12వ సెక్షన్‌కు పరిచయం
యేసు ప్రజలకు పరలోక రాజ్యం గురించి నేర్పించాడు. దేవుని పేరు పవిత్రపర్చాలని, ఆయన రాజ్యం రావాలని, భూమ్మీద ఆయన చిత్తం జరగాలని ప్రార్థించమని కూడా యేసు వాళ్లకు నేర్పించాడు. మీకు పిల్లలుంటే ఈ ప్రార్థనకు ఉన్న అర్థాన్ని చెప్పి, మన జీవితంలో అదెంత ముఖ్యమో వివరించండి. యేసు యెహోవాకు నమ్మకంగా ఉండకుండా సాతాను చేయాలనుకున్నాడు. కానీ, యేసు అతనికి అవకాశం ఇవ్వలేదు. యేసు తన అపొస్తలుల్ని ఎంపిక చేసుకున్నాడు. వాళ్లు దేవుని రాజ్యానికి మొదటి సభ్యులు అయ్యారు, వాళ్లకు ఆ రాజ్యంలో చాలా ముఖ్య పాత్ర ఉంది. నిజమైన ఆరాధన పట్ల యేసు ఎంత ఆసక్తి చూపించాడో చూడండి. యేసు అందరికీ సహాయం చేయాలని అనుకున్నాడు. అందుకే రోగుల్ని బాగు చేశాడు, ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు, చనిపోయినవాళ్లను కూడా తిరిగి బ్రతికించాడు. ఈ అద్భుతాలన్నీ చేసి, దేవుని రాజ్యం మనుషుల కోసం ఏమేం చేస్తుందో చూపించాడు.