నిరుద్యోగం నుండి స్వాతంత్ర్యం ఎప్పుడు మరియు ఎలా?
తన సృష్టికర్తలానే మానవుడు పనిలో ఆనందాన్ని పొందగలడు, అది “దేవుడిచ్చు బహుమాన”మని తగినరీతిగానే నిర్వచింపబడింది. (ప్రసంగి 3:12, 13; యోహాను 5:17) ఆసక్తికరమైన పని మనకు సంతోషాన్ని కలుగజేసి, మనం ఉపయోగకరమైనవారిగా, అవసరమైనవారిగా భావించేలా చేస్తుంది. తమకు తమ పనిలో ఎంత తక్కువ ఆనందం ఉన్నప్పటికీ ఎవ్వరూ తమ పనిని కోల్పోవాలని ఇష్టపడరు. జీతపు ఉద్యోగం కచ్చితంగా వేతనం లభించేలా చూడడమేగాక, అది ఒకరి జీవితానికి క్రమాన్ని, సంకల్పాన్ని, గుర్తింపును ఇస్తుంది. సాధారణంగా, “నిరుద్యోగులకు ఉద్యోగం కంటే ఎక్కువగా మరింకేది అవసరంలేక”పోవడం ఆశ్చర్యమేమికాదు.
ఉద్యోగాన్వేషణలో
మనం ఇప్పటికే గమనించినట్లుగా, కార్మిక విపణిలో పరిస్థితి ఎంతో సంక్లిష్టంగా ఉంది. ఫలితంగా, ఉద్యోగం కొరకు ఎదురుచూసే అనేక విలువైన పద్ధతులు ఉన్నాయి. అందుబాటులోవున్న ప్రభుత్వ నిరుద్యోగ ప్రయోజనాలను పొందగలవారెవరైనా వాటి నుండి ప్రయోజనం పొందవచ్చు; అన్వయింపబడగల చోట, నిరుద్యోగ కార్యాలయాలలో తమ పేరును నమోదు చేసుకొని అందజేయబడే సేవలను ఉపయోగించుకోవచ్చు. కొందరు తమ స్వంత పనులను సృష్టించుకోవడం ద్వారా ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. కాని జాగ్రత్త అవసరం. తరచూ, స్వయం ఉపాధి సంపాదించుకొనేవారు ఆరంభంలో అధిక ఖర్చులు భరించవలసి ఉంటుంది, అదంత సులభం కాకపోవచ్చు. కోశసంబంధ మరియు పన్ను చట్టాల గురించి తెలుసుకుని, గౌరవించడం కూడా అవసరం, కొన్ని దేశాల్లో ఇది ఏమంత సులభమైన పనికాదు!—రోమీయులు 13:1-7; ఎఫెసీయులు 4:28.
ఉద్యోగం సంపాదించుకోవడానికి కొందరు ఒక పద్ధతి ప్రకారం పట్టుదలతో, అంకిత భావంతో ఉద్యోగ సంపాదననే ఒక పనిగా చేసుకున్నారు. ఇతరులు సిబ్బంది కొరకు చూస్తున్న కంపెనీలకు వ్రాసారు, లేక ఉద్యోగ వినతి ప్రకటనలను ఉచితంగా ముద్రించే కొన్ని స్థానిక వార్తా పత్రికలలో ప్రకటనలు వేయించారు. యౌవనస్థులకు పెద్దవారికి ఒకే విధంగా, తేజరిల్లు! తరచూ ఈ అంశంపై ప్రయోజనకరమైన, ఆచరణయోగ్యమైన ఉపదేశాన్నిచ్చింది.a—11వ పేజీలోని బాక్సులను చూడండి.
మీరు పరిస్థితులకు అనుకూలంగా మారేలా ఉండాలి—మీరు ఇష్టపడనవసరంలేని ఉద్యోగాలతో సహా అన్ని రకాలైన పనులను చేయడానికి సుముఖత కలిగివుండాలి. ఉద్యోగ ఇంటర్వ్యూలలో అడిగే మొదటి విషయాల్లో, మునుపటి పని అనుభవం మరియు పని లేకుండావున్న కాలనిడివి చేరి ఉంటాయని నిపుణులు చెబుతారు. ఎక్కువ కాలం పని లేకుండా ఉండడాన్ని భవిష్యత్ యజమాని ప్రతికూల విషయంగా పరిగణిస్తాడు.
నైపుణ్యాలను సంపాదించుకుంటూ పాఠశాలలో తన సమయాన్ని యుక్తిగా వెచ్చించిన వ్యక్తికి మొదటి ఉద్యోగాన్ని కనుగొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. “నిరుద్యోగం, ప్రాముఖ్యంగా నైపుణ్యాలులేని పనివారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని” ఆర్థిక శాస్త్రాల ఉపాధ్యాయుడైన ఆల్బెర్టో మాయొకీ చెబుతున్నాడు.
భావోద్వేగ మద్దతు యొక్క ప్రాముఖ్యత
ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, అనుకూలమైన దృక్పథం కలిగి ఉండడం. దీని వలన ఒక ఉద్యోగాన్ని పొందడం లేక పొందలేక పోవడం అంతటి తేడా ఉండగలదు. ఇతరుల నుండి తమను తాము దూరం చేసుకోవడం లేక ఉదాసీనతలో పడిపోవడం వంటి వాటిని నిరోధించడానికి వారికి సహాయపడే భావోద్రేక మద్దతును నిరుద్యోగులు ఎంతగానో మెచ్చుకుంటారు. తమ ఉద్యోగాలను కోల్పోని ఇతరులతో తమను పోల్చుకోవడం ద్వారా వచ్చే స్వయం గౌరవ లోపాన్ని అధిగమించడానికి కూడా అది దోహదపడుతుంది.
తక్కువ డబ్బుతో సరిపెట్టుకోవడం అంత సులభం కాకపోవచ్చు. “నేను కలత చెంది ఉండడం మూలంగా, నాకు అందుబాటులో ఉన్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడం కష్టమైపోయింది” అని స్టిఫానో చెబుతున్నాడు. “పరిస్థితి నన్ను ఎంతగా కలవరపర్చిందంటే, నేను నా ప్రియమైన స్నేహితులు కొందరిలో కూడా లోపాలెన్నడం మొదలెట్టాను” అని ఫ్రాన్సెస్కో గుర్తు చేసుకుంటున్నాడు. ఇక్కడే కుటుంబ మద్దతు అవసరమౌతుంది. డబ్బు కొరత వలన, జీవన స్థితిగతులను తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులందరూ పరిస్థితులకు అనుకూలంగా మారవలసి ఉంటుంది. ఒకే కంపెనీ కొరకు 23 సంవత్సరాలపాటు పనిచేసి, 43 ఏళ్ల వయస్సులో ఉద్యోగం నుండి తొలగింపబడిన ఫ్రాంకో, “నేను ఉద్యోగంలో నుండి తొలగింపబడినప్పటి నుండి, నా భార్య అనుకూల దృక్పథం కలిగివుండి, గొప్ప ప్రోత్సాహానికి మూలంగా ఉంది” అని చెబుతున్నాడు. తన భార్య “కొనుగోలు విషయంలో చూపించిన గొప్ప కుశలతను” బట్టి అర్మండో ఆమె ఎడల కృతజ్ఞత కలిగివున్నాడు.—సామెతలు 31:10-31; మత్తయి 6:19–22; యోహాను 6:12; 1 తిమోతి 6:8-10.
అనుకూల దృక్పథం కలిగివుండి, మరింత ప్రాముఖ్యమైన విలువలను మరచిపోకుండా ఉండడానికి బైబిలు సూత్రాలు మనకు సహాయం చేస్తాయి. తేజరిల్లు! ఇంటర్వ్యూ చేసిన, పైన ప్రస్తావించబడినవారు బైబిలు నుండి ఓదార్పుకరమైన నిశ్చయతను పొందారు. ఇది, వారు దేవునికి సన్నిహితమైనట్లు భావించేలా చేసింది. (కీర్తన 34:10; 37:25; 55:22; ఫిలిప్పీయులు 4:6, 7) యెహోవా దేవునితో సన్నిహిత సంబంధం కలిగివుండడం అత్యంత ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఆయనిలా వాగ్దానం చేస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.”—హెబ్రీయులు 13:5.
ఒక వ్యక్తి నిరుద్యోగి అయినా కాకపోయినా, ప్రతి ఒక్కరు అనుదిన జీవనం కొరకు ఉపయోగకరమైన లక్షణాలను అలవర్చుకోవడాన్ని దేవుని వాక్యం ప్రోత్సహిస్తుంది. కొన్నిసార్లు యెహోవాసాక్షుల కొరకు వెదకి, యథార్థవంతులని వారిని మెచ్చుకోవడం కాకతాళీయమేమి కాదు. సోమరులుగా కాదుగాని కష్టపడేవారిగా, విశ్వసనీయులుగా ఉండమని బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని వారు అనుసరిస్తారు.—సామెతలు 13:4; 22:29; 1 థెస్సలొనీకయులు 4:10-12; 2 థెస్సలొనీకయులు 3:10-12.
నిరుద్యోగ పిశాచి నుండి స్వాతంత్ర్యం
పని కొరతకు ఒక మూలకారణం ఉంది—మానవ స్వార్థం మరియు దురాశ. బైబిలు చెబుతున్నట్లుగా, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.
ఇప్పుడు దాని “అంత్యదినములలో” ఉన్న మానవ అధికార నిర్మూలనతో నిరుద్యోగ సమస్యలు—మరితర సమస్యలు కూడా—పరిష్కరింపబడతాయి. (2 తిమోతి 3:1-3) నిజంగా క్రొత్తదై ఉండే ప్రపంచ అవసరత ఉంది. అవును, దురాశ ఇక ఎంత మాత్రం ఉండని, మంచి పరిపాలన క్రింద నీతియుక్తమైన మానవ సమాజం జీవించి పనిచేయగల ప్రపంచం కావాలి. (1 కొరింథీయులు 6:9, 10; 2 పేతురు 3:13) అందుకే, దేవుని రాజ్యం రావాలని ఆయన చిత్తం భూమిపై నెరవేరాలని ప్రార్థించమని యేసు ప్రజలకు బోధించాడు.—మత్తయి 6:10.
మానవజాతి యొక్క కొన్ని ప్రధాన సమస్యల నిర్మూలనను ప్రవచనాత్మకంగా వివరిస్తూ, దేవుని వాక్యం ఆ రాజ్య ప్రభావాలను ఇలా ఉదాహరిస్తోంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు; ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. . . . నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు.” (యెషయా 65:21-23) నిరుద్యోగ పిశాచి ఇక ఎన్నటికీ ఉండకుండా పోతుంది. దేవుని పరిష్కారం గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే, దయచేసి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను కలవండి.
[అధస్సూచి]
a తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబరు 22, 1994 సంచికలోని 16–18 పేజీలను; ఆగస్టు 8, 1991 సంచికలోని 6–10 పేజీలను; జనవరి 22, 1983 సంచికలోని 17–19 పేజీలను; జూన్ 8, 1982 సంచికలోని 3–8 పేజీలను చూడండి.
[11వ పేజీలోని బాక్సు]
గృహంలోనే పనిని కల్పించుకోవడం
• బేబి సిట్టింగ్, పిల్లల సంరక్షణ
• ఇంట్లో పెంచిన కూరగాయలు లేక పువ్వులు అమ్మడం
• కుట్టడం, ఆల్టరింగ్, బట్టలు బాగుచేయడం
• ఉత్పాదకుల కొరకు చిన్న చిన్న విడిభాగాలు తయారుచేయడం
• బేకరీ పని చేయడం, వంటలు చేయడం
• పరుపులు కుట్టడం, అల్లికలు, వూలు అల్లడం, లేసులు అల్లడం, కుమ్మరిపని, ఇతర చేతి పనులు
• గృహోపకరణములకు మెత్తలు చేయడం
• జమాఖర్చు లెక్కలు వ్రాయడం, టైపు చేయడం, గృహ కంప్యూటర్ సేవలు
• టెలిఫోను సమాధానాలిచ్చే సేవ
• మంగలి పని
• పూటకూళ్ల ఇల్లు నడపడం
• ప్రకటనలు చేసేవారికి చిరునామాలు వ్రాసి, కవర్లు నింపడం
• కార్లను కడగడం, మైనము పూయడం (వినియోగదార్లు కార్లను మీ ఇంటి వద్దకే తెస్తారు)
• పెంపుడు జంతువులను శుభ్రం చేయడం, వ్యాయామం చేయించడం
• తాళాలు బాగు చేయడం, తాళం చెవులను తయారు చేయడం (ఇంటివద్ద కర్మాగారం)
• వీటికి ప్రకటనలు వారాంత వార్తాపత్రికల్లోని కొనుగోలు వార్తల్లో లేక దుకాణాల నోటీసు బోర్డులపై ఉచితంగా లేక తక్కువ ఖరీదుకు చేయబడతాయి
[11వ పేజీలోని బాక్సు]
ఇంటి వెలుపల పని కల్పించుకోవడం
• హౌస్ సిట్టింగ్ (ప్రజలు సెలవుపై వెళ్లినప్పుడు వాళ్ల ఇంటిని చూసుకోవాలని ఇష్టపడతారు)
• శుభ్రం చేయడం: దుకాణాలను కార్యాలయాలను నిర్మాణ పని పూర్తి అయిన తర్వాత, అగ్ని ప్రమాదం తర్వాత, ప్రజలు వేరే ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఇళ్లను మరియు అపార్ట్మెంట్లను; ఇంటిపని (ఇతరుల ఇళ్లలో); వ్యాపార మరియు గృహ సంబంధ కిటికీలను శుభ్రం చేయడం
• బాగు చేయడం: అన్ని రకాల పరికరాలను (బాగు చేయడానికి సంబంధించి సుళువుగా అనుసరించదగిన పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉంటాయి)
• అందరికీ అందుబాటులో ఉండే ఉద్యోగాలు: ఇళ్ల గోడలను సరిచేయడం; కాబినెట్లు, తలుపులు, తలవాకిలి వసారాలు నిర్మించడం; రంగులు వేయడం; ఫెన్సింగ్; పైకప్పు వేయడం
• పొలం పని: పంట పొలాల నాట్లు, కోత పని, పళ్లు కోయడం
• కార్యాలయాలు, బ్యాంకులు, షాపింగ్ స్థలాల్లో, ప్రాంగణాల్లో, నడవాలలో లోపలి భాగమందు మొక్కల ఏర్పాటు, వాటి పోషణ
• ఆస్తి నిర్వహణ: కాపలాదారులు, అపార్ట్మెంట్ల పర్యవేక్షకుని పని (కొన్నిసార్లు వాటిలో ఉచిత వసతి గృహాలు చేరివుంటాయి)
• భీమా, స్థిరాస్తి
• తివాచీని అమర్చడం, శుభ్రం చేయడం
• వార్తా పత్రికల రూట్లు (పెద్దవారు మరియు పిల్లలు), ఇతర డెలివరీ సేవలు: ప్రకటనలు, మున్సిపాలిటీలకు బిల్లులు
• రవాణా, నిల్వ
• మొక్కల ఏర్పాటు, చెట్లను కత్తిరించడం, తోట గురించి శ్రద్ధ వహించడం, కట్టెలు కొట్టడం
• స్కూలు బస్సు నడపడం
• ఛాయాచిత్రాలు తీయడం (చిత్తరువులు, బహిరంగ సంఘటనలు)
• జాలరులకు ఎర సంపాదించి పెట్టడం
• పని మార్చుకోవడం: విద్యుత్ సంబంధ పని బదులు కార్లు బాగు చేయడం, ప్లమింగ్ బదులు కుట్టుపని చేయడం, వగైరా.
[10వ పేజీలోని చిత్రం]
“నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”—యెషయా 65:22