కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 1/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 1/8 పేజీ 30

మా పాఠకుల నుండి

పునర్జన్మ “మీరు పూర్వం జీవించారా? మీరు మరలా జీవిస్తారా?” అనే చక్కని శీర్షికల పరంపరనుబట్టి మీకు కృతజ్ఞతలు. (జూన్‌ 8, 1994) చనిపోయినవారి పరిస్థితిని గూర్చిన సత్యాన్ని యీ శీర్షికలు సరళమైన, యుక్తమైన విధానంలో తెలుపుతున్నాయి. ఈ విషయాన్ని గూర్చిన సత్యం కొరకు అన్వేషించే వారెవరైనా, మీరు వ్రాసిన దానిని ఒప్పుకోడానికన్నా మించిందేమీ చేయలేరని నేను నమ్ముతున్నాను.

ఎఫ్‌. పి., ఇటలీ

మునుపటి బాక్సర్‌ “నేను ఇష్టపడినదాన్ని ద్వేషించడం నేర్చుకున్నాను” అనే శీర్షికను బట్టి మీకు చాలా కృతజ్ఞతలు. (జూన్‌ 8, 1994) అబ్దూలియో ననెస్‌ కథ నా భర్తకున్న ఆరోగ్య సమస్యల్లో కొన్నింటిని అర్థం చేసుకోడానికి మాకు సహాయపడింది. మునుపటి బాక్సర్‌గా ఆయన కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. నిజంగా, నా భర్త తన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి యెహోవా దేవుడే సహాయపడ్డాడు!

ఎస్‌. ఎస్‌., అమెరికా

నొప్పి నేను వృత్తిపరంగా మర్దనా చేసేవాడను, “నొప్పిలేని జీవితం సాధ్యమేనా?” అనే పరంపరనుబట్టి మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. (జూలై 8, 1994) ఈ సమాచారాన్ని గూర్చిన పరిశోధనలోను మరియు దాన్ని వివరించిన విధానంలోను స్పష్టమవుతున్న అంతర్దృష్టి, సమతుల్యత, జ్ఞానాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఈ శీర్షిక, స్పెషలిస్టులకు, రోగులకు, మరితరులకు అమూల్యమైన సహాయంగా ఉంటుంది. దేవుని రాజ్యం క్రింద, యిక ఏ మాత్రము దీర్ఘకాలిక నొప్పి ఉండని రోజు కొరకు ఎదురు చూస్తూ, మర్దనా విధానాలను ఉపయోగించి నొప్పికెదురుగా పోరాడడంలో నేను కొనసాగుతాను.

డి. టి., డెన్మార్క్‌

ఈ శీర్షికలు నాకు ఎంతో ఊరటను కలిగించాయి. నాలాగే ప్రతిదినము నొప్పిని అనుభవిస్తున్న అనేకులతో నేను దానిని పంచుకున్నాను.

ఎమ్‌. జి., అమెరికా

ఇక్కడ నేను పడక మీద పండుకొని మీకు వ్రాస్తున్నాను. రెండు ఫలకాలు సంకోచించిన కారణంగా రెండున్నర సంవత్సరాలుగా మళ్ళీ మంచం మీదే ఉంటున్నాను. “మీరు వెన్ను నొప్పితో బాధపడుతున్నారా?” అనే మంచి శీర్షికనుబట్టి మీకు కృతజ్ఞతలు. (జూన్‌ 8, 1994) దాన్ని చదివేటప్పుడు ఏడ్చేశాను, ఎందుకంటే మీరు నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఈ సమస్యను ఎవరైనా ఇంత స్పష్టంగా అర్థం చేసుకోగలరన్న దాన్ని నేను నమ్మలేకపోయాను.

బి. హెచ్‌., ఇంగ్లాండు

కేవలం పది రోజుల క్రితం నేను వెన్ను చికిత్స కొరకు వెళ్ళవలసి వచ్చింది, సరైన సమాచారమిచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఆ శీర్షిక, నా నొప్పికి గల కారణాన్ని అర్థం చేసుకోడానికి నాకు సహాయపడింది. ఇవ్వబడిన సలహాలు ఎంతో సహాయకరమైనవి, అనేకులు వాటిని అన్వయించుకుని, సర్జరీని తప్పించుకోగలరని అపేక్షిస్తున్నాను.

కె. జి., హంగేరీ

ఆత్మహత్య “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ఆత్మహత్యే పరిష్కారమా?” (ఏప్రిల్‌ 8, 1994) అనే శీర్షికను బట్టి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని చూశానో. నేను తప్పటడుగులు వేస్తున్న చంటి పాపగా ఉన్నప్పుడు, నేను నమ్మిన ఒకరు నాపై లైంగిక అత్యాచారం చేశారు. . . . గతంలో, నాకు కాలం చెల్లింది, ‘నేను చచ్చిపోవాలి’ అని నేను ఎన్నో సార్లు రాసుకున్నాను. దాని తర్వాత నేను యెహోవాసాక్షినై, యిప్పుడు పూర్తికాల సువార్తికురాలిగా సేవ చేస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు యిలా ప్రేరేపించబడేదాన్ని. నేను యీ శీర్షికను అందుకున్న ముందటి రోజు కూడా యిలాంటి భావం నాలో కలిగింది. ఆ శీర్షికను చూసినప్పుడు నాకు ఏడ్పు వచ్చింది. అయినా యెహోవా జీవించడానికి నన్ను అనుమతించాడు, నువ్వు ‘జీవిస్తుండాలి’ అని ఆయన నాతో మృదువుగా చెబుతున్నట్లు అనిపించింది. నిజంగా, మీకు చాలా కృతజ్ఞతలు.

వై. కె., జపాన్‌

గత వారమే ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులు నా హృదయంలో తీవ్రంగా ఉండేవి. ఒక క్రైస్తవ పెద్ద, మరియు ఆయన భార్య నాకు సన్నిహితులయ్యారు, ఆ తలంపులను అధిగమించడానికి నాకు సహాయం చేశారు. నిరాశను గూర్చిన మీ అనేక శీర్షికలు నాకు ప్రాణాన్ని కాపాడేవిగా ఉంటున్నాయి.

డి. జె., అమెరికా

నేను మీ శీర్షికనుబట్టి నా ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలపాలనుకున్నాను. ముందటి మరే శీర్షికలకన్నా నేను ఎప్పటికీ గుర్తుంచుకోగల్గేలా అది నాలో అనుభూతిని కలిగించింది. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం, తట్టుకోలేని పరిస్థితుల్లో—ఆత్మహత్య ఒక్కటే ఎన్నుకోగల మార్గమని తలంచాను. అయినప్పటికీ, తల్లిదండ్రుల, స్నేహితుల సహాయంతో నేను జీవించడానికి, యెహోవా నేను జీవించాలని కోరుకుంటున్నాడన్న మంచి కారణముందని తెలుసుకోగల్గాను.

ఎమ్‌. వి., అమెరికా

ఈ శీర్షిక సమగ్రంగా, చక్కగా వ్రాయబడిందని నేను గ్రహించాను. ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులుగల ఎవరికైనా సహాయపడడానికి యిది ఎంతో విలువైన ఉపకరణమని నేను భావిస్తున్నాను. చేర్చబడిన అన్ని ఉదాహరణలు నన్ను ఆకట్టుకున్నాయి.

ఎల్‌. ఎస్‌., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి