 28-30
  • భక్తిహీనమైన పారంపర్యాలను ప్రతిరోధించండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భక్తిహీనమైన పారంపర్యాలను ప్రతిరోధించండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మూఢనమ్మకపు అంత్యక్రియల ఆచారం
  • లైంగిక “శుభ్రపర్చడం”
  • గర్భస్రావం మరియు మృత శిశుజననం
  • ఎదిరింపులను నివారించండి, కానీ నిలకడగా ఉండండి
  • అంత్యక్రియల విషయంలో క్రైస్తవ దృక్కోణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవుణ్ణి అసంతోషపరిచే ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • “పాదాలకు కాదు, నోటికి ఆహారాన్ని అందించండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • క్రైస్తవులు అంత్యక్రియలను గౌరవపూర్వకంగా, మర్యాదకరంగా, దేవుడు ఇష్టపడే విధంగా జరిపించాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 8/15 పేజీలు 28-30

భక్తిహీనమైన పారంపర్యాలను ప్రతిరోధించండి!

“సత్యము మిమ్మును స్వతంత్రులను” చేయును అని యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 8:32) అవును, క్రైస్తవత్వం ప్రజలను స్వతంత్రులను చేస్తుంది—మూఢనమ్మకపు దాసత్వం నుండి స్వతంత్రులనుగాను అబద్ధ సిద్ధాంతాలు మరియు విశ్వాసాల నుండి స్వతంత్రులనుగాను దిగజారిపోతున్న ఆచారాల బంధకాల నుండి స్వతంత్రులనుగాను చేస్తుంది.

అయితే ప్రాచీన కాలాల్లోలా, క్రైస్తవులు నేడు తరచూ తమ పూర్వపు పారంపర్యాలకు వెళ్లే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. (గలతీయులు 4:9, 10) దాని భావం, ప్రసిద్ధి చెందిన ఆచారాలన్నీ హానికరమైనవని కాదు. వాస్తవానికి, ఓ క్రైస్తవుడు మంచివైన మరియు ప్రయోజనకరమైన ఆచారాలను అనుసరించేందుకు ఎన్నుకోవచ్చు. అయితే, ఆచారం దేవుని వాక్యానికి విరుద్ధమైనప్పుడు, క్రైస్తవులు రాజీపడరు. కనుక, క్రిస్టమస్‌ ఆచరణ, జన్మదిన వేడుక దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మరితర ఆచారాలలో భాగం వహించేందుకు నిరాకరించడంలో యెహోవాసాక్షులు ప్రసిద్ధిగాంచారు.

ధైర్యంతో తీసుకున్న ఈ స్థానం వల్ల, పరిచయస్థులు, పొరుగువారు మరియు అవిశ్వాసులైన బంధువులనుండి అధిక పరిహాసం మరియు వ్యతిరేకతలు వచ్చాయి. ప్రత్యేకంగా కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఇది నిజమైంది, అక్కడ ఎన్నో పారంపర్యాలు, చనిపోయినప్పుడు, పెళ్లిళ్ల సమయంలో మరియు జననాల సమయంలో సాధారణంగా ఆచరించబడుతుంటాయి. వాటిని ఆచరించాలనే ఒత్తిళ్లు భయంకరంగా ఉండవచ్చు—తరచూ అవి బెదిరింపులూ మరియు దౌర్జన్యపూరితమైన క్రియలతోకూడినవై ఉంటాయి. అక్కడి క్రైస్తవులు దృఢంగా ఎలా నిలువగలరు? వాటితో రాజీపడకుండా వాటిని ఎదిరించకుండా నివారించడం సాధ్యమౌతుందా? దానికి జవాబుగా, లేఖన విరుద్ధమైన పారంపర్యాలతో యథార్థమైన క్రైస్తవులు ఎలా వ్యవహరిస్తారో మనం పరిశీలిద్దాం.

మూఢనమ్మకపు అంత్యక్రియల ఆచారం

దక్షిణాఫ్రికానందు అంత్యక్రియలు మరియు సమాధికి సంబంధించిన అనేక పారంపర్యాలున్నాయి. దుఃఖించేవారు సాధారణంగా రాత్రంతా దుఃఖిస్తారు—లేక అనేక రాత్రులు—దుఃఖించేవారి ఇంటివద్ద గడుపుతారు, అక్కడ మంట ఎడతెగక మండుతూనే ఉంటుంది. సమాధి జరిగేంతవరకూ ప్రియమైనవారిని కోల్పోయినవారు వంట చేసుకునేందుకు, జుట్టు కత్తిరించుకునేందుకు లేక కనీసం స్నానం కూడా చేసుకునేందుకు అనుమతించేవారు కాదు. ఆ తర్వాత వారు ప్రత్యేకమైన వనమూలికలతో స్నానం చేయాలి. అలాంటి ఆచారాలు క్రైస్తవులకు అంగీకార యోగ్యమైనవేనా? లేదు. ఆత్మ అమర్త్యమైనదనే విశ్వాసాన్ని మరియు చనిపోయిన వారిని గూర్చిన హానికరమైన భయాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి.

ప్రసంగి 9:5 ఇలా చెబుతోంది: ‘బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.’ ఈ సత్యాన్ని తెలుసుకోవడం ఒకరు ‘మరణించినవారి ఆత్మలకు’ భయపడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే సదుద్దేశాలుగల బంధువుల దగ్గిర సంబంధులైన వారు, అలాంటి ఆచారాల్లో పాల్గొనమని ఓ క్రైస్తవునినో క్రైస్తవురాలినో కోరినట్లైతే అప్పుడు ఓ క్రైస్తవుడు ఏమి చేయాలి?

ఆఫ్రికా నివాసులైన జేన్‌ అనే సాక్షి అనుభవాన్ని పరిశీలించండి, ఆమె నాన్నగారు చనిపోయారు. అంత్యక్రియలు జరుగుతున్న ఇంటికి వచ్చిన వెంటనే, ఆమె, కుటుంబంలో మిగిలినవారు, మరణించిన వ్యక్తి ఆత్మ శాంతి కొరకు రాత్రంతా ఆ శవంచుట్టూ నాట్యం చేయాలని ఆమెకు చెప్పడం జరిగింది. “ఓ యెహోవాసాక్షిగా నేను అలాంటి ఆచారాల్లో పాల్గొననని” నేను వారితో చెప్పాను. కానీ మరణించిన వ్యక్తి ఆత్మ నుండి మరింత రక్షణ కొరకు, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు స్నానం చేయించబోతున్నామని, ఆమె బంధువుల్లో పెద్దవయస్కులు, సమాధి చేసిన మరునాడు ఆమెతో చెప్పారు. మరలా నేను అందులో పాల్గొనేందుకు నిరాకరించాను. అదే సమయంలో, అమ్మను ఇంట్లో ఒంటరిగా ఉంచారు. ఆమెను చూడాలనుకున్నవారెవరైనా ఆ ఉద్దేశానికి సిద్ధపర్చిన మాదకద్రవ్యాన్ని మొదట త్రాగవల్సి ఉంటుంది.

“వీటన్నింటిలోనూ నేను పాల్గొనేందుకు నిరాకరించాను. కొంత ఆహారాన్ని తయారు చేసేందుకు నేను ఇంటికి వెళ్లాను, మరి మా అమ్మ ఉంటున్న ఇంటికి దాన్ని తీసుకెళ్లాను. ఇది నిజంగా మా కుటుంబాన్ని నిరాశపర్చింది. నేను మామూలుగా లేనని నా బంధువులు అనుకున్నారు” అని జేన్‌ చెబుతోంది. అంతేకాక వారు ఆమెను వెక్కిరించారు మరియు ఇలా అంటూ ఆమెను దూషించారు: “నీ మతం వల్ల మన ఆచారాలను నీవు నిరాకరించావు కనుక, మీ తండ్రి ఆత్మ నిన్ను బాధిస్తుంది. అసలు, నీకు ఇంక పిల్లలు పుట్టరు.” అయినా జేన్‌ భయపడకుండా దృఢంగా నిలిచింది. దాని ఫలితం? ఆమె ఇలా చెబుతోంది: “ఆ సమయంలో నాకు ఇద్దరు పిల్లలుండేవారు. ఇప్పుడు నాకు ఆరుగురున్నారు! నాకు ఇక ఎన్నడు పిల్లలు పుట్టరు అని శపించిన వారిని అది అవమానపర్చింది.”

లైంగిక “శుభ్రపర్చడం”

మరో ఆచారంలో, ఒకరి భార్య గానీ భర్తగాని చనిపోతే వైదిక శుభ్రపర్చడం కూడా ఇమిడివుంది. భార్య చనిపోతే, భార్యను కోల్పోయిన వ్యక్తి వద్దకు అతని మరదలును లేక చనిపోయిన భార్య దగ్గిరి బంధువుల్లో మరో స్త్రీని తీసుకువస్తారు. అతను తప్పనిసరిగా ఆమెతో లైంగిక సంబంధం కల్గివుండాలి. అప్పుడు మాత్రమే అతడు తన ఇష్టం వచ్చినవారిని వివాహం చేసుకోగలడు. ఒక స్త్రీ భర్త మరణించినట్లైతే అదే జరుగుతుంది. మరణించిన జత “ఆత్మ” నుండి జీవించి ఉన్న భార్య లేక భర్తను ఈ ఆచారం శుద్ధిపరుస్తుందని భావించబడుతోంది.

అలాంటి “శుభ్రపర్చడం” నిరాకరించిన వారెవరైనా తమ బంధువుల ఉగ్రతకు గురయ్యే అపాయాన్ని కల్గివుంటారు. ఆమె గానీ లేక ఆయన గాని ఒంటరివారిగా చేయబడగలరు, అపహాస్యానికి మరియు దుర్భాషకు గురికాగలడు. అయినప్పటికీ, క్రైస్తవులు ఈ అలవాటును అనుసరించేందుకు నిరాకరిస్తారు. ఇది “శుభ్రత” కాదు సరికదా, వివాహమందు కాకుండా విడిగా లైంగిక సంబంధం కల్గివుండడం దేవుని దృష్టిలో హేయమైనదని వారికి తెలుసు. (1 కొరింథీయులు 6:18-20) అంతేకాకుండ, క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలి.—1 కొరింథీయులు 7:39.

వయిలెట్‌ అనే ఓ జాంబియా స్త్రీ తన భర్తను కోల్పోయింది. తర్వాత ఆమె బంధువులు, ఒక వ్యక్తితో లైంగిక సంబంధం కల్గివుండమని బలవంతం చేస్తూ అతనిని ఆమె వద్దకు తీసుకువచ్చారు. వయిలెట్‌ అందుకు నిరాకరించింది, దానికి శిక్షగా బావిలోనుండి నీళ్లు తీసుకోవడానికి ఆమెను అనుమతించలేదు. ఆమెకు ఏ హాని జరగకుండా ఉండాలంటే, మెయిన్‌ రోడ్డు మీదికి రావద్దని ఆమెను హెచ్చరించారు. అయినప్పటికి, బంధువుల లేక తోటి గ్రామస్థుల బెదిరింపులకు ఆమె భయపడలేదు.

పిదప వయిలెట్‌ను స్థానిక న్యాయస్థానానికి తీసుకువెళ్లారు. అక్కడ అక్రమ లైంగిక సంబంధాన్ని కల్గివుండేందుకు నిరాకరించడానికి తనకు గల కారణాన్ని ఆమె దృఢంగా వివరించింది. ఆమె నమ్మకాలకు విరుద్ధమైన స్థానిక ఆచారాలను పారంపర్యాలను హత్తుకుని ఉండేందుకు బలవంతం చేయలేమని చెబుతూ న్యాయస్థానం ఆమె పక్షంగా తీర్పుతీర్చింది. ఆసక్తికరంగా, రాజీపడేందుకు ఆమె పూర్తిగా నిరాకరించడం, ఆ గ్రామంలో తర్వాత ఇదే విషయంపై బలవంతం చేయబడిన ఇతర సాక్షులపై ఒత్తిడిని తగ్గించింది.

మోనికా అనే ఓ ఆఫ్రికా సాక్షి తన భర్త చనిపోయిన తర్వాత ఇలాంటి ఒత్తిడినే తాళుకుని నిలిచింది. ఆ వ్యక్తి కుటుంబం ఆమెకు మరో భర్తనివ్వాలని పట్టుపట్టింది. మోనికా ఇలా చెబుతోంది: “1 కొరింథీయులు 7:39 నందలి ఆజ్ఞకు విధేయురాలినవ్వాలన్న నిశ్చయంతో నేను అందుకు నిరాకరించాను.” అయితే ఒత్తిడి ఆగలేదు. “వారు నన్ను భయపెట్టారు. ‘నువ్వు ఈ మనిషిని కాదంటే, ఇక ఎన్నడూ నీకు పెళ్లికాదని’ వారన్నారు. నా తోటి క్రైస్తవుల్లో కొందరు కూడా రహస్యంగా ఈ విధంగా వైదిక కర్మకనుగుణంగా శుభ్రపర్చబడ్డారని వారు చెప్పుకొచ్చారు” అని మోనికా చెప్పింది. అయినప్పటికీ మోనికా దృఢంగా నిలిచింది. “నేను రెండు సంవత్సరాలవరకూ ఒంటరిగా జీవించాను, ఆ తర్వాత నేను క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్నాను,” అని ఆమె చెప్పింది. మోనికా ఇప్పుడు క్రమ పయినీరుగా సేవచేస్తోంది.

గర్భస్రావం మరియు మృత శిశుజననం

దక్షిణాఫ్రికాలోని క్రైస్తవులు కూడా గర్భస్రావం మరియు మృత శిశుజననాల చుట్టూ అల్లుకొనివున్న ఆచారాలతో వ్యవహరించాల్సి ఉంది. అలాంటి విషాదకరమైన సంఘటనలు మానవ అపరిపూర్ణతవల్ల కలిగినవే—దైవిక శిక్షవల్ల కలిగినవికావు. (రోమీయులు 3:23) ఒక స్త్రీకి గర్భస్రావం జరిగితే, కొంతకాలం వరకు ఆమెను కులం నుండి వెలివేయబడినదానిగా కొన్ని ఆఫ్రికా పారంపర్యాలు కోరుతాయి.

ఇటీవల గర్భస్రావమైన ఒక స్త్రీ, ఒక సాక్షి తన ఇంటివైపుకు రావడంచూసి ఆశ్చర్యపోయింది. ఆయన దగ్గిరకు వస్తుండగా, ఆమె గట్టిగా ఇలా అరిచి చెప్పింది: “ఇక్కడికి రావద్దు! మా ఆచార ప్రకారం, గర్భస్రావమైన స్త్రీని సందర్శించకూడదు.” అయితే, యెహోవాసాక్షులు అన్ని విధాలైన ప్రజలకూ బైబిలు సమాచారాన్ని తీసుకువెళతారని మరి గర్భస్రావం విషయంలోని ఆచారాలను వారు పాటించరని ఆ సాక్షి ఆమెతో చెప్పాడు. తర్వాత దేవుని రాజ్యంలో గర్భస్రావం, మృత శిశుజననం సంభవించవని వివరిస్తూ ఆయన ఆమెకు యెషయా 65:20, 23 చదివి వినిపించాడు. తత్ఫలితంగా, ఆ స్త్రీ గృహ బైబిలు పఠనాన్ని అంగీకరించింది.

మూఢనమ్మకంతో కూడిన ఆచారాల్లో మృతశిశువుల సమాధి కూడా ఉండవచ్చు. ఒక సాక్షి అలాంటి ఒక అంత్యక్రియలకు హాజరైనప్పుడు, అక్కడ ఉన్నవారందరూ ఏవో ఔషధాలతో తమ చేతులను కడుగుకొని మందును తమ గుండెలమీద రుద్దుకోవాలని చెప్పారు. ఇదెందుకంటే, ఆ పసిబిడ్డ “ఆత్మ” తిరిగి వచ్చి వారికి హాని చేయకుండా ఉండడానికి అని చెప్పారు. మరణించినవారు జీవించినవారికి హాని కలుగజేయలేరనే బైబిలు బోధ తెలుసు కనుక జోసెఫ్‌ గౌరవపూర్వకంగా నిరాకరించాడు. అయినప్పటికీ, ఆ మందును రాసుకోమని కొందరు అతన్ని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు. జోసెఫ్‌ మరలా నిరాకరించాడు. ఈ క్రైస్తవుని ధైర్యంతోకూడిన నిశ్చయాన్ని చూసి, అక్కడున్న అనేకులు అదే విధంగా ఆ ఔషధాలను నిరాకరించారు.

ఎదిరింపులను నివారించండి, కానీ నిలకడగా ఉండండి

జీవించి ఉన్నవారి భయం మరియు కులం నుండి వెలివేస్తారన్న భీతి మనం రాజీపడిపోయేందుకు ఎంతో బలమైన శక్తులుగా పనిచేయగలవు. సామెతలు 29:25 [NW] ఇలా చెబుతోంది: “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును.” పైన చెప్పిన అనుభవాలు, “యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును” అన్న ఆ వచనం యొక్క తర్వాతి భాగపు సత్యసంధతను ప్రదర్శిస్తున్నాయి.

అయినప్పటికీ, ఎదిరింపులను తరచూ నివారించవచ్చు. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు తన బంధువు అంత్యక్రియలకు ఆహ్వానించబడినట్లైతే, తాను రాజీపడిపోయే స్థితిలోకి వచ్చేంతవరకూ ఆయన వేచివుండకూడదు. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామెతలు 27:12.

అక్కడ ఎలాంటి ఆచారాలు పాటించబడతాయో యుక్తిగా కనుగోవడం జ్ఞానయుక్తం. ఇవి ఆక్షేపనీయమైనట్లైతే, తాను ఎందుకు వీటిలో పాల్గొనలేడో వివరించేందుకు ఈ అవకాశాన్ని ఓ క్రైస్తవుడు వినియోగించుకోవచ్చు, దాన్ని ‘సాత్వీకముతోను గౌరవముతోను వివరించాలి.’ (1 పేతురు 3:15) ఒక క్రైస్తవుడు గౌరవప్రదంగా తన బైబిలు ఆధారిత స్థానాన్ని ముందుగానే వివరించినప్పుడు, అతని బంధువులు అతని విశ్వాసాన్ని మరింత గౌరవించేందుకు మొగ్గుచూపుతారు మరియు భయాలనూ బెదిరింపులను ఉపయోగించేందుకు తక్కువ మొగ్గుచూపుతారు.

బంధువుల ప్రతిస్పందన ఏమైనా, ఏ భయాలు లేక దురాగతాలు కుప్పగా కురిసినప్పటికీ దేవుని అగౌరవపర్చే పారంపర్యాలను అనుసరించడం ద్వారా క్రైస్తవుడు రాజీపడలేడు. మనము మూఢనమ్మకపు భయం నుండి విడుదల పొందాము. అపొస్తలుడైన పౌలు మనకు ఇలా ఉద్బోధించాడు: “ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.”—గలతీయులు 5:1.

[29వ పేజీలోని చిత్రం]

ఇటీవల చనిపోయిన వ్యక్తి, మునుపెప్పుడో చనిపోయిన బంధువులకు సమాచారాన్ని అందించేందుకు మధ్యవర్తిగా పనిచేయగలడని అనేకులు విశ్వసిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి