కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 5/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవా తన ముఖకాంతిని వారిపై ప్రకాశింపజేశాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • బధిరులైన సహోదర సహోదరీలను శ్రద్ధగా చూసుకుందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీ ప్రాంతంలోని బధిరులను కనుగొనడంలో చురుకుగా ఉండండి
    మన రాజ్య పరిచర్య—2001
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 5/8 పేజీ 30

మా పాఠకుల నుండి

ఆయన నన్ను ప్రేమించకపోతే నేనేం చేయను? ఈరోజే నేను తేజరిల్లు! జూలై 8, 1998 సంచికను అందుకున్నాను, దానిలోవున్న యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . “ఆయన నన్ను ప్రేమించకపోతే నేనేం చేయను?” అనే శీర్షికను చూడగానే నా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు యెహోవాకు నేను వెంటనే కృతజ్ఞతలు తెలిపాను. ఈ శీర్షికను మా అమ్మతో ఆలోచించి, నా జీవితంలో ఈ సలహాను పాటించాలని దృఢనిశ్చయం చేసుకున్నాను. “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .” అనే శీర్షికలు నిజంగా యెహోవా దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు.

కె. యమ్‌., కెన్యా

నేను 22 సంవత్సరాల అమ్మాయిని, మీ పత్రికల ప్రతీ సంచికా నాకిష్టం; కానీ మొదటిసారిగా నా హృదయాన్ని స్పృశించింది ఈ శీర్షికనే. నేను దాన్ని చదువుతూండగా నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు కొద్దికాలం క్రితం నిజంగా మీరు వివరించినటువంటి భావాలే కలిగాయి, వాటి గురించి నాకు చాలా ప్రశ్నలు ఉండేవి. విషయాలను సుస్పష్టంగా గ్రహించడానికి ఈ శీర్షిక నాకు సహాయపడింది.

ఆర్‌. బి., లిథువానియా

నేను ఈ శీర్షికను చదివినప్పుడు, ‘నేనెలా భావిస్తున్నానో మరొకరికెలా అర్థమైంది?’ అని నేను అనుకున్నాను. యెహోవా ప్రతీవిషయాన్ని దయతో అర్థంచేసుకుంటాడని తెలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ పత్రిక ఈరోజే వచ్చింది, ఇప్పుడు అర్థరాత్రి కావస్తున్నా నేను ఇప్పుడే వ్రాయాలనుకున్నాను.

ఏ. ఎన్‌., జపాన్‌

స్త్రీలను దృష్టిలో పెట్టుకొని ఈ శీర్షిక సిద్ధం చేయబడినప్పటికీ, ఇది నాకు కూడా సహాయకరంగా అనిపించింది. సరిగ్గా వారంక్రితం, నన్ను నిక్కచ్చిగా నిరాకరించడంతో నేను బాధపడ్డాను. నా భావాలను సరిచేసుకొనేందుకు మీ శీర్షిక నాకు సహాయపడింది. ఈ శీర్షిక నన్ను ఓదార్చింది, మరిముఖ్యంగా భార్యను ఎంపిక చేసుకొనేటప్పుడు నేను ఏమివ్వగలను అనేదాని గురించి ఆలోచించాలి గానీ నేను ఏమి పొందగలను అనేదాని గురించి ఆలోచించకూడదని నాకు చూపించింది.

పి. హెచ్‌. యస్‌., బ్రెజిల్‌

యుక్తవయస్సు వచ్చేటప్పటికి అమ్మాయిలకు వివాహం చెయ్యాలి అని కొరియా సమాజం నొక్కి చెప్తుంది. పెండ్లిచేసుకొనేందుకు ఆమె ‘ఈడు మించిపోయే’ వరకూ ఆగడం క్రైస్తవ యౌవనస్థురాలికి గొప్ప సవాలుతో కూడినది. (1 కొరింథీయులు 7:36) శ్రేష్ఠమైన సలహాకోసం కృతజ్ఞతలు.

యస్‌. సి. కొరియా

స్వంత వైద్యం “స్వంత వైద్యం—అది మీకు సహాయం చేయగలదా లేక హాని చేయగలదా?” (ఆగస్టు 8, 1998) అనే శీర్షికల పరంపరను చూసి నేను సంతోషించాను. అది చక్కగా వ్రాయబడింది, విషయాన్ని గురించి సమతూకమైన సంపూర్ణ అవగాహనను ఇచ్చింది, అది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆచరణయోగ్యమైనదై ఉండగలదు. ‘అన్ని జబ్బులకు మందులను’ ఆశ్రయించే బదులు ఆరోగ్యకరమైన జీవనవిధానం ద్వారా మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవలసిన మన వ్యక్తిగత బాధ్యత యొక్క ప్రాముఖ్యతను అది చక్కగా నొక్కి చెప్పింది.

జె. యమ్‌. జె., ఇంగ్లాండ్‌

అమ్మాయిల వెనకపడ్డం “బైబిలు ఉద్దేశం: అమ్మాయిల వెనకపడ్డం తప్పా?” (ఆగస్టు 8, 1998) అనే శీర్షిక కొరకు కృతజ్ఞతలు. నేను అమ్మాయిల వెనకపడడం వల్ల ఏర్పడిన పర్యవసానాలనుండి మా కుటుంబం కోలుకుంటోంది. నా కుటుంబానికి ముఖ్యంగా నా ప్రియమైన భార్యకు నేను ఎంత బాధకల్గిస్తున్నాననేది నేను పట్టించుకోలేదు. ఒకవేళ నా క్రైస్తవ సహోదర, సహోదరీలతో నేనేమైనా చెప్పగల్గితే అదిలా ఉంటుంది: “మన తండ్రియైన యెహోవా చెబుతున్న దానిని దయచేసి వినండి. అమ్మాయిల వెనకపడ్డం మానండి, సహాయంకోరండి, యెహోవాను ప్రార్థించండి, చెడునుండి దూరంగా పారిపోండి, పారిపోండి, పారిపోండి.”

డి. బి,. అమెరికా

అమ్మాయిల వెనకపడ్డం చిన్నవిషయం కాదన్న వాస్తవాన్ని ఈ శీర్షిక నాకు ధ్రువీకరించింది. మా కుటుంబానికి విడాకులనే పెద్ద దెబ్బతగిలింది, ఆ సమస్యకు ముఖ్య కారణం అంత తప్పుకాదనిపించేలాంటి హాస్యోక్తులే. తమ ప్రవర్తన, మాటలు, సంజ్ఞలు వ్యతిరేకలింగానికి చెందిన వ్యక్తులపై ఎలా ప్రభావం చూపెడతాయన్నదాన్ని తమకుతాముగా తెలుసుకోలేని వారికి ఈ సలహా సహాయకరంగా ఉంటుందని నేను అనుకొంటున్నాను.

ఒ. యమ్‌., జెక్‌ రిపబ్లిక్‌

వేదన అనుభవిస్తున్న అనేకమంది సహోదరీల హృదయాలకు ఇది ఉపశమనం కల్గించే ఔషధంలాంటిది. యెహోవా మన అంతర్గత భావాలను గమనిస్తాడనీ, వాటిగురించి శ్రద్ధ తీసుకుంటాడనీ ఈ శీర్షిక ద్వారా మనం తెలుసుకున్నాము.

ఏ. యమ్‌. పి., స్పెయిన్‌

“మానసిక వ్యభిచారం” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న పేరాలో ఉన్నది నాకు క్రొత్త విషయం. నా భర్త సంఘంలోని మరో సహోదరితో మేథోపరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు, ఎందుకంటే వాళ్ళ ఇద్దరివీ ఒకేవిధమైన పూర్వచరిత్రలు. 17 ఏండ్ల మా వివాహజీవితంలో, ఆయనను అనుమానించడానికి ఆయన నాకు ఎలాంటి అవకాశాన్నీ ఇవ్వలేదు, కానీ నాకు అనుమానం కలిగింది. నా భావాలను నా భర్తకు చెప్పడం అంత సులభమేమీ కాలేదు. మొదట ఆయన ఆశ్చర్యపోయారు, కానీ నా దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. నన్ను, మా ముగ్గురు పిల్లలను బాధపెట్టడం తనకిష్టంలేదని ఆయన చెప్పారు, వెంటనే ఆయన ఆమెతో అన్ని విధాలైన సంప్రదింపులూ మానుకున్నారు. ఆయన ప్రతిస్పందననుబట్టి నేనెంతో ఉపశమనం పొందాను.

డి. టి., కెనడా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి