కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 3/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ట్రాఫిక్‌లో ప్రాణాపాయం కలగడం అధికమౌతుంది
  • షాపింగ్‌ వ్యసనానికి అలవాటు పడ్డారు
  • అపరిశుభ్రమైన ఉపరితలాలు
  • మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడం
  • హిమనదులు కరిగినప్పుడు వెలువడినవి ఆశ్చర్యకరంగా ఉన్నాయ్‌
  • పొగత్రాగే మూర్ఖమైన అలవాటు గురించి మరింత సమాచారం
  • గూఢలిపి అర్థం చెప్పడాన్ని సవాలు చేస్తుంది
  • యెహోవాసాక్షులు ఈస్టర్‌ ఎందుకు చేసుకోరు?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • ఈస్టర్‌ లేక జ్ఞాపకార్థదినం—మీరు దేన్ని ఆచరించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మూత్రపిండంలో రాళ్లు పురాతన రోగానికి చికిత్స
    తేజరిల్లు!—1993
  • ఈస్టర్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 3/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

ట్రాఫిక్‌లో ప్రాణాపాయం కలగడం అధికమౌతుంది

ప్రతి సంవత్సరం, 5,00,000 కన్నా ఎక్కువ మంది ప్రపంచపు హైవేల్లో చనిపోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా, ట్రాఫిక్‌లో ప్రాణాపాయం అధికమౌతోందని ఫ్లీట్‌ మెయిన్‌టెనన్స్‌ & సేఫ్టీ రిపోర్ట్‌ నివేదిస్తుంది. తీవ్రమైన ట్రాఫిక్‌ ప్రమాదంలో మీరు కూడా ఇమిడి ఉండగల అవకాశాలేవి? ఆ నివేదిక ప్రకారం, “‘మోటారువాహనాలను బాగా ఉపయోగిస్తున్న’ దేశాల్లో, ప్రతి సంవత్సరం హైవేలో వాహనాలు ఢీకొనడం వల్ల, ప్రతి 20 మందిలో కనీసం ఒక్కరు చనిపోవడమో గాయాలు తగలడమో జరుగుతుంది, ప్రతి ఇద్దరిలో ఒక్కరు తమ జీవితంలో కనీసం ఒకసారి ట్రాఫిక్‌ ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారు.”

షాపింగ్‌ వ్యసనానికి అలవాటు పడ్డారు

“జర్మనీలో అనేకులు అనియంత్రిత షాపింగ్‌తో బాధపడుతున్నారు” అని గ్రాఫ్‌షాఫ్‌టర్‌ నాక్‌రిక్టన్‌ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. వ్యాపార మనశ్శాస్త్రవేత్త అయిన ఆల్‌ఫ్రేట్‌ గేబేర్ట్‌ అభిప్రాయం ప్రకారం, అనియంత్రితంగా షాపింగ్‌ చేసేవారు ఒక రకమైన సుఖానుభూతిని పొందుతారు, కానీ అది వస్తువులకు ఖరీదు చెల్లించిన వెంటనే పోతుంది. వాళ్ళలో శారీరక రోగలక్షణాలు కూడా కనిపిస్తుంటాయి అని గేబేర్ట్‌ అంటున్నారు. “వాళ్ళకు వణుకు వస్తుంది, చెమటపడుతుంది, ఉదర కండరాలు బాధాకరమైన విధంగా ముడుచుకోవడం జరుగుతుంది.” అందువల్లే, పేద ప్రజల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళూ సమాజంలో మంచిపేరు ఉన్నవాళ్ళూ ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఇలా వ్యసనానికి అలవాటుపడడానికి కారణాల్లో ‘ఒంటరితనం, ఆత్మ-గౌరవం కావలసినంత లేకపోవడం, ఒత్తిడి, పనిస్థలంలో సమస్యలూ’ కూడా ఉండవచ్చని చెప్పుకోబడుతుంది. ఈ అనియంత్రిత ప్రేరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు, ఏదైనా హాబీని చేసుకోవాలని గేబేర్ట్‌ సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సంబంధాలు ముఖ్యమని గేబేర్ట్‌ అంటున్నారు. “బయటివారి సహాయం లేకుండానే ఈ వ్యసనం బయటపడేది అప్పుల్లో కూరుకుపోయి, బ్యాంకు బ్యాలన్స్‌ అంతా అయిపోయినప్పుడే” అని ఆయన అంటున్నారు.

అపరిశుభ్రమైన ఉపరితలాలు

అలా ఉండే ఆస్కారం ఏమాత్రం లేదని అనిపించవచ్చుగానీ, మీ వంటగదిలో కట్టింగ్‌బోర్డు కన్నా మీ ఇంట్లో టాయిలెట్‌ సీటే ఎక్కువ శుభ్రంగా ఉండవచ్చు. 15 ఇండ్లలో కనిపించిన బ్యాక్టీరియాపై 30 వారాలు మోనిటరింగ్‌ చేసిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా పరిశోధకులు తేల్చిచెప్పింది అదే. కుళాయిలు, వాష్‌బేసిన్‌ ఉపరితలాలు, కట్టింగ్‌బోర్డ్‌లు, అంట్లు తోమిన తర్వాత వాటిని తుడవడానికి ఉపయోగించే గుడ్డలు, టాయిలెట్‌ సీట్లతో సహా ప్రతి ఇంట్లోను 14 చోట్ల నుండి శాంపిల్‌లను ఆ టీమ్‌ తీసుకుంది. ఇంతకీ ఏమని కనుక్కున్నారు? “టాయిలెట్‌ సీట్ల మీది కన్నా లక్షల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను వంటగదిలో ఉపయోగించే గుడ్డల్లోని తడిలో ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కట్టింగ్‌ బోర్డుల్లో బ్యాక్టీరియా మూడురెట్లు ఎక్కువగా కనిపించాయి” అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక అంటుంది. ఆ అధ్యయనానికి ప్రతినిధియైన పాట్‌ రసన్‌, “బ్యాక్టీరియా తేమగా ఉండే పరిస్థితులను ఇష్టపడుతుంది. టాయ్‌లెట్లు మరీ బొత్తిగా తేమ లేకుండా ఉంటాయి కనుక, బ్యాక్టీరియా అభివృద్ధికి అవి ఏ మాత్రం ప్రోత్సాహమివ్వవు” అనే థియరీని తయారు చేశారు అని ఆ పత్రిక నివేదిస్తుంది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు, వంటగదిలో ఉపయోగించే గుడ్డలను ప్రతివారం శుభ్రం చేయాలని రసన్‌ సిఫారసు చేస్తున్నారు. “సింక్‌ నిండా నీళ్ళు నింపి, దానిలో ఒక కప్‌ బ్లీచ్‌ను వేసి ఆ గుడ్డలను 10 నిమిషాలు నానబెట్టి ఉతికి ఆరవేయండి” అని ఆమె అంటున్నారు.

మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడం

అమెరికాలో 1986కూ 1994కూ మధ్య కాలంలో 80,000 మంది నర్సుల ఆహారపుటలవాట్లను బట్టి అధ్యయనం చేసి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడగల ప్రమాదాన్ని ఒక వ్యక్తి నివారించుకునేందుకు కొన్ని ద్రవాలు ఇతర ద్రవాలకన్నా ఎక్కువగా తోడ్పడవచ్చని పరిశోధకులు కనుగొన్నారని సైన్స్‌ న్యూస్‌ నివేదిస్తుంది. అధ్యయనం చేసిన 17 పానీయాల్లో, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడగల ప్రమాదాన్ని టీ 8 శాతం తగ్గించగా, మామూలు కాఫీ లేక కఫీన్‌ తీసివేయబడిన కాఫీ 9 శాతం తగ్గించింది. వైన్‌ను మితంగా తీసుకోవడం వల్ల ఒక వ్యక్తికి మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడగల ప్రమాదాన్ని 20 లేదా అంతకన్నా ఎక్కువ శాతం వరకూ తగ్గించుకునేందుకు సహాయపడింది. “ఆశ్చర్యకరంగా, 8 ఔన్స్‌లు (240 మి.లీ) పట్టే గ్లాసెడు ద్రాక్ష జ్యూస్‌ను ప్రతిరోజూ త్రాగడం మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని 44 శాతం పెంచింది” అని ఆ అధ్యయనం చూపించింది. “మరే పానీయం కూడా అంత ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదు” అని ఆ అధ్యయనం చూపించింది. “పానీయాల్లో కొంత మార్పులు చేసి సేవిస్తే కొంచెం తేడా ఉంటుందని” బోస్టన్‌లో మూత్రపిండశాస్త్రజ్ఞుడూ, మహామారుల శాస్త్రవేత్తా అయిన డాక్టర్‌ గ్యారీ కర్‌హన్‌ అన్నట్లు ఉటంకించబడింది. కానీ, అదీ మొత్తంమీద ట్రీట్‌మెంట్‌లో భాగంగా మాత్రమే.

హిమనదులు కరిగినప్పుడు వెలువడినవి ఆశ్చర్యకరంగా ఉన్నాయ్‌

ఉష్ణోగ్రత క్రమంగా పెరగడం వల్ల ఆల్ప్‌ పర్వతం మీది హిమనదులు కరిగిపోనారంభించడంతో, ఆశ్చర్యకరమైన విషయాలు వెలువడుతున్నాయి. 1991లో, ఆస్ట్రియా, ఇటలీల సరిహద్దుల్లో ఉన్న ప్రాచీనకాలం నాటి మంచుస్ఫటికం కరిగిపోవడం మొదలెట్టడంతో, చరిత్రవ్రాతకు పూర్వం జీవించిన ఒక వేటగాడి మృతదేహం మమ్మీగా భద్రపరచబడినది బయటపడింది. 1998 ఆగస్ట్‌లో, కనుగొనబడిన ఇతరములను—సైనికుల మృతదేహాలు, విస్ఫోటనం చెందని చేతి గ్రెనేడ్‌లు, శతఘ్ని షెల్లులు—తొలగించేందుకుగాను, ఉత్తర ఇటలీలోని అధికారులు కొన్ని నిర్దిష్ట పర్వత ప్రాంతాల్లోకి ఎవరూ రాకూడదని ప్రకటించారు. కనుగొనబడివన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధంనాటివే. ఇటలీ మరియు ఆస్ట్రియా సైన్యాల మధ్య భయంకర యుద్ధానికి రంగస్థలమైంది ఈ ప్రాంతమే. ఈ ప్రాంతంలో అవశేషించిన వాటినన్నింటినీ తొలగిస్తుండగా, “విస్ఫోటనం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంది” కనుక, “చాలా జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక నివాసులందరికీ, ముఖ్యంగా టూరిస్టులకూ, సరదాకు తిరగడానికి వచ్చేవాళ్ళకూ ఇవ్వబడింది” అనీ, ఆ మార్గాలను గురించి అధికారులను అడిగి కనుక్కోమనీ హెచ్చరిక ఇవ్వబడిందనీ కొరియర్‌ డెలా సెరా అనే ఇటలీ వార్తాపత్రిక చెప్పింది. ఆ ప్రాంతాల్లో ఉన్న వస్తువుల్లో చాలా మట్టుకు చాలా ప్రమాదకరమైనవి, వాటిని కనుగొనే ప్రజలు చనిపోవడమో, భయంకరంగా గాయాలు కలగడమో జరుగుతోంది.

పొగత్రాగే మూర్ఖమైన అలవాటు గురించి మరింత సమాచారం

“పొగత్రాగడం డెమెన్షీయను, ఆల్‌జీమెర్స్‌ రుగ్మత వృద్ధి అయ్యే ప్రమాదాన్ని రెండింతలకన్నా ఎక్కువగా చేస్తుంది” అని నెదర్‌ల్యాండ్స్‌లో ఇటీవల జరిగిన అధ్యయనం చెబుతుందని ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రైబ్యూన్‌ నివేదిస్తుంది. ఆల్‌జీమెర్స్‌ రుగ్మత ఎన్నడూ పొగత్రాగనివారికన్నా, పొగత్రాగేవారిలో వృద్ధి అయ్యే అవకాశం 2.3 రెట్లు ఉందని 55 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న 6,870 మంది వ్యక్తులపై చేసిన అధ్యయనం వెల్లడి చేసింది. పొగత్రాగడం మానేసినవారిలో ఈ రుగ్మత వచ్చే అవకాశం కొంచెమే ఎక్కువ ఉంది. కాలక్రమేణా మెదడు కణాలను నాశనం చేసే ఆల్‌జీమెర్స్‌ రుగ్మత అనేది “డెమెన్షీయా యొక్క అత్యంత సాధారణ రూపం.”

గూఢలిపి అర్థం చెప్పడాన్ని సవాలు చేస్తుంది

“ఇండూస్‌ ప్రజలు వ్రాసిన దానికి అర్థంచెప్పేవారి కోసం నోబుల్‌ ప్రైజ్‌ ఎదురుచూస్తోంది” అని ఇండియా టుడే పత్రిక పేర్కొంది. “ఇటలీకి చెందిన ఈట్రూస్కన్‌తోపాటు, అర్థం చెప్పాల్సి ఉన్న, కంచు యుగానికి చెందిన చివరి లిపి ఇది.” ఈ లిపులను వివరించగల్గేలా రెండు భాషల్లో ఉన్న ప్రాచీన కాలంనాటి వస్తువు ఏదీ ఇప్పటి వరకూ దొరక్కపోవడం ఒక కారణం. నెపోలియన్‌ మనుష్యులు చిత్రలిపిలోను, ఈజిప్ట్‌ లోని మామూలు లిపిలోను, గ్రీక్‌ లిపిలోను వ్రాయబడిన రోసెట్టా స్టోన్‌ను కనుగొన్న తర్వాత ఈజిప్టు చిత్రలిపులను అనువదించడం జరిగింది. సూమర్‌ యొక్క కీల లిపిని అనువదించేందుకు తనకు అవసరమైన సంకేతాలుగల బీసటూన్‌ శిలాశాసనాన్ని హెన్రీ రాలిన్‌సన్‌ కనుగొన్నాక ఆ లిపి అనువదించబడింది. ఇండూస్‌ ప్రజల వ్రాతల గురించి ఇప్పటి వరకూ ఖచ్చితంగా ఏమీ తెలియదు. వాళ్ళు కుడి నుండి ఎడమకు వ్రాసేవారనీ—గీతల ద్వారా అది సూచించబడింది—వాళ్ళ వ్రాతలు సంయుక్తాక్షరాల ఆధారంగా ఉండేవనీ తప్ప మరేమీ తెలియదు. ఇండూస్‌ ప్రజల లిపి దాదాపుగా చిహ్నాలతోనే కూర్చబడింది, దానిలో 419 చిహ్నాలు ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి