కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 68 పేజీ 162-పేజీ 163 పేరా 1
  • ఎలీసబెతుకు బాబు పుట్టాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎలీసబెతుకు బాబు పుట్టాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవా దృష్టిలో నీతిమంతులు’
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మార్గం సిద్ధం చేసే వ్యక్తి పుట్టాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • నిందారహితులుగా నడిచినందుకు వారికి ప్రతిఫలమివ్వబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవుని నుండి వచ్చిన రెండు సందేశాలు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 68 పేజీ 162-పేజీ 163 పేరా 1
జెకర్యా తన కొడుకు పేరు యోహాను అని బంధువులకు స్నేహితులకు చెప్తాడు

లెసన్‌ 68

ఎలీసబెతుకు బాబు పుట్టాడు

యెరూషలేము గోడలు కట్టి 400 సంవత్సరాలు దాటిపోయింది. జెకర్యా అనే యాజకుడు, ఆయన భార్య ఎలీసబెతు ఆ పట్టణానికి దగ్గర్లో నివసిస్తున్నారు. వాళ్లకు పెళ్లి అయ్యి చాలాకాలం అయినా పిల్లలు లేరు. ఒకరోజు జెకర్యా ఆలయంలో ధూపం వేస్తున్నప్పుడు, గబ్రియేలు దూత కనిపించాడు. జెకర్యా భయపడ్డాడు, కానీ గబ్రియేలు ఇలా అన్నాడు: ‘భయపడకు. నేను యెహోవా నుండి ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను. నీ భార్య ఎలీసబెతుకు బాబు పుడతాడు, అతనికి యోహాను అనే పేరు పెట్టాలి. యెహోవా యోహానును ఒక ప్రత్యేక పని కోసం ఎన్నుకున్నాడు.’ జెకర్యా ఇలా అంటాడు: ‘నువ్వు చెప్పే మాటలను ఎలా నమ్మాలి? నా భార్య, నేను చాలా ముసలి వాళ్లం, ఈ వయసులో మాకు పిల్లలు పుట్టరు కదా.’ గబ్రియేలు ఇలా అంటాడు: ‘ఈ వార్త చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. కానీ నువ్వు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఇప్పటి నుండి నీకు బిడ్డ పుట్టే వరకు నువ్వు మాట్లాడవు.’

జెకర్యా ఆలయంలోకి వెళ్లి చాలాసేపు అయ్యింది. చివరికి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తూ ఉన్నారు. జెకర్యా మాట్లాడలేకపోయాడు. ఆయన చేతులతో సైగలు మాత్రం చేస్తున్నాడు. అప్పుడు ప్రజలు దేవుని నుండి అతనికి సందేశం వచ్చిందని అర్థంచేసుకున్నారు.

కొంతకాలం తర్వాత దేవదూత చెప్పినట్లు, ఎలీసబెతు గర్భవతి అయ్యి మగ బిడ్డను కంటుంది. ఆమె స్నేహితులు, బంధువులు బాబును చూడడానికి వస్తారు. వాళ్లు ఆమెను చూసి చాలా సంతోషిస్తారు. ఎలీసబెతు ‘బాబు పేరు యోహాను’ అని చెప్తుంది. వాళ్లు ‘యోహాను అనే పేరు మీ కుటుంబంలో ఎవరికి లేదు. బాబుకు జెకర్యా అని వాళ్ల నాన్న పేరు పెట్టు’ అని అంటారు. కానీ జెకర్యా, ‘అతని పేరు యోహాను’ అని రాస్తాడు. ఆ క్షణం నుండి జెకర్యా మళ్లీ మాట్లాడగలుగుతాడు. ఆ బిడ్డ గురించి యూదయ అంత తెలుస్తుంది, ప్రజలు, ‘ఈ బాబు పెద్దయ్యాక ఏమౌతాడో?’ అనుకుంటారు.

జెకర్యా పవిత్రశక్తితో నిండిపోయి ఇలా ప్రవచించాడు: ‘యెహోవా స్తుతించబడాలి. మనల్ని రక్షించడానికి ఒక రక్షకుడిని, మెస్సీయని పంపిస్తానని ఆయన అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. యోహాను ఒక ప్రవక్త అవుతాడు, మెస్సీయకు ఆయన మార్గం సిద్ధం చేస్తాడు.’

ఎలీసబెతు బంధువు మరియకు కూడా ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. అది ఏమిటో తర్వాతి అధ్యాయంలో చూద్దాం.

“మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యమే.”—మత్తయి 19:26

ప్రశ్నలు: గబ్రియేలు జెకర్యాకు ఏమి చెప్పాడు? యోహాను ఏ ప్రత్యేకమైన పని చేస్తాడు?

మత్తయి 11:7-14; లూకా 1:5-25, 57-79; యెషయా 40:3; మలాకీ 3:1

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి