కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 5/15 పేజీలు 3-4
  • ఓ నాయకుడు తన భవిష్యత్తును గూర్చి ఆలోచించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓ నాయకుడు తన భవిష్యత్తును గూర్చి ఆలోచించాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనలను మృతులు చూడగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మీరు మృతులకు భయపడాలా?
    తేజరిల్లు!—1996
  • మన పితరులకు ఓ నూతన జీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “పాదాలకు కాదు, నోటికి ఆహారాన్ని అందించండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 5/15 పేజీలు 3-4

ఓ నాయకుడు తన భవిష్యత్తును గూర్చి ఆలోచించాడు

పశ్చిమాఫ్రికా నాయకుడు, అనేకుల ప్రేమను అందుకున్నాడు మరియు తన తెగకు చెందిన వారిలో ఆయన ఎంతో గౌరవించబడే వ్యక్తి. ఆయన 78వ జన్మదినోత్సవం నాడు, ఆయన స్నేహితులూ కుటుంబ సభ్యులు మరితర శ్రేయోభిలాషులు అతనికి శుభాకాంక్షలు చెప్పేందుకు సమకూడారు. ఆ నాయకుడు ప్రసంగించేందుకు, అలాంటి సందర్భానికి అసహజమైన విషయాన్ని ఎన్నుకున్నాడు. ఆయన మరణానంతర జీవితాన్ని గూర్చిన తన అభిప్రాయాలను తెలియజేశాడు.

మరణించిన తర్వాత “మోసం, ఈర్ష్య లోభత్వం లేని ఓ నూతనలోకం ఉంది” అని ఆయన చెప్పాడు. అది దేవునితో సంబంధం కల్గివుండే నీతిమంతులైన వారితో మాత్రమే నిండివుండి, “మరుగు చేయబడిన మర్మంగా” ఉండే లోకమని ఆయన వర్ణించాడు.

ఆఫ్రికానందంతటా ఉన్న ప్రజల్లో అలాంటి నమ్మకాలు సహజమే. ఆఫ్రికా పారంపర్య మతం ప్రకారం, మరణమన్నది జీవానికి అంతం కాదు కానీ, అది ఓ పరివర్తన, అంటే ఆత్మ సామ్రాజ్యంలోకి జీవాన్ని మార్చడమే. ఒక వ్యక్తి మరణించినప్పుడు దృశ్యమైన లోకంనుండి అదృశ్యమైన లోకంలోకి ప్రవేశిస్తాడని చెప్పబడుతోంది. ఓ ఆత్మగా, ఆ వ్యక్తి అప్పుడు అతని లేక ఆమె పితరులున్న లోకాన్ని చేరుకుంటారు.

పితరులు, లేక పితరుల ఆత్మలు భూమిమీదున్న తమ కుటుంబాలు క్షేమంగా ఉండేలా చూసుకుంటారని అనేకమంది పశ్చిమాఫ్రికా వారు నమ్ముతున్నారు. పశ్చిమాఫ్రికా పారంపర్య మతం అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ఇంకా భూమి మీదున్న సంఘంలోని సభ్యుల మధ్యనున్న ప్రభావంలో ఏ వ్యత్యాసం లేదు మరియు పై ప్రపంచంలో ఉన్నవారి మధ్య కూడా వ్యత్యాసం లేదు. భూమి మీద ఉన్నప్పుడు [పితరులు] తమ కుటుంబాలకు పెద్దలుగా ఉండేవారు. మరిప్పుడు వారు మనకు కనిపించకుండా ఉన్నప్పటికీ, ఆత్మల లోకంలో వారు ఇంకా పెద్దలుగానే ఉన్నారు. తమ కుటుంబమంతటి సహజ శ్రేయస్సు విషయంలో వారు ఆసక్తి కల్గివుండకుండా ఉండరు.”

తత్ఫలితంగా, మొదట ప్రస్తావించిన వయస్సుమళ్లిన నాయకుడు తన పితరులను చేరి, ఆత్మ సామ్రాజ్యంలో వారితో కూడా పని చేయాలని నిరీక్షించాడు. ఆయన ఇలా చెప్పాడు: “మరణం తర్వాత జీవితం ఉందని, మరణించిన తర్వాత కూడా నేను సేవించగల అవకాశముందని పూర్తిగా నేను నమ్ముతున్నాను.”

అయితే, ఆ నాయకుడు తర్వాత చెప్పిన దానిని బట్టి, మరణించిన తర్వాత జీవితముందన్న విషయంపై “ఆయనకు పూర్తి నమ్మకం కలగలేదు” అని సన్‌డే టైమ్స్‌ అనే వార్తాపత్రిక అభిప్రాయపడింది. మరణం తర్వాతి జీవితాన్ని గూర్చి చర్చించే ఓ గ్రంథాన్ని గూర్చి తాను విన్నానని అక్కడ చేరిన గుంపుతో ఆయన చెప్పాడు. సుమారు అయిదు సంవత్సరాలు ఆ నాయకుడు దాని కొరకు వెతుకుతూనే ఉన్నాడు. దాన్ని చదివేందుకు ఆయన ఎంత ఉత్సుకతను కలిగి ఉన్నాడంటే, దాన్ని తనకు తీసుకొచ్చి ఇచ్చే ఏ వ్యక్తికైనా సుమారు 1,500 (అమెరికా) డాలర్లు ఇస్తానని చెప్పాడు.

సులభంగా దొరికే గ్రంథాన్ని సంప్రదించడం ద్వారా, వెతికే శ్రమనుండి ఆ నాయకుడు తప్పించుకోగల్గేవాడు. అది ఎంతో అందుబాటులో ఉండే గ్రంథాన్ని అది మానవుని వల్ల వచ్చినది కాదు సృష్టికర్తవల్ల కలిగినదే. (1 థెస్సలొనీకయులు 2:13) ఆ గ్రంథం బైబిలే. మరణం తర్వాతి జీవితాన్ని గూర్చి అది ఏమని చెబుతోంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి