అది ఒక వ్యక్తి డబ్బును కాపాడింది
ఒక వ్యక్తి పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియాలో నగరాల మధ్య టాక్సీలో ప్రయాణిస్తూ, తన తోటి ప్రయాణికునితో దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్ నుండి “దేవుడు ద్వేషించే అలవాట్లు” అనే పాఠాన్ని చర్చించాడు. ఆ టాక్సీ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగినప్పుడు, బ్రోషూర్‌లోని విషయాలపై అత్యంత ఆసక్తిని చూపించిన వ్యక్తి తాను తీసుకెళ్తున్న ప్యాకేజ్‌ని చూపించి, “ఇది డబ్బు. . . . దీన్ని నేను టాక్సీ డిక్కీలో ఉన్న ప్రయాణీకుల సామానులోనుండి దొంగిలించాను” అని వివరించాడు.
అయితే, డబ్బును దొంగిలించిన ఆ వ్యక్తి తాను చేసిన దానికి క్షమాపణను కోరి, ఆ డబ్బును దాని యజమానికి తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు. తోటి ప్రయాణికుడైన ఒక యువ వర్తకుడు ఆ ప్యాకేజ్ తనదేనని గుర్తించాడు. అందులో 1,50,000 నైరాలు (దాదాపు రూ. 68,000) ఉన్నాయి. వర్తకుడ్ని 500 కిలోమీటర్ల దూరం నుండి వెంబడిస్తూ వస్తున్న ఆ దొంగ ఆ వర్తకునితో, బ్రోషూరులో ఉన్న సమాచారాన్ని తనతో చర్చించిన వ్యక్తికి వర్తకుడు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పాడు. తాను ఆ డబ్బును తిరిగి ఇచ్చేసేలా చేసింది ఆ సమాచారమేనని ఆ దొంగ వివరించాడు.
జరిగిన దాన్ని డ్రైవరూ, ఇతర ప్రయాణికులూ తెలుసుకున్నప్పుడు, ఆశ్చర్యపోయారు, వాళ్ళందరూ ఆ బ్రోషూర్ ప్రతులను అడిగి తీసుకున్నారు. ఇంతకు ముందెన్నడూ యెహోవాసాక్షులు తనతో మాట్లాడడానికి ఆ వర్తకుడు అనుమతించలేదు. కానీ, ఇప్పుడు అతడు తనకు బైబిలు పఠనం కావాలని కోరాడు.
మీరు ఈ 32 పేజీల విలువైన బ్రోషూర్ కావాలనుకుంటే, దీనితోపాటు ఉన్న కూపన్‌ను నింపి, ఇక్కడ ఇవ్వబడిన చిరునామాకు లేదా, ఈ పత్రిక 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకు అనుకూలమైన చిరునామాకు పంపించండి.
□ నాకు దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్‌ను నాకు పంపించండి.
□ మా కోసం బైబిలు పఠనాన్ని నిర్వహించేందుకు ఈ చిరునామాకు రండి.