ఆనందభరితమైన జనాంగము
ఆనంద భరితమైన జనాంగము! ఏ మానవ జనాంగమునకైనా నేడు ఈ వర్ణన సరిపోతుందా? ఏ దేశమైనా తాము హింస, నేరము, పేదరికం, కలుషితం, అవిటివారినిగా చేస్తున్న రోగములను, రాజకీయకుళ్లు, మతద్వేషములను తొలగించామని ఆనందముతో చెప్పుకోగల్గునా? అట్టి వాటిని సాధించగలమనే నిజమైన నిరీక్షణను ఏ దేశమైన యివ్వగలదా? లేదు!
భూగోళ దృశ్యమేలాగున్నది? సోవియట్ అధ్యక్షుడు మిఖాయేల్ గోర్బచెవ్ గత జూలై 16న యిలా అనెను: “అంతర్జాతీయ సంబంధముల విషయములో మనము ఒక శకమును విడిచి, నేను తలంచుచున్నట్లు, ఒకదీర్ఘకాల సమాధానకరమగు మరొక కాలములోనికి ప్రవేశించుచున్నాము.” అయితే అదే తారీఖునకు చెందిన టైమ్ పత్రిక, యునైటెడ్ స్టేట్స్ యింకనూ 120 పరమాణు క్షిపణులను మాస్కో వైపు ఎక్కుపెట్టి ఉంచినదని, వాటిలో ఏ ఒక్కటియైనా ఆ పట్టణాన్ని సమూలంగా నాశనముచేయగలదని పేర్కొనినది. అట్టి ప్రతిచర్యనే సోవియట్ వారు కూడా యివ్వగలరనుటలో సందేహములేదు. ఐక్యరాజ్యసమితిలో సభ్యులైన అనేకులకు పరమాణు ఆయుధాలు ఉత్పత్తిచేయుట పొట్ల తెలిసియుండగా, స్వల్ప కోపోద్రేకములో ఎవరు వాటిని మొదట ప్రయోగించి యుద్ధమును ప్రారంభింతురని తలంచుటలో ఎక్కువ ఆనందమేమీ లేదు.
నిజముగా ఆనందభరితమైన ఒక జనాంగము
చరిత్రలో ఒకప్పుడు—3,500 సంవత్సరముల క్రితం—నిజంగా ఆనందమును అనుభవించిన జనాంగము ఉండింది. అది ప్రాచీన ఇశ్రాయేలు జనాంగము. ఆ ప్రజలను దేవుడు ఐగుప్తు అణిచివేతనుండి విడిపించినపుడు, వారు విజయోత్సాహగానము చేయుచు మోషేను అనుసరించి, తమ దేవుడును, విమోచకుడునైన వానికి తాము విధేయులైనంతకాలము వారు ఉల్లసించారు.—నిర్గమకాండము 15:1-21; ద్వితీయోపదేశకాండము 28:1, 2, 15, 47.
సొలొమోను పాలనక్రింద “యూదావారును ఇశ్రాయేలువారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమ పడుచునుండిరి.” అది గొప్ప ఉల్లసవంతమైన సమయము, చరిత్రయంతటిలో మహోన్నతమైన నిర్మాణముగా గుర్తింపు పొందిన యెరూషలేమునందలి యెహోవా ఆరాధన కొరకు నిర్మించబడిన దేవాలయముతో ఆ సమయము దాని తారాస్థాయిని చేరినది.—1 రాజులు 4:20; 6:11-14.
ఆధునిక కాల ఆనందభరితమైన జనాంగము
ఒక ఆధునిక జనాంగమునకు ప్రాచీన ఇశ్రాయేలీయులు సాదృశ్యముగా ఉన్నారు. అది ఏమిటి? మధ్యప్రాశ్చమందలి రాజకీయ ఇశ్రాయేలీయులా? పెనుగులాడుచున్న ఆదేశానికి ఆనందంతప్ప అన్ని ఉన్నాయని వార్తా నివేదికలు తెల్పుచున్నవి. ఐక్యరాజ్యములని పిలువబడుచున్న సంస్థ దాని సభ్యదేశాలకు నిజమైన ఆనందమును తేగల్గెనా? లేదు, నిజమైన ఆనందమనేది నేటి రాజకీయ వ్యవహారక దేశములలో ఎచ్చటను కనుగొనబడదు. దురాపేక్ష, దుర్నీతి మరియు మోసము అధికమగుచున్నది, అనేక దేశాలలో సామాన్యప్రజలు కేవలం జీవించడానికే అసంతృప్తితో పెనుగులాడుచున్నారు.—సామెతలు 28:15; 29:2.
అయితే నేడు అత్యంత ఆనందదాయకమైన ఒక విశేష జనాంగము కలదు. అది రాజకీయమైనదికాదు. ఎందుకంటె, దాని శిరస్సుయైన యేసుక్రీస్తు అందలి ప్రజలనుగూర్చి యిట్లు చెప్పెను: “మీరు లోకసంబంధులుకారు.” (యోహాను 15:19) ఐక్యరాజ్య సమితియైతే పేరుకు మాత్రమే ఐక్యమైయున్నదికాని, ఆనందభరితమైన జనాంగమైతే, సమాధానమును ప్రేమించి హత్తుకొనువారిని “ప్రతి జనాంగము, ప్రతిజాతి, ప్రతి భాషలలోనుండి ఆకర్షించుచున్నది. (ప్రకటన 7:4, 9) ఇప్పుడు దాని సభ్యుల సంఖ్య 40 లక్షలకు మించినది. అనగా ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశములైన 159 వాటిలో 60 దేశముల జనాబాకంటె వారు మించియున్నారు. ఈ 40 లక్షలమంది యొక్క స్వభాషలు దాదాపు 200; అయినను వారంతా “స్వచ్ఛమైన భాషను” మాట్లాడుటలో ఐక్యమైయున్నారు.—జెఫన్యా 3:9.
అన్ని విభిన్న సంస్కృతులకు చెందినవాళ్లు ఒక్కటే భాషను మాట్లాడుట వింతకాదా? నిజంగా కాదు. ఎందుకంటె ఐక్యపర్చు ఈ భాషయందు రాబోవుచున్న దేవునియొక్క నీతియుక్త రాజ్యమునుగూర్చిన వర్తమానము యిమిడియున్నది. ఆనందభరితమైన ఈ జనాంగము “భూదిగంతములనుండి” వచ్చి ప్రపంచవ్యాప్తంగా “యెహోవాసాక్షులని” పిలువబడుచున్నారు. (యెషయా 43:5-7, 10; జెకర్యా 8:23) ఈ భూగోళముపై నీవు ప్రయాణించు ఏ ప్రదేశములోనైనా సరే నీవు వారిని కనుగొంటావు.
అన్ని జనాంగములనుండి ప్రవాహమువలె వచ్చు సమూహమును గూర్చి దేవుని ప్రవక్త యెషయా 2:2-4 నందు వర్ణించి యిట్లనెను: “యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదమురండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలో నడుతము అని చెప్పుకొందురు.” యెహోవానుండి ఆయన వాక్యమైన బైబిలు ద్వారా ఉపదేశమును పొంది ఆయన చిత్తమును చేయుటనుగూర్చి నేర్చుకొనుటకు ఇతరులను వారు అత్యంత ఆసక్తితో ఆహ్వానించుదురు. ఈ జనాంగమొక్కటే నిజమైన సమాధానకరమగు మార్గములో పయనించుచున్నది, దాని ప్రజలు యిప్పటికే ‘తమ ఖడ్గములను నాగటినక్కులుగాను, ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టిరి, యుద్ధముచేయ నేర్చుకొనుట మానివేసారు.’ నిజంగా యిది ఆనందభరితమైన జనాంగమే!
ఈ ఆనందములో నీవును పాల్గొనవచ్చును. నాశనకరమైన మనుష్యులను ప్రభుత్వములను రాజైన యేసుక్రీస్తు నిర్మూలించి భూమిపై పరదైసును పునరుద్ధరించుటకు అతివేగంగా సమీపిస్తున్న దినమునుగూర్చి నీవు నేర్చుకొనవచ్చును. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) తదుపరి పేజీలు చూపునట్లు, ఐక్యపర్చబడిన జనాంగముగా, యెహోవాసాక్షులు యిప్పుడు కూడ నిజమైన సమాధానముతోకూడిన మహిమాయుత శకముకొరకు సిద్ధపర్చునట్టి తమపనిలో గొప్ప ఆనందమును అనుభవిస్తున్నారు. (w91 1/1)