ఓ త్రాచు పామును కలిసేందుకు మీరు ఇష్టపడతారా?
ఇండియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
మరి, మీకిష్టమేనా? అనేకమంది పెద్దలు లేదు అని జవాబు చెప్పవచ్చు. కానీ ఓ పిల్లవాడు మాత్రం అలా చెప్పడు. త్రాచు పాములతో సహా పాముల భయం చంటి పిల్లల్లో లేక జంతువుల్లో సహజమైనది కాదు. నమ్మరాని సమాచారమూ వట్టి కథలూ, కట్టు కథలూ, మరియు తప్పుడు సిద్ధాంతాల వల్ల పాములంటే అయిష్టం కలుగవచ్చు.
ఓ త్రాచు పామును కలవమని మేము మిమ్మల్ని ఆహ్వానించామంటే అది అపాయంలేనంత దూరంనుండే సుమా! త్రాచు పాములు ఎంతో విషపూరితమైనవి, మరి మనం ఒక దాని దగ్గరకు వెళ్ళి కాటేయమంటూ చేయి చాచాలనుకోము. అటు త్రాచు పాము మనలను కలుసుకునేందుకు మనకొరకు ఎదురుచూస్తూ ఉండదు, మన రాక వినిపించగానే సురక్షితమైన స్థలానికి పరుగుతీస్తుంది. కనుక కేవలం ఈ ఆసక్తిదాయకమైన జీవిని గూర్చిన వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా దానిని కలిసినంత సంతృప్తిని మనం పొందుదాం.
త్రాచు పాములు సర్పాల ఉప విభాగానికీ చెందిన సరీసృపాలు మరియు ఎలపిడియ కుటుంబానికి చెందినవి, గాడివున్న కోరలుగల పాములకివ్వబడ్డ పేరే అది. సుమారు 12 రకాల త్రాచు పాములు ఆస్ట్రేలియా నుండి ఆసియా ఉష్ణమండలం వరకు మరియు ఆఫ్రికా నుండి అరేబియా మరియు సమశీతోష్ణ మండలాల వరకు విస్తరించివున్నాయి. త్రాచు పాములన్నింటి కంటే అతి భయంకరమైనది కింగ్ కోబ్రా, లేక హమడ్రియాడ్. మూడు నుండి ఐదు మీటర్లున్న ఇది ప్రపంచంలోకెల్లా అతి పొడవైన విష సర్పం. వర్షపాతం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని, దట్టంగా ఉండే అడవిలోని చిన్న మొక్కలనూ లేక బురదను ఇష్టపడే దీనిని దక్షిణ చైనా, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, మలేసియా, మ్యాన్మార్, మరియు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో కనుగొనవచ్చు. వయసు పెరిగే కొలది ముదురాకుపచ్చ రంగుకు మారే కారు నలుపు తోకతో దాని పడగపైని చిన్ని చిన్ని పొడలు గుంపులు గుంపులుగా ఉండడం, అది ఎంతో అందంగా కనిపించేలా చేస్తుంది.
త్రాచు పాము రకాల్లో ఇతరములు ఒకటి నుండి రెండు మీటర్ల పొడవుంటాయి. ఇండియాకు చెంది, ఇందు బహుళవ్యాప్తంగా వ్యాపించివున్న త్రాచు పాము పడగ మీద ద్విసులోచనాలకు పోలిన విశేషమైన గురుతులతో అది ఒక జత కళ్ళజోడులా ఉంటుంది. అది నల్లగా, ముదురు గోధుమ రంగులో ఉండవచ్చు, లేక కొద్దిగా పసుపుపచ్చగా ఉన్న తెలుపు రంగుల్లో వెడల్పుగానూ, ముదురుగానూ మెడ చుట్టూ పట్టి ఉండి, శరీరం నిండా తెల్లటి మరియు పసుపు రంగుల్లోని గీతలున్నవి ఉండవచ్చు. శ్రీలంక అలాగే తూర్పూ మరియు ఈశాన్య ఇండియాల్లో కనిపించే ఏక సులోచిత త్రాచు పాము చిన్నగా లేత రంగు కలిగివుండి, ఒక తెల్లని వలయంతో గుండ్రని పడగ ఉంటుంది, దానివల్లనే దానికా పేరువచ్చింది. వాయవ్య ఇండియాలోనూ మరియు పాకిస్తాన్‌లోనూ కారు నలుపున్న త్రాచు పామును మనం కనుగొంటాము. ఇతర వాటితోసహా ఆఫ్రికా నందు రింఘల్స్, లేక స్పిట్టింగ్ కోబ్రా మరియు ఈజిప్టియన్ కోబ్రా ఉన్నాయి. నల్లటి సన్నటి పడగ ఉన్న చివర చెప్పబడిన పాము, బహుశ క్లియోపాత్రా మరణానికి కారణమని భావించబడుతున్న కట్ల పాము కాబోలు.
పాములు తమదైన కస్తూరి వాసనవల్ల ఆకర్షించబడి, తమ స్వజాతి పాములతోనే జత కడతాయి. మరితర పాములకన్నా త్రాచు పాములే ఆడది మొగది తరచు కలిసి జీవిస్తూ కుటుంబంలో ఎక్కువ ఆసక్తిని కనపరుస్తాయి. గూళ్ళను తయారు చేసే చాలా తక్కువ పాముల్లో ఆడ కింగ్ కోబ్రా ఒకటి. అది రాలిన ఆకులను 30 సెంటీమీటర్ల ఎత్తున్న ఒక గుంటలోకి చేర్చి, అందులో 20 నుండి 50 గ్రుడ్లను పెడుతుంది. ఆ తర్వాత అది ఆ గుంట చుట్టూ తన శరీరాన్ని చుట్టి ఆహారం లేకుండ సుమారు రెండు నెలల పొదిగే సమయమంతా అక్కడే ఉంటుంది, మరి మొగది వాటిని రక్షించేందుకు సమీపంలోనే ఉంటుంది. ఇతర పాములు గూళ్ళను తయారు చేయకుండానే తమ గ్రుడ్లను కాపాడుకుంటూ వాటి దగ్గరే ఉంటాయి.
పిల్ల పాములు గ్రుడ్డుపెంకు పగులగొట్టుకొని బయటికి వచ్చేందుకు తమ తాలూకు ముక్కు కొసను ఉపయోగిస్తాయి, అవి కొంత కాలానికి ఊడిపోతాయి. బయటికి వచ్చిన తర్వాత, సంపూర్ణంగా తయారైన విష గ్రంథులూ కోరలతో అది పూర్తిగా స్వాతంత్ర్యంగా ఉంటుంది. అవి వాటి నాలుకలను తరచూ బయటకు చాచి, పరిసరాలను రుచించి, నోటి పై భాగంలో ఉన్న జేకబ్సన్స్ అని పిలువబడే అవయవానికి రసాయనిక సమాచారాన్ని పంపిస్తుంది. ఇది వాసన గ్రాహకానికి సంబంధం కల్గివుంది; రుచి, వాసనల కలయిక ద్వారా పాము దాని ఎరనూ, జతనూ కనుగొనేందుకు లేక తన భక్షకులనుండి తప్పించుకునేందుకు సహాయపడుతుంది.
చిన్న పాము త్వరగా పెరుగుతుంది అంతేకాకుండా కొంత కాలానికే మరీ బిగువైపోయిన తన కుబుసాన్ని విడుస్తుంది. త్రాచు పాము తన జీవిత కాలమంతా పెరుగుతూనే ఉంటుంది కనుక, అంటే 20 సంవత్సరాల వరకు ఈ అసాధారణ పద్ధతి క్రమంగా మరలా మరలా జరుగుతుంది. కుబుసాన్ని విడిచేందుకు ఒకటి లేక రెండు వారాలముందు పాము మైకంలో ఉంటుంది, దాని చర్మం మందగిస్తుంది దాని కళ్ళు పాల నీలంలోకి మారుతాయి. అప్పుడు అకస్మాత్తుగా దాని కళ్ళు స్పష్టమౌతాయి, మరి తన తలను రాయికేసి రుద్దడం ద్వారా తన నోటి వద్ద పాత చర్మాన్ని చీల్చుతుంది. ఇప్పుడది ఆ చర్మం ఊడిపోతుండగా అది దానిలో నుండి కళ్ళమీది పొరల దగ్గరనుండి తోకవరకు కుబుసం నుండి అక్షరాలా బయటికి వస్తుంది. ఇప్పుడు మెరుస్తూ క్రొత్తగా కనిపించే చురుకైన పాము తన మామూలు పని చేసేందుకు సిద్ధంగా ఉంటుంది.
గాలిలోని శీతోష్ణస్థితి త్రాచు పాములపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వాతావరణం చల్లబడుతుండగా తమ చురుకుదనాన్ని కోల్పోయి, నిద్రాణావస్థలోకి సహితం వెళ్ళిపోతాయి, మరలా శీతోష్ణస్థితి పెరిగినప్పుడు మాత్రమే చురుకౌతాయి. విపరీతమైన వేడి వల్ల అవి చనిపోవచ్చు. పాములను తినే కింగ్ కోబ్రా తప్ప, ఇవి ఎలుకలనూ, చుంచెలుకలనూ, కప్పలనూ, బల్లులనూ, పక్షులనూ, మరితర చిన్న జంతువులనూ ఆహారంగా తీసుకుంటాయి. ఎరను పట్టుకున్న తర్వాత, విషాన్ని ఎక్కించడం దాన్ని కదలనీయకుండా చేస్తుంది. త్రాచు పాము నమలలేదు కనుక దాన్ని మొత్తంగా మింగడం జరుగుతుంది. చర్మపు సాగే గుణమూ దవడ మెత్తదనమూ, త్రాచు పాము తలకన్నా రెండు లేక మూడు రెట్లు పెద్దదైన జంతువును మింగేందుకు సహాయపడుతుంది. నోటి నిండా ఆ ఎర ఉన్నప్పుడు, పాము గాలిగొట్టాన్ని అడ్డంగా ఉన్నదాని బయటకు పెట్టి, సరిగ్గా ఓ ఈతగాడు సోర్‌కెల్ను ఉపయోగించినట్లుగానే పెట్టి గాలి పీల్చుకుంటుంది. వెనుకకు తిరిగి, వరుసగానున్న పళ్ళు ఎరను పాము శరీరంలోకి నెడుతాయి. ఆహారాన్ని అరిగించుకునేందుకు ప్రశాంతంగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళి పడుకుంటుంది, బహుశ మరలా అది చాలా రోజుల వరకూ తినదు. శరీరంలో ఉన్న క్రొవ్వు పదార్థాన్ని వినియోగించుకుంటూ త్రాచు పాము ఆహారం లేకుండా కొన్ని నెలలవరకూ జీవించగలదు.
పాములు యుక్తిగా మసలుకుంటాయి. (మత్తయి 10:16 చూడండి.) ఓ రాతి క్రిందికి పోవడం గానీ లేక ఎలుక రంధ్రంలోని తన ఇంట్లోకి ప్రాకిపోవడం, లేక ఇక పరిశీలించకుండా ఉండేందుకు కదలకుండా ఉండడం వంటివి త్రాచుపాము తప్పించుకోవడంలో ఇమిడివున్నాయి. ఎదురైనప్పుడు, అది లేచి తన పడగ విప్పి, తన శత్రువును భయపెట్టేందుకు బుసలుకొడుతుంది. దాని చివరి ఉపాయం కాటువేయడమే.
పాముకాటు
ఆఫ్రికా మరియు ఆసియా పల్లె ప్రాంతాల్లో పాముకాటు తరచూ రిపోర్టు చేయబడదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరమూ విషసర్పాల కాటువలన సుమారు పది లక్షలమంది ప్రజలు చనిపోతున్నట్లు అగుపడుతోంది. అలాంటి మరణాల్లో ఇండియా రికార్డు స్థాపించింది, అంటే ప్రతి సంవత్సరం 10,000 మంది చనిపోతున్నారు. బహుశ వీరిలో ఎక్కువమంది ద్విసులోచిత త్రాచు పామువల్లనేకావచ్చు. త్రాచుపాము కాటులో ఇంచుమించు 10 శాతం కాట్లు ప్రాణాంతకం కావచ్చు.
త్రాచు పాము అనేక ఇతర పాములకంటే కూడా ఎంతో నెమ్మదైనది; దాని ముఖ్య శత్రువుల్లో ఒకటైన లాఘవంగా కదిలే ముంగిస దానిని సులభంగా ఓడిస్తుంది. పాము దగ్గరకు వెళ్ళి వంగి, తరచూ దాడిచేసే దాని కాటును తప్పించుకుంటూ ఈ ముంగిస పాముకు భయాన్ని బింకాన్ని కల్గిస్తుంది. పడగ వెనకాల దాడిచేస్తూ అది దాని మెడను విరుగగొడుతుంది. అనేక పాములు, అవి ఎంత దూరం వరకు కొట్టగలవన్నది తెలుసుకోవడాన్ని కష్టతరం చేస్తూ చుట్టుకుని కొడతాయి, అయితే త్రాచు పాము తన శరీరాన్ని నిటారుగా లేపి నేరుగా క్రిందికి కొడుతుంది. ఆ దూరాన్ని అంచనా వేయగలం, మరి ఇతర వాటికన్నా నెమ్మదైన కదలిక గల దాన్ని దూరం నుండి ఒక వ్యక్తి తప్పించుకోగలడు.
రింఘల్స్, నల్లమెడవున్న దక్షిణ ఆఫ్రికా త్రాచు పాము, మరియు ఈశాన్య ఇండియాలోని త్రాచు పాముల వంటి కొన్ని త్రాచు పాములు ఉమ్మడం ద్వారా స్వయం రక్షణ చేసుకుంటాయి. పైకి లేచి తన ఎరవైపు కోరలను గురిపెట్టి, ఎగవేసే గాలితో రెండు కంటే ఎక్కువ మీటర్ల దూరం వరకు రెండు సన్నటి విషపు తుంపరలను చిమ్ముతుంది. చర్మంపై ఇది ఏ హానీ కలుగజేయదు కాని కళ్ళల్లో పడితే మాత్రం అది తాత్కాలిక అంధత్వాన్ని కలిగిస్తుంది, దాన్ని త్వరగా కడిగివేయకపోయినట్లయితే శాశ్వత అంధత్వం కలుగవచ్చు. ఆశ్చర్యకరంగా, పాము కళ్ళనే గురిగా పెట్టుకుందన్నట్లుంటుంది.
ఒకవేళ త్రాచు పాము మిమ్మల్ని కాటేస్తే, అప్పుడు మీరేమి చెయ్యాలి? పాము దవడలో ఉన్న విషగ్రంథి, చిన్నదైన లొట్టగానున్న పాము దవడల ముందు అమర్చబడిన రెండు కోరలవల్ల అదమబడినప్పుడు విషంవెలుపలికి వస్తుంది. ఈ కోరలు చర్మంలోకి దిగి హైపోడర్మిక్ సిరంజీలా విషాన్ని ఎక్కిస్తాయి. పాము కాటుకు సరైన మందు, నాలుగు విష పాముల నుండి తీసిన విషం నుండి తయారు చేసిన విషవిరుగుడే. 20వ శతాబ్దారంభంలో విషవిరుగుడును ఉపయోగించిన దేశాల్లో ఇండియా మొదటిది. ఈ విషవిరుగుడు పొడి ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఐదు సంవత్సరాలవరకూ ప్రభావం కోల్పోకుండా ఉంటుంది; దానిలో నీటిని కలిపి ఇంజక్షను ఇస్తారు.
త్రాచు పాము కాటు గురుతులేమిటంటే, నొప్పి, వాపు, చూపు మందగించడం, చంచలితులవ్వడం, స్వరపేటిక పని చేయకపోవడం, మరియు ఊపిరి సరిగా ఆడకపోవడం. ఎక్కువ మోతాదులో విషమెక్కి, ఏ చికిత్స ఇవ్వబడకపోయినట్లయితే రెండు గంటల్లో మరణం సంభవిస్తుంది.
పామునాడించేవాడు
పామును ఆడించడం ఎంతో పురాతనమైన వినోదం. ఈ అలవాటు తూర్పునందు ఎక్కువగా ఉంది, పాశ్చాత్య సర్కస్‌లో దీనిని తమ ప్రదర్శనల్లో భాగంగా చేసుకున్నాయి. దాని అసాధారణమైన పడగ మరియు నాడీ వ్యవస్థ వల్ల ఈ ద్విసులోచన త్రాచు పామే ఎంతో విరివిగా ఉపయోగించబడుతోంది, అయితే చక్కగా కనిపించే రాయల్ స్నేక్ మరియు రెడ్ సాండ్ బోయాలు కూడ ఉపయోగించబడతాయి. పాములనాడించేవానిగా, నిపుణత గల ప్రదర్శకుడు తన నాదాన్ని వాయించినప్పుడు, త్రాచు పాము తన బుట్టలోనుండి బయటికి వచ్చి తన సాధారణమైన స్వయం రక్షిత స్థానంలో తన పడగను విప్పుతుంది. పాము అతని పై ఓ కన్నేసి ఉంచుతుంది గనుక పాములు ఆడించేవాని కదలికలు ఆ పాములో ప్రతిస్పందనను తెస్తాయి, దాడి చేసేందుకు అవి సదా సిద్ధంగా ఉంటాయి. తాముపయోగించే అనేక త్రాచు పాములకు కోరలు తీసివేయబడి ఉంటాయి, అయితే కొందరు విష పాములతోనే ప్రదర్శన చేసేందుకు ఎంచుకుంటారు.
ప్రాచీన ఇండియాలో పాములనాడించే సంచార వ్యక్తి, మత ఆలోచనలనూ, కట్టు కథలనూ చెప్పేవానిగా ఉండేవాడు, అది అతనికి పలువురి మెప్పును తెచ్చేది. ఫోటోలను తీయడంలో ఆసక్తిగల యాత్రికులు తరచూ వచ్చే హోటళ్ళ ముందు ప్రదర్శించడం నేడు మరింత లాభదాయకమైంది. పాములనాడించే కొందరు ఇళ్ళకు వెళ్ళి, ఇంటి వారితో వారి విశాలమైన తోటలో పాములుండే అవకాశముందని చెబుతారు. ఇంత డబ్బిస్తే వాటిని పట్టుకునేందుకు ఒప్పుకుంటాడు. అతను ఆ పొదల్లోకి వెళ్ళి మరి కొంత సమయం తర్వాత అంటే తన నాదస్వరం వినిపించే సమయంలో అతను ఒక సంచీ నిండా పాములను తీసుకొస్తాడు. అయితే ఇంటివారు అతనిపై నిఘా ఉంచడం లేక కనీసం తనతో తీసుకు వచ్చిన సంచీలో పాములనేమైనా తెచ్చాడేమో చూసుకునేంత జ్ఞానులైవుండాలి సుమా!
సర్ప ప్రదర్శన శాలలు జ్ఞానాన్నందిస్తాయి
పాము ప్రదర్శన శాలలు సరీసృపాల్లో ఆసక్తిని ప్రోత్సహిస్తాయి. అవి పరిశోధన చేసేందుకు సహాయపడతాయి, పాము కాటు నివారణ మరియు చికిత్సను గూర్చిన జ్ఞానాన్ని అందిస్తాయి మరియు మానవుని దురాశ అజ్ఞానాలనుండి పాములను రక్షించేందుకు పనిచేస్తాయి. త్రాచు పాములు వాటి అందమైన చర్మం కొరకు చంపబడుతున్నాయి ఆ చర్మాలతో బెల్టులూ, పర్సులూ, బూట్లూ, మరితర విలాస వస్తువులు తయారు చేయబడుతున్నాయి. ఒక్క సంవత్సరంలోనే ఇండియాలో ఒక కోటి పాములు చర్మ కర్మాగారాల కొరకు చంపబడ్డాయి. పాములు చంపబడతాయి ఆ తర్వాత వెంటనే వాటి తోలు తీసివేయబడుతుంది. చర్మానికి వన్నె తెచ్చేందుకు కాయగూరల రంగులు అద్దకంచేసి, గాజుతో మెరిసేలా పాలిష్ చేస్తారు. కొన్నిసార్లు దానిని మెరిసేలా, తేమను తట్టుకునేలా చేయడానికి లక్కరంగు జల్లుతారు. ఆ చర్మానికి రంగు తెప్పించేందుకు ఇండియాలో మొక్కలనుండి తీసే డైలను ఉపయోగిస్తారు, మరి అది మెరిసేందుకు మరియు నీటి వికర్షితమయ్యేందుకూ దానికి గ్లాస్ పాలిష్ చేయబడుతుంది మరి కొన్నిసార్లు లాక్క్ పాలిష్ దాని మీద స్ప్రే చేయబడుతుంది.
త్రాచు పాము విలువను మనం తక్కువ అంచనా వేయలేము. అది ఎలుకలనూ మరితర కీటకాదులనూ తిని ఎన్నో టన్నుల ధాన్యాన్ని కాపాడుతుంది. దాని విషం విషంవిరుగుడు మందునూ బాధానివారణినీ మరితర మందులనూ అందిస్తుంది. బొంబాయి నందున్న టాటా మెమోరియల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వారు, క్యాన్సర్ కణాలపై త్రాచు పాము విష ప్రభావం ఎంత ఉందో పరిశోధిస్తున్నారు.
త్రాచు పామును కలవడంలో మీరు ఆనందించారా? అందమైన, ఉపయుక్తమైన, మెలకువగల్గి తన్నుతాను రక్షించుకోగల్గినది. దాన్ని మరింత తెలుసుకోవడం జంతు రాజ్యంలో ఎంతగానో అపార్థం చేసుకోబడిన దానిని మరింత చక్కగా అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది.
[15వ పేజీలోని బాక్సు]
త్రాచు పాము ఆరాధన మరియు మూఢనమ్మకం
త్రాచు పాము ఆరాధన ప్రాచీన కాలం నుండి ఉంది. పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్వకాల్లో వెలికి తీసిన అతి పురాతనమైన నాగరికతలలో ఒకటైన మొహెంజొదారోనందలి లక్క ముద్రలపై త్రాచు పాము గురుతులు కనిపించాయి. సా.శ.పూ. మూడువేల సంవత్సరాల నుండి నేటి వరకూ ఇండియాలోని లక్షలాదిమంది త్రాచు పాములను మూఢ నమ్మకంతోనే పవిత్రముగా దృష్టిస్తూ వచ్చారు. ఆసక్తికరంగా, త్రాచు పాము కథల్లో అనేకం, నిజంగా జరిగిన చారిత్రాత్మక సంఘటనల చుట్టూ అల్లబడిన వికృతీకరించబడిన కట్టు కథలుగా గుర్తించవచ్చు.
విశ్వంలో వెలుగులేని ఒక సమయాన్ని గూర్చి ఓ సృష్టి “కథ” చెబుతుంది. ముదురు రంగులోని జగత్ జలాలనుండి మొదట విష్ణువు, తర్వాత ఆకాశం, భూమి, పాతాళం సృజించబడ్డాయి. మిగిలిన దానితో, శేషుడు (మిగిలినది) అనే ఓ పెద్ద పాము సృష్టించబడింది. శేషుడికి 5 నుండి 1,000 తలలున్నట్లు కట్టు కథలు చెబుతున్నాయి, మరి శేషుని అనేక తలల విప్పుకున్న పడగ నీడనిస్తూ చుట్టుకునున్న శేషునిపై శయనించిన విష్ణువును ప్రతిమలు చిత్రించాయి. శేషుడు ఆవలింత వల్ల భూకంపాలు కలుగుతాయని, మరి తన నోటినుండి నిప్పు లేక విషం యుగాంతములో ప్రపంచాన్ని నాశనం చేస్తుందని అనుకుంటారు.
హిందువుల పురాణాలు నాగులు అనే ఓ త్రాచు పాము తెగను చిత్రించింది, వారు నాగ లోకం లేదా పాతాళం అనే క్రింది ప్రపంచంలో ఉంటారు. వానర దేవుడైన హనుమంతుడు, “పరిపూర్ణ యుగం”లో మానవులందరూ శుద్ధులుగా ఉండేవారు ఒకే ఒక మతాన్ని కల్గివుండేవారు మరి దయ్యాలు గానీ నాగులు గానీ ఉండేవారు కాదని చెబుతాడు. సర్పాలు భూ సంపదకు రక్షకులయ్యాయి మరి అపారమైన జ్ఞానాన్ని మాయ శక్తులనూ కల్గివున్నాయి. కొన్నిసార్లు వాసుకి అని పిలువబడే శేషుణ్ణి, అమరత్వాన్నిచ్చే సుధయైన అమృతాన్ని పాల సముద్రం నుండి వెలికి తీసేందుకు దేవుళ్ళు ఉపయోగించారు. నాగులు పరిపాలించే క్రిందిలోకం ఎంతో కోరదగినదిగా చూపబడింది; యుద్ధంలో మరణించిన యోధులకు అక్కడ ఊహింపనలవిగాని సుఖాలు ప్రాప్తిస్తాయని వాగ్దానం చేయబడింది.
అయితే, పురాణాల్లోని త్రాచు పాములన్నీ దయలగలవికావు. ఒక “కథ” విష్ణు అవతారమైన కృష్ణుడు మరియు పైశాచిక, ప్రాణాంతక, మహా త్రాచు పామైన కాళీయుని మధ్య పోరాటాన్ని గూర్చి చెప్పింది. విజయుడైన కృష్ణుడు తన పాదాన్ని మహా సర్పం తలపై పెట్టి ఉన్నట్లుగా ప్రతిమలు కనపరుస్తున్నాయి.
నాగుల రాణైన మానస, లేక దుర్గమ్మను, తమ పిల్లలను పాము కాటునుండి రక్షించడం కొరకు స్త్రీలు ఆరాధిస్తారు. నాగపంచమి నాడు పాముల భక్తులు, త్రాచు పాము ప్రతిమలపైన మరియు పాము పుట్టల్లోనూ పాలనూ కొన్నిసార్లు రక్తాన్ని సహితం పోస్తారు. మగ శిశువును గర్భం ధరించాలని ఇష్టపడుతున్న స్త్రీలు రాతి లేక వెండి త్రాచు పాము ప్రతిమలను ఆరాధిస్తారు మరియు దేవాలయాల్లో అర్పణలను అర్పించేవారు.
సినిమాల్లో త్రాచు పాములు
ఇండియాలోని సినిమా కథల్లో త్రాచు పాము పురాణం ఎంతో ప్రఖ్యాతి గాంచింది—ఇవి 1928 నుండి 40 కన్నా ఎక్కువ తయారు చేయబడ్డాయి. సాధారణంగా పాములు మంచిని కాపాడేవిగానూ, తన భక్తుల సహాయకునిగానూ దుష్టుల సంహారకునిగానూ చిత్రించబడుతుంది. మానవ రూపం దాల్చే శక్తిగలవనబడే ఇచ్ఛాదరి త్రాచు పాముల కథ ప్రఖ్యాతమైనది. వాటికి యథార్థమైన ఒక జత ఉంటుందట. దాని జత చంపబడినట్లయితే, చనిపోయిన పాము కళ్ళలో హంతకుని ప్రతిమను చూడగల్గుతుందట, మరి అది పగతీర్చుకునేందుకు బయలుదేరుతుంది. అది అనేక సినిమాలకు ఆధారమౌతుంది. కథకు ప్రాముఖ్యత పాము నృత్యం; పాములనాడించే వ్యక్తి వాయించే సంగీతంలాంటి దానితో నర్తకులు పాము కదలికలనూ అనుకరిస్తారు, నేలమీద మెలికెలు తిరగడం కూడా చేస్తారు.
శక్తి అనే డాక్యుమెంటరీ సినిమా, ఇండియాలోని రాజస్థానునందలి పండుగ సమయంలో తీయబడింది. అక్కడ ప్రతి ఆగస్టు నెలలోనూ పాము ఆరాధికులు ఆ ఎడారిలో వేవేలకొలదిగా కలుసుకుంటారు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించిపోతూ ఎండ మండుతుండగా, వాళ్లు తమను తాము ఇనుప కడ్డీలతో కొట్టుకుంటూ, రెండు కిలోమీటర్ల దూరం కాలుతున్న ఇసుక మీద తమ పొట్టలపై పాకుతూ సర్ప దేవుడైన గోఘా దగ్గరికి వెళతారు. సా.శ. పదవ శతాబ్దంలో గోఘా అనే ఓ చారిత్రాత్మక రాజు శత్రువులను పాములు అధికంగా ఉన్న ప్రాంతానికి నడిపించి మహమ్మదీయ ఆక్రమణదారులనుండి తన ప్రజలను కాపాడాడుట, మరి అక్కడ ఆ సైన్యం పాముగాట్లతో చంపబడింది.
[16వ పేజీలోని బాక్సు]
త్రాచు పాము వల్ల కాపాడబడ్డారు
ఇండియాలోని సాస్తూర్ గ్రామంలోని రెండు కుటుంబాలు ఓ త్రాచు పాముకు కృతజ్ఞులైవుండేందుకు కారణముంది. సెప్టెంబరు 30 నాడు ఉదయం 3:50కి, తమ ఇంట్లోనుండి బయటికి ప్రాకే త్రాచు పాము పెద్దగా బుసకొట్టిన శబ్దంతో వాళ్ళు మేల్కున్నారు. దాన్ని చంపేందుకు వాళ్ళు దాని వెనకాలే పొలాలవరకూ వెళ్ళారు. ఉదయం 4:00 గంటలకు మధ్య ఇండియాలో సంభవించిన భూకంపం ఇంచుమించు అందరినీ పొట్టనబెట్టుకుంటూ వారి గ్రామాన్ని నేలమట్టం చేసింది. రెండు కుటుంబాలవారు బ్రతికారు—ముందే హెచ్చరించే త్రాచు పాములో ఉన్న విధానానికి కృతజ్ఞతలు!
[12,13వ పేజీలోని చిత్రాలు]
ఆసియా త్రాచు పాముల ముందు భాగమూ వెనుక భాగము
చిన్న ఫోటో: ఓ వెచ్చని రాతిపై ఎండకాచుకుంటూ ఓ నల్ల త్రాచు పాము తన పడగను విప్పుతుంది
[క్రెడిట్ లైను]
Pictures on pages 12, to 16: A. N. Jagannatha Rao, Trustee, Madras Snake Park Trust
[15వ పేజీలోని చిత్రాలు]
నల్ల త్రాచు పాము ముందు భాగమూ వెనుక భాగము