కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 4/1 పేజీలు 24-29
  • ఆనందముతో నిండియుండుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆనందముతో నిండియుండుడి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భూవ్యాప్తమైన విస్తరణ
  • అత్యంత శ్రేష్టమైన విద్య
  • బైబిలు విద్య విస్తరించుట
  • ఆనందముయొక్క సంపూర్ణత
  • యెహోవాను హృదయానందముతో సేవించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవాను ఆనందముతో సేవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యెహోవాను గూర్చిన ఆనందమే మన ఆశ్రయదుర్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • సంతోషం-పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 4/1 పేజీలు 24-29

ఆనందముతో నిండియుండుడి

“అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి”—అ. కార్యములు 13:52.

1. (ఎ) ఆనందము ఎటువంటి ఫలమైయున్నది? (బి) ఆనందదాయకమైన ఏ ఏర్పాటునుబట్టి దేవుడు మహిమపరచబడవలసియున్నాడు?

ఆనందము! పౌలు ఈ క్రైస్తవలక్షణమును ప్రేమ తరువాత ఆత్మఫలములలో రెండవదానిగా వర్ణించుచున్నాడు. (గలతీయులు 5:22-25 NW) ఆ ఆనందమునకు కారణమైనదేమి? 1900 సంవత్సరముల పూర్వము దీనులైన గొఱ్ఱెల కాపరులకు దేవుని దూత ప్రకటించిన సువార్త అందుకు కారణమైయున్నది. “ఇదిగో! ప్రజలందరికిని కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియ జేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకుపుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు.” ఆ వెంటనే దూతల సమూహము ఆ దూతతో కూడ దేవుని స్తుతించుటయందు చేరి “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని” చెప్పసాగిరి.—లూకా 2:10-14.

2, 3. (ఎ) దేవుడు తనకు మొదట జన్మించిన కుమారుని మానవజాతియొక్క విమోచకునిగా పంపుట ఎందుకు యుక్తమైనదైయుండెను? (బి) మరియే ఇతర మార్గములలోను భూమిపైనున్నప్పుడు యేసు దేవుని సంకల్పములను నెరవేర్చెను?

2 మనుష్యులయెడల యెహోవాయొక్క అభీష్టము ప్రభువైన క్రీస్తుద్వారా రక్షణను దయచేయుటను బట్టి వ్యక్తమైనది. మొట్టమొదట జన్మించిన ఈ దేవుని కుమారుడు నిజమైన జ్ఞానముయొక్క రూపమైయుండి సృష్టి జరుగు సమయమందు తన తండ్రినిగూర్చి ఈ విధముగా చెప్పినట్లు వర్ణించబడియున్నది: “నేను ఆయనయొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన భూమియొక్క ఫలవంతమైన ప్రదేశమునుబట్టి ఆనందించుచు, నరులను చూచి ఆనందించుచుంటిని.”—సామెతలు 8:30, 31, రోథర్‌హామ్‌.

3 కాబట్టి, నరులనుచూచి ఆనందించినట్టి అలాంటి కుమారుని మానవజాతియొక్క విమోచకునిగా యెహోవా పంపుట ఎంతగానో యుక్తమైనది. అయితే దేవునికెట్లు ఇది మహిమ తెచ్చును? ఎట్లనగా అది భూమిని నీతియుక్తమైన మరియు సమాధానమును ప్రేమించు నరులతో నింపవలెనను ఆయన గొప్ప సంకల్పమును నెరవేర్చుటకు మార్గమును తెరచును. (ఆదికాండము 1:28) అంతేగాక ఈ కుమారుడైన యేసు భూమిపైనున్నప్పుడు కఠినమైన పరీక్షయందు ఒక పరిపూర్ణ మానవుడు సార్వభౌముడైన ప్రభువుగా యెహోవాకు నమ్మకముగా విధేయుడు కాగలడని చూపించును. ఆవిధముగా సృష్టిపై తన తండ్రి పరిపాలనాహక్కుయొక్క సత్యత్వమును ఆయన నిరూపించును. (హెబ్రీయులు 4:15; 5:8, 9) మరియు యేసు యథార్థతను నిలుపుకొనిన విధానము నిజ క్రైస్తవులందరికి తన అడుగుజాడలను సన్నిహితముగా అనుసరించుటకు మాదిరినుంచినది.

4. యేసుయొక్క సహనము ఏ గొప్ప ఆనందమును లభింపజేయును, ఇది మనలనెట్లు పురికొల్పవలెను?

4 ఆవిధముగా యేసు తన తండ్రి చిత్తమునుచేయుటలో ఉన్నతమైన ఆనందమును కనుగొనెను. అయితే అపొస్తలుడైన పౌలు హెబ్రీయులు 12:1, 2 NWలో సూచించినట్లు ఇంకను మరియెక్కువ ఆనందము నిమిత్తమై “విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్షపెట్టి, మ్రానుపై హింసను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” ఈ ఆనందము ఏమిటి? తన తండ్రినామమును పరిశుద్ధపరచుటలోను, మానవజాతిని మరణమునుండి విడిపించుటలోను, పరదైసుభూమిపై నిరంతర జీవితమునకు విధేయులైన మానవులను తిరిగితెచ్చుటకు ప్రధానయాజకునిగా మరియు రాజుగా పరిపాలించుటలోను యేసు కలిగియున్న సంతోషమైయున్నది.—మత్తయి 6:9; 20:28; హెబ్రీయులు 7:23-26.

5. యేసుయొక్క “సహోదరులు” ఎవరు, మరియు ఏ సాటిలేని ఆనందములో వారు పాల్గొందురు?

5 ఔను, దేవుని కుమారుడు మానవజాతికి సేవచేయుటలో ఎల్లప్పుడు ఆనందమును కనుగొనెను. మరియు యథార్థతను కాపాడుకొను మానవులను ఎన్నుకొనుటలో తన తండ్రితోపాటు పనిచేయుట ఆయనకు ఆనందమైయుండెను. ఆయన వారిని తన “సహోదరులని” పిలుచుచున్నాడు. వారు మరణమందు పరలోకమునకు పునరుత్థానము చేయబడువారై యేసుతోపాటు సాటిలేని ఆనందములో ప్రవేశించుదురు. వారు “ధన్యులుగాను పరిశుద్ధులుగాను” ప్రకటించబడియున్నారు. వీరు దేవునికిని మరియు క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యిసంవత్సరములు రాజ్యము చేయుదురు.”—హెబ్రీయులు 2:11; ప్రకటన 14:1, 4; 20:6.

6. (ఎ) ఏ ఆనందాదయకమైన ఆహ్వానమును రాజు తన “వేరే గొర్రెలకు” అందించుచున్నాడు? (బి) ఈ గొర్రెలలోని అనేకులు నేడు ఏ ఆధిక్యతలను అనుభవిస్తున్నారు?

6 అంతేగాక, పరిపాలించుచున్న రాజు తన అంగీకారయోగ్యమైన కుడిచేతివైపునకు వేరుపరచు “వేరేగొర్రెల” యొక్క గొప్పసమూహమునకు ఇచ్చు తన ఆహ్వానము ఇట్లున్నది: “నాతండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.” (యోహాను 10:16; మత్తయి 25:34) ఎంతటి ఆనందదాయకమైన ఆధిక్యత! రాజ్యముయొక్క భూభాగమును స్వతంత్రించుకొనబోవువారిలో అనేకులు ఇప్పుడును అభిషక్తులతోపాటు బాధ్యతగల పనులను అంగీకరించుచున్నారు. యెహోవా దీనిని ముందుగానే ఇట్లు ప్రవచించెను: “అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షాతోట కాపరులును అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. వారు మాదేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు.” ఇంకను వీరందరు దేవుని ప్రవక్తతో కలసి ఇట్లు చెప్పుదురు: “కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది.”—యెషయా 61:5, 6, 10.

7. 1914 నుండి ఈ “దినము” ఎందుకు ఎంతో ప్రత్యేకమైనది?

7 ప్రస్తుతము మనము ఎంతో ప్రత్యేకమైన ఒక దినములో జీవిస్తున్నాము. అది 1914 నుండి క్రీస్తు పరలోక రాజుగా పరిపాలించుచున్న దినము. కీర్తన 118:24, 25 నందు అది ఇట్లు వివరించబడియున్నది. “ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము.” యెహోవా బబులోను మతమునకు తీర్పుతీర్చి, క్రీస్తు పెండ్లి కుమార్తెయైన 1,44,000 మంది సహోదరులను ఆయన వారి పరలోకపు రాజుతోకూడ ఐక్యపరచినప్పుడు ఆ దినము దాని చివరిదశకు చేరును. దేవుని ప్రజలందరు దీనియందు “సంతోషపడి ఉత్సహింతురు.” మరియు తమ మెస్సియా రాజు యథార్థతగల తన జనాంగమును తన నీతియుక్త నూతనలోకములోనికి రక్షించునట్లు ఆర్మగెద్దోనునందు యుద్ధము చేయుటయందును వారు సంతోషించుదురు. (ప్రకటన 19:1-7, 11-16) ఈ ఆనందదాయకమైన నిరీక్షణను తన ప్రజలు ప్రకటించుచుండగా యెహోవా వారికి విజయమును దయచేయునా? క్రింది నివేదిక దానిని వివరించును.

భూవ్యాప్తమైన విస్తరణ

8. (ఎ) 1991 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము నందలి నివేదికలో పరిశుద్ధాత్మయందలి ఆనందము ఎట్లు ప్రతిబింబించబడినది? (బి) ఈ నివేదికలోని కొన్ని ఉన్నతాంశములేమి?

8 ఆధునిక దిన యెహోవాసాక్షులు “పరిశుద్ధాత్మ శక్తితో విస్తారముగా నిరీక్షణ” గలవారైయున్నారు. (రోమీయులు 15:13) 1991 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకములో చూపబడిన 1990 భూవ్యాప్తమైన రాజ్యసేవా నివేదికలో ఇది ప్రతిబింబించుచున్నది. నూతన శిఖరముగా 40,17,213 మంది చురుకైన ప్రచారకులు ప్రాంతములో పనిచేయుటయందు మనమెంతగా ఆనందింతుము! గత పది సంవత్సరములలో ఇది 77 శాతము అభివృద్ధి. ప్రపంచ మంతట 212 దేశములలో గొర్రెలాంటివారిని సమకూర్చుపని వేగము పుంజుకొనుచున్నది. 15 సంవత్సరముల తరువాత బాప్తిస్మములు మరలా ఎప్పుడులేనంత నూతన శిఖరముగా 3,01,518కి చేరినవి! అనేక సమావేశములలో ఊహించనంతగా బాప్తిస్మముల సంఖ్య హెచ్చుగా ఉన్నది. ప్రత్యేకంగా తూర్పు ఐరోపానుండి సాక్షులు హాజరైన సమావేశములలో. వీరిలో అనేకమంది యౌవనులైయున్నారు. సామ్యవాద భావమునుబట్టి ముసలివాళ్లతో మతము గతిస్తుందన్న మాటను ఇది తప్పిదమని రుజువుచేస్తుంది.

9. (ఎ)బాల్యదశలోనే యిచ్చు తల్లిదండ్రుల శిక్షణవలన ఎట్టి ఆనందాదయకమైన ఫలితము వచ్చుచున్నది? (బి) ఏ స్థానిక మరియు ఇతర అనుభవములు దీనిని చూపుచున్నవి?

9 గుంపులుగుంపులుగా యౌవనులు “నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి, ఉల్లసించుడి యథార్థహృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి,” అను కీర్తన 32:11 లోని పిలుపునకు సమాధానమిస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులు చిన్నపిల్లలకు “బాల్యమునుండే” శిక్షణయివ్వుడి, అను హెచ్చరికను అన్వయిస్తున్నట్లు కనిపించుచున్నది. (2 తిమోతి 3:15) బాల్యదశలో ఉన్నవారికొరకై అందించబడుచున్న సాహిత్యములను కేసట్లను బాగుగా ఉపయోగిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు పాఠశాలలో ప్రవేశించుటతోడనే అచ్చట వారు మంచి సాక్ష్యమిచ్చుచున్నారు. ఉదాహరణకు జపనీయుల 8 సంవత్సరముల బాలిక ఈ విధముగా తెలుపుచున్నది: “వేసవికాల సెలవులయిన తరువాత మా టీచరును కలిసికొని ఇలా అడిగితిని: ‘సెలవులలో మీరు మీ తండ్రి సమాధి దగ్గరకు వెళ్లారా?’ అందుకు ఆమె: ‘ఔను, మా తండ్రి ఎంతో దయగలవాడు, ఆయన సమాధియొద్దకు ప్రతిసంవత్సరము వెళ్తాను’ అని అంది. అప్పుడు నేను ‘మీరు బైబిలును పఠించి దేవుని బోధలను అనుసరించినట్లయిన, ప్రేమగల మీతండ్రిని భూపరదైసులో చూస్తారు’ అని ఆమెకు మై బుక్‌ ఆఫ్‌ బైబిలు స్టోరీస్‌ ఇచ్చాను. ఇప్పుడు మా టీచరు మధ్యాహ్నభోజన సమయములో ప్రతివారము క్లాసు అందరికి ఒక అధ్యాయము చదివి వినిపిస్తుంది.”

10. యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకమువలన ఏ మంచి ఉద్దేశ్యము నెరవేర్చబడెను, మరియు కొన్ని ఉదాహరణలేమి?

10 యౌవనులు వారి యుక్తవయస్సులో కొశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ పుస్తకమును వారివ్యక్తిగత పఠనమందును, ఇతర యౌవనులకు సాక్ష్యమిచ్చుటలోను బాగుగా ఉపయోగిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ పుస్తకమును మెచ్చుకొనియున్నారు. స్విట్జర్లాండులో ఆక్సిలరీ పయినీరుగా చేయుచున్న ఒక సహోదరి తనతోటి పాఠశాల పిల్లల తల్లిదండ్రులందరిని దర్శించాలని నిర్ణయించుకున్నది. దీనివలన అనేకమంది తల్లిదండ్రులతో ఆమె మంచి చర్చలను ప్రారంభించగలినది. 20 పుస్తకములను (చాలా వరకు యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌) 27 పత్రికలను వారికి అందించగలినది. ట్రినిడాడ్‌లో ఒక పాఠశాల బాలిక ఈ పుస్తకమును తన టీచరుకు అందించినపుడు వెంటనే ఆమెతల్లి ఈ చొరవతీసుకొని ఇతర 36 మంది టీచర్ల స్టాఫ్‌లో 25 కాపీలను పంచినది. మరలా తదుపరి మాసములో ప్రత్యేక శ్రద్ధతీసుకొని తనకు వ్యక్తిగతముగా తెలిసిన తల్లిదండ్రులను దర్శించి 92 పుస్తకములను పంచి అనేక క్రొత్త బైబిలు పఠనములను ప్రారంభించినది. కొరియాలో ఒక మాధ్యమిక పాఠశాల టీచరు యంగ్‌పీపుల్‌ ఆస్క్‌ ఉపయోగించి “నేనెట్లు నా గ్రేడులను అభివృద్ధి చేసికొనవచ్చును?” “నేనెట్లు నా టీచరుకు అనుగుణంగా సర్దుకు పోగలను?” అను అంశములపై క్లుప్తముగా మాట్లాడి ఒక పుస్తకమును అందించెను. విద్యార్థులు 39 పుస్తకములను తీసుకొనిరి. ఆ విషయములో కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. అప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఒక కాపీని తీసుకొని పరీక్షించి, చాలా “అద్భుతంగా ఉందని”, తన కుమార్తెకును ఒక కాపీని ఆర్డరు చేసెను.

అత్యంత శ్రేష్టమైన విద్య

11, 12. వాచ్‌టవర్‌ సొసైటి ప్రచురణలు అత్యంత శ్రేష్టమైన విద్యను అందించగలవను వాస్తవికతకు కొన్ని రుజువులేమి?

11 మన పత్రికల విద్యా సంబంధమైన విలువ అనేకులవలన మెచ్చుకొనబడినది. ఉదాహరణకు యు.ఎస్‌. లోని ఒకపాఠశాల దాని తరగతులలో ఉపయోగించుటకై జూలై, 22 1990, అవేక్‌(ఎక్స్‌పోజింగ్‌ క్రాక్‌ అడిక్షన్‌) 1,200 కాపీలను ఆర్డరు చేసినది. అంతేగాక యెహోవాసాక్షుల పాఠశాల విధ్యార్థుల మాదిరకరమైన ప్రవర్తన సద్భావమును కలుగజేయుచున్నది. థాయ్‌లాండ్‌లోని ఒక క్లాసురూమ్‌లో పిల్లలు అల్లరిచేస్తుండగా ఉపాధ్యాయురాలు రాచ అను 11 సంవత్సరముల బాలుని పిలిచి తరగతి పిల్లవానిని అందరిముందు అతని ప్రవర్తనను బట్టి మెచ్చుకొని “మీరందరు ఈయనను మాదిరిగా ఎందుకు తీసుకొనకూడదు? ఆయన తన పాఠాలను శ్రద్ధగా పఠిస్తు, మంచి ప్రవర్తనగలవాడైయున్నాడు.” ఆమె ఇంకా ఇట్లనెను: “మీరును మీ ప్రవర్తనను మెరుగుపరచుకొనుటకు రాచ వలెనే యెహోవాసాక్షులు కావాలని నేననుకుంటున్నాను.”—సామెతలు 1:8; 23:22, 23 ను పోల్చుము.

12 డెమినకన్‌ రిపబ్లికన్‌ నుండి ఒక యౌవన సహోదరి ఇట్లు వ్రాయుచున్నది: “కేవలము నాలుగు సంవత్సరములప్పుడు పాఠశాలకు వెళ్లక ముందు చదివే మతసంబంధమైన పాఠశాలలోనేను విద్యను పూర్తిచేయబోతున్నాను. అక్కడనే చదవను, వ్రాయను నేర్చుకొన్నాను. అందులో నాకు టీచరుగా ఉన్న నన్‌కు యుకెన్‌ లివ్‌ ఫరెవర్‌ ఇన్‌ ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్త్‌ అను పుస్తకమును బహుమతిగా ఇస్తు, దానితో పాటు ‘మీరు వ్రాయుటకు చదువుటకు నేర్పించినందుకు మీకు ఎంతో కృతజ్ఞురాలిని. మీరు కూడా నా విశ్వాసమును అర్థము చేసుకొని భూమి పరదైసుగా మార్చబడినప్పుడు దానియందు నిరంతరము జీవించు నా నిరీక్షణను కలిగియుండాలని కోరుకొంటున్నాను అని వర్తమానమును వ్రాసి అందించాను’ దానిని బట్టి నేను పాఠశాలనుండి వెళ్లగొట్టబడ్డాను. మరలా ఎనిమిది సంవత్సరముల తరువాత నేను ఈ టీచరును కలుసుకొన్నాను. ప్రీస్టునుండి ఎంత వ్యతిరేకతయున్నను ఈమె ఆమె ఆ పుస్తకమును ఎలా చదవగలిగిందో వివరించింది. ఆమె ముఖ్యపట్టణమునకు తరలివెళ్లి అక్కడ సాక్షితో బైబిలు పఠించగలిగింది. ఆమె నాతో పాటు ‘స్వచ్ఛమైన భాష’ జిల్ల సమావేశములో బాప్తిస్మము తీసుకొనెను.” ప్రవచింపబడిన రీతిగా జ్ఞానము “బాలురనోటి” నుండియు రాగలదు!—మత్తయి 21:16; కీర్తన 8:1, 2.

13. అనేకమంది యుక్తవయస్కులు సొలొమోను ఉపదేశమునకు ఎట్లు ప్రత్త్యుత్తర మిచ్చుచున్నారు? ప్రపంచవ్యాప్త రిపోర్టులో ఇది ఎట్లు ప్రతిబింబించబడినది?

13 సొలొమోను ఇట్టి ప్రోత్సాహకరమైన ఉపదేశమునిచ్చెను: “యౌవనుడా నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పినను నీ దృష్టియొక్క యిష్టము చెప్పునను ప్రవర్తింపుము.” (ప్రసంగి 11:9) అనేకమంది యెహోవాసాక్షుల పిల్లలు ఈ మాటలను అన్వయించుటను చూచుట ఎంతో ఆనందదాయకముగా ఉన్నది. ఎందుకనగా వారు తమ యుక్తవయస్సు సంవత్సరములను యెహోవాయొక్క పూర్తికాల సేవతో కూడిన జీవితముకొరకు సిద్ధపడుటకు ఉపయోగిస్తూ పాఠశాలనుండి పట్టభద్రులైన వెంటనే వృత్తులన్నిటిలో కెల్ల అత్యంత మనోహరమైన ఈ వృత్తిలో ప్రవేశిస్తున్నారు. పయినీరుల సంఖ్య ఎంతో వేగముగా వృద్ధిచెందుతూ, ఈ సంవత్సరములో 8,21,108 మంది రిపోర్టుచేశారు. బేతేలు సేవలో పనిచేయు 11,092 మంది సహోదర సహోదరీలతో పాటు ఇది మొత్తము ప్రచారకుల సంఖ్యలో 21 శాతమును గుర్తించుచున్నది!

14. మన సహోదరీలు ఏ సహకారమును అందించుచున్నారు? మరియు వారు ఎట్టి మెప్పుకు తగియున్నారు?

14 యునైటెడ్‌ స్టేట్స్‌లాంటి అనేక దేశములలో పయినీరు ప్రచారకులలోని 75 శాతము సహోదరీలైయున్నారు. ఇది కీర్తన 68:11 లోని మాటలను బలపరచుచున్నవి: “యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. సువార్తను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.” ప్రాంతీయసేవా పనిలో ఎక్కువ భాగమును చేయుచున్నందుకు మనసహోదరీలను మెచ్చుకొనవలెను. గృహబైబిలు పఠనములో వారుచేయు నైపుణ్యవంతమైన బోధ అనేకులను సత్యములోనికి నడిపించుచున్నది. సంఘసంబంధమగు అనేక విధులతోనున్న తమ భర్తలకు యథార్థతతో మద్దతునిచ్చు వివాహితులైన సహోదరీలును పొగడబడవలసియున్నారు.—సామెతలు 31:10-12; ఎఫెసీయులు 5:21-25, 33.

బైబిలు విద్య విస్తరించుట

15. (ఎ) ప్రపంచ వ్యాప్తమైన రిపోర్టులో సూచించబడిన కొన్నిదేశములు గృహ బైబిలు పఠనకార్యక్రమములో ఎట్లు అధికమించినవి? (బి) బైబిలు పఠనములు ఎంత ఫలవంతమైనవి కాగలవో చూపు ఏ అనుభవములను మీరు చెప్పగలరు?

15 బైబిలు విద్యాపని విస్తరించుచున్నది. ప్రపంచవ్యాప్తముగా ప్రతినెల సగటున 36,24,091 పఠనములు జరుపబడుచున్నవి. క్రిందచూపబడిన నివేదిక చూపునట్లు బైబిలు సత్యము వ్యక్తిత్వములను మార్చగలదు. 1987 జనవరి తొలిభాగమందు దొంగతనము మరియు మోసమునకు పాల్పడినందుకు ఒకవ్యక్తి 25 నెలలు జైలు శిక్షననుభవించి న్యూజిలాండునుండి ఆస్ట్రేలియాకు పంపబడ్డాడు. అతను మత్తుమందులకు అలవాటు పడి 17 సంవత్సరముల కంటె ఎక్కువకాలము వాటితో దొంగ వ్యాపారము చేసాడు. ఆ తదుపరి సంవత్సరము ఆయన భార్య యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించింది. ఆమె జ్ఞానము పెరుగుకొలది ఆమె ప్రవర్తనలో ఆయన గుర్తింపదగిన మార్పును గనించాడు. ఆమె శ్రేష్టమైన భార్యగా మరియు తల్లిగా తయారైనది. తన భార్య బలవంతంమీద అతను జూన్‌ 1989లో ప్రాంతీయ సమావేశమునకు హాజరయ్యాడు. ప్రస్తుతము ఆయన గృహబైబిలు పఠనమును అంగీకరించాడు. బాహ్యరూపమందు, జీవితవిధానమందు పెద్దమార్పులు కనిపించటం ప్రారంభించాయి. కుటుంబంలోని ఏడుగురు కుటుంబ సభ్యులందరూ కూటములకు హాజరుకావటం ప్రారంభించారు. ఎఫెసీయులు 4:17-24 లోని పౌలుయొక్క శ్రేష్టమైన ఉపదేశమును అనుసరించినవాడై 1990 జనవరిలో ఆయన బాప్తిస్మము తీసుకున్నాడు.

16. (ఎ) 1990 జ్ఞాపకార్థపు హాజరు ఎట్లు ఆనందమునకు మూలమైయున్నది? (బి) ఏ అత్యవసరతను గుర్తించవలెను? మరియు సహాయముచేయుటకు మనము ఏ ప్రయత్నము చేయవలెను?

16 సంవత్సరపు రిపోర్టులోని ప్రాముఖ్యమైన అంశము 1990 ఏప్రిల్‌ 10 మంగళవారము జరిగిన జ్ఞాపకార్థమునకు హాజరైనవారి 99,50,058 సంఖ్య. హాజరును రిపోర్టు చేసిన 212 దేశములలోని 70 దేశముల కంటె ఎక్కువ వారి ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్యకు మూడురెట్లు ఎక్కువ హాజరును రిపోర్టు చేసినవి. ఉదాహరణకు నిర్భంధములోనున్న ఏడు ఆఫ్రికా దేశముల మొత్తము ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 62,712. అయితే వారి జ్ఞాపకార్థపుహాజరు 2,04,356. పోరాటముతో చీల్చబడియున్న లైబీరియాలో ఉన్న 1,914 మొత్తము ప్రచారకులు జ్ఞాపకార్థమునకు 7,811 మంది హాజరగుటనుబట్టి ఆనందించిరి. 6,427 మంది ప్రచారకుల శిఖరమును కలిగియున్న హయితి మొత్తము 36,551 మంది హాజరును రిపోర్టుచేసినది. చెదరియున్న మైక్రోనేసియా ద్వీపములలో 886 మంది ప్రచారకులు ఉండగా 3,958 మంది హాజరును కలిగియున్నారు. శ్రీలంకలోని 1,298 ప్రచారకులు 4,521 మందిని రిపోర్టుచేశారు, జాంబియా 73,729 మంది ప్రచారకులు జ్ఞాపకార్థమునకు 3,26,991 మంది హాజరయ్యారు. అనగా జాంబియా జనాబాలో 25 మందికి ఒక వ్యక్తి చెప్పున హాజరైనట్టు. ప్రపంచవ్యాప్తమైన రిపోర్టు ఇంకా లక్షలకొలది నిష్కాపట్యముగల ప్రజలు గొర్రెలమందలోకి రావలసియున్నారని చూపుచున్నది. అయితే నిష్కపటత మాత్రమే సరిపోదు. మన బైబిలు పఠన పనియొక్క శ్రేష్టతను వృద్ధిచేసికొని జ్ఞాపకార్థమునకు హాజరైన ఎక్కువమందిలో బలమైన విశ్వాసమును నిర్మించుటకు సహాయపడగలమా? యెహోవాను స్తుతించుచు వారు మనతో కూడ చురుకైన సహవాసులుగా ఉండవలెనని కోరుకుంటాము. ఎందుకనగా అదివారి జీవితములకు సంబంధించినది.—కీర్తన 148:12, 13; యోహాను 17:3; 1 యోహాను 2:15-17.

ఆనందముయొక్క సంపూర్ణత

17. మన ఆనందమును మనము హత్తుకొనియుండుటకైన మన తీర్మానమును మొదటి శతాబ్దపు ఏ ఉదాహరణలు మనకు సహాయముచేయవలెను?

17 మనకు ఎటువంటి శోధనలు వచ్చినను మన ఆనందమును గట్టిగా చేపట్టుకొనియుండుటకు మనము తీర్మానించుకొందము. బహశా మనము స్తెఫను లాంటి అనుభవమును అనుభవించకపోవచ్చును. అయినను ఆయన మాదిరి మనలను బలపరచగలదు. తనపై నేరారోపణ చేయబడుచున్నను ఆయన తన ఆనందదాయకమైన ప్రశాంతతను కాపాడుకొనగలిగెను. ఆయన ముఖము “దేవదూత ముఖమువలె” ఉన్నట్లు శత్రువులు చూచారు. కఠినకరమైన ఆ పరీక్షా సమయమంతటిలో దేవుడు ఆయన ప్రక్కన నిలిచియుండెను. హతసాక్షిగా మరణించునంతవరకు పూర్తిగా “పరిశుద్దాత్మతో నిండుకొనినవాడై” ధైర్యముగా సాక్ష్యమిచ్చెను. పౌలు మరియు బర్నబాలు వారి ప్రకటనపనిలో అన్యజనులయొద్దకు వెళ్లునప్పుడు, “సంతోషించుచు యెహోవావాక్యమును మహిమ పరచిరి.” హింస మరలా చెలరేగెను. అయితే అది విశ్వసించువారిని అధైర్యపరచలేదు. “శిష్యులు ఆనందభరితులై ఆనందముతో నిండినవారైరి.” (అపొస్తలుల కార్యాలు 6:15; 7:55; 13:48-52) మన శత్రువులు మనకేమి చేసినను, జీవితములో ప్రతిదినశోధనలు ఏమైనను, మనమెప్పటికిని పరిశుద్ధాత్మయందలి మన ఆనందము క్షీణించిపోవునట్లు అనుమతించకూడదు. పౌలు ఉపదేశము ఇలా ఉన్నది: “నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.”—రోమీయులు 12:12.

18. (ఎ) నూతన యెరూషలేము ఏమిటి? దేవుని ప్రజలు దానితోపాటు ఎందుకు ఆనందించవలెను? (బి) “క్రొత్తఆకాశము మరియు క్రొత్తభూమి” మానవజాతినెట్లు ఆశీర్వదించును?

18 ఆ నిరీక్షణ ఎంత అద్భుతమైనది! తన ప్రజలందరికి యెహోవా ఇట్లు ప్రకటించుచున్నాడు: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు. నేను సృజించుచున్న దానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి.” ప్రభువైన క్రీస్తు “నూతన యెరూషలేము” (ప్రస్తుతము దేవుని పరలోక సంస్థయొక్క ముఖ్యపట్టణము “పైనున్న యెరూషలేము”) మరియు భూమిపై నూతనలోక సమాజము మానవజాతికి విస్తారమైన ఆనందమును తెచ్చును. (గలతీయులు 4:26) మృతులైన మానవుల పునరుత్థానము, విధేయులైన వారినందరిని మానవ పరిపూర్ణతయందు నిత్యజీవమునకు తెచ్చుట, పరదైసుభూమిపై ప్రయోజనకరమైన నిత్యత్వము, ఉల్లసభరితమైన జీవితము—ఎంతటి మహత్తైన నిరీక్షణ మరియు ఉత్సాహమునకు మూలము! యెహోవా తనమట్టుకుతానే ‘యెరూషలేమునుగూర్చి ఆనందించుచు ఆయన ప్రజలనుగూర్చి హర్షించుచున్నాడు.’ మరియు ఆయన ప్రవక్త తన ప్రజలకు ఈ విధమైన పిలుపునిచ్చుచున్నాడు: “యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి.” (యెషయా 65:17-19; 66:10; ప్రకటన 14:1; 20:12, 13; 21:2-4) మనమును “ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి” అను పౌలు మాటలను గైకొనుచు, ఎల్లప్పుడు ఆనందముతోను, పరిశుద్ధాత్మతోను నిండియుందుముగాక!—ఫిలిప్పీయులు 4:4. (w91 1/1)

మన ఆనందమును సమీక్షించుట:

◻ ఆనందదాయకముగా సహించు ఏ మాదిరిని యేసు మనకొరకు విడిచి వెళ్లెను?

◻ సమర్పించుకున్న రెండు గుంపులు ఆనందించుటకు ఏ కారణమును కలిగియున్నవి?

◻ ఈనాడు యౌవనులు మరియు వృద్ధులు సత్యమునందు ఎట్లు ఆనందించుచున్నారు?

◻ 1990 రిపోర్టును పునఃసమీక్షించిన “యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము” అను ప్రార్థనకు ఏ జవాబు లభించినది?

◻ ఎప్పుడు మరియు ఎట్లు ఆనందముయొక్క సంపూర్ణత ప్రాప్తించును?

[25వ పేజీలోని చిత్రాలు]

యెహోవా దూత ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను “మహాసంతోషకరమైన సువర్తమానము”గా ప్రకటించినది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి