కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 5/8 పేజీ 31
  • అసాధారణమైన రుచిగల పీత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అసాధారణమైన రుచిగల పీత
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో ఒక కాయ
    తేజరిల్లు!—2003
  • “మానవునికి అత్యంత ఉపయోగకరమైన చెట్టు”
    తేజరిల్లు!—1994
  • పాఠం 6
    బైబిలు పాఠాలు నేర్చుకుందాం
తేజరిల్లు!—1995
g95 5/8 పేజీ 31

అసాధారణమైన రుచిగల పీత

సాలమన్‌ దీవులలోని తేజరిల్లు! విలేఖరి చెప్పినది

కొబ్బరి పీత—విచిత్రంగా అనిపిస్తుందా?a అది సాలమన్‌ దీవులలో ఒక భాగమైన న్యూ జార్జియా దీవులతో సహా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తుంది.

“కొబ్బరి పీతలా? అవును, అవి ఇక్కడ ఉన్నాయి, కాని వాటి కొరకు మీరు రాత్రిలోనే వెళ్లాల్సి ఉంటుంది” అని స్థానిక ప్రజలు వివరిస్తారు. ఈ నిశాచర పీతలు పగటి సమయాన్ని దట్టమైన అడవిలో ఉండే పొదలు, గుబురుల్లోవున్న కుళ్లిపోయిన చెట్ల తొర్రలలో గడుపుతాయి. అవి రాత్రి సమయంలో బయటికి వచ్చి కొబ్బరి కాయలను తింటాయి, అవి తమ శక్తివంతమైన డెక్కలతో వాటి నుండి పీచును తీసివేసుకొంటాయి, కాని అవి రకరకాల మెత్తని ఆకు కూరలను కూడా తింటాయి. ఈ ఆసక్తికరమైన జీవిని చూసేందుకు, ఒకరు పడిపోయిన చెట్ల యొక్క కుళ్లిపోయిన కాండములలోని కమిలిపోయిన గుంటల ముందు కొబ్బరిపీచు పడివున్న గుర్తుల కొరకు చూడాలి.

జూన్‌, జూలై నెలల్లో, పీతలు నేలలోకి చొచ్చుకువెళ్లి, అక్కడ తమ పై పొరను విసర్జించిన తర్వాత బయటికి రావడానికి ముందు సురక్షితమైన క్రొత్త పొర పూర్తిగా పెంచుకుంటాయని ద్వీపవాసులు వివరిస్తారు. కొన్ని కొబ్బరి పీతలు 50 సంవత్సరాల వరకు జీవిస్తాయి గనుక, అవి చేరుకోగల పెద్ద పరిమాణాలను ఒకరు అర్థం చేసుకోవచ్చు. నేను గమనిస్తుండగా, ఒకటి దాని రంధ్రంలో నుండి బయటికి వచ్చింది, దాని కాలు కొలత 50 సెంటీ మీటర్ల వరకు ఉంది.b

విచారకరంగా, నేలలోని సొరంగాల భద్రతవలె కన్పించే వాటి రంధ్రం యొక్క మొదలును సూచించే భూమిలోని గుండ్రని పల్లాన్ని పసిగట్టగల వేటగాని నుండి ఆ రంధ్రం వాటికి రక్షణ కలిగించలేదు. త్వరలోనే రక్షణలేని ఈ జీవి బయటికి తీయబడి, భోజనం కొరకు సిద్ధం చేయబడుతుంది. ఆసియాలోని భోజనశాలలు ఈ పీతకు, ప్రాముఖ్యంగా దాని వెనుక భాగంలో ఉండే మృదువైన, మెత్తని, గుండ్రని మాంసానికి ఎక్కువ విలువిస్తాయి.

కాబట్టి ఇక్కడ సాలమన్‌ దీవుల్లో, కొబ్బరి పీత నిర్మూలించబడగల సాధ్యతపై నిజంగా శ్రద్ధ చూపించవలసినదే. గ్రుడ్లు పెట్టే ఆడ పీతల సంఖ్యపై, ఎగుమతి చేయబడే పీత పరిమాణంపై మత్స్య విభాగం ఆ ఆంక్షలు విధిస్తున్నది. అక్కడి నుండి సహజ స్థలాలకు పంపగలిగేలా పీతల కొరకు ఫారమ్‌లను నెలకొల్పాలని కొందరు సలహా ఇచ్చారు. కాని వాటి గర్భధారణ అలవాట్ల గురించి తగినంత తెలియదు గనుక, ఎంతో పరిశోధన అవసరం కావచ్చు.

కొబ్బరి పీత సంఖ్య తగ్గిపోవడమనే విషయం, సమతూకంగల పర్యావరణాన్ని స్థాపించే ప్రపంచ విధానం కొరకైన అవసరతను మరింత నొక్కి చెబుతుంది. దాని క్రింద, సృష్టికర్త యొక్క భూజీవుల అద్భుతమైన వర్ణపటంలోని ప్రతి ఒక్కటి కీర్తన 148:5-10 నందలి ప్రవచనాన్ని నెరవేర్చడంలో తమ పాత్రను నిర్వహించవచ్చు: “యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక. . . . నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, . . . యెహోవాను స్తుతించుడి.”

[అధస్సూచీలు]

a దొంగ పీత అని కూడా పిలువబడుతుంది.

b పెద్ద కొబ్బరి పీతలు తల నుండి తోక వరకు దాదాపు ఒక మీటరు ఉండి, 17 కిలోగ్రాముల బరువుంటాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి