కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 2/1 పేజీలు 8-9
  • ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉపమానములతో బోధించుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • రాజ్యం గురించిన ఉదాహరణలు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • వల, చేపలు మీకు ఏ భావము నిచ్చుచున్నవి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ‘అమూల్యమైన ముత్యమును కనుగొనడం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 2/1 పేజీలు 8-9

యేసు జీవితము పరిచర్య

ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడుట

శిష్యులు విత్తువాని ఉపమాన భావమును అప్పుడే తెలిసికొనియున్నారు. అయితే యింకను ఎక్కువగా తెలుసుకొనవలెనను కోరికతో వారాయన యొద్దకు వచ్చి, “పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియజెప్పుమనిరి.”

సముద్రతీరముననున్న జనసమూహపు దృక్పథమునకు, శిష్యుల దృక్పథము ఎంత భిన్నముగా యున్నది! వారైతే తమకు చెప్పబడిన పైపైసంగతులతో తృప్తి చెంది, ఆ ఉపమానముల వెనుకనున్న భావమును తెలిసికొను ఆతురతను చూపకపోయిరి. అందుచేత ప్రశ్నించి తెలుసుకొను తన శిష్యులకును సముద్రతీరమునున్న ఆ ప్రేక్షకులకును మధ్యగల వ్యత్యాసమును చూపుతూ, యేసు యిలా అంటున్నాడు:

“మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును.” అవును, యేసు పట్ల నిజమైన ఆసక్తిని చూపి, ఆయనపై అవధానమును నిలిపినందున, శిష్యులు మరి ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడిరి. వారు అడిగిన దానికి సమాధానముగా, యేసు యిలా వివరిస్తున్నాడు:

“మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యకుమారులు; గురుగులు దుష్టుని కుమారులు; వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.”

తన ఉపమానమందలి ప్రతిభాగమును గుర్తించిన తరువాత, తదుపరి ఫలితమును ఆయన వివరించుచున్నాడు. యుగసమాప్తియందు “కోతకోయువారు” లేక దేవదూతలు గురుగులవలె క్రైస్తవులలాగా నటించువారిని రాజ్యకుమారులనుండి వేరుచేయుదురు. అప్పుడు “దుష్టుని కుమారులు” నాశనమునకు గుర్తింపబడగా “నీతిమంతులు” అనగా “రాజ్యకుమారులు” తన తండ్రి రాజ్యములో తేజరిల్లుదురు.

ఆ తరువాత ప్రశ్నించి తెలుసుకొని తన శిష్యులను మరి మూడు ఉపమానములతో యేసు ఆశీర్వాదిస్తున్నాడు. మొదట: “పరలోకరాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును,” అని చెప్పెను.

“మరియు,” “పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి, దాని కొనును,” అని చెప్పసాగెను.

యేసు తనంతటతానే దాచబడినధనమును, అమూల్యమైన ముత్యమును కనుగొనిన మనుష్యుని పోలియున్నాడు. ఒక దీనమైన మనిషిగా అగుటకు పరలోకములో తనకున్న గౌరవనీయమైన స్థానము వదలుటలో, తనకున్నదంతయు అమ్మియున్నాడు. దేవుని రాజ్యపాలకునిగా అగుటకు యోగ్యతను నిరూపించుకొనుచు భూమిపై మనుష్యునిగా, నిందను మరియు ద్వేషపూరితమైన హింసను అనుభవిస్తాడు.

అలాగే, క్రీస్తుతో సహపరిపాలకునిగా, లేక భూరాజ్య స్వతంత్రుడగుటయను గొప్ప ప్రతిఫలమును పొందుటకై సమస్తమును అమ్ము సవాలు యేసు అనుచరుల ముందు ఉంచబడియున్నది.

దేవుని రాజ్యములో భాగము వహించుట వెలకట్టలేని ధనమువలె, లేక అమూల్యమైన ముత్యమువలె మన జీవితములో అన్నింటికన్న మిక్కిలి విలువైనదని మనము యెంచుదుమా?

చివరగా, “పరలోకరాజ్యమును” ప్రతివిధమైన చేపలను పట్టు వలకు యేసు పోల్చియున్నాడు. చేపలను వేరుచేయునప్పుడు మంచివాటిని ఉంచుకొని చెడ్డవాటిని పారవేయుదురు. కాబట్టి యుగసమాప్తియందు అలాగే యుండునని యేసు చెప్పుచున్నాడు: “దేవదూతలు నీతిమంతులనుండి దుష్టులను వేరుచేసి నాశనమునకు భద్రపరతురు.

తన తొలి శిష్యులను “మనుష్యులను పట్టుజాలరులని” పిలిచి తానే స్వయముగా ఈ చేపలు పట్టుపనిని యేసు ప్రారంభించెను. చేపలు పట్టుపని శతాబ్దములనుండి దేవదూత ఆధ్వర్యమున కొనసాగుచున్నది. భూమిపై క్రైస్తవులమని చెప్పుకొను సంస్థలను సూచించు ఈ “వలను”దరికి లాగు కాలము చివరకు వచ్చును.

పనికిరాని చేపలు నాశనమునకు త్రోసివేయబడినను, కృతజ్ఞతతో, భద్రపరచుకొను ‘మంచి చేప’ల యందు మనము లెక్కించబడవచ్చును. జ్ఞానమునకు, మరియు గ్రహింపునకు యేసు శిష్యులు చూపినలాంటి నిజమైన, శ్రద్ధనే కనపరచుటద్వారా, ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వాదించబడుటయేగాక, దేవుని నిత్యజీవపు ఆశీర్వాదముతోను మనము ఆశీర్వాదింపబడుదుము. మత్తయి 13:36-52; 4:19; మార్కు 4:24, 25.

◆ సముద్రతీరమునున్న జనసమూహమునకు శిష్యులు ఎట్లు భిన్నముగా యున్నారు?

◆ విత్తువాడు, పొలము, మంచివిత్తనము, శత్రువు, కోత, కోతకోయువారి వలన ఏమిటి లేక ఎవరు సూచింపబడియున్నారు?

◆ ఏ ఇతర మూడు ఉపమానములను యేసు యిచ్చాడు, మరియు వాటినుండి మనము ఏమినేర్చుకొనగలము? (w87 4/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి