మా పాఠకుల నుండి
కుల వ్యవస్థ నాకు 12 ఏళ్లు, నిన్ననే మా స్కూల్లో నాకు కులవ్యవస్థ గురించి వ్యాసం రాసే అసైన్మెంట్ ఇచ్చారు. మా పూర్వీకులలో కొందరు భారతీయులు. ఈరోజే నేను “క్రైస్తవులూ కులం” అనే మీ శీర్షికను అందుకున్నాను. (ఏప్రిల్ 8, 1998) ఈ అంశం గురించి మా పాఠ్యపుస్తకాలు మీరు చెప్పినంత సమగ్రంగా వివరించలేదు.
ఎస్. ఎస్. ఎన్., అమెరికా
ఒత్తిడిని ఎదుర్కోవడం అలసట, పూర్తి నిస్సత్తువ, నరాల బలహీనత వంటి వాటి గురించి నేను పేరుపొందిన పత్రికల్లో శీర్షికలను చదివాను. కాని అవి తరచూ, నేను పనిలో కొనసాగడానికి పనికి వస్తానా లేదా అని నేను ఆలోచించేలా చేస్తాయి! ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చిన 15 సూచనలలో ఏదీ కూడా పని మానేసి ఉద్యోగ విరమణ పొందడం గురించి సూచించలేదు. (“మీరు ఒత్తిడిని ఎదుర్కోగలరు!,” ఏప్రిల్ 8, 1998) బదులుగా, జీవితాన్ని కొనసాగిస్తూనే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో అవి చూపించాయి.
జె. బి., బొలీవియా
ఆ శీర్షికలు సరైన సమయంలో వచ్చాయి, ఎందుకంటే నేను చింతతో బాధపడుతున్నాను. నేను పూర్తికాల పరిచారకురాలిని, కాబట్టి నాకలాంటి సమస్యలు ఉండకూడదని నేననుకున్నాను. నేను ఈ శీర్షికలను చదువుతుండగా, నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. యెహోవా తన సేవకుల పట్ల ఎంతో శ్రద్ధ కలిగివున్నాడనీ, మనం ఏమి అనుభవిస్తున్నామో ఆయన అర్థం చేసుకుంటాడనీ నేను గ్రహించాను.
డి. ఎమ్., ఇటలీ
నేను ఒత్తిడితో కూడిన పరిస్థితియైన సొరియాసిస్‌తో బాధపడుతున్నాను కాబట్టి నేను చదవవలసింది సరిగ్గా అదే. నేను యెహోవాకు ప్రాముఖ్యమైనదాన్ని కానని నేను కొన్నిసార్లు అనుకునేదాన్ని, కాని విషయం అది కాదని మీ శీర్షిక నాకు చూపించింది. ఆయన నిజంగా నా పట్ల శ్రద్ధ కల్గివున్నాడు—ఆయన ఎంత శ్రద్ధ కల్గివున్నాడంటే నేను ఒత్తిడి గురించి తెలుసుకోవలసిన సమాచారమంతా ఆయన నాకు అందజేసేటంతగా నాపట్ల శ్రద్ధ కల్గివున్నాడు.
ఎస్. ఎస్., బ్రెజిల్
“పిటిఎస్డి—అసాధారణ అనుభవానికి సాధారణ ప్రతిస్పందన” అనే బాక్సు గురించి నేను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. నా బాల్యం వేదనాభరితంగా గడిచింది, గత స్మృతులు నా జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ, ఆ శీర్షిక నాకు నిజమైన ఓదార్పునిచ్చింది.
ఆర్. ఎన్., అమెరికా
ఆ శీర్షికలు నాకెంతో జ్ఞానోదయాన్ని కలిగించాయి. సాతాను నుండి వచ్చే ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి గనుక, విశ్వాసంలో నిలిచివుండడానికి మనకు ఈ విధమైన సమాచారం అవసరం. అది, మీరు మా సమస్యల గురించి ఎంతో ఆసక్తి కలిగివున్నారని, వాటిని తాళుకోవడానికి మాకు అవసరమైనది మీరు ఇస్తారని నేను గ్రహించేలా చేసింది.
వి. టి., ఫిజి
స్కూల్లో మరింత సఫలీకృతమవ్వడం నేనొక స్కూలు విద్యార్థిని, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను స్కూల్లో మరింత సఫలీకృతుడనై ఉండగలనా?” అనే శీర్షిక గురించి మీకు కృతజ్ఞతలు తెల్పాలనుకుంటున్నాను. (ఏప్రిల్ 8, 1998) నాకు ఎప్పుడూ మంచి మార్కులే వచ్చినప్పటికీ, ఇంకా మెరుగుపర్చుకోవచ్చునని నేను నిజంగా ఎన్నడూ అనుకోలేదు. ఈ ఆసక్తికరమైన, ప్రేరణాత్మకమైన శీర్షిక మూలంగా, నేను సహేతుకమైన లక్ష్యాలను ఏర్పరచుకుని మరింత అభివృద్ధి సాధించగలనని నాకు స్పష్టమయ్యింది.
బి. ఆర్., అమెరికా
నాకు 14 ఏళ్లు, ఎలా చదువుకోవాలో నాకెప్పుడూ నిజంగా అర్థం కాలేదు. కొన్ని విషయాలు నాకు అసలు భవిష్యత్తులో ఎప్పుడూ అవసరం ఉండవని నేను నిశ్చయించుకున్నాను, కాబట్టి వాటిని చదవడం దండగ అని నేననుకున్నాను. ఈ శీర్షిక నేను నా మనస్సు మార్చుకునేలా చేసింది. అంతేగాక, ఎలా చదవాలో ఎంతో ఆచరణయోగ్యమైన రీతిలో వివరించినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెల్పాలనుకుంటున్నాను!
కె. ఎఫ్., జపాన్