కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 17 పేజీ 139-పేజీ 142 పేరా 1
  • మైక్‌ ఉపయోగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మైక్‌ ఉపయోగం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • సముచితమైన స్వరం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశాన్ని అనువదించడం
    మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
  • సేవా కూటము మనలను ప్రతి సత్కార్యమునకు సిద్ధపరుస్తుంది
    మన రాజ్య పరిచర్య—1994
  • స్వరము, వ్యవధి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 17 పేజీ 139-పేజీ 142 పేరా 1

17

మైక్‌ ఉపయోగం

మీరు ఏమి చెయ్యాలి?

స్వరం బిగ్గరగా వినిపించేందుకు మీ కూటాల్లో మైక్‌ను ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని సరిగ్గా ఉపయోగించండి.

ఎందుకు ప్రాముఖ్యం?

చెబుతున్న మాటలు వినబడేటట్లుంటేనే ఇతరులు వాటి నుండి ప్రయోజనం పొందగలరు.

మన క్రైస్తవ సహోదరసహోదరీలు క్రైస్తవ కూటాలకు హాజరు కావడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తారు, చాలా కష్టపడతారు. అక్కడ చెప్పబడుతున్న వాటినుండి ప్రయోజనం పొందాలంటే వాళ్ళు వాటిని స్పష్టంగా వినగలగాలి.

ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో శబ్దాన్ని అధికం చేసే విద్యుత్‌ పరికరాలేవీ ఉండేవి కావు. వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు మోయాబు మైదానంలో మోషే ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడినప్పుడు, సంఖ్యలో లక్షలకొద్దీ ఉన్న ప్రేక్షకులు ఆయన మాటలను ఎలా వినగలిగారు? మోషే మానవ వార్తాప్రసార పద్ధతిని ఉపయోగించి ఉంటాడు, ఆ పద్ధతిలో పాళెములో నిర్దిష్ట ఎడంలో అక్కడక్కడ నిలబడివున్న పురుషులు మోషే చెబుతున్న సందేశాన్ని ఒకరి తర్వాత ఒకరికి అందించుకునేవారు. (ద్వితీ.1:1; 31:1) ఇశ్రాయేలీయులు యొర్దానుకు పశ్చిమాన ఉన్న స్థలాన్ని గెలుచుకోనారంభించిన ఆ మధ్య కాలంలో యెహోషువ, ఇశ్రాయేలు జనాంగాన్ని గెరిజీము కొండ ఎదుటా ఏబాలు కొండ ఎదుటా సమకూర్చాడు. అయితే లేవీయులు ఆ కొండల మధ్యనున్న లోయలోనే సమకూడారన్నది స్పష్టం. వాళ్ళందరూ దేవుని దీవెన వచనాలనూ శాప వచనాలనూ విని ప్రతిస్పందించారు. (యెహో. 8:33-35) ఆ సందర్భంలో కూడా ఆయన మానవ వార్తాప్రసార వ్యవస్థను ఉపయోగించి ఉండవచ్చు, అయితే ఆ ప్రాంతపు నైసర్గిక లక్షణాలు శబ్ద ప్రసారానికి ఎంతో అనుకూలంగా ఉండడం కూడా చాలా సహాయకరమైందనడంలో సందేహం లేదు.

దాదాపు 1,500 సంవత్సరాల తర్వాత గలిలయ సముద్రము దగ్గర యేసు చెబుతున్న మాటలను వినడానికి “బహు జనులాయనయొద్దకు కూడివచ్చి”నప్పుడు, ఆ జనసమూహంతో మాట్లాడ్డానికి ఆయన ఒక దోనె ఎక్కి కూర్చొని దాన్ని తీరానికి కొంచెం దూరంగా తీసుకువెళ్ళాడు. (మార్కు 4:1,2) యేసు దోనెలో నుండి ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే మానవ స్వరం నీటి ఉపరితలం మీదనుండి ఎంతో స్పష్టంగా వినబడుతుంది.

20వ శతాబ్దపు ఆరంభం వరకు, ప్రసంగీకుని మాటలను ప్రేక్షకుల్లో ఎంతమంది వినగలిగారన్నది ఆయన స్వరం ఎంత బిగ్గరగా ఉంది, ఎంత స్పష్టంగా ఉంది అన్నవాటిని బట్టే తరచూ నిర్ణయించబడేది. అయితే 1920 మొదలుకొని, యెహోవా సేవకులు తమ సమావేశాల్లో మానవ స్వరాన్ని పెద్దగా వినిపింపజేసే ఎలక్ట్రిక్‌ సౌండ్‌ సిస్టమ్‌లను ఉపయోగించుకోగలుగుతున్నారు.

సౌండ్‌ సిస్టమ్‌. ఈ పరికరం ఒక ప్రసంగీకుని కంఠధ్వనిని అనేకరెట్లు ఎక్కువగా వినిపింపజేయగలదు, అయితే ఆయన కంఠస్వర నాణ్యతనూ స్వరస్థాయినీ ఉన్నది ఉన్నట్లుగానే వినిపింపజేస్తుంది. ప్రసంగీకుడు తన స్వర తంతువులను శ్రమపెట్టనవసరమూ లేదు, ఆయన చెబుతున్న మాటలను వినడానికి శ్రోతలు తమ చెవులను రిక్కించుకోవలసిన అవసరమూ ఉండదు. బదులుగా వాళ్ళు ప్రసంగ సందేశంపై మనస్సును నిలపగలుగుతారు.

యెహోవాసాక్షుల సమావేశ స్థలాల్లో మంచి సౌండ్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి కావలసినన్ని ఏర్పాట్లు చేయబడతాయి. అంతేగాక, అనేక రాజ్య మందిరాలు ప్రసంగాలిచ్చేవారి స్వరాలనూ, కూటాలు నిర్వహించేవారి స్వరాలనూ వేదిక మీది నుండి చదివేవారి స్వరాలనూ పెద్దగా వినిపింపజేసేందుకు సౌండ్‌ సిస్టమ్‌ని ఉపయోగిస్తాయి. కొన్ని సంఘాల్లోనైతే కూటాల్లో ప్రేక్షకులు వ్యాఖ్యానించేటప్పుడు కూడా మైక్‌లు ఉపయోగించబడతాయి. మీ సంఘానికి అలాంటి పరికరాలు ఉంటే వాటిని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోండి.

కొన్ని ప్రాథమిక మార్గదర్శక సూత్రాలు. ఈ పరికరాలను సరిగ్గా ఉపయోగించుకునేందుకు, ఈ విషయాలను మనస్సులో ఉంచుకోండి: (1) మామూలుగా మైక్‌ మీ నోటికి నాలుగు నుండి ఆరు అంగుళాల దూరంలో ఉండాలి. మైక్‌ మరీ దగ్గరగా ఉంటే మాటలు అస్పష్టంగా ఉండవచ్చు. మరీ దూరంగా ఉన్నా కూడా మీ స్వరం స్పష్టంగా ఉండదు. (2) మైక్‌ మీ ఎదుట ఉండాలి, ఒక ప్రక్కకు కాదు. మీ తలను కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ త్రిప్పితే తిరిగి మీ ముఖాన్ని మైక్‌ వైపుకు పెట్టాకే మాట్లాడండి. (3) మీరు మామూలుగా సంభాషించేటప్పటికన్నా కొంచెం బిగ్గరగా దృఢంగా మాట్లాడండి. అలాగని గట్టిగా అరవవలసిన అవసరం లేదు. సౌండ్‌ సిస్టమ్‌ మీ స్వరాన్ని మీ ప్రేక్షకుల్లో ఎంతో దూరాన ఉన్న వాళ్ళకు సహితం వినిపింపజేస్తుంది. (4) మీరు మీ గొంతును సవరించుకోవలసి ఉంటే లేదా మీకు దగ్గు గానీ తుమ్ము గానీ వస్తున్నట్లయితే మీ తలను మైక్‌ నుండి ప్రక్కకు తిప్పడం మరవకండి.

ప్రసంగమిచ్చేటప్పుడు. మీరు పోడియమ్‌ దగ్గరికి వెళ్ళేటప్పుడు, సాధారణంగా ఒక సహోదరుడు మైక్‌ను అడ్జస్ట్‌ చేస్తాడు. ఆయనలా చేసేటప్పుడు మీరు ప్రేక్షకులకు అభిముఖంగా సహజంగా నిలబడండి. మీ నోట్సును పోడియమ్‌ మీద ఉంచండి, ఆ కాగితాలకు మైక్‌ అడ్డురాకుండా చూసుకోండి.

మీరు మాట్లాడ్డం మొదలుపెట్టినప్పుడు లౌడ్‌స్పీకర్‌ నుండి మీ స్వరం ఎలా వినిపిస్తుందో వినండి. మీ స్వరం మరీ బిగ్గరగా ఉందా లేక కొన్ని మాటలు ఏవో పేలిన శబ్దాల్లా వినిపిస్తున్నాయా? అలాగైతే మీరు ఒకటో రెండో అంగుళాలు వెనక్కి జరగవలసిన అవసరం ఉండవచ్చు. మీరు మీ నోట్సు చూసేటప్పుడు మీ ముఖము మైక్‌కి అభిముఖంగా ఉన్నప్పుడు మాత్రమే లేదా దానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడ్డమూ చదవడమూ చేయాలనీ ముఖం మైక్‌కి దిగువగా ఉన్నప్పుడు మాట్లాడకూడదనీ గుర్తుంచుకోండి.

వేదిక మీద చదువుతున్నప్పుడు. మీ బైబిలును గానీ ఇతర ప్రచురణను గానీ పైకి ఎత్తి పట్టుకోవడం మంచిది, అప్పడు మీ ముఖం ప్రేక్షకులకు అభిముఖంగా ఉంటుంది. సాధారణంగా మైక్‌ మీకు ఎదురుగా ఉంటుంది గనుక, మీరు చదవవలసిన సమాచారాన్ని కొంచెం ఒక ప్రక్కకు పట్టుకోవలసిన అవసరం ఉండవచ్చు. అంటే మీ తల, మైక్‌కి కొంచెం మరొకవైపు ఉండాలి. అలాగైతే మీరు చదివేటప్పుడు మీ స్వరం నేరుగా మైక్‌లోకి వెళ్తుంది.

కావలికోట అధ్యయనంలో చదివే సహోదరుల్లో చాలామంది నిలబడి, తమకు ఎదురుగా ఉన్న మైక్‌లో చదువుతారు. అలా నిలబడి ఉండడం వల్ల, వారు మరింత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకూ మరింత భావయుక్తంగా చదివేందుకూ వీలవుతుంది. పేరాలను చదవడం కావలికోట అధ్యయన కూటంలో ఒక ముఖ్య భాగమన్న విషయం మనస్సులో ఉంచుకోండి. దీని నుండి ప్రేక్షకులు ప్రయోజనం పొందడమనేది, చదువుతున్న సమాచారం వినబడడం మీదే చాలావరకు ఆధారపడి ఉంటుంది.

కూటంలో వ్యాఖ్యానించేటప్పుడు. మీ సంఘంలో ప్రేక్షకులు పాల్గొనేటప్పుడు మైక్‌లను ఉపయోగిస్తున్నట్లయితే ఇప్పటికీ స్పష్టంగాను కావలసినంత బిగ్గరగాను మాట్లాడవలసిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. వ్యాఖ్యానించేటప్పుడు మీ అధ్యయన ప్రచురణను గానీ బైబిలును గానీ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగైతే మీరు మైక్‌లో మాట్లాడేటప్పుడు సమాచారాన్ని స్పష్టంగా చూడగలుగుతారు.

కొన్ని సంఘాల్లో వ్యాఖ్యానించమన్న వారి దగ్గరికి మైక్‌లను తీసుకువెళ్ళడానికి సహోదరులు నియమించబడతారు. మీ సంఘంలో అలాంటి ఏర్పాటు ఉన్నట్లైతే మిమ్మల్ని వ్యాఖ్యానించమన్నప్పుడు మీ చేతిని అలాగే ఎత్తి ఉంచండి, అప్పుడు మైక్‌ను అందించే సహోదరుడు మీరు ఎక్కడ కూర్చున్నారో చూసి మీ దగ్గరికి త్వరగా తీసుకురాగలుగుతాడు. చేతితో పట్టుకునే మైక్‌ అయితే, దాన్నందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మైక్‌ మీ ముందుకు వచ్చి మీరు దాన్ని సరైన దూరంలో పట్టుకునే వరకు వ్యాఖ్యానించడం మొదలుపెట్టకండి. మీరు మీ వ్యాఖ్యానాన్ని ముగించినప్పుడు మైక్‌ను వెంటనే తిరిగి ఇవ్వండి.

ఒక ప్రదర్శనలో పాల్గొనేటప్పుడు. ఒక ప్రదర్శననిస్తున్నప్పుడు మైక్‌ను ఉపయోగించేందుకు దాని గురించి ముందుగా ప్రత్యేకంగా ఆలోచించడం అవసరం. మైక్‌ ఒక స్టాండు మీద ఉంటే మీ బైబిలును, నోట్సును పట్టుకోవడానికి మీ రెండు చేతులూ ఖాళీగా ఉంటాయి. చేతితో పట్టుకునే మైక్‌ అయితే ఇంకా స్వేచ్ఛగా కొంచెం అటు ఇటు కదలడానికి ఉంటుంది, అయితే దాన్ని పట్టుకొమ్మని మీ భాగస్వామిని అడగాల్సి రావచ్చు. అప్పుడు మీరు బైబిలును ఉపయోగించడానికి మీ చేతులు ఖాళీగా ఉంటాయి. ఇలా చేయడానికి మీరూ మీ భాగస్వామీ ప్రాక్టీస్‌ చేయాలి, అలా ప్రాక్టీస్‌ చేస్తే మైక్‌ను సరిగ్గా పట్టుకోవడమెలాగో మీ భాగస్వామికి తెలుస్తుంది. మీరు వేదిక మీద ఉన్నప్పుడు, ప్రత్యేకించి మీరు మాట్లాడేటప్పుడు మీ వీపును ప్రేక్షకుల వైపుకు పెట్టకూడదని కూడా గుర్తుంచుకోండి.

సేవా కూటపు ప్రదర్శనల్లో పాల్గొనేవారు చాలామంది ఉండవచ్చు, వాళ్ళు వేదిక మీద అటు ఇటు కదులుతుండవచ్చు. కనుక, అనేక మైక్‌లు అవసరమవుతుండవచ్చు. కాబట్టి ముందుగానే వాటిని వాటి స్థానంలో ఉంచాలి లేదా పాల్గొనేవారు వేదిక మీదకు వెళ్ళేటప్పటికి వాటిని అక్కడ అందుబాటులో ఉంచాలి. మైక్‌లు సరైన చోట సరైన సమయంలో ఉండేలా చూడాలంటే ముందుగా పథకం వేయవలసి ఉంటుంది. ప్రదర్శనలను చేసే ముందు ప్రాక్టీస్‌ చెయ్యడం ద్వారా మైక్‌లను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని గురించి పాల్గొనేవారికి నిర్దేశమిచ్చే అవకాశం లభిస్తుంది. వేదిక మీద ప్రాక్టీస్‌ చేయలేనప్పుడు, పాల్గొనేవారు మైక్‌ను సరైన విధంగా పట్టుకోవడం ప్రాక్టీస్‌ చేసేందుకు మైక్‌ సైజులోవున్న ఒక చిన్న వస్తువును పట్టుకోవడం జ్ఞానయుక్తంగా ఉండవచ్చు. పాల్గొన్నవారు ప్రదర్శన తర్వాత, చేతితో పట్టుకునే మైక్‌లను మెల్లగా తిరిగి పెట్టాలి, వేదిక మీద నుండి వచ్చేటప్పుడు, ఇతర మైక్‌ల వైర్లను తట్టుకొని పడిపోకుండా జాగ్రత్తపడాలి.

మైక్‌లను ఉపయోగించేటప్పుడు మనం శ్రద్ధచూపడానికీ మన కూటాల ముఖ్య లక్ష్యాల్లో ఒకదానికీ నేరుగా సంబంధముంది. మనం దేవుని వాక్యాన్ని చర్చించుకోవడం ద్వారా ఒకరి నుండి ఒకరం ప్రయోజనం పొందడమే ఆ లక్ష్యం. (హెబ్రీ. 10:24,25) మైక్‌లను సమర్థవంతంగా ఉపయోగించడం నేర్చుకోవడం ద్వారా ఈ ప్రాముఖ్యమైన లక్ష్యసాధనకు మనం స్వయంగా దోహదపడవచ్చు.

మైక్‌ను సరిగ్గా ఉపయోగించడమెలా?

  • మైక్‌ను మీ నోటికి నాలుగు నుండి ఆరు అంగుళాల దూరంలో ఉంచండి.

  • మీ నోరు మైక్‌ వైపు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడండి.

  • మామూలు సంభాషణలో కన్నా కొంచెం బిగ్గరగా దృఢంగా మాట్లాడండి, చదవండి.

  • మీరు గొంతు సవరించుకోవలసి వస్తే, మీ తలను మైక్‌ నుండి కొంచెం ప్రక్కకు తిప్పండి.

అభ్యాసం: మీ సంఘంలో మైక్‌లను ఉపయోగిస్తున్నట్లయితే, స్టాండ్‌ ఉన్న మైక్‌లనూ చేతితో పట్టుకునే మైక్‌లనూ అనుభవజ్ఞులైన ప్రసంగీకులు ఎలా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా గమనించండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న పద్ధతులను ఉపయోగించకుండా జాగ్రత్తపడాలనుకుంటున్న పద్ధతులను మీరు అలా అనుకోవడానికి గల కారణాలను గుర్తించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి