11వ సెక్షన్‌కు పరిచయం
ఈ సెక్షన్‌తో క్రైస్తవ గ్రీకు లేఖనాలు మొదలౌతాయి. యేసు ఒక చిన్న పట్టణంలో సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఆయన వడ్రంగి అయిన తన తండ్రితో పని చేశాడు. మానవజాతిని రక్షించేది యేసే. యెహోవా ఆయనను పరలోక రాజ్యానికి రాజుగా నియమించాడు. యేసు ఏ కుటుంబంలో పుట్టాలో, ఎలాంటి వాతావరణంలో పెరగాలో యెహోవా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో మీకు పిల్లలుంటే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. యేసును హేరోదు చంపకుండా యెహోవా ఎలా కాపాడాడో వివరించండి. యెహోవా సంకల్పాన్ని ఏదీ ఆపలేదని కూడా వివరించండి. యేసు కోసం మార్గాన్ని సిద్ధం చేయడానికి యెహోవా యోహానును ఎలా నియమించాడో తెలుసుకోండి. యేసు చిన్న వయసు నుండే యెహోవా జ్ఞానాన్ని ప్రేమించాడని ఎలా చూపించాడో వివరించండి.