ఆరోగ్యకరమైన సమాజాన్ని వృద్ధిచేయుట
న్యూ ఆఫ్రికన్ పత్రిక యొక్క డిప్యూటి ఎడిటర్ ఇటీవల ఈ విధంగా వ్రాశాడు: “ఆఫ్రికాలోని ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ ఉన్నత వర్గానికి చెందిన చిన్న గుంపు ఒకటి విలాసంగా జీవించడాన్ని అదే సమయంలో అనేక మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలో జీవించడాన్ని కనుగొంటారు . . . ఈ పేదరికపు ఉరి నుండి ఎలా తప్పించుకోగలం? సరళమైన పరిష్కారమేమంటే: ఉన్నత వర్గాన్ని తీసివేసి, సంపదను పంచుకోవడమే. వాస్తవానికి ఇది జరిగే పని కాదు. అలా చేయడానికి, సంపద అందరికీ సరిపోదు. రెండవది, ఒక ఉన్నత వర్గాన్ని తీసివేయడంతో, దాని స్థానాన మరొకటి వస్తుంది. మూడవది, సామ్యవాద ఆదర్శాలు పేదరికాన్ని మాత్రం సమానంగా పంచడంలో [సఫలీకృతమయ్యాయి].
“అన్ని దేశాల్లోను, అన్ని యుగాల్లోనూ అభివృద్ధికి తోడ్పడేందుకు ఒకే ఒక పరిష్కారం ఉంది: వ్యక్తుల అభివృద్ధి. ప్రజలే సమాజాలను సృష్టించేది. బాగా విద్యావంతులైన, ఆరోగ్యంగానున్న, అనుకూలమైన మరియు సృజనాత్మకత గల ప్రజలు తప్పకుండా ఆరోగ్యకరమైన, చురుకైన సమాజాలను స్థాపించగలరు.”
ఆ డిప్యూటి ఎడిటర్ ఉదాహరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, అతడు యెహోవాసాక్షుల్లో ఒక ఉదాహరణ కనుగొనేవాడే. ఆఫ్రికాలో, నిజానికి ప్రపంచమంతటా ప్రజలు విద్యావంతులు కావడానికి భూవ్యాప్త సమాజంలో ఆరోగ్యం గల సభ్యులుగా మారడానికి సహాయపడేందుకు సాక్షులు పని చేస్తున్నారు. ఇతర పనులేమంటే, వారు నిరక్షరాస్యులైన పెద్దవారికి వ్రాయడం చదవడం నేర్పిస్తున్నారు. వారి ప్రచురణల ద్వారా, పారిశుద్ధ్యం, ఆరోగ్య రక్షణ, కుటుంబ బంధాలు వంటి విషయాల్లో వారు మార్గనిర్దేశాలను ఇస్తారు. బైబిలు ఉపదేశానికి అనురూపంగా సత్యసంధులుగాను, కష్టపడి పనిచేసేవారుగాను, ఫలించేవారుగాను ఉండాలని సాక్షులు వారి కూటాల్లో ఒకరినొకరిని అలాగే వ్యక్తిగతంగాను ప్రోత్సహిస్తారు.
ఫలితం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా యాభై లక్షల మంది ప్రజలతో దృఢమైన, తేజోవంతమైన సమాజం ఏర్పడింది. కాని సాక్షులు దాని ఘనతను తమకు ఆపాదించుకోరు. “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును,” అని చెబుతున్న దేవునికే తమ ఆత్మీయ సంపదనుబట్టి ఘనతనిస్తారు.—యెషయా 48:17.
బైబిలును గూర్చి, దాని ఆచరణయోగ్యమైన ఉపదేశాన్ని గూర్చి మీరు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే, దయచేసి, మీ ప్రాంతంలోని యెహోవాసాక్షుల రాజ్య మందిరాన్ని సంప్రదించండి లేదా 5వ పుటలో ఇవ్వబడిన చిరునామాలో మీకు అతి సమీపంగా ఉన్న దానికి వ్రాయండి.