‘మానసిక ఆరోగ్య భవిష్యత్తు నిస్తేజంగా ఉంది’
“ఆరోగ్య సంరక్షణ సంబంధంగా అనేక విషయాల్లో అబ్బురపరచేంతటి వైద్య పురోగతులు జరిగినప్పటికీ, భూగోళవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సంబంధంగా నిస్తేజ భవిష్యత్తును మనం ఎదుర్కుంటున్నాం” అని ద కనేడియన్ సొసైటీ ఫొర్ ఇంటర్నాషనల్ హెల్త్వారి వార్తాలేఖయైన సినర్జీలోని ఒక శీర్షిక పేర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా, ప్రతి నలుగురులో ఒకరు మానసిక, ఔద్వేగిక, లేక ప్రవర్తనా సంబంధమైన రుగ్మతల చేత బాధపడుతున్నారు. హెల్త్వర్కర్ని సంప్రదించే ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరు విచారం చేత లేక ఆతురత వంటి సమస్యల చేత బాధపడుతున్నందువల్లే హెల్త్వర్కర్ని సంప్రదిస్తున్నారని ఒక అధ్యయనం సూచించింది. అలాంటివారి సంఖ్య పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
ఎందుకని? హార్వార్డ్ యూనివర్సిటీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోష్యల్ మెడిసిన్ జరిపిన అధ్యయనం ఏమని చెప్తుందంటే, “చాలా మంది చాలా వృద్ధాప్యం వరకూ జీవిస్తున్నారు” కనుకనే, క్లినికల్ డిప్రెషన్, స్కిజోఫ్రేనియా, డెమెన్షియావంటి రోగాలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ, రోగాలకు కారణం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు. ఆధునిక జీవనంలో ఒత్తిళ్ళు అధికం కావడము, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడము కూడా కారణమౌతున్నాయి.
ఈ విషాదకరమైన పరిస్థితిని ఎలా మార్చవచ్చు? ఆరోగ్య సంరక్షణ యొక్క అనేక కారకాల్లో, మానసిక ఆరోగ్యానికి మొదటి స్థానమివ్వాలి, ఎందుకంటే, “అది మానవుడి పరిస్థితి మెరుగుపర్చడంలో చివరిగా అభివృద్ధి సాధించవలసిన రంగాల్లో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.”