కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/1 పేజీ 31
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదర్శవంతమైన పరిష్కారాన్ని కనుగొనడం
    తేజరిల్లు!—1996
  • హృదయంనుండి, మనస్సునుండి కాలుష్యాన్ని పెరికివేయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/1 పేజీ 31

పాఠకులనుండి ప్రశ్నలు

మన నేల, సముద్రం, గాలి—యొక్క పర్యావరణ కలుషితాన్ని తగ్గించుటలో క్రైస్తవులకు ఏ బాధ్యత కలదు?

ప్రస్తుతం మన భూగృహంపై ప్రభావం చూపుతున్న అనేక జీవపర్యావరణ సమస్యల యెడల యెహోవాసాక్షులుగా మనం మిక్కిలి శ్రద్ధను కలిగియున్నాము. ఈ భూమి స్వచ్ఛమైనదిగాను, పరిపూర్ణ మానవ కుటుంబానికి ఆరోగ్యదాయకమైన గృహంగాను సృష్టింపబడిందని మనం ఇతరులనేకులకంటె ఎక్కువగా గుణగ్రహిస్తాం. (ఆదికాండము 1:31; 2:15-17; యెషయా 45:18) ఆయన “భూమిని నశింపజేయువారిని నశింపజేయుననే” దేవుని వాగ్దానము కూడ మనకున్నది. (ప్రకటన 11:18) కాబట్టి, మన భూగ్రహాన్ని ఎడతెగక పాడుచేస్తున్న మానవునికి అనవసరముగా తోడ్పడకుండా సమతూకమైన, సహేతుకమైన ప్రయత్నాలు చేయుట యుక్తము. అయితే “సహేతుకమనే” మాటను గమనించండి. ఆలాగే జీవపర్యావరణ అంశాలు, అభ్యాసాలే మన ప్రధాన చింతగా అనుమతించకుండ జాగ్రత్తపడాలనేది కూడ లేఖనానుసారంగా సరియైనదే.

సాధారణ జీవనం కూడ వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు, ఆహార ధాన్యాలు పండించడం, నాణ్యపరచి, తినడం తరచు వ్యర్థ పదార్థాలకు కారణమౌతుంది, అయితే అవి సహజంగా కుళ్లిపోయి అంతరించిపోయేవే. (కీర్తన 1:4; లూకా 3:17) పునరుత్థానుడైన యేసు తన శిష్యుల కొరకు నిప్పులపై కాల్చి తయారుచేసిన చేపల ఆహారం మూలంగా పొగ, బూడిద, పనికిరాని చేపముళ్లు ఏర్పడుటకు దారితీసి యుండవచ్చు. (యోహాను 21:9-13) అయితే జీవ, నిర్జీవ ప్రక్రియలు, భూమియొక్క రుతు చక్రములు, అలాంటి వాటిని తట్టుకోగల విధంగా రూపొందించబడ్డాయి.

దేవుని ప్రజలు జీవపర్యావరణ విషయాలను ఉపేక్షించేవారై యుండకూడదు. వ్యర్థ పదార్థాలు లేకుండాచేసే చర్యలు తీసుకోవాలని యెహోవా తన ప్రాచీనకాల ప్రజలను కోరాడు, ఆ చర్యలు జీవపర్యావరణ, పారిశుధ్య ప్రాముఖ్యతను కలిగియుండెను. (ద్వితీయోపదేశకాండము 23:9-14) భూమిని నాశనం చేసేవారిని ఆయనెలా దృష్టిస్తాడో మనకు తెలుసు గనుక, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మనం చేయగల చర్యలను మనము నిశ్చయంగా అలక్ష్యం చేయకూడదు. చెత్తను లేదా వ్యర్థ పదార్థాలను, ప్రత్యేకంగా విషపదార్థాలను సరియైన రీతిలో నిర్మూలం చేయుట మూలంగా మనం అలక్ష్యం చేయడం లేదని నిరూపించగలం. పునరుత్పత్తి ప్రయత్నాలను మనం మనఃపూర్వకంగా సహకరించాలి, యిలా చేయాలని కైసరు శాసించినట్లయితే అలా చేయుటకు మనకు మరింత కారణముంటుంది. (రోమీయులు 13:1, 5) భూమిపైన, సముద్రాలలోను పేరుకుపోతున్న చెత్తాచెదారానికి మరికాస్త చేర్చే బదులు సహజసిద్ధంగా కుళ్లి అంతరించిపోనైయున్న ఉత్పత్తులను ఉపయోగించడానికి ఎంచుకోవడం వంటి అదనపు చర్యలు తీసుకొనుట ద్వారా కొందరు సంతృప్తి చెందుతున్నారు.

అయితే, చట్టం కోరనంత వరకు యీ విషయంలో ఒక క్రైస్తవుడు యిలా ఎంతమేరకు చేయగలడనేది, వ్యక్తిగత విషయమౌతుంది. అసంపూర్ణ మానవులు విపరీత ధోరణికి సులభంగా గురయ్యే ప్రమాదముందని ప్రచారసాధనాల ద్వారా స్పష్టమగుచున్నది. యేసు యిచ్చిన సలహా నిశ్చయంగా ఉపయుక్తం: “మీరు తీర్పుతీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పుతీర్చబడదు . . . నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?” (మత్తయి 7:1, 3) దీనిని మనస్సులో ఉంచుకొనుట యితర అవశ్యకమైన విషయాలను దృష్టికి తీసుకొనుటకు సహాయము చేయవచ్చును.

ప్రవక్తయైన యిర్మీయా యిలా వ్రాశాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) ఈ సూత్రాన్ని పెడచెవిన బెట్టుటవల్ల మానవజాతి 2 తిమోతి 3:1-5లో వ్రాయబడిన “అపాయకరమగు కాలములను” ముఖాముఖిగా ఎదుర్కోవలసివచ్చింది. ఈ భూమిని కలుషితము నుండి, దాని జీవపర్యావరణ విషయంలో తలెత్తుచున్న పెద్ద సమస్యల నుండి మానవ ప్రయత్నాలు విడిపించలేవని ప్రకటన 11:18లో దేవుడు వ్రాయింపజేసినది నిరూపిస్తున్నది. అక్కడఇక్కడ కొంత అభివృద్ధి కన్పించవచ్చు, అయితే శాశ్వత పరిష్కారానికి కేవలం దేవుడు జోక్యం చేసుకోవడం అవసరం.

అందుకే మనం పైపై పరిష్కార మార్గాల కొరకు ప్రయత్నించుటకు బదులు, దైవిక పరిష్కారంపై మన ప్రయత్నాలను, వనరులను కేంద్రీకరింపజేస్తాము. దీని విషయంలో మనము ‘సత్యానికి సాక్ష్యమిస్తూ’ తన పరిచర్యలో ఎక్కువ సమయం గడిపిన యేసు మాదిరిని అనుసరిస్తాము. (యోహాను 18:37) లోకానికి ఆహారం పెట్టడానికి లేదా కలుషితంతో సహా పెద్దయెత్తున సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి బదులు మానవజాతిని పీడిస్తున్న సమస్యల సంపూర్ణ పరిష్కారాన్ని యేసు సూచించాడు.—యోహాను 6:10-15; 18:36.

నేలను, వాతావరణాన్ని, లేదా నీటి సరఫరాను అనవసరంగా కలుషితం చేయకుండునట్లు పొరుగువారి యెడల మనకున్న ప్రేమ మనలను ప్రేరేపిస్తుండగా, మనము సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటలో కొనసాగుదాము. ఇందులో పొగత్రాగి, అమితంగా మద్యం సేవించి లేదా హానికరమగు మాదక ద్రవ్యాలు వాడి ఆరోగ్యం పాడు చేసుకోకుండుటకు మనం ప్రజలకు బైబిలు సూత్రాలను అన్వయించుడని బోధించుట యిమిడియుంది. లక్షలాదిమంది క్రొత్త శిష్యులగుచుండగా, వారు పరిశుభ్రమైన అలవాట్లను, ఇతరులయెడల శ్రద్ధచూపుటను నేర్చుకున్నారు. కాబట్టి నేటి సాధారణ సమస్యయగు కలుషితాన్ని తక్కువచేయడానికి ప్రకటించు పని అక్షరార్థముగా దోహదపడింది. అయితే మరింత ప్రాముఖ్యముగా, దేవుడు త్వరలోనే తన నిజమైన ఆరాధికులకు ఏర్పాటుచేయనైయున్న ఇవ్వబోయే పరిశుభ్రమైన పరదైసు భూమినందు జీవించుటకు అర్హులగునట్లు, క్రైస్తవ శిష్యులు ఇప్పుడే తమ వ్యక్తిత్వాన్ని, అలవాట్లను మార్చుకొనుటకు కృషిచేస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి