మా పాఠకుల నుండి
అమర్యాద నాకు జ్ఞాపకమున్నంతమేరకు, నేనెప్పుడు కూడా అమర్యాదగానే ప్రవర్తించేవాన్ని. “మీకు ధన్యవాదాలు,” “దయచేసి నన్ను క్షమించండి,” మరియు “నన్ను మన్నించండి” వంటి మర్యాదను, గౌరవ భావాన్ని వ్యక్తంచేసే పదాలను ఉపయోగించడంలో విఫలమైనప్పుడు గర్వంగా భావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. “సత్ప్రవర్తన క్షీణించటము వెనుకనున్నదేమిటి?” (అక్టోబరు 8, 1994) అనే శీర్షికను, అందులోని బైబిలునుండి సూచించబడిన భాగాలను చదివాను. దేవుడు తనకన్నా చిన్నవారితో వ్యవహరించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా, తన విన్నపాలకు తరచు “దయచేసి” అనే పదాన్ని కలుపుతూ మర్యాద కలిగి ఉంటాడని నేను నేర్చుకున్నాను. దీన్ని బైబిలునందు చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇది నాకు దేవుని పోలి ఉండేలా ప్రయత్నించడానికి నన్ను ప్రేరేపించింది. మీకు వెలలేని కృతజ్ఞతలు.
ఎమ్. ఇ. జె., నైజీరియా
క్యాన్సర్ ఇటీవలనే నేను నా తల్లి యొక్క డాక్టరుకు “రొమ్ము క్యాన్సర్—ప్రతి స్త్రీకివున్న భయము,” అనే శీర్షికవున్న ఏప్రిల్ 8, 1994 సంచిక ఒక ప్రతినిచ్చాను. పుట 10లో హైడ్రెజైన్ సల్ఫేట్ అనేది అంత “విషపూరితమైన మందు” కాదని వివరించబడింది. వైద్యపరమైన సాహిత్యాలందు అది ఎక్కువ విషపూరితమైన వాటి జాబితాలో ఉన్నట్టు డాక్టరు మాకు చూపించాడు.
డి. ఎమ్., ఫ్రాన్స్
ఈ రసాయనం యొక్క విషపూరిత స్వభావం వివాదాస్పదమైన విషయంగా ఉందని రుజువులు చూపుతున్నాయి గనుక, ఆ మందు విషపూరితం కాదని మేము అనడంలో పొరపాటు చేశాము. ల్యాబొరేటరీ ఎలుకలకు, పెద్ద ఎలుకలకు ఎక్కువ మోతాదులో ఇవ్వబడినప్పుడు అది అధిక విషపూరితమైనదిగా తేలిందని ఒక రష్యా పరిశోధనా అధ్యయనం పేర్కొన్నది. అయితే, యూసీఎల్‌ఎ వైద్య కేంద్రమందు, మానవ క్యాన్సర్ రోగులపై నిర్వహించబడిన ఒక క్లినికల్ అధ్యయనంలో, రోగులలో 71 శాతం మందికి విష ప్రభావం లేనట్లు చెప్పారు గనుక హైడ్రెజైన్ విషపూరిత స్వభావం “స్వల్పంగానే” ఉన్నదని నివేదించబడింది. ఈ మందు వలన వచ్చే ప్రమాదాలను మరియు దానివలన పొందగల ప్రయోజనాలను గురించి పూర్తిగా అంచనావేయక ముందు, ఎంతో ఎక్కువ పరిశోధన చేయవలసి ఉంటుందనడంలో సందేహంలేదు.—ఎడిటర్.
ఆడీ కథ “ఆడీ జవాబు ఆలస్యంగా కనుగొన్నది కాని మరీ ఆలస్యంగా కాదు” (ఆగస్టు 8, 1994) అనే శీర్షిక చాలా అద్భుతంగా ఉంది! అది చదువుతుంటే ఒక నవలను చదివినట్లు అనిపించింది, అయితే ఇది వాస్తవంగా నిజమైన కథ. మన పొరుగువారికి సహాయం చేయడంలో అధిక ప్రభావవంతమైన మార్గం, ప్రకటనా పని అన్నది కథ యొక్క సారాంశమని నేను గుర్తించినప్పుడు నేను కదిలింపబడ్డాను.
డి. ఎల్., ఇటలీ
ఆడీ క్లింటన్ ఫ్యూయొక్క జీవితగాథను ఇప్పుడే చదవడం ముగించాను, నేను తేజరిల్లు!ను (ఆంగ్లం) గత 19 సంవత్సరాలుగా చదువుతున్నప్పటికీ, మీకు కృతజ్ఞతలు తెల్పడానికి మొదటిసారిగా ఉత్తరం వ్రాస్తున్నాను. నేను కూడా నల్లజాతీయురాలినే, మరి నేను నా జీవితకాలమంతా సాంఘిక అన్యాయాల వాడి బాణాలను ఓర్చుకున్నాను. అయితే యెహోవా నిజంగా నల్లవారి అవస్థలపట్ల శ్రద్ధ కలిగివున్నాడని మరియు ఆయన వాగ్దానం చేసిన క్రొత్తలోకం అన్ని తప్పులను సరిచేయగలదని నేర్చుకున్నాను.
ఎల్. ఎన్., అమెరికా
ఆమె కలిగివున్న చాతుర్యం మరియు సరదా స్వభావం దీనత్వంతో సమతూకంగా ఉన్నాయని ఆ శీర్షిక చూపింది. ఆమె కథలు చక్కగా చెప్పగలదు! ముగింపు ఎంతో చలింపజేసేదిగా ఉందని నాకు అనిపించింది. అప్పుడు బస్సులో ఉన్న నేను ఒక క్షణం నాలో నేను నవ్వుకున్నాను దాని తర్వాత ఏడ్చాను.
డి. ఎమ్., అమెరికా
లావు “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . నేనెందుకింత లావుగా ఉన్నాను?” (మే 8, 1994) అనే శీర్షికనుబట్టి నేను చాలా ముగ్ధురాలినైనాను. నా బరువునుగూర్చి నేను ఎప్పుడూ చింతించే దాన్ని, అయితే ఈ శీర్షికలో చెప్పినట్లుగా యెహోవా మీరు ఎలా ఉన్నారు అనేది కాదుగాని, మీ హృదయంలో ఏమి ఉందనేది చూస్తాడని గ్రహించాను. మీకు కృతజ్ఞతలు.
ఎన్. సి., అమెరికా
వాస్తవానికి నేను లావుగా లేనప్పటికీ, కొన్నిసార్లు మోడల్స్‌లా ఉండాలని ఇష్టపడుతుంటాను. కొన్నిసార్లు నేను కృంగిపోయి, ఏడ్చేస్తుంటాను. అలా భావించేది నేనొక్కదాన్నే కాదని గ్రహించడానికి మీ శీర్షిక నాకు సహాయం చేసింది, ఆ విషయం నాకు ఓదార్పునిచ్చింది.
ఆర్. ఎమ్., అమెరికా
నేను స్థూలకాయురాలినేమి కాదుగానీ, వెడల్పు భుజాలతో భారీగా ఉండే అమ్మాయిని. మా అన్నలు, బావలు నన్ను ఏడిపిస్తుంటారు. నేను భారీగా ఉన్నవాళ్లలో చేర్చబడినప్పటికీ, నా బరువును తగ్గించుకొనే అవసరం లేదని మీరు చెప్పిన అంశాన్ని నేను మెచ్చుకుంటున్నాను.
ఎమ్. టి., అమెరికా