కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 5/8 పేజీ 31
  • ఊహించలేనటువంటి హింసా ఉపకరణాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఊహించలేనటువంటి హింసా ఉపకరణాలు
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • “చర్చివిరోధి” విచారణ మరియు మరణశిక్ష
    తేజరిల్లు!—1997
  • “ధర్మవిరోధికి” విరుద్ధమైన దేవుని తీర్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • కాథార్‌లు—వారు క్రైస్తవ హతసాక్షులైయుండిరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
తేజరిల్లు!—1998
g98 5/8 పేజీ 31

ఊహించలేనటువంటి హింసా ఉపకరణాలు

“బేడీలు,” “హింస,” “ఉరిశిక్ష” అనే పదాలు మీలో వణుకు పుట్టిస్తాయా? యూరప్‌లో (13వ మరియు 19వ శతాబ్దాల మధ్య కాలంలో) ఇన్‌క్విజిషన్‌కూ, మాంత్రికులన్న ఆరోపణపై జరిగిన విచారణకూ బాధితులైన వేలాది మంది విషయంలో అది వేదనకరమైన వాస్తవం. ఇక్కడ చిత్రంలో ఇవ్వబడిన ఉపకరణాలు ఆ కాలానికి చెందినవి. జర్మనీలో రైన్‌ నది ప్రక్కనున్న ర్యూడెస్‌హైమ్‌ పట్టణంలోని మ్యూజియానికి చెందినవి. అవి ఆ పీడితుల కష్టానుభవాన్ని గురించి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాయి.

విచారణ కోసం, మొనదేలిన ముళ్ళతోవున్న ఇన్‌క్విజిషన్‌ కుర్చీపై పాపం ఆ పీడితుడు నగ్నంగా కూర్చున్నప్పుడు మాటల్లో చెప్పలేనంత మానసిక వ్యధకు గురయ్యాడు. పీడితుని బాహువులూ, కాళ్ళూ, లేదా కీళ్ళు నీ స్క్రూస్‌ అనే ఉపకరణం ద్వారా చీల్చివేయబడడమో, నాశనం చేయబడడమో జరిగింది. అతని మాంసాన్ని ఖండం ఖండంగా చీల్చివేసేందుకు క్యాట్స్‌ పా అనే ఉపకరణం ఉపయోగించబడేది; శరీరంలోని ఏ భాగమూ విడిచిపెట్టబడేది కాదు. ముళ్ళ మెడపట్టీ పీడితుని మెడ, భుజాలు, దవడలోని అంతర్భాగాలు మృతమయ్యేలా చేసేది. అది నెమ్మదిగా రక్తం విషమయం కావడానికి చివరికి మరణానికీ దారితీసేది.

అభిప్రాయభేదంగల వ్యక్తులతో—ఎక్కువగా, నేరారోపణ చేయబడిన, హింసద్వారా “పాపసంకీర్తన” చేసేందుకు బలవంతం చేయబడిన సామాన్య ప్రజలతో—వ్యవహరించేందుకు రోమన్‌ క్యాథలిక్‌ చర్చి నియమించిన ఇన్‌క్విజిటర్లు ఈ ఉపకరణాలను, వీటిని పోలిన ఉపకరణాలను ఉపయోగించారు. నిజానికి, వాల్డెన్స్‌ అనే తెగ కూడా ఇమిడివున్న పోప్‌ సంబంధిత ఇన్‌క్విజిషన్‌ను నిర్వహించేటప్పుడు, హింసా ఉపకరణాలపై పవిత్ర జలాన్ని చిలకరించడం కూడా జరిగేది.

ఇన్‌క్విజిషన్‌ పేరట క్రైస్తవ మత సామ్రాజ్యం చాలా బరువైన అపరాధ భారాన్ని వహిస్తుంది. చరిత్రకారుడైన వాల్టర్‌ నిగ్‌ ఇలా వివరిస్తున్నాడు: “క్రైస్తవ మత సామ్రాజ్యం ఇన్‌క్విజిషన్‌లో చేసిన పాపాలనూ, మతం పేరట అది చేసిన సమస్త విధాలైన హింసనూ యథార్థంగా, సంపూర్తిగా—బాహాటంగా పూర్తి విశ్వాసంతో ఒప్పుకునేంతవరకూ ఇక ఏ ఆశీర్వాదాలను అనుభవించదు.”

[31వ పేజీలోని చిత్రం]

ఇన్‌క్విజిషన్‌ కుర్చీ

ముళ్ళ మెడపట్టీ

నీస్క్రూస్‌

క్యాట్స్‌పా

[క్రెడిట్‌ లైను]

అన్ని చిత్రాలూ: Mittelalterliches Foltermuseum Rüdesheim/Rhein

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి