కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 5/8 పేజీ 31
  • మీకు శ్రద్ధ ఉందని చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు శ్రద్ధ ఉందని చూపించండి
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆత్మహత్య—యువతను పీడిస్తున్న మహామారి
    తేజరిల్లు!—1998
  • క్రైస్తవ కుటుంబము వృద్ధులకు సహాయముచేయును
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • తమ వారికి దూరంగావున్నా ఎవరూ వారిని మరచిపోలేదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురౌతున్న వృద్ధులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 5/8 పేజీ 31

మీకు శ్రద్ధ ఉందని చూపించండి

కెనడాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

కెనడాలోని వృద్ధపౌరులలో, వ్యక్తిగత చింతల మూలంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య భయం గొల్పేదిగా ఉంది. 200 మంది యౌవనస్థులు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే వారిలో ఒకరు చనిపోతారనీ, అదే 65 ఏళ్లు పైబడిన వారిలో, ఆత్మహత్యకు పాల్పడే ప్రతీ నలుగురిలోనూ ఒకరు చనిపోతారని వన్‌కోవర్‌ సన్‌ అనే వార్తాపత్రికలోని ఒక నివేదిక తెలియజేసింది. “వృద్ధులు చేసుకునే ఆత్మహత్యలలో అనేకం వెలుగులోకి రాకపోవచ్చునని” విశ్వసించబడుతోంది, “ఎందుకంటే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుల మరణాలు సహజ మరణాలో లేక ఆత్మహత్యలో చెప్పడం కష్టం.”

చాలామంది వృద్ధులు జీవించాలనే ఆశను ఎందుకు కోల్పోతున్నారు? వృద్ధపౌరులు ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడే కారకాలు కృంగుదల, సమాజంనుండి దూరంగా జీవించడం, ఒంటరితనం అని వయోవృద్ధుల ఆత్మహత్యకు సంబంధించిన అంశంలో నిపుణుడైన, బ్రిటీష్‌ కొలంబియా యూనివర్సిటీకి చెందిన మానసిక వైద్యుడు అయిన ఒలువఫేమి అగ్బయేవ చెప్తున్నాడు. ప్రజలు వృద్ధులయ్యే కొలది, “తమకున్న గౌరవాన్నీ, అధికారాన్నీ, నిగ్రహాన్నీ . . . కోల్పోతారు, ఉన్నట్టుండి, ఇక ఎవ్వరూ వాళ్ల ఆభిప్రాయాలను అడగరు. చాలా ఎక్కువమంది సంరక్షణా గృహాలలో విడువబడ్తారు అక్కడ చేయడానికేమీ ఉండదు, వాళ్ళు కేవలం కూర్చొని పేకాట ఆడాలి, టీవీ చూడాలి” అని ఆల్బెర్టలోని కాల్గరిలో ఉన్న ఆత్మహత్యల సమాచార విద్యాకేంద్ర సంచాలకుడైన గెరీ హారింగ్‌టన్‌ పేర్కొంటున్నాడు. ఈ భావాన్ని అధికం చేసే వాస్తవమేమిటంటే, సమాజం యౌవనానికీ అలాగే స్వేచ్ఛకూ ఉత్పాదకతకూ వేగానికీ అధిక విలువనివ్వడమే—అయితే సమాజం అధిక విలువనిచ్చే ఈ లక్షణాలే, ఒకరు వృద్ధాప్యానికి ఎదుగుతుండగా తగ్గిపోతాయి.

అయితే, యెహోవా దేవుని దృష్టిలో వృద్ధులు బహు విలువైన వారు. వారి భావోద్వేగపరమైన అవసరతలను ఆయన నిశితంగా గ్రహిస్తాడన్న రుజువును, “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను” అని ఆయన ప్రాచీనకాల ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలో చూడవచ్చు.—లేవీయకాండము 19:32.

కనుక, వృద్ధులను మనం ఎలా ‘ఘనపర్చవచ్చు’? వారి మాటల్లో జ్ఞానం ఎల్లప్పుడూ తొణికిసలాడక పోయినప్పటికీ, వృద్ధాప్యం వల్ల వారి అసంపూర్ణతలు మరింత స్పష్టంగా కనిపించినప్పటికీ, వారు మన గౌరవాన్ని పొందడానికి అర్హులు. మీకు శ్రద్ధ ఉందని చూపించండి. వారి జ్ఞాన వివేచనల నుండి మీరు ప్రయోజనం పొందడం ద్వారా వారికి గౌరవాన్ని, ఘనతను, గుర్తింపును ఇవ్వండి. ముఖ్యంగా వారు దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం, ఆయన వాక్యాన్ని కచ్చితంగా అర్థంచేసుకుని దాని అనుసారంగా జీవితాన్ని గడిపినప్పుడు అలా చేయండి.

దేవుని వాక్యం వృద్ధుల గురించి శ్రద్ధ వహించి వారికి గౌరవాన్ని ఇచ్చే విషయంలో ఇంకా ఎంతో బోధిస్తుంది. అదనపు సమాచారం కోసం, కుటుంబ సంతోషానికిగల రహస్యం అనే పుస్తకాన్ని పంపమని దయచేసి ఈ పత్రిక ప్రచురణకర్తలను కోరండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి