హార్ట్ సర్జన్—తేజరిల్లు!ను అభినందిస్తున్నారు
జనవరి 8, 1997 తేజరిల్లు!లో “గుండెపోటు—ఏమి చేయవచ్చు?” అనే శీర్షికల పరంపర ప్రచురించబడింది. జర్మనీలోని ప్రముఖ హార్ట్ ట్రాన్స్ప్లాన్ట్ సర్జన్లలో ఒకరైన, మరియు గొంతు, గుండె రక్తనాళాల విభాగం అధిపతియైన ప్రొఫెసర్ థామస్ స్టేగ్మాన్ ఈ శీర్షికలను చదివి, ఈ పత్రిక ప్రకాశకులకు ఈ క్రింది విధంగా వ్రాశాడు:
“హృద్రోగాల విషయమై, ముఖ్యంగా గుండెపోటు విషయమై మీరు వ్రాసిన నివేదికను ఎంతో ఆసక్తిగా చదివాను. ఒకవైపు హృద్రోగం గల ఒక్కో రోగి విషయమై ఎంతో అవగాహనను చూపిస్తున్న, మరో వైపు వైద్యసంబంధమైన వాస్తవాలను గురించిన సరైన వివరాలను తెలియజేస్తున్న గుండెపోట్లను గురించిన మీ విశదీకరణా, ఆ విషయమై మీరు వ్రాసిన సమాచారమూ చాలా బాగున్నాయని మీకు చెప్పేందుకు ఈ రంగంలో నిష్ణాతుడనైన నేను పురికొల్పబడుతున్నాను. మీరిచ్చిన విశదీకరణ మొత్తం మీద మంచి సంగ్రహాన్నిస్తూ, సరైన సమాచారాన్ని తెలియజేసింది. గుండెపోటు లక్షణాలను ముందుగా గుర్తించడానికి మీరు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం కూడా ప్రాముఖ్యమైనదే.
“మొత్తం మీద వైద్యశాస్త్రమూ, మొత్తం మీద సమాజమూ సమిష్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పాశ్చాత్య దేశాల్లో మరణాలకు అతి సాధారణమైన కారణం ధమనులు గట్టిపడడమే—ముఖ్యంగా గుండెపోటే. సరైన ఆధారంగల, వాస్తవాలతో కూడిన వివరణ ప్రజలకూ—ఈ రుగ్మతలకు గురికాగల రోగులకూ ఎంత ప్రాముఖ్యమో ప్రతిరోజూ, కరోనరీ ఆర్టరియోస్క్లిరోసిస్లోని గంభీరమైన మార్పులతో (గట్టిపడడం, సంకోచించడం, రక్తనాళాలు మూసుకుపోవడం) వ్యవహరించే, కార్డియక్ సర్జరీలోని వివిధ టెక్నిక్‌ల ద్వారా ఈ రుగ్మతలకు చికిత్సచేసే కార్డియక్ సర్జన్‌గా నాకు తెలుసు.
“మీ శీర్షిక సాధ్యమైనంత మంది ప్రజలకు లభ్యం కావాలనే ఆకాంక్షతో—ఈ అంశంపై మీరిచ్చిన వివరణకు సౌహార్ద్రతతో కూడిన నా అభినందనలనూ మీకు తెలియజేస్తున్నాను.”
మీరు తేజరిల్లు! క్రమంగా చదవాలని ఇష్టపడుతున్నట్లయితే, లేదామీతో ఉచిత బైబిలు పఠనాన్ని నిర్వహించేందుకు మిమ్మల్ని ఎవరైనా సందర్శించాలనుకుంటున్నట్లయితే, Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., Indiaకు లేదా 5వ పేజీలో ఇవ్వబడిన సరైన చిరునామాకు వ్రాయండి.