మా పాఠకుల నుండి
వలసవెళ్ళడం “వలసవెళ్లడానికి ముందు తగులుబడి చూసుకోండి!” (జూన్ 8, 1997) అనే శీర్షికను నిజంగా చాలా మెచ్చుకుంటున్నాను. మీరు చెప్పిన విషయాల్లో చాలా మటుకు నేను అనుభవించినవే. ఆఫ్రికా నుండి యూరప్ వరకూ వలసవెళ్ళిన నేను, జాతి, భాష, వర్ణం, మరెక్కువగా నిర్హేతుకమైన ప్రతికూల అభిప్రాయం వంటివాటి చేదు అనుభవాలను ఎడతెగక ఎదుర్కుంటున్నాను. జనాదరణగల ప్రసార మాధ్యమాలు ఆఫ్రికావారి గురించీ, సాధారణంగా విదేశీయుల గురించి నీచమైన అభిప్రాయాన్ని కలిగించాయి.
పి. ఏ., జర్మనీ
వినోదం “వినోదానికి ఏమైంది?” (జూన్ 8, 1997) అనే శీర్షికకు కృతజ్ఞతలు. నాకు 12 ఏండ్లు. మా స్కూలు సెలవు దినాల్లో, నేను విపరీతంగా టీ.వీ. చూస్తూ కూర్చునేదాన్ని. వినోదాన్నిచ్చే ఇతర కార్యాలను చేయగలనని గ్రహించేందుకు ఈ శీర్షిక నాకు సహాయపడింది.
జె. ఎల్., ఇంగ్లండ్
సింగపూర్ “సింగపూర్—కాంతివిహీనమైన ఆసియా రత్నం” (జూలై 8, 1997) అనే శీర్షిక ఈ ప్రభుత్వం శాంతి కాముకులైన క్రైస్తవులతో ఎంత విభ్రాంతికరమైన విధంగా వ్యవహరించిందో బయలుపరచింది. అక్కడ ఉన్న అనేకమంది క్రైస్తవ స్త్రీ పురుషులు వ్యక్తిగతంగా నాకు తెలిసినవారే. వాళ్ళందరూ చాలా మంచివారు, ప్రేమపూర్వకమైనవారు. వాళ్ళు అంత పీడించబడుతున్నప్పటికీ యెహోవాను సేవిస్తున్నారన్నది నన్ను ప్రోత్సాహపరిచింది.
ఐ. ఓ., మలేషియా
కోపం “మీ కోపాన్ని ఎందుకు అదుపు చేసుకోవాలి?” (జూలై 8, 1997) అనే శీర్షికలో, షిమ్యోను, లేవీలను వాళ్ళ తండ్రి శపించాడు అని మీరంటున్నారు. యాకోబు శపించింది వాళ్ళ కోపాన్ని అని ఎక్కడో చదివినట్లు నాకు బాగా గుర్తు.
ఎస్. ఎల్., అమెరికా
ఈ అంశంలో మా పాఠకురాలు చెప్పింది నిజం. జూన్ 15, 1962 “కావలికోట” (ఆంగ్లం) ఈ విధంగా వివరించింది: “యాకోబు మరణించబోతుండగా, షిమ్యోనునూ, లేవీనీ శపించలేదు. ఆయన వాళ్ళ కోపాన్ని శపించాడు, ‘ఎందుకంటే అది క్రూరమైనది.’ ఆయన వారి క్రోధాన్ని శపించాడు, ‘ఎందుకంటే అది చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది.’”—సంపాదకుడు.
ఆహారం “మీ ఆహారపుటలవాట్లు—అవి మిమ్మల్ని చంపగలవా?” (జూలై 8, 1997) అనే శీర్షిక నా ప్రాణాన్ని కాపాడింది. దాన్ని చదివిన తర్వాత, ఆ శీర్షిక నా పరిస్థితినే సరిగ్గా వివరించినట్లుండగా, డాక్టర్‌ని పిలవమని నేను నా భార్యకు చెప్పాను. మా డాక్టర్ నన్ను పరీక్షించిన తర్వాత, మరుసటి ఉదయమే నాకు సర్జరీ చేసేందుకు షెడ్యూల్ వేశారు. ఆయన నన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. నేను ఆ రాత్రే చనిపోతానేమోనని ఆయన భయపడ్డారు. నేను ట్రిపుల్ బైపాస్ నుండి కోలుకుంటూ ఇప్పుడు ఇంట్లో ఉన్నాను.
ఎఫ్. ఎస్., అమెరికా
కొన్ని సార్లు నేనూ, నా భర్తా భోజనం చేసేటప్పుడు మమ్మల్ని మేము నియంత్రించుకోవడం కష్టంగా ఉండేది. నేను ఆహారపు అలవాట్లను గురించి వేరే శీర్షికలను కూడా చదివాను. కాని ఈ శీర్షిక పరంపర విషయాలను చాలా సరళమైన విధంగా, ఆచరణాత్మకమైన విధంగా చర్చించింది. మీ సలహాలను ఆచరణలో పెడితే మేము మంచి ఆరోగ్యంతో ఉండగలమని నాకు బాగా నమ్మకముంది.
వి. ఏ. బ్రెజీల్
“మీ ఆహారం—ఎందుకు పట్టించుకోవాలి” అనే శీర్షికల పరంపరకు కృతజ్ఞతలు. అమిత బరువు వల్ల కలిగే ప్రమాదాలేమిటో గ్రహించేందుకు నాకు సహాయపడింది. అందులో ఇవ్వబడిన సలహాలనన్నింటినీ నేను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాను. యెహోవా సహాయంతో నేను నా తిండిని అదుపు చేసుకోగలనని నాకు తెలుసు.
వి. వై. డి., లైబీరియా
తూనీగలు “నది ఒడ్డున రత్నాలు” (జూలై 8, 1997) అనే చాలా బాగా ఆస్వాదించగల శీర్షికకు కృతజ్ఞతలు. గాలిలో ఎగిరే కీటకాల్లో నేను బాగా ఇష్టపడే వాటిలో ఒకటైన తూనీగ గురించి అది చర్చించింది. నేను మా తోటలో పనిచేసేటప్పుడు, ఏదో ఒక తూనీగ సమీపంలోనే తిరుగుతూనో ఎక్కడో ఒక చోట వ్రాలో ఉంటుంది. అవి ఎందుకలా చేస్తాయి అని ఒక తోటమాలిని నేను అడిగినప్పుడు, దోమలు కూడా తూనీగకు ఆహారమేననీ, ఆ దోమలేమో మనుష్యులవైపుకు ఆకర్షించబడి ఉంటాయనీ ఆయన చెప్పాడు. కనుక నేను ఇప్పుడు వివిధ వన్నెల ఈ ప్రాణిని వ్యక్తిగత బాడీగార్డ్‌గా దృష్టిస్తున్నాను!
జె. ఎఫ్., అమెరికా