యేసుయొక్క జీవితము పరిచర్య
బాధపడు వారికి కరుణచూపుట
వంశ పారంపర్యాచారములతో తమను తాము సేవించు కొనుచున్న పరిసయ్యులను ఖండించిన తరువాత, యేసు తన శిష్యులతో వెళ్లును. ఆయన దూరముగా వెళ్లి విశ్రాంతి తీసికొన ప్రయత్నించినప్పుడు, జనులాయనను కనుగొని అంతరాయము కలిగించి ఎంతో సమయముకాలేదని, జ్ఞప్తినందుంచుకొనుము. ఇప్పుడాయన, శిష్యులతో ఉత్తరముగా అనేకమైళ్ళ దూరమున నున్న తూరు, సీదోను ప్రాంతములకు వెళ్లును. యేసు తన శిష్యులతో ఇశ్రాయేలు సరిహద్దులు దాటుట బహుశ ఈ ఒక్కసారే కావచ్చును.
యేసు ఒక ఇల్లు కనుగొని ఎవరికి తెలియకుండ దానిలో ఉండగోరి ఆసంగతి వారికి తెల్పును. అయినను ఇశ్రాయేలీయుల ప్రాంతముగాని యిక్కడను, ఆయన సంగతి తెలియకుండ యుండలేక పోయెను. ఇక్కడ సురోఫెనికయ వంశమందు పుట్టిన ఒక గ్రీకు స్త్రీ యేసును కనుగొని “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నాకుమార్తె దయ్యముపట్టి బాధింపబడుచున్నదని” బ్రతిమిలాడసాగెను. యేసు ఒక్కమాటైనను, జవాబు చెప్పలేదు.
అప్పుడాయన శిష్యులు వచ్చి, “ఈమె మనవెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక యీమెను పంపివేయు”మని యేసుతో చెప్పిరి.
ఆమెను పట్టించుకొనకుండుటకు కారణమును వివరించుచు: “ఇశ్రాయేలు యింటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకేగాని మరి ఎవరియొద్దకు నేనుపంపబడలేదని” యేసు చెప్పును.
అయినను, ఆ స్త్రీ విరమించుకొనలేదు. ఆమె యేసునొద్దకు వచ్చి, మ్రొక్కి “ప్రభువా నాకు సహాయము చేయుమని” అడుగును.
ఆ స్త్రీ పట్టుదలతో వేడుకొనుట ఆయన హృదయమును ఎంత ద్రవింపజేసియుండవచ్చును! అయినను, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవచేయుట తన ప్రథమ కర్తవ్యమని ఆయన మరల చూపించెను. అదే సమయములో, బహుశ ఆమె విశ్వాసమును పరీక్షించుటకు, అన్యజనులను యూదులెట్లు చూతురో తెల్పుచూ “పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని వాదించును”.
యూదులు కానివారి యెడల తనకున్న సున్నిత భావములను తన ముఖ కవళికలతోను, కరుణాపూరిత స్వరముతోను యేసు నిశ్చయముగా తెల్పును. వారిని “కుక్కపిల్లలు” లేక పప్పీలు అనుట ద్వారా అన్యులను వివక్షతతో కుక్కలుగ పోల్చుటను తగ్గించివేసెను. ఆ స్త్రీ కోపగించుకొనుటకు బదులు, యేసు తెల్పిన యూదుల పక్షపాతవైఖరిని పురస్కరించుకొని వినయముతో “అవును ప్రభువా! కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీద నుండి పడిన ముక్కలు తినునుగదా” అని పల్కును.
అందుకు యేసు, “అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవుకోరినట్లే నీకు అవునుగాక” అని చెప్పును. అట్లే జరుగును! ఆమె యింటికి వచ్చినప్పుడు, తనకుమార్తె స్వస్థతపొంది, మంచము మీద పండుకొని యుండుటను కనుగొనును.
సీదోను కోస్తా ప్రాంతమునుండి, యేసు ఆయన శిష్యులు పల్లెల మధ్యనుండి యోర్దాను నది ఆరంభమైన ప్రాంతమునకు వచ్చును. గలిలయ సముద్రము ఎగువ ఎక్కడో యోర్దాను నదిని దాటి, సముద్రతూర్పు ప్రాంతమున దెకపొలికి వచ్చెను. అక్కడ వారు కొండ ఎక్కి కూర్చుండెను. కాని జనసమూహములు ఆయనవద్దకు కుంటివారు, గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను యేసు నొద్దకు తీసుకొని వచ్చి ఆయన పాదముల వద్దపడవేసిరి. ఆయన వారిని స్వస్థపర్చును. మూగవారు మాటలాడుట, అంగహీనులు బాగుపడుట, కుంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుటను జనసమూహముచూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపర్చిరి.
చెవుడు గల ఒక నత్తివాని ఎడల యేసు ప్రత్యేక శ్రద్ధను కనపర్చును. చెవిటివారు తరచు, సుళువుగ తత్తరపడుదురు. అందున జనసమూహములో మరీ ఎక్కువ. ఈ మనుష్యుని బలహీనతను యేసు గమనించియుండవచ్చును. కనుక యేసు కనికరముతో అతనిని జనసమూహమునుండి ప్రక్కకుగొనిపోయెను. వారు ఏకాంతమునకు రాగానే యేసు ఏమి చేయదలచెనో చూపును. వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టెను. అప్పుడు ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి “ఎప్ఫతా” అని (తెరువబడుమని) పల్కెను. వెంటనే వానికి వినగలుగుశక్తి పునఃరుద్దరించబడెను. మరియు అతడు మామూలుగా మాటలాడసాగెను.
యేసు ఈ విధముగా అనేకులను స్వస్థపర్చినప్పుడు ఈయన సమస్తమును బాగుచేసియున్నాడు. చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లు చేసియున్నాడని” జనులు మెచ్చుకొనిరి. మత్తయి 15:21-31; మార్కు 7:24-37.
◆ యేసు వెంటనే గ్రీసుదేశస్తురాలి కుమార్తెనెందుకు స్వస్థపర్చలేదు?
◆ తరువాత యేసు తన శిష్యుల నెచ్చటికి కొనిపోయెను?
◆ యేసు కరుణతో చెవుడుగల ఒక నత్తివాని నెట్లు బాగుచేసెను? (w87 11/15)