కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 4/1 పేజీలు 4-7
  • భూగోళమంతటా ఆనందము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూగోళమంతటా ఆనందము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఎవరూ తీసివేయలేని ఆనందము”
  • “భూదిగంతముల వరకు”
  • “ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైయుండుడి”
  • శాంతియుతమైన ప్రజలు
  • “నీవు నాబాధను దృష్టించియున్నావు”
  • యెహోవాను హృదయానందముతో సేవించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఆనందముతో నిండియుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యెహోవాను గూర్చిన ఆనందమే మన ఆశ్రయదుర్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవాను ఆనందముతో సేవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 4/1 పేజీలు 4-7

భూగోళమంతటా ఆనందము

“ఇదిగో! నా స్వంత సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరు.” (యెషయా 65:14) తన ప్రవక్తయైన యెషయా ద్వారా యెహోవా అలా సెలవిచ్చెను, ఆయన మాటలు యెహోవాసాక్షుల మధ్య ఎంత అద్భుతముగా నెరవేరుచున్నవి! వారికి హృదయానందము ఎచ్చటనుండి కల్గెను? యెహోవా దేవుని యొక్క ఐక్య ఆరాధననుండి పొందగల్గిరి. ఆయన “సంతోషముగలదేవుడు” (శ్రీమంతుడగుదేవుడు) ఆయనను ఆరాధించువారంతా “యెహోవాయందు ఆనందించెదరు.” (1 తిమోతి 1:11; జెకర్యా 10:7) వారందరూ కలసికట్టుగా రాజ్యసువార్తను ప్రకటించుచు తమ దేవునికి భూవ్యాప్తంగా స్తుతి చెల్లించుచున్నందున ఈ ఆనందభరితమైన భక్తి వారిని ఒకే జనాంగముగా ఐక్యపరచుచున్నది.—ప్రకటన 7:9, 10.

“ఎవరూ తీసివేయలేని ఆనందము”

నిజముగా, దేవుని నామము మరియు రాజ్యమునుగూర్చి ప్రకటించుట యెహోవాసాక్షులకు నిత్యానందమునకు మూలమైయున్నది. (మార్కు 13:10) కీర్తనల రచయిత యొక్క మాటలకు వారు స్పందించుచున్నారు: “ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక.”—కీర్తన 105:3.

దీని విషయములో వచ్చు ఆటంకములను వారు తరచు అధికమించుచున్నారు. స్పెయిన్‌నందు, ఇసిడ్రో యెహోవాకు సమర్పించుకొని, ఆయననుగూర్చి యితరులతో మాట్లాడగోరెను. కాని అతడు ట్రక్కుడ్రైవరు, కొద్దిపాటి ఖాళీ సమయమే అతనికి ఉన్నది. రాత్రియంతా సుదీర్ఘ ప్రయాణములు చేసి పగలు నిద్రపోతాడు. ఇతర ట్రక్కువాళ్లకు సాక్ష్యమివ్వాలని ఇసిడ్రో ఆశపడెను. అయితే అతడు దీనిని ఎలా చేయగల్గెను?

తాను యితర డ్రెవర్లతో మాట్లాడుటకు తన ట్రక్కులో CB (సిటిజెన్స్‌ బేండ్‌) రేడియోను అమర్చుకున్నాడు. బహుతక్కువగా వాడబడుచున్న 13 నంబర్‌ ఛానల్‌ను అనతికాలంలోనే కనుగొని, దానిని ఉపయోగించుటకు నిశ్చయించుకొనెను. అయితే, బైబిలును గూర్చి తాము CB రేడియో ద్వారా మాట్లాడుకొనవచ్చు అని ఇతర ట్రక్కువాళ్లకు సలహా ఇచ్చినపుడు, స్పందన చాలా భిన్నముగా నుండెను. కాని కొందరు విన్నారు. వాక్యము ప్రబలింది, స్పెయిన్‌లోని అనేకమంది ట్రక్కువాళ్లు 13వ ఛానల్‌కు త్రిప్పారు. ఇటీవల వారిలో కనీసం ఒక్కరు తన బైబిలు పఠనమును కొనసాగించుటకు చర్యగైకొనుచున్నట్లు ఇసిడ్రో తెలిసికొన్నాడు.

ఇటలీలో ఒక వ్యక్తి బస్సులో తాను సంభాషించుటద్వారా యెహోవా సాక్షులనుగూర్చి విన్నాడు. ఒక స్నేహితురాలి ద్వారా అతని భార్య వారిని కలిసికొన్నది. వారిరువురు బైబిలును పఠించి తాము నేర్చుకొన్న దానిని యితరులతో పంచుకోవాలని ఆశపడుచున్నారు. ఎంత ఆసక్తిని కల్గియున్నారంటే, దేవుని రాజ్యసువార్తను ఇతరులకు చెప్పుటలో ఎక్కువ సమయాన్ని గడుపునిమిత్తము అతడు తన ప్రమోషన్ని వదలుకున్నాడు, ఆమైతే ఎక్కువ జీతము లభిస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. అది విలువైనదేనా? అవును. అతడిలా అనుచున్నాడు: “మేము సత్యమును నేర్చుకొన్ననాటినుండి నేను, నా భార్య 20 వ్యక్తులు దేవుని సంకల్పమును గూర్చిన ఖచ్చితమైన జ్ఞానమునకు వచ్చునట్లు సహాయము చేసితిమన్న ఆనందమును పొందితిమి. సాయంత్రమయ్యేసరికి, యెహోవా సేవయందు దినమంతా గడిపి నేను గృహమునకు చేరుకుంటాను, చాలా అలసిపోయినట్లు భావిస్తాను, అది నిజమే కాని, నేను సంతోషిస్తున్నాను. నానుండి ఎవ్వరూ తీసివేయలేని ఆనందాన్ని నాకు అనుగ్రహించినందుకు నేను యెహోవాకు కృతజ్ఞత తెల్పుచున్నాను.”

“భూదిగంతముల వరకు”

దేవునియొక్క ఆనందభరిత జనాంగమందున్నవారు తామెచ్చట ఉన్నను, “భూమియొక్క మారుమూల ప్రాంతమందున్నను” సరే అట్టి ఆసక్తినే కనపర్చెదరు. (అ.కార్యములు 1:8) ఉత్తర గ్రీన్‌లాండ్‌కన్న మారుమూలప్రాంతములు కొన్ని ఉన్నవి. అయినను, అక్కడక్కడ ఆర్కిటిక్‌ ధృవమునకు ఉత్తరంగా 200 మైళ్ల దూరమున 19 మందితో కూడిన ఇలులీసేట్‌ అనే చిన్న సంఘమున్నది. వారును ఇటలీలోని దంపతులవలె అదే సువార్తను ప్రకటించుచున్నారు. గత సంవత్సరము గ్రీన్‌ లాండ్‌లోని ఏడుగురు తాము యెహోవాకు సమర్పించుకొనినదానికి చిహ్నముగా బాప్తిస్మము తీసికొనుటనుచూచి వారు ముగ్ధులయ్యారు.

గ్రీన్‌ లాండ్‌నకు వేలాది మైళ్ల దూరమున హిందూ మహాసముద్రములో గల మారిషస్‌ ద్వీపకల్పమునందున్న అంజినీ కూడా అట్టి ఆనందమునే అనుభవిస్తున్నది. అంజీనీకి మొదట్ల సంగతులు క్లిష్టంగా ఉండేవి. ఇండియాకు చెందిన హిందూ బాలిక ఒంటరిగా మారిషస్‌లో క్రైస్తవకూటములకు హాజరగుట, దేవునిగూర్చి బహిరంగముగా ప్రకటించుట అనుకూలమైన చర్యలుగా ఎంచబడలేదు. కాని అంజినీ పట్టుదలతో కొనసాగింది. ఇప్పుడు, ఆమె క్రైస్తవ జీవితమును ప్రారంభించిన తొమ్మిది సంవత్సరములకు ఆమె బంధువులలో కొంతమంది బైబిలును పఠించుచున్నారు.

అంజినీతో పాటు ప్రపంచమునకు మరోప్రక్కన ఉన్న హాండురాస్‌నందలి ఎమియానుకూడ పేర్కొనాలి. తాను పనిచేస్తున్న ప్రదేశములో తోటిపనివారు బైబిలును చర్చిస్తుండగా ఎమిలియో విని తానుకూడ చేరాడు. తాను చదవలేడుకాని బైబిలు వచనములు చదువబడుచుండగా ఆనందముతో విన్నాడు. క్రైస్తవ సత్యము అతని హృదయములోనికి చొచ్చుకొనగా, ఎమిలియో తన అవినీతిప్రవర్తనకు స్వస్తిచెప్పి, మితిమీరి త్రాగడం మానివేసాడు. యెహోవాసాక్షులు అతనికి వ్రాయడం, చదవడం నేర్పించారు, ఇప్పుడతడు ఆనందభరితమైన దేవుని జనాంగములో ఒక పరిచారకుడు.

హోండురాస్‌కు వాయవ్యంగా కొన్నివేల మైళ్ల దూరమున అలస్కానందు గల ఒక ఎస్కిమో తల్లి అదే క్రైస్తవ సత్యాన్ని నేర్చుకొన్నది. ఈ స్త్రీ ఒక ఏకాంత గ్రామములో నివసించేది, ఆమెకు యెహోవాసాక్షులతోగల సంబంధము కేవలం ఉత్తరముల ద్వారానే కనుక ఆమె ఉత్తరములద్వారా పఠనము సాగించింది, ఉత్తరములద్వారానే తన ప్రశ్నలను అడిగింది. తానేమైతే నేర్చుకున్నదో దానిని తన పొరుగువారితో ఇప్పుడు ఆసక్తిదాయకంగా పంచుకొనుచున్నది. ఇట్టి దృష్టాంతములు అనంతముగా వృద్ధిచెందవచ్చును. భూగోళమందంతటినుండి దీనహృదయులైన వారు “సంతోషముతో యెహోవాను సేవించుటకు” వచ్చుచున్నారు.—కీర్తన 100:2.

“ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైయుండుడి”

వీరినందరిని ఆకర్షించుచున్న ఒక విషయమేమంటే ఆనందభరితమైన దేవుని జనాంగము మధ్యనున్న ప్రేమయే. యేసు చెప్పెను: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:35) ఈ నిజక్రైస్తవుల అనుదిన జీవనవిధానములో క్రైస్తవప్రేమ మరి ముఖ్యముగా విపత్కరసమయములలో కాననగును.

దురదృష్టవశాత్తు యెహోవాసాక్షులపని నిర్భంధించబడిన ఒక ఆఫ్రికా దేశములో తీవ్ర అనావృష్టి సంభవించింది. పదివేలమంది చనిపోయారు, వారి పశువులమందలు నాశనమయినవి. యెహోవాసాక్షులు ఎలా తప్పించుకొనగల్గిరి? చెట్లవ్రేళ్లను వండుకొని తిన్నారు! దేవుని సహాయముచేత ఇతరదేశములలోనున్న సాక్షులు 25 టన్నుల ఆహారపదార్ధములను పంపుటకు అనుకోని విధంగా అనుమతి పొందినపుడు వారి దుర్భర పరిస్థితి నాటకీయంగా సడలిపోయింది. నిజమే, నిర్భంధమున్నప్పటికిని, అవి క్షేమంగా వారికి పంపిణీయగుటకు పంపబడిన సహాయక ఏర్పాట్లకు మిలిటరీ కాపలా యివ్వబడింది!

నిజంగా యెషయా మాటల నెరవేర్పును ఆఫ్రికా సాక్షులు అనుభవించి తమయెడల తమ సహోదరులు చూపిన యిట్టి ప్రేమను పొందుటకు ఎంతో సంతోషించారు: “రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందముకాలేదు.”—యెషయా 59:1.

శాంతియుతమైన ప్రజలు

దేవునియొక్క ఆనందభరితమైన జనాంగమునకు దీన హృదయులు కూడ ఆకర్షితులగుచున్నారు. ఎందుకంటె అందలి సభ్యులు ఈ లోకముయొక్క యుద్ధపోరాటములవంటి మార్గములను విడనాడి ‘తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టి’ నందువలన ఆకర్షించబడుచున్నారు. (యెషయా 2:4) ఎల్‌సాల్వ్‌డార్‌ నందు ఒక మాజీ సైనికుని యిల్లు అతని మిలటరీ కాలమునాటి మెమెంటోలతో నిండియున్నది. అయితే యెహోవాసాక్షులతో అతడు బైబిలును పఠించుట ప్రారంభించినప్పుడు, అతడు శాంతియుతమైన ఆసక్తులను పెంచుకున్నాడు. తుదకు యుద్ధమునకు సంబంధించిన వాటన్నింటిని తన గృహమునుండి తీసివేసి ఆసక్తితో ప్రచారపు పనినిచేపట్టెను.

ప్రభుత్వవ్యతిరేక శక్తులు అతని గ్రామాన్ని స్వాధీనపర్చుకొనినప్పుడు, అతడు బందీగా కొనిపోబడెను. మునుపు అతడు సైనికుడని ఒకడు గుర్తించాడు కూడా. అయితే తానిప్పుడు సైనికునిగా లేనని, యెహోవాసాక్షులలో ఒకనిగా ఉన్నానని అతడు వివరించాడు. అతని యింటిలో ఆయుధములు ఉన్నవని ఆ తీవ్రవాదులు అతనిపై నిందవేసారు, కాని వెతికితే ఒక్కటీ కన్పించుటలేదు. ఆ తీవ్రవాదుల నాయకుడు అతనినిగూర్చి పొరుగువారిని అడిగాడు. ఈ రూపకాలంకార వ్యాఖ్యానమేమనగా: “అతడు ప్రతిదినము బైబిలుగూర్చి ప్రకటించుచు వీధిలో అటుఇటు తిరుగుచు ఉంటాడు.” అతడు విడిపించబడ్డాడు. నిస్సందేహముగా, అతని ఆసక్తి అతని జీవితాన్ని కాపాడింది.

ఇద్దరు సైనికులు యెహోవాసాక్షులతో బైబిలును పఠించినట్లు ఆఫ్రికా దేశము నివేదిక తెల్పుచున్నది. వీరిలో ఒకరు ప్రభుత్వ సైన్యములోను మరొకరు తిరుగుబాటుదారులకొరకు పోరాడారు. క్రమేపి, వీరిరువురు “తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టుటకు” నిర్ణయించుకొని మిలటరీనుండి రాజీనామాచేసారు. మొదటిసారిగా వారు క్రైస్తవ కూటములకు హాజరైనప్పుడు, ప్రభుత్వ తిరుగుబాటు సైనికుడు మరొకనితో: “నీకు ఇచ్చట ఏమికావాలి?” అని అడిగెను. అతని సమాధానమేమంటే: “మరి నీవు, నీకు ఏమి కావాలి ఇక్కడ?” “పిమ్మట” “వారిరువురు కౌగలించుకొని వారిద్దరు సమాధానముతో కలిసియున్నందుకు ఆనందబాష్పాలు రాల్చారు.” అని ఆ నివేదిక ముగించింది. ఈ మాజీ సైనికులిరువురు నిస్సందేహముగా దేవునికి యిలా ప్రార్థించి యుందురు: “దేవా, నారక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానముచేయును.”—కీర్తన 51:14.

“నీవు నాబాధను దృష్టించియున్నావు”

“నీవు నా బాధను దృష్టించియున్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించెదను.” (కీర్తన 31:7) అని కీర్తనల రచయిత ప్రార్థించెను, నేడుకూడ తమ బాధలను తాళుకొనుటకు దేవునివాక్యము సహాయము చేసినందున అనేకులు సంతోషించుచున్నారు. ఫ్రాన్సునందు ఒకానెక యెహోవాసాక్షి, మానసిక వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీతో పఠనముచేసెను. ఈ స్త్రీ కొంతకాలము మానసిక వైద్య చికిత్సచేయించుకొనెను కాని అది పనిచేయలేదు. ఆమెపఠనము ప్రారంభించిన వారం తరువాత, మనస్తత్వవేత్త ఆమెను యిట్లడిగెను.: “ఈ స్త్రీ బైబిలునుండి నీకు వివరించుచున్నదానిని నీవు నిజంగా అర్థం చేసికొనగల్గుచున్నావా?” కావున ఆ తదుపరి వారము అతని సమక్షములో ఆమెతో బైబిలును పఠనముచేయుటకు ఆ సాక్షి అతని కార్యాలయమునకు వెళ్లింది.

పఠనము తరువాత మనస్తత్వవేత్త ఆ సాక్షితో యిట్లనెను: “అనేక సంవత్సరములనుండి నా రోగుల మతములయెడల నేను శ్రద్ధతీసుకున్నాను, కాని ఏమతముకూడ నిజమైన సహకారమును అందించినట్లు నేను కనుగొనలేదు. మీ విషయములో అయితే సంగతులు భిన్నముగా ఉన్నవి. శ్రీమతి పి—వారంలో రెండుసార్లు నా సలహా కొరకు వస్తారు. దానికొరకు నాకు డబ్బు చెల్లిస్తారు. అయితే, మీ బైబిలు బోధ ద్వారా మరియు మంచి సలహాద్వారా, మీరు శ్రేష్టమైన పనిని ఉచితంగా చేస్తున్నారు. అలాగే కొనసాగండి, మీకు ఎప్పుడైన మా సహకారము కావలసివస్తే నేను పూర్తిగా సహకరిస్తానని మీకు వాగ్దానముచేస్తున్నాను.”

బైబిలు యిలా అంటున్నది: “శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా నీ ముఖకాంతిని చూచివారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారుదినమెల్ల హర్షించుచున్నారు.” (కీర్తన 89:15, 16) ఈ కీర్తన సత్యమేనని ప్రతి యెహోవాసాక్షికి తెలియును. యెహోవాస్తుతి నిమిత్తము వారినోటనుండి భూమియంతట ఆనందపు హర్షనాదము పైకెగయుచున్నది. వారితో కలసి దేవుని స్తుతించుటకు జనాంగములనుండి అనేకులు వచ్చుచున్నారు. వారితో సహవసించి నీయంతట నీవే ఈ ఆనందమును ఎందుకు అనుభవించకూడదు? (w91 1/1)

[7వ పేజీలోని చిత్రాలు]

తూర్పు ఐరొపాలోనున్న యెహోవాసాక్షులు తమ స్వంత భాషలో “దివాచ్‌టవర్‌”ను పొంది పఠనముచేయుటకు పొందిన స్వతంత్రతను బట్టి ఉల్లసించుచున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి