కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 3/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 3/8 పేజీ 30

మా పాఠకుల నుండి

స్నేహితురాలి వల్ల ఊపిరాడని పరిస్థితి నేను “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నా స్నేహితురాలి వల్ల కలుగుతున్న ఊపిరాడని పరిస్థితిని ఎలా నివారించగలను?” (మే 8, 1998) అనే శీర్షికను నేను ఎంత ప్రశంసిస్తున్నానో చెప్పాలనుకున్నాను. నేను వయోజనురాలనే అయినా, వివాహితనే అయినా, ఈ శీర్షికలను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాను. ప్రత్యేకంగా ఈ శీర్షిక, నేనూ మా శ్రీవారూ ఉన్న ప్రస్తుత పరిస్థితికి తగినట్లుగా ఉంది గనుక, నేను దీనిని ఐదుసార్లు చదివిన తర్వాత గానీ వదిలిపెట్టలేదు. యేసుకు కూడా ఏకాంత సమయం అవసరమైందని తెలుసుకునేందుకు ఇది నాకు సహాయపడింది.

పి. ఏ., ట్రినిడాడ్‌

చిన్న చిన్న అపార్థాలవల్ల, నేనూ, నా స్నేహితుడూ కొన్నిసార్లు మాట్లాడుకోవడం మానుకునేవాళ్ళం. అది నన్ను ఎంతో కృంగదీసేది గనుక, ఇక నేను దేని మీదా శ్రద్ధ నిలపలేకపోయేవాడ్ని. ఈ శీర్షికను అనేకసార్లు చదివిన తర్వాత, నేను నా స్నేహితుడికి ఊపిరాడనంతగా ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాననీ, ఆయన వేరే పనులు చేసుకోవడానికి సమయమివ్వడం లేదనీ గ్రహించాను. ఇతరులతో గల నా సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ఈ శీర్షిక నాకు అనేక మార్గాలను చూపించింది కనుక, ఇది నా కోసమే వ్రాయబడిందన్న అనుభూతి కలిగింది.

ఆర్‌. ఎస్‌., ఇండియా

ఆర్తోడాన్టిక్స్‌ నేను ఈ మధ్యే డెంటిస్ట్‌ దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆర్తోడాన్టిక్స్‌ను గురించి చర్చిస్తున్న మే 8, 1998 తేజరిల్లు! ప్రతిని ఆయనకు ఇచ్చి వచ్చాను. ఆ డెంటిస్ట్‌ తర్వాత, ఆ శీర్షికలో చాలా మంచి సమాచారముందనీ, క్షుణ్ణంగా ఉందనీ, అర్థమయ్యేలా సులభంగా వ్రాయబడిందనీ చెబుతూ ప్రశంసించాడు. తమకు చేయబోయే ట్రీట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఏమిటో అర్థం చేసుకోవడానికి సహాయపడేందుకు ఈ శీర్షికల కాపీలను తన పేషంట్లకు కొందరికి ఇచ్చానని కూడా ఆయన చెప్పారు.

టీ. పీ., ఇంగ్లండ్‌

2000 సంవత్సరం జూన్‌ 8, 1998 తేజరిల్లు!లోని “బైబిలు ఉద్దేశము: 2000 సంవత్సరం ఎంత ప్రాముఖ్యమైనది?” అనే శీర్షిక ఆహ్లాదకరమైన విషయాన్ని గుర్తుచేసేదిగా ఉంది. ఊహించే ధోరణిని నిరుత్సాహపర్చడంలో మీరు నిర్మొహమాటంగా ఉండడాన్నీ, యెహోవా దినం వచ్చే సమయాన్ని గురించిన గత వివరణను వివరించడంలో నిష్కపటంగా ఉండడాన్నీ నేను మెచ్చుకుంటాను.

ఎస్‌. డబ్ల్యు., అమెరికా

కంబోడియాలో జీవమరణాలు “కంబోడియాలో జీవమరణాలనుండి నా సుదీర్ఘ ప్రయాణం” (జూన్‌ 8, 1998) అనే శీర్షికకు కృతజ్ఞతలు. యెహోవాను నమ్మకంగా సేవచేయడము, తన మనుగడ కోసం ఇతరులను చంపిన సైనికుడైన వాతనా మీయాస్‌లాంటి అనేకులు విచారకరమైన జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, ఇదే మార్గంలో పయనిస్తున్నారని తెలుసుకోవడము చాలా బాగుంది. ఆయన ఒక గుంటలో మూడునెలలు దాక్కొని ఉండవలసి వచ్చిందని తెలుసుకున్నప్పుడు నిర్ఘాంతపోయాను. యెహోవాను తెలుసుకునే అత్యంత గొప్ప ఆధిక్యతను తాను త్వరలోనే అనుభవించబోతున్నాడని పాపం ఆయనకు ఆ సమయంలో తెలియదు కదా!

సి. ఎమ్‌. ఎస్‌. ఎల్‌., బ్రెజిల్‌

మీరు పైరూపాలను బట్టి న్యాయనిర్ణయం చేస్తారా? నసీరుద్దీన్‌ హాజ్‌ గురించిన జానపద కథ ద్వారా సోదాహరణంగా వివరించబడినట్లు, పైరూపాన్ని చూసి మోసపోవచ్చు. (జూలై 8, 1998) ఇతరులను గురించి వారి పైరూపాన్ని బట్టి, అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ ఒక అభిప్రాయానికి రాకూడదనీ,—యెహోవా మన పైరూపాన్నిబట్టి కాదుగానీ, మన హృదయం ఎలా ఉందనే దాన్ని బట్టే న్యాయనిర్ణయం చేస్తాడనీ మాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

ఏ. ఓ. ఎఫ్‌. ఏ., బ్రెజిల్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి