నిబంధనలు వాటియందు దేవుని నిత్య సంకల్పము చేరియున్నది
యెహోవా . . . తాను సెలవిచ్చినమాటను వెయ్యితరముల వరకును, . . . తానుచేసిన నిబంధనను . . . నిత్యము జ్ఞాపకము చేసుకొనును.—కీర్తన 105:7, 8.
1, 2. మనందరిమీద ఒక నిబంధన ప్రభావముగలదై యున్నదని మనలో అనేకులము ఎందుకు చెప్పగలము?
ఒకానొక నిబంధన తప్పక నీ గతమును, ప్రస్తుతజీవితమును మరియు నీ బావిజీవితము మీద ప్రభావము చూపినదైయున్నది. ‘అది ఏ నిబంధన’? అని నీవు ఆశ్చర్యపడవచ్చును. ఈ విషయములో అది వివాహమునకు సంబంధించిన నిబంధనయైయున్నది. మనమనేకులము ఈ వివాహబంధమందలి సంతానమైయున్నాము మరియు వివాహితులమైయున్నాము. ఇంకను వివాహము కానివారు భవిష్యత్తునందు ఆనందదాయక వివాహ ఆశీర్వాదములను గూర్చి తలపోయుచుండవచ్చును.
2 శతాబ్దములకు పూర్వమే ప్రవక్తయైన మలాకి “యౌవనమున నీ భార్య,” “నీకు తోటిదై నీవుచేసిన నిబంధనయందలిదని” వ్రాసెను. (మలాకి 2:14-16) వివాహమొక ఒడంబడిక లేక ఒప్పందములాంటిది కనుక దానిని ఆయన ఒక నిబంధనయని పిలిచెను. ఇద్దరు వ్యక్తులమధ్య (ద్వైపాక్షిక) ఒప్పందమనగా, ఇద్దరు కలసిపనిచేయునని దానిభావము. వివాహబంధము ఇరుపక్షముల వ్యక్తులు భార్యభర్తలగుటకు నిబంధనచేసుకొని పరస్పరబాధ్యతను అంగీకరించుచు శాశ్వతకాల ప్రయోజనము పొందుటకు ఎదురుచూచుటయై యున్నది.
3. వివాహముకంటే ఎక్కువగా మనమీద ఇతరనిబంధనలు ఎందుకు ప్రభావము చూపవచ్చును?
3 వివాహము మనమీద వ్యక్తిగతముగా బహుగొప్పప్రభావముచూపు నిబంధనయన్నట్లు కన్పించవచ్చును, అయితే అంతకంటే మరిప్రాముఖ్యమైన నిబంధనలను గూర్చి బైబిలు చర్చించుచున్నది. బైబిలునందలి నిబంధనలకు బైబిలేతర మతములలోని నిబంధనలకు మధ్యగల భేదమునుచూపుచు ఒక సర్వసంగ్రహనిఘంటువు ఇట్లు చెప్పుచున్నది: కేవలము బైబిలునందు మాత్రమే, “కడకు సార్వజనిక అన్వయింపుతో దేవునికి ఆయన ప్రజలకు మధ్య సంగ్రహవిధానముగా మారిన సంబంధము క్రమపరచుట” కలదు. అవును ఈ నిబంధనలయందు మనప్రేమగల సృష్టికర్త నిత్యసంకల్పము చేరియున్నది. మీరిక చూడబోవునట్లు మీరనుభవించు చెప్పనలవికాని ఆశీర్వాదములు ఈ నిబంధనలతో ముడిపడియున్నవి. “అయితే అదెట్లు?” అని మీరడుగు కారణమును కలిగియున్నారు.
4. ఏ తొలినిబంధన దేవుని నిత్యసంకల్పమును సూచించుచున్నది?
4 ఆదాము, హవ్వలు దేవుని అధికారమును తిరస్కరించుట వలన కల్గినదుఃఖకర ఫలితములను నీవు బాగుగా ఎరిగియున్నావు. మనకు వారినుండి స్వాస్థ్యముగా కల్గిన అసంపూర్ణత మనమనుభవించు రోగము వెనుకగల కారణముగానే కాకుండా, అది మనను మరణమునకును నడిపించుచున్నది. (ఆదికాండము 3:1-6, 14-19) ఏమైనప్పటికిని, శాశ్వత ఆరోగ్యమును, ధన్యతను అనుభవించు సత్యారాధికులతో భూమిని నింపవలెనను దేవుని సంకల్పమును వారిపాపము అడ్డగించలేకపోయినందుకు మనము కృతజ్ఞులమై యుండగలము. ఈ సంబంధముగా యెహోవా చేసిన నిబంధన ఆదికాండము 3:15 నందు వ్రాయబడినది: “మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీదకొట్టును, నీవు దానిని మడిమెమీద కొట్టుదువు.” ఈ మాటల క్లుప్తత, మరియు సూచనార్థక భాష అనేక ప్రశ్నలకు జవాబుచెప్పకుండా వదిలివేసినది. అయితే యెహోవా ఈ వాగ్దాననిబంధనను ఎట్లు నెరవేర్చెను?
5, 6. (ఎ) తన సంకల్పమును నెరవేర్చుటయందు దేవుడు ఏ మాధ్యమములను ఉపయోగించ తీర్మానించెను? (బి) దీనిని చేయుటలోని దేవుని మాధ్యమములయందు మనమెందుకు శ్రద్ధ కలిగియుండవలెను?
5 దేవుడు ఇంకను ప్రత్యేక క్రమమందు దైవనిబంధనలను ఏర్పాటుచేయ ఎన్నికచేసెను. ఏదేను నిబంధనతో కలిపి ఇవి మొత్తము ఏడు నిబంధనలాయెను. నిత్యప్రయోజనములకొరకు ఎదురుచూచు మనలో ప్రతివారును ఈ నిబంధనలను అర్థము చేసుకొనవలెను. దీనియందు అవి ఎప్పుడు, ఎట్లు చేయబడినవి, ఎవరు యిమిడియున్నారు, వాటి ఉద్దేశ్యములు, నియమావళి ఏమిటి, విధేయతా మానవజాతిని నిత్యజీవముతో ఆశీర్వదించు దేవుని సంకల్పమందు వాటి పరస్పర సంబంధమేమిటి వంటి విషయములను తెలుసుకొనుట చేరియున్నది. ఈ నిబంధనలు సూటిగాయిమిడియున్న ప్రభురాత్రి భోజనమును జ్ఞాపకార్థముగా ఆచరించుటకు 1990, ఏప్రిల్ 10వ తారీఖున క్రైస్తవులు సమావేశమగుదురు, గనుక ఈ నిబంధనలను సమీక్షించుటకు ఇది సరియైన సమయమై యున్నది.
6 కొంతమందికి నిబంధనల తలంపు వట్టిదిగాను, కేవలము శాసనబద్ధమైనదిగాను మానవులకు అంత ఆసక్తికరము కానిదిగాను ఉండవచ్చును. అయితే థియోలాజికల్ డిక్షనరీ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఏమిచెప్పుచున్నదో చూడుము: “ప్రాచీన తూర్పుప్రాంతములు అలాగే గ్రీసు మరియు రోమనుప్రపంచమందు ‘నిబంధన’ను గూర్చిన పదములు. . .రెండు భాషాక్షేత్రముల ప్రకారము: ఒకప్రక్కన ప్రమాణము, మాటొప్పుకొనుటయు మరొకప్రక్కన ప్రేమ మరియు స్నేహమై యున్నది.” యెహోవా నిబంధనలయందు ఈ రెండును—ప్రమాణము మరియు స్నేహము—కీలక విషయములైయుండుటను మనము చూడగలము.
అబ్రాహాము నిబంధన—నిత్య ఆశీర్వాదములకు పీఠము
7, 8. యెహోవా అబ్రాహాముతో ఏ విధమైన నిబంధనను చేసెను? (1 దినవృత్తాంతములు 16:15, 16.)
7 “నమ్మినవారందరికి తండ్రియైన” పితరుడగు అబ్రాహాము “యెహోవాకు స్నేహితుడైయుండెను.” (రోమీయులు 4:11; యాకోబు 2:21-23) దేవుడాయనతో ఒక ప్రమాణముచేయుటకు ఒట్టుపెట్టుకొని, మనము నిత్యాశీర్వాదములను పొందుటకు ఆధారమైన ఒక నిబంధనను స్థిరపరచెను.—హెబ్రీయులు 6:13-18.
8 అబ్రాహాము ఊరు అను పట్టణమునందుండగా యెహోవా ఆయనను మరొక ప్రాంతమునకు కదిలివెళ్ళుమని సెలవిచ్చెను, కాగా అది ఆతర్వాత కనానుదేశమయ్యెను. ఆ సమయములో యెహోవా అబ్రాహామునకు ఇలా వాగ్దానము చేసెను: “నిన్ను గొప్పజనముగాచేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును; . . . భూమియొక్క సమస్తవంశములు నీ యందు ఆశీర్వదించబడును.”a (ఆదికాండము 12:1-3) ఆ తర్వాత మనము దేనినైతే అబ్రాహామునిబంధన అంటున్నామో దానికి దేవుడు క్రమేణి అనేకవివరములను అనగా: అబ్రాహాము సంతానము, లేక వారసులు, వాగ్దానదేశమును స్వతంత్రించుకొనును; అతని సంతానము అసంఖ్యాక జనాంగమునకు మూలమగును; అబ్రాహాము శారాయిలు రాజులకు మూలదంపతులగుదురను విషయములను చేర్చెను.—ఆదికాండము 13:14-17; 15:4-6; 17:1-8, 16; కీర్తన 105:8-10.
9. అబ్రాహాము నిబంధనయందు మనమూ చేరియుండగలమని మనకెట్లు తెలియును?
9 దానిని దేవుడు “నాకును నీకును [అబ్రాహామునకు] మధ్య నా నిబంధన”యని పిలిచెను. (ఆదికాండము 17:2) అయితే, “నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశనక్షత్రముల వలెను సముద్రతీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నామాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును” అనిచెప్పుచు ఆపిమ్మట దేవుడు ఆ నిబంధనను అధికము చేసెను, గనుక మనము నిశ్చయముగా మనజీవితములు అందు ఇమిడియున్నవని భావించవలెను. (ఆదికాండము 22:17, 18.) ఆ జనములలో మనము భాగమైయున్నాము; మనకొరకు కార్యరూపముదాల్చగల ఆశీర్వాదములు వేచియున్నవి.
10. అబ్రాహాముతో చేసిన నిబంధననుండి మనమెటువంటి పరిజ్ఞానము పొందవచ్చును?
10 అబ్రాహాము నిబంధననుండి మనమేమి నేర్చుకొనగలమో విచారించుటకు మనమిక్కడ ఆగుదాము. దీనికి ముందున్న ఏదేను నిబంధన వలెనే ఇదికూడా రానైయున్న “సంతానమును” చూపించుచూ, ఆ సంతానము మానవ వంశక్రమమందు వచ్చునని సూచించినది. (ఆదికాండము 3:15) అది షేము నుండి అబ్రాహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు ద్వారావచ్చు వంశక్రమమైయుండును. ఈ వంశక్రమమందు రాజరికము చేరియుండి, అది కేవలము ఒక కుటుంబమునేకాక అన్నిదేశములయందలి మానవులు ఆశీర్వదించబడుటకు వీలుకల్పించును. ఆ నిబంధన ఎట్లు నెరవేర్చబడినది?
11. అబ్రాహాము నిబంధనయొక్క అక్షరార్థ నెరవేర్పు ఎట్లు నిజమైనది?
11 యాకోబు లేక ఇశ్రాయేలు ద్వారా కలిగిన అబ్రాహాము సంతతివారు ఒకగొప్ప జనాంగముగా హెచ్చింపబడిరి. అసంఖ్యాకముగాయున్న అక్షరార్థ అబ్రాహాము సంతానముగా వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా సత్యారాధనకు తమను సమర్పించుకొనిరి. (ఆదికాండము 28:13; నిర్గమకాండము 3:6, 15; 6:3; అ. కార్యములు 3:13) తరచుగా ఇశ్రాయేలీయులు సత్యారాధన చేయుటలో తప్పిపోయిరి, అయినను “యెహోవా వారిని జాలిదలచి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తానుచేసియున్న నిబంధననుబట్టి . . . వారిని నాశనము చేయనొల్లెను.” (2 రాజులు 13:23; నిర్గమకాండము 2:24; లేవీయకాండము 26:42-45) క్రైస్తవ సంఘమును తనప్రజలుగా దేవుడు అంగీకరించిన తర్వాత కూడా, అబ్రాహాము అక్షరార్థసంతానముగా కొంతకాలమువరకు ఆయన ఇశ్రాయేలీయులయెడల ప్రత్యేకశ్రద్ధను చూపించెను.—దానియేలు 9:27.
అబ్రాహాముయొక్క ఆత్మీయ సంతానము
12, 13. అబ్రాహాము నిబంధనయొక్క ఆత్మీయ నెరవేర్పునందు ప్రాథమిక భాగముగా యేసు ఎట్లు నిరూపించుకొనెను?
12 అబ్రాహాము నిబంధనకు మరొక ప్రత్యేక నెరవేర్పుకూడా యుండెను. యేసు కాలమునకు ముందు ఈ గొప్పనెరవేర్పు అంత సాక్ష్యాధారముగా లేకుండెను, అయితే మన కాలమందు అది స్పష్టమైయున్నందుకు మనమెంతో ధన్యులము. దేవుని వాక్యమందు దాని నెరవేర్పుయొక్క వివరణ కలదు. పౌలు ఇలావ్రాసెను: “అబ్రాహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ‘సంతానములకును’ అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే ‘నీ సంతానమునకును’ అనెను; ఆ సంతానము క్రీస్తు.”—గలతీయులు 3:16.
13 అవును, సంతానము కేవలము ఒకే వంశముద్వారా, లేక కుటుంబముద్వారా రానైయుండెను, అది అక్షరార్థముగా అబ్రాహాము వారసునిగా సహజయూదునిగా జన్మించిన యేసు విషయములో నిజమైయుండెను. (మత్తయి 1:1-16; లూకా 3:23-34) అంతేకాకుండా, ఆయన పరలోకములోని మహాగొప్ప అబ్రాహాముయొక్క కుటుంబములో భాగమై యుండెను. దేవుడు కోరియున్నట్లయిన తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చుటకు మహావిశ్వాసముతో పితరుడైన అబ్రాహాము ఇష్టపడుటను గుర్తుతెచ్చుకొనుము. (ఆదికాండము 22:1-18; హెబ్రీయులు 11:17-19) అదేవిధముగా, విశ్వాసమానవజాతికొరకు విమోచనా బలిగా తయారయ్యేందుకు యెహోవా తన అద్వితీయకుమారుని భూమికి పంపించెను. (రోమీయులు 5:8; 8:32) ఈ నిబంధన ప్రకారము అబ్రాహాము సంతానములో యేసు క్రీస్తు ముఖ్యభాగమని పౌలు ఎందుకు గుర్తించెనో ఈ విధముగా అర్థమగుచున్నది.
14. అబ్రాహాము సంతానముయొక్క ద్వితీయ భాగము ఏమైయున్నది, మరియు ఇది ఇంకా ఏమి చర్చించుటకు నడిపించుచున్నది?
14 ఆత్మీయ నెరవేర్పునందు దేవుడు ‘అబ్రాహాము సంతానమును హెచ్చించునని’ పౌలు ఇంకను సూచించెను. ఆయనిట్లు వ్రాసెను: “మీరు క్రీస్తుసంబంధులైతే, ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్ధానప్రకారము వారసులైయున్నారు.” (ఆదికాండము 22:17; గలతీయులు 3:29) అబ్రాహాము సంతానమందు ద్వితీయ భాగముగా తయారగు 144,000 మందియైన ఆత్మాభిషక్తులైన క్రైస్తవులు అలాంటివారైయున్నారు. వారు సంతానముయొక్క ప్రాథమిక భాగమైయున్న వానిని ఎదిరించువారు కాక వారు “క్రీస్తుసంబంధులైయున్నారు.” (1 కొరింథీయులు 1:2; 15:23) వారిలో అనేకులు అబ్రాహాము వంశమునుండి వచ్చినవారుకారని మనకు తెలియును, ఏలయనగా వారు యూదామతేతర జనాంగములనుండి వచ్చినవారైయున్నారు. ఆత్మీయ నెరవేర్పునందు మరింత ప్రధానమైన విషయమేమనగా, వారు మహాగొప్ప అబ్రాహామగు యెహోవా సహజకుటుంబములోని వారుకాదు, బదులుగా వారు పాపియైన ఆదాము అసంపూర్ణ కుటుంబమునుండి వచ్చినవారైయున్నారు. కాబట్టి ఆ తర్వాతి నిబంధనలనుండి వారు “అబ్రాహాము సంతానములో” భాగమయ్యేందుకు ఎట్లు అర్హులుకాగలరో మనము చూడవలసిన అవసరము కలదు.
ధర్మశాస్త్రము తాత్కాలికముగా చేర్చబడినది
15-17. (ఎ) అబ్రాహాము నిబంధనకు ధర్మశాస్త్రము ఎందుకు చేర్చబడెను? (బి) ఈ ఉద్దేశ్యములను ధర్మశాస్త్రము ఎట్లు నెరవేర్చెను?
15 తన సంకల్పమును నెరవేర్చుటకు మూలాధార చర్యగా దేవుడు అబ్రాహాము నిబంధనను చేసిన తర్వాత, సంతానము ప్రత్యక్ష్యమగు సమయమువరకు అతని వంశక్రమము పాడుకాకుండా లేక నాశనము కాకుండా ఎట్లు కాపాడబడగలదు? సంతానము వచ్చినప్పుడు సత్యారాధికులు ఆయనను ఎట్లు గుర్తించగలరు? ధర్మశాస్త్రమును తాత్కాలికముగా చేర్చుటలోని దేవుని జ్ఞానమును సూచించుచు పౌలు అలాంటి ప్రశ్నలకు జవాబులిచ్చుచున్నాడు. అపొస్తలుడు ఇలా వ్రాయుచున్నాడు:
16 “ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి వాగ్దానము చేయబడెనో ఆ సంతానమువచ్చు పర్యంతము అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతద్వారా నియమింపబడెను. . . . కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.”—గలతీయులు 3:19, 24.
17 మోషే మధ్యవర్తిగా సీనాయి పర్వతమునొద్ద యెహోవా, తనకు ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్నతమైన జాతీయ నిబంధననొకదానిని ఏర్పాటుచేసెను.b (గలతీయులు 4:24, 25) ఈ నిబంధనయందుండుటకు ప్రజలంగీకరించిరి, మరియు అది కోడెల, మేకల రక్తము చేత చట్టబద్ధము చేయబడెను. (నిర్గమకాండము 24:3-8; హెబ్రీయులు 9:19, 20) అది ఇశ్రాయేలీయులకు దైవపరిపాలనా నియమములను మరియు నీతియుక్త ప్రభుత్వమునకొక నమూనానిచ్చినది. ధర్మశాస్త్రము అన్యులతో కులాంతర వివాహములను, అబద్ధమత అభ్యాసములలో భాగమువహించుటను నిషేధించినది. ఆవిధముగా అది ఇశ్రాయేలీయులను కాపాడెను, అలాగే అది సంతానమువచ్చు వంశక్రమము పాడుకాకుండా భద్రముచేయు శక్తిగా యుండెను. (నిర్గమకాండము 20:4-6; 34:12-16) అయితే ఏ ఇశ్రాయేలీయుడును సంపూర్ణముగా ధర్మశాస్త్రమును పాటించలేడు గనుక, అది పాపములను బయటకు చూపించినది. (గలతీయులు 3:19) అంతేకాకుండా అది పరిపూర్ణమైన, శాశ్వతమైన యాజకుని మరియు ప్రతిసంవత్సరము పునరావృతముకాకూడని బలి అవసరతను సూచించినది. ధర్మశాస్త్రము బాలశిక్షకునిగాయుండి పిల్లవానిని అవసరమగు ఉపదేశకుని యొద్దకు అనగా ఉపదేశకుడైయుండు మెస్సీయా, లేక క్రీస్తునొద్దకు నడిపించినది. (హెబ్రీయులు 7:26-28; 9:9, 16-22; 10:1-4, 11) తన సంకల్పమును నెరవేర్చిన తదుపరి ధర్మశాస్త్రము ముగించబడును.—గలతీయులు 3:24, 25; రోమీయులు 7:6; “పాఠకులనుండి ప్రశ్నలు,” పుట 32 చూడుము.
18. ధర్మశాస్త్రమందు మరింకే ఉత్తరాపేక్ష యిమిడియుండెను, అయితే ఇది అర్థముచేసుకొనుటకు ఎందుకు కష్టముగా యుండెను?
18 ఈ తాత్కాలిక నిబంధనను చేయునప్పుడు దేవుడు పులకరింతను కలుగజేయు ఈ ఉద్దేశ్యమును కూడా ప్రస్తావించెను: “మీరు నామాట శ్రద్ధగావిని నా నిబంధనననుసరించి నడిచిన పక్షమందు మీరు . . . నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మరియు మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.” (నిర్గమకాండము 19:5, 6) ఎంత చక్కని ఉత్తరాపేక్ష! రాజులైన-యాజకుల జనాంగము. ఆతర్వాత ధర్మశాస్త్రము ప్రత్యేకముగా చెప్పినట్లు పాలించువారైన (యూదా) తెగకు, యాజకులైన (లేవీ) తెగకు వివిధ బాధ్యతలు అప్పగించబడినవి కదా, మరి అలాంటప్పుడు, ఇదెట్లు సాధ్యము? (ఆదికాండము 49:10; నిర్గమకాండము 28:43; సంఖ్యాకాండము 3:5-13) ఏకకాలమందు ఏ మానవుడును పాలకునిగా మరియు యాజకునిగా యుండలేడు. అయినను, నిర్గమకాండము 19:5, 6లోని దేవునిమాటలు ఏదో వెల్లడికానివిధమందు ధర్మశాస్త్రమందలి వారు “యాజకరూపమైన రాజ్యమునకు మరియు పరిశుద్ధ జనమునకు” సభ్యులను అందించు అవకాశమును కలిగియుందురని నమ్ముటకు కారణమునిచ్చుచున్నవి.
దావీదురాజ్య నిబంధన
19. నిబంధనలయందు రాజరికము ఎట్లు సూచింపబడెను
19 తగిన కాలమున యెహోవా మరొక నిబంధనను చేర్చెను. అది మన నిత్య ఆశీర్వాదముల కొరకు ఆయనెట్లు తన సంకల్పమును నెరవేర్చునో మరింత విశదపరచినది. అబ్రాహాము అక్షరార్థసంతానమందు రాజరికమువైపు అబ్రాహాము నిబంధన సూచించినదని మనము చూచియున్నాము. (ఆదికాండము 17:6) అంతేకాకుండా, ధర్మశాస్త్రము దేవుని ప్రజలయందు రాజులకొరకు ఎదురుచూచినది, ఏలయనగా మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను: “నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న దేశమున [వాగ్ధాన దేశము] నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి ‘నా చుట్టునున్న సమస్త జనములవలె నామీద రాజును నియమించుకొందునను’ కొనినయెడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యకముగా నీమీద రాజుగా నియమించుకొనవలెను. . . . అన్యుని నీమీద నియమించుకొనకూడదు.” (ద్వితీయోపదేశకాండము 17:14, 15) దేవుడు అలాంటి రాజరికమును ఎట్లు ఏర్పాటుచేయును, మరియు అది అబ్రాహాము నిబంధన మీద ఎలాంటి ప్రభావమును కలిగియుండును?
20. దావీదు అతని వంశక్రమము ఎట్లు దృశ్యములోనికి వచ్చిరి?
20 బెన్యామీను గోత్రికుడైన సౌలు ఇశ్రాయేలీయుల మొదటి రాజైనను, అతని తర్వాత యూదా గోత్రికుడును, యథార్థపరుడును, ధైర్యశాలియైన దావీదు వారికి రాజయ్యెను. (1 సమూయేలు 8:5; 9:1, 2; 10:1; 16:1, 13) దావీదు పాలనలో యెహోవా దావీదుతో ఒక నిబంధనను చేయుటకు ఎంపికచేసుకొనెను. మొదట ఆయనిట్లనెను: “నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యము అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యము స్థిరపరచెదను.” (2 సమూయేలు 7:12, 13) అక్కడ సూచింపబడినట్లుగా, దావీదు కుమారుడైన సొలొమోను ఆతర్వాత రాజయ్యెను, మరియు ఆయన యెరూషలేమునందు దేవుని కొరకు ఒక మందిరమును లేక ఆలయమును నిర్మించుటకు ఉపయోగింపబడెను. అయినను చేయవలసినది ఇంకా ఎంతో ఉండెను.
21. దావీదు రాజ్య నిబంధన దేనికొరకు ఒక ఏర్పాటును చేసినది?
21 యెహోవా ఇంకను దావీదుతో ఈ నిబంధనను చేసెను: “నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును.” (2 సమూయేలు 7:16) ఆవిధముగా, దావీదు కుటుంబమునందు ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఒక రాజ్యవంశక్రమమును స్థిరపరచుచుండెను. అది కేవలము దావీదు వంశములోని రాజులు వరుసగా వచ్చుటకు కాదు. అయితే చివరకు దావీదు వంశమునందలి ఒకరు వచ్చి ‘శాశ్వతముగా, పాలించవలెను, మరియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము [దేవుని] సన్నిధిని ఉండవలెను.’—కీర్తన 89:20, 29, 34-36; యెషయా 55:3, 4.
22. దావీదు నిబంధన సంతానవంశక్రమమునకు ఎట్లు సంబంధముగలదై యున్నది, దాని ఫలితముగా ఏమివచ్చినది?
22 కాబట్టి సంతానవంశక్రమమును దావీదు నిబంధన మరింత దగ్గర చేసినదనుట సాక్ష్యాధారమైయున్నది. మొదటి శతాబ్దయూదులు సహితము మెస్సీయా, దావీదు సంతానమైయుండునని ఎరిగియుండిరి. (యోహాను 7:41, 42) ఒక దూత చెప్పినట్లుగా, యేసుక్రీస్తు అబ్రాహాము నిబంధనలోని ముఖ్యభాగముగా దావీదు రాజ్యమునకు శాశ్వతవారసునిగా తయారయ్యెను. (లూకా 1:31-33) ఆవిధముగా యేసు ఏ భూభాగము మీద దావీదు పరిపాలించెనో ఆ వాగ్ధాన దేశముమీద పరిపాలించు హక్కును సంపాదించెను. యేసు అక్రమముగా ఆక్రమించుటద్వారా కాదుగాని స్థిరపరచబడిన న్యాయ ఏర్పాటు, అనగా దైవనిబంధన మూలముగా పాలించుచున్నాడని; ఇది ఆయనయందలి మన నమ్మకమును వృద్ధిచేయవలెను.
23. ఏప్రశ్నలు మరియు విషయములు పరిష్కారమునకై నిలిచియున్నవి?
23 మానవజాతికి నిత్యాశీర్వాదములను తెచ్చు తనసంకల్పమును నెరవేర్చుటకు దేవుడు చేసిన ఏర్పాటుమీద ప్రభావము చూపిన నాలుగు దైవనిబంధనలను మనము విచారించియున్నాము. అయినను, కార్యము ఇంకను పూర్తికానట్లు నీవుచూడగలవు. ఈ ప్రశ్నలు ఇంకను ఇట్లు నిలిచియున్నవి: మానవులు ఇంకను అసంపూర్ణులుగానే నిలిచియున్నందున, ఏ యాజకుడైనను లేక బలియేదైనను దానిని ఎట్లు శాశ్వతముగా మార్చగలదు? అబ్రాహాము నిబంధనయందు భాగమయ్యేందుకు మానవులు ఎట్లు అర్హులగుదురు? పాలనాహక్కు కేవలము భూప్రాంతము కంటే ఎక్కువను చేర్చుకొనుటకు విస్తరించునని నమ్ముటకు ఏదైనా కారణము కలదా? అబ్రాహాము సంతానముయొక్క ప్రాథమిక, ద్వితీయ భాగములు ఈ రెండును, మనతోసహా “భూమిమీది సమస్త జనాంగములకు” ఎట్లు ఒక ఆశీర్వాదమును తీసుకొనిరాగలవు? దీనిని మనము చూద్దాము. (w89 2/1)
[అధస్సూచీలు]
a ఇది సర్వపక్ష నిబంధన, ఏలయనగా దాని నియమావళిని నెరవేర్చుటకు కేవలము ఒకే ఒక వ్యక్తి (దేవుడు) మాటచెప్పి ఒప్పుకొనియున్నాడు.
b “ఇశ్రాయేలు మతమునందు ధర్మశాస్త్రము యొక్క తలంపు ఒక ప్రత్యేక అంశమైయుండెను, అలాగే అది, మాత్రమే సంపూర్ణభక్తిని గట్టిగా అడుగునదిగాను, ఇతర మతములలో అనుమతింపబడినట్లుగా కాక, ద్వంద లేక వివిధరకముల భక్తిక్రియలను నివారించుదానిగాను యుండెను.”—థియోలాజికల్ డిక్షనరీ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్, సంపుటి II, పుట 278.
మీ జవాబు ఏమైయున్నది?
◻ మనము నిత్యాశీర్వాదములు పొందుటకు అబ్రాహాము నిబంధన ఎట్లు ఒక ఆధారమును వేయుచున్నది?
◻ అబ్రాహాము యొక్క అక్షరార్థమైన, శరీరసంబంధమైన సంతానము, మరియు సూచనార్థక సంతానము ఎవరైయున్నారు?
◻ అబ్రాహాము నిబంధనకు ధర్మశాస్త్రము ఎందుకు చేర్చబడినది?
◻ దావీదు రాజ్య నిబంధన దేవుని సంకల్పమును ఎట్లు పురోగమింపజేసినది?
[13వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఏదేను నిబంధన ఆదికాండము 3:15
అబ్రాహాము నిబంధన
ప్రాథమిక సంతానము
ద్వితీయ సంతానము
నిత్య ఆశీర్వాదములు
[14వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఏదేను నిబంధన ఆదికాండము 3:15
అబ్రాహాము నిబంధన
ధర్మశాస్త్ర నిబంధన
దావీదురాజ్య నిబంధన
ప్రాథమిక సంతానము
ద్వితీయ సంతానము
నిత్య ఆశీర్వాదములు
[10వ పేజీలోని చిత్రాలు]
మానవజాతియెడల గల తనసంకల్పమును నెరవేర్చుటకు దేవుడు విశ్వాసపాత్రుడైన అబ్రాహాముతో ఒక నిబంధనను చేసెను