కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 8/15 పేజీ 31
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • తన గుర్తును విడిచిపెట్టిన ఓ ముద్రణకర్త
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • సత్యంకొరకు ఎందుకు అన్వేషించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మత సత్యం పొందగల్గినదేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 8/15 పేజీ 31

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట ప్రతులను చదివి ఆనందించారా? ఈ క్రింది విషయాలను జ్ఞాపకంచేసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉంటుంది:

◻ మత సత్యం పొందగల్గినదేనా?

యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:32) సత్యం పొందగల్గిందేనని సూచించడమే కాకుండ, మనం దేవున్ని ఆరాధించడంలో దాన్ని కనపర్చాలని చూపాడు. “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుదురు” అని ఆయన ఓ సమరయ స్త్రీతో చెప్పాడు. (యోహాను 4:23)—4/15, 5వ పేజీ.

◻ రాబర్‌ ఎట్యన్‌ ఎవరు మరియు ఆయన తన గుర్తును ఎలా విడిచిపెట్టాడు?

రాబర్‌ ఎట్యన్‌ పదహారవ శతాబ్దంలో జీవించిన ముద్రణాకర్త. ఆయన తన జీవితాన్ని పరిశుద్ధ లేఖనాల ప్రచురణకు సమర్పించాడు మరియు మొదట బైబిలునందు రాయబడిన మాటలను వెలిబుచ్చేందుకు ప్రయత్నించాడు. బైబిలు భాగాన్ని సంఖ్యలున్న వచనాలుగా విడదీసే ఆయన పద్ధతే నేడు విశ్వవ్యాప్తంగా ఉపయోగించబడుతోంది.—4/15, 10, 14 పేజీలు.

◻ మనం ప్రతిదిన బైబిలు పఠనం నుండి ఎలా ప్రయోజనం పొందగలం?

లేఖనాలు ఎప్పుడూ మనకు సరిక్రొత్త భావాన్నిస్తాయి మరియు మనము చూసిన, వినిన, వ్యక్తిగతంగా అనుభవించిన వాటి వెలుగులో అంత్యదినాలను గూర్చిన ప్రవచనాలు మనకు మరింత ప్రభావవంతమైనవౌతాయి. మన జీవితంలో మన స్వంత అనుభవాన్ని విశాలపర్చుకొని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, మనం బైబిలు ఉపదేశాన్ని మరింత అధికంగా గుణగ్రహిస్తాము. (సామెతలు 4:18)—5/1, 15వ పేజీ.

◻ బైబిలు వచనాలను ఎలా జ్ఞాపకముంచుకోగలము?

మీరు బైబిలు చదువుతుండగా, గుర్తుంచుకోవాలనుకునే ఎంపిక చేసుకున్న లేఖనాలను గుర్తు పెట్టుకోండి, లేక వాటిని కార్డులపై ఎత్తివ్రాసుకొని, వాటిని మీరు ప్రతి దినం చూసే స్థలంలో ఉంచండి. వాటిని కంఠస్థం చేస్తుండగా వాటిపై ధ్యానించండి మరియు వాటిని ఉపయోగించండి. ఒకేసారి చాలా కంఠస్థం చేయడానికి ప్రయత్నించకండి, బహుశా ఒక వారానికి ఒకటి లేక రెండు చేయండి.—5/1, 16, 17 పేజీలు.

◻ ఇతర సువార్తల రచయితలు అందించని ఏ అదనపు సమాచారం లూకా సువార్తలో ఉంది?

లూకా రాసిన చాలావంతు మత్తయి దృష్టాంతానికి పోలినదైనప్పటికీ, దానిలో 59 శాతం భిన్నంగా ఉంది. ఇతర సువార్తల్లో రాయబడని ఆరు అద్భుతాలను లూకా రాశాడు మరియు వాటికన్నా రెట్టింపు సంఖ్యలో ఇతర సువార్త రచయితలు ప్రస్తావించని యేసు ఉపమానాలను ఆయన నివేదించాడు.—5/15, 12వ పేజీ.

◻ పందొమ్మిదివందల ముప్పైఅయిదులో ఏ విశేషమైన సత్యపు మెరుపులు బయల్పర్చబడ్డాయి?

ప్రకటన 7:9-14 నందు ప్రస్తావించబడిన గొప్ప సమూహము, రెండవ తరగతి కాదుగానీ భూ సంబంధమైన నిరీక్షణలుగలవారినే సూచించిందని ఆ సంవత్సరం యెహోవా ప్రజలు అర్థంచేసుకున్నారు. (యోహాను 10:16)—5/15, 20వ పేజీ.

◻ ప్రియమైన వారిని కోల్పోయినవారిని మనం ఓదార్చేందుకు ఏ ఆచరణాత్మక విధాలున్నాయి?

వినండి. అభయాన్నివ్వండి. అందుబాటులో ఉండండి. సమంజసమైనప్పుడు చొరవ తీసుకోండి. ఓదార్పుకరమైన ఉత్తరాన్నిగానీ లేక కార్డునుగానీ పంపించండి. వారితో ప్రార్థించండి. (యాకోబు 5:16) వారికి సహాయం చేస్తూనే ఉండండి.—6/1, 13, 14 పేజీలు.

◻ మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లో జీవించేవారు సహించేలా సహాయపడేందుకు ఆత్మీయ సహోదర సహోదరీలు ఏమి చేయగలరు?

క్రమంగా ప్రోత్సాహకరమైన, అనుకూలమైన, ఊరట కలిగించే మాటలనే వారితో పలకండి. (1 థెస్సలోనీకయులు 5:14) వారి మనస్సుకూ శరీరానికి అది ఒక ఉపశమనంగా పనిచేస్తుంది. ఆచరణాత్మకమైనప్పుడెల్లా, సముచితమైనప్పుడెల్లా, మీ దైవపరిపాలనా మరియు సాంఘిక కార్యక్రమాల్లో వారిని చేర్చుకోండి. మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. (రోమీయులు 1:9; ఎఫెసీయులు 1:16)—6/1, 29వ పేజీ.

◻ ప్రాంతీయ సేవలో పాల్గొనేటప్పుడు ఓర్పును కనపర్చడంవల్ల ఏ ప్రతిఫలాలు వస్తాయి?

ఎలాంటి అలక్ష్యానైనా లేక వ్యతిరేకతనైనా ఓ రాజ్య ప్రచారకుడు సహించేందుకు ఓర్పు సహాయపడుతుంది. కోపచిత్తులైన ఇంటివారితో వాదించే బదులు, ఓర్పుగల ప్రచారకులు నెమ్మదిగా జవాబు చెబుతారు లేక ఏమీ చెప్పకుండా వెళ్లిపోతారు, అలా శాంతిని, ఆనందాన్ని వారు కోల్పోరు. (మత్తయి 10:12, 13) అంతేకాకుండ, గొర్రెవంటివారు రాజ్య వర్తమానంవైపుకు ఆకర్షింపబడతారు.—6/15, 9వ పేజీ.

◻ బైబిలు సత్యాలను తెలుసుకోవడం ఎందుకు విలువైనది?

సత్యాన్ని తెలుసుకోవడం అబద్ధాలు, భ్రమలూ మరియు మూఢత్వాలనుండి మనలను విడుదల చేస్తుంది. మనం దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు, కష్టాలను సహించేందుకు సత్యం మనలను బలపరుస్తుంది మరియు నిరీక్షణతో మనలను ఎంతగా పురికొల్పుతుందంటే, ఏ పరీక్షలోనైనా మనం నిలద్రొక్కుకునేందుకు అది మనకు సహాయపడుతుంది.—7/1 8వ పేజీ.

◻ సహజమైన ఇశ్రాయేలునుండి ఏ ప్రాథమిక బాధ్యతను అభిషక్త క్రైస్తవ సంఘం తీసుకుంది?

యెహోవా గొప్పతనాన్ని గూర్చి జనాంగాల్లో సాక్ష్యమిచ్చే ఆధిక్యతే. (యెషయా 43:21; 1 పేతురు 2:9)—7/1, 19వ పేజీ.

◻ భర్త తన భార్యను ‘సన్మానించ’వలెను అని అపొస్తలుడైన పేతురు చెప్పిన మాటల భావమేమిటి? (1 పేతురు 3:7)

తన భార్యను సన్మానించు భర్త, ఆమెను అవమానపర్చడు లేదా చిన్నబుచ్చడు. బదులుగా, అతడు తన మాటలు, క్రియలద్వారా—ఏకాంతమందు లేదా అందరియెదుట—ఆమెను ఘనపరస్తున్నానని ప్రదర్శిస్తాడు. (సామెతలు 31:10-31)—7/15, 19వ పేజీ.

◻ పశ్చాత్తాపం చెందని తప్పిదస్థున్ని క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించడం ప్రేమపూర్వకమైన కార్యమని ఎందుకు చెప్పవచ్చు?

బహిష్కరించుట యెహోవాయెడల ఆయన మార్గాలయెడల ప్రేమచూపుటకే. (కీర్తన 97:10) తమపై చెడు ప్రభావం చూపగల వ్యక్తిని అది తమ మధ్యనుండి తీసివేస్తుంది గనుక అది నీతి విధానాన్ని వెంబడించే వారియెడల ప్రేమ చూపిస్తుంది; ఆలాగే అది సంఘ స్వచ్ఛతనుకూడ కాపాడుతుంది. (1 కొరింథీయులు 5:1-13)—7/15 25వ పేజీ.

◻ మత్తయి 24:45-47 నందు చెప్పబడిన ‘నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని’ ఎలా గుర్తించవచ్చు?

ప్రాముఖ్యంగా, బైబిలు ఆధారిత సాహిత్యాలను అందించేందుకు వారు చేసే పనిని బట్టి మరియు “రాజ్య సువార్తను” బోధించి ప్రకటించడాన్ని బట్టి, దేవుని వాక్యమైన బైబిలును వారు సన్నిహితంగా అనుసరించడాన్ని బట్టి గుర్తించవచ్చు. (మత్తయి 24:14; 28:19, 20)—8/1, 16వ పేజీ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి