ప్రపంచ పరిశీలన
క్రొత్త మరియు పునరావృతమయ్యే వ్యాధులు
క్రొత్తవాటితో సహా మళ్లీ సోకే వ్యాధులు, లక్షలాది మంది ప్రజల జీవితాలను భయపెడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చాలా ఆకస్మికంగా వచ్చినదాని ఉదాహరణ ఎయిడ్స్ వ్యాధియే, పది సంవత్సరాల పూర్వం ఒక వైరస్ మూలంగా వచ్చే ఈ వ్యాధిని గురించి అసలు తెలియదు. మరొక ఉదాహరణ హన్‌టావైరస్, యిది ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయవ్యాధి, యిటీవల కాలంలోనే అమెరికా నైరుతి భాగంలో కనుగొనబడింది. పూర్తిగా క్రొత్తవిధంగా కలరా ఆసియాలోకి ప్రవేశించింది. రెండు రకాల హెమ్రోహగీక్ జ్వరాలు దక్షిణాసియాలో వృద్ధి అయ్యాయి, యివి రెండుకూడ ప్రాణాంతకమైనవే. గత 1993లో మళ్లీ సోకిన ప్రసిద్ధ అంటువ్యాధుల ఉదాహరణలలో లాటిన్ అమెరికాలోని కలరా, కెన్యాలోని ఎల్లో ఫీవర్, కోస్టా రికాలోని సంధిగత జ్వరం, మరియు రష్యాలోని వలయరోగం ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ క్రొత్తగా లేదా పునరావృతమయ్యే వ్యాధులను గుర్తించి వాటిని ఎదుర్కోటానికి భౌగోళిక నెట్‌వర్క్ కేంద్రాలకు పిలుపునిచ్చింది. (g94 12/22)
రేసులు పొగత్రాగుటను వృద్ధిచేస్తున్నాయి
సాంప్రదాయంగా, ఐరోపా దేశాలన్నీకూడ ప్రముఖ ఫార్ములా వన్ గ్రాండ్ ఫ్రిస్ కారు రేసులకు ఆతిధ్యం యిస్తున్నాయి. అయితే, వ్యవస్థాపకులు యిప్పుడు ఆసియా దేశాలైన, జపాను, చైనా మొదలగు దేశాల్లో యిటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి యిష్టపడుతున్నారు. ఎందుకు? పొగాకు ప్రకటనలపై ఐరోపా కలిగివున్న గట్టి ప్రతిబంధాలనుబట్టి. రేసులకు ముఖ్యమైన మద్దతుదార్లు పొగాకు కంపెనీలు కాబట్టి, రేసుకార్లు ప్రముఖంగా పొగాకు ప్రకటనలను ప్రదర్శిస్తాయి. జపానులోని అసాహీ ఈవినింగ్ న్యూస్ ప్రకారంగా, ఒక పొగాకు కంపెనీ “సంవత్సరానికి రెండు జట్టులపై కొన్ని వందల కోట్ల బిలియన్స్ పెట్టుబడి పెడుతుంది.” ఐరోపాలో పోటీ జరిగేటప్పుడు, పోటీపడే కార్లు ప్రకటనలను తీసివేయడం లేక అవి కనిపించకుండా ఉంచవలసి వస్తుంది. ఇటీవల సిగరెట్టుపై ప్రకటనను నిషేధించినందున ఫ్రెంచ్ గ్రాండ్ ఫ్రిక్స్ దాదాపు రద్దుచేయబడింది. ఆసియా దేశాల్లో వయోజన పురుషులందరిలో దాదాపు 60 మంది పొగత్రాగుతున్నారు గనుక, అవి యిప్పుడు రేసుకార్లపై సిగరెట్టు ప్రకటనలకు అనుకూలమైన ప్రదేశాలుగా ఎంచబడుతున్నాయి. (g94 12/22)
ఎవరెస్టు పర్వతంపై శుభ్రపర్చేపని
యునెస్కో సోర్సెస్ పత్రిక ప్రకారం, ఎవరెస్టు పర్వతం ప్రపంచంలోని ఎత్తైన శిఖరంగా ఉండడమే కాక, యిప్పుడు ప్రపంచంలో “చెత్త ఎక్కువగా ఉండే ప్రదేశంగా,” కూడా ప్రసిద్ధి చెందింది. గత 40 సంవత్సరాలుగా, ఆక్సిజన్ బాటిల్స్‌ను, టెంటులను, పడక శయ్యలను, ఆహారాన్ని కట్టడానికి ఉపయోగించే సంచీలను, అంటే మొత్తం 20 టన్నుల చెత్తను పర్వతారోహకులు ఎవరెస్టుపై వేశారు. క్రింద ఏటవాలు ప్రాంతాల్లోని మైదానమంతటా టాయిలెట్ పేపర్ ముక్కలు రెపరెపలాడుతుంటాయి, ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు వెళ్లేమార్గం యిప్పుడు “టాయిలెట్ పేపర్ దారి అని పిలవబడుతుంది.” పర్వత పైభాగమంతా, చెత్తాచెదారం మరీ ఎక్కువగా ఉంది. “ఎవరెస్టు అంటే ఆదిమకాల అరణ్యమన్న అభిప్రాయమున్న వారికి ఈ దృశ్యాల ఫోటోలు ఎంతో దిగ్భ్రాంతిని కలిగిస్తాయి,” అని యునెస్కో సోర్సెస్ రాస్తుంది. పర్వతంపైని ఈ చెత్తను తీసివేయడానికి, నేపాల్ ప్రభుత్వం యీ సంవత్సరం “శుభ్రపరచుట కొరకైన” అనేక పర్వతారోహణా కార్యక్రమాలను చేపట్టింది. (g94 12/22)
సమృద్ధిగా బీరు ఉంది—సరిపడేంత ఆహారంలేదు
వెనుజ్యులాలోని వార్తాపత్రికయైన ఏల్ యూనివర్సల్ ప్రకారం పోషకాహారలోపం మూలంగా వెనుజ్యులాలోని 7,26,000 మంది ఆరేండ్ల ప్రాయం లేదా అంతకంటే తక్కువ ప్రాయంగల పిల్లలు వాళ్ల ఆకారంలో వయస్సుకు తగ్గట్లుగా లేకుండా పొట్టిగా ఉంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ వయస్సు గుంపు పిల్లల్లో 23.8 శాతం, అంటే సగటున నలుగుర్లో ఒకరు అలా ఉన్నారు. పిల్లలకు పెట్టడానికి తగినంత పోషకాహారం లేదు గాని, ఆ దేశంలో సమృద్ధిగా బీరు మాత్రం ఉన్నట్లు కనబడుతుంది. ఏల్ యూనివర్సల్ నివేదిక ప్రకారంగా లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో, బీరును వినియోగించటంలో వెనుజ్యులా ప్రథమ స్థానం వహిస్తుంది. మరి 1991లో వెనుజ్యులా పౌరులు సుమారు 75 లీటర్లు తాగారని చెప్పబడింది. (g94 12/22)
కళ్లల్లో పొగ
సిగరెట్టునుండి వచ్చే పొగలో ఉండే రసాయనాలు కాటరాక్ట్ కలుగజేస్తాయన్న దానికి నిర్వివాదమైన రుజువులున్నాయని, ఆస్ట్రేలియా జాతీయ నేత్ర పరిశోధన సంస్థ డైరెక్టరైన, ప్రొఫెసర్ రోబార్ట్ ఆగస్టీన్ చెబుతున్నాడు. పొగత్రాగని వాళ్లకన్నా పొగత్రాగేవాళ్లకు కాటరాక్ట్ వచ్చే అవకాశం రెండు లేక మూడు సార్లు ఎక్కువగా ఉందని ఒక పరిశోధన చూపిస్తుంది. సిగరెట్టునుండి వచ్చే పొగలోని రసాయనాలు మొదట శరీరంలోనికి చేరుతాయి, అయితే తర్వాత అవి అక్కడనుండి కళ్ల దగ్గరకు వెళ్తాయి, అక్కడ కళ్లలోని కటకమునుండి అదనపు ఉప్పును నీళ్లను వడగట్టే “పంపులను” నాశనం చేస్తాయి. దాని ఫలితంగా, కంటిలోని కణాలు ఉబ్బడం మరియు తెగిపోవడం కాటరాక్ట్‌ను కలిగిస్తాయి. “నేను పూర్తిగా ఒప్పించబడ్డాను. సిగరెట్టు పొగనుండి వచ్చేది ఎదో, పంపులు కటకంలో పనిచేయకుండా నివారిస్తున్నాయని అనడంలో సందేహమే లేదని,” ప్రొఫెసర్ ఆగస్టీన్ వివరిస్తున్నారు. (g94 12/22)
మెదడు వ్యాయామం
“జ్ఞాపకశక్తి తగ్గిపోవటం సర్వసాధారణంగా ఒక విధికాదు అయితే సరియైన అభ్యాసాన్ని యివ్వకపోవటమే,” అని ఒక జర్మనీ హెల్త్-ఇన్సూరెన్స్ ప్రచురణ అయిన డిఎకే మ్యాగజీన్ చెప్పింది. పనేమి చేయకపోతే కండరాలు ఎలా క్షయమౌతాయో, అలాగే మెదడు కూడా తక్కువ వ్యాయామం చేయడం వలన మందగించి ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేయలేదు. ఈ సమస్య ముఖ్యంగా పెద్దలకు మాత్రమే ఉంటుందా? కానే కాదు! “ఆలోచించటం మనకు తరచుగా సులభం చేయబడుతుంది లేదా ఒక్కోసారి ఆలోచించనవసరం కూడా ఉండదు గనుక,” తమ మెదళ్లను సరైన విషయాలపై కేంద్రీకరించక పోవడం ద్వారా యౌవనస్థుల జ్ఞాపకశక్తి కూడా మందగించే అపాయం ఉందని ఆ పత్రిక వ్యాఖ్యానిస్తుంది. దానికి ఏది సహాయం చేయగలదు? మెదడును జ్ఞాపకశక్తిని పెంచడానికి, అంకెలు మరియు అక్షరమాలలోని అక్షరాలుగల పజిల్స్ వంటి మానసిక ఆటలు ఆడటం, అంటే మెదడు వ్యాయామం మంచిదని ఆ పత్రిక సలహా యిస్తుంది. అంతేకాకుండా, “క్రాస్‌వర్డ్ ఫజిల్స్ చాల సహాయకరంగా ఉండగలవు.” (g95 1/8)
ఆఫ్రికాను హతంచేస్తున్న ఎయిడ్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థయొక్క తాజా అంచనాల ప్రకారం, ప్రపంచంలోని మొత్తం ఒక కోటి 50 లక్షలమందికన్నా ఎక్కువ మందికి ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసిన కేసులలో, దాదాపు ఒక కోటి మంది ఆఫ్రికాలో ఉండడంవలన, అది ప్రపంచంలోని ఎక్కువగా దానికి గురైన ఖండంగా మారింది. ఎయిడ్స్ రుగ్మతను ఎదుర్కొనుటకు యిప్పుడు గైకొంటున్న చర్యలు “ఎడతెగక పొంగిపొర్లే నదిని అడ్డగించేంతగా చిన్న ఇసుక కందకాలు,” పని చేస్తున్నట్లు ఉన్నాయని ప్రొఫెసర్ నాతన్ క్లూమీక్ వర్ణిస్తున్నాడు. ఈ వైరస్ ఆఫ్రికానందంతా జరిగించబోయే వినాశనాన్ని ఆఫ్రికా రాష్ట్ర ప్రముఖులు గుర్తెరగలేకపోతున్నారని, ప్రొఫెసర్ క్లూమెక్ పారిస్ దిన పత్రికైన లీ మోన్‌డిలో ప్రచురించబడిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రొఫెసర్ క్లూమెక్ 1987లో, ఖండం మొత్తంలో 10 శాతానికి ఎయిడ్స్ సోకుతుందని అంచనా వేసినప్పుడు అనేకులు అది అతిశయోక్తిగా చెప్పబడిందని అనుకున్నారు. ఈనాడు 20 నుండి 40 శాతం వరకు ఆఫ్రికాలోని జనాబా అంతటికీ కూడ మరణకరమైన వైరస్ సోకుతుందని అంచనావేయబడింది. (g95 1/8)
చేపలను ఎక్కువ పట్టడం సముద్ర జీవరాసులు తరిగిపోయేలా చేయడం
“‘సముద్రంలో చేపలు ఎక్కువగా ఉన్నాయి,’ అని ఒక ఆంగ్ల సామెత ఉంది. అయితే అది తప్పు,” అని ది ఎకానమిస్ట్ చెబుతుంది. “సముద్రంలో అవి విరివిగా ఉన్నప్పటికీ దానినంతటినీ పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది.” గత 1989లో చేపలు పట్టడం ఎంతో ఎక్కువగా ఉన్నప్పటినుండీ, సముద్ర చేపలను పట్టడం ప్రపంచమంతటా తగ్గిపోతుంది. దానికి కారణం చాలా చిన్నది: “గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేయడానికి కేవలం కొన్ని చేపలు మాత్రమే సముద్రంలో మిగిలాయి. చేపలు పట్టే వారు చేపలను మళ్లీ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చేపలను పట్టుకెళ్తున్నారు.” ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకారం, ప్రపంచంలోని చేపలు పట్టే అతి ముఖ్యమైన 17 కేంద్రాల్లో, 13 కేంద్రాలకు సమస్యలున్నాయి—వాటిలో 4 వ్యాపారపరంగా పనికిరానివిగా ఎంచబడుతున్నాయి. సోనార్ మరియు ఉహగ్రహంద్వారా సందేశాలను గ్రహించడం వంటి అధునాతనమైన సాంకేతికం ద్వారా జాలరులు సుదూరమైన ప్రదేశాల్లో ఉన్న చేపలను కూడా కనుగొనడానికి మరియు చేపలు ఎక్కడ ఎక్కువగా లభిస్తాయో ఆ స్థలాలను కనుగొనడానికి కూడా వీలు కలిగిస్తున్నాయి. చేపలు పట్టే, ఫుట్‌బాల్ ఫీల్డ్ అంత పెద్ద ఫ్యాకర్టీ ఓడలు, అంతకంటే పెద్ద వలలు అపరిమితమైన పరిమాణంలో చేపలను లాగుతాయి. తమ అధికారం క్రింద ఉన్న జలాల్లోని 370 నాటికల్ కిలోమీటర్లలోనే, ప్రపంచపు 90 శాతం చేపలు పట్టడం జరుగుతుంది గనుక, వ్యర్థమౌతున్న దాని విషయమై ప్రభుత్వాలే నిందింపబడాలని ది ఎకానమిస్ట్ చెబుతుంది. ప్రభుత్వాలు యితర దేశాలను తమ ప్రాంతంలో చేపలు పట్టనివ్వరు కానీ తమ స్వంత ఓడలను అనుమతించి వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాయి. (g95 1/8)
రైళ్ళ టాయిలేట్-రోల్ సమాచారం
ఆధునిక పరికరాలు వచ్చేంతవరకు, దాదాపు అన్ని ఇటలీ రైళ్ళలో అత్యవసర పరిస్థితిని గురించి రైలు కండక్టరు రైలు అధికారులకు తెలియజేయవలసి వచ్చినప్పుడు యీ విధంగా చేసేవారు: ఒక చిన్న నోట్‌ను వ్రాసి, దానిని టాయిలేట్ కాగితంయొక్క రోల్‌లో (చుట్టల్లో) పెట్టి, అధికారులు దాన్ని చూసి, విషయాన్ని తెలుసుకుంటారన్న ఆశలతో, వేగంగా వెళుతున్న రైలునుండి వచ్చే స్టేషనుకు దానిని విసిరి వేయటమే. “రైళ్ళంత పాతదైన,” యీ పద్ధతి రైల్వే అధికార నియమాల ద్వారా నిర్ణయించబడింది. ఏమైనప్పటికీ “రైళ్ళలో సంభాషించడమన్నదీ చాలా గంభీరమైన సమస్య” అని గుర్తెరిగిన ఒక ఇటలీ రాష్ట్ర రైల్వే అధికారి, అది “యిప్పటికి కూడా కార్యసాధకమైన, ప్రయోజనకరమైన, పరిశోధింపబడిన పద్ధతి” అని అంటున్నాడు. ప్రయాణికునికి బాగులేకపోవడం, ఎదైన అనుమానాస్పదమైన లగేజీవున్నా, దురాక్రమణ జరిగినా, లేక దొంగతనం జరిగినా వాళ్లు జోక్యం కలుగజేసుకోడానికి వీలులేదు గనుక “స్టేట్ రైల్వే సిబ్బంది అశక్తులుగా ఉంటారు,” అని కొరీయరా డెల్లా సెరా అనే ఇటలీ వార్తాపత్రిక చెబుతుంది. సంభాషణా సమస్యను పరిష్కరించటానికి, ఇటలీ స్టేట్ రైల్వే వారు రానున్న కాలంలో క్లోస్డ్ సర్కిట్ పోర్టబుల్ టెలిఫోన్ల వాడుక ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. (g95 1/8)
మంచి నిద్ర అలవాట్లు
“నిద్రరాకపోవడం అనేది చాలామందికి ఉత్పాదకతకు దోహదపడుతుందని అనిపిస్తుంది, శరీరానికి కావలసినంత నిద్రను దానికి లభించేలా చేయకపోవడం ఉత్పాదకత తగ్గిపోడానికి దారితీయవచ్చు,” అని బ్రెజిల్ పత్రికైన ఎక్సామి చెబుతుంది. నాడీ శాస్త్రజ్ఞుడగు రూబెన్జ్ రీమాయో యిలా వివరించాడు: “శరీరానికి ఎంత నిద్ర కావాలో అది ఎన్నడూ మర్చిపోదు. దానికి బదులుగా దాన్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుని, ఒక్కసారిగా దాన్ని బయల్పరుస్తుంది—అంటే నిద్ర కొరవడటాన్ని అప్పుడప్పుడూ జ్ఞాపకశక్తి లోపించటం, ఏకాగ్రత నిలపడంలో సమస్యలు, మందకొడిగా ఆలోచించడం వంటి వాటిద్వారా ఆ లోటును చూపిస్తుంది.” అనవసర ఆదుర్దాను తగ్గించడానికి “పనిలోని సమస్యలను పరిష్కరించడం లేక వాటిని గురించి ఆలోచించడాన్ని పని స్థలంలోనే వదిలిపెట్టండి,” అని డాక్టర్ రీమాయో సిఫారసు చేస్తున్నాడు. మీరు విశ్రాంతి తీసుకుని మంచిగా నిద్రపోవడాని కొరకు, క్రమంగా వ్యాయామం చేయడం, ఆహ్లాదకరమైన సంగీతం, తక్కువ వెలుతురు, మరియు మంచి తలంపులు సహాయకరంగా ఉంటాయని ఎక్సామి చెబుతుంది. (g95 1/8)
నపుంసకుల మతశాఖ
ఇండియాలో 10 లక్షలకంటే ఎక్కువమంది నపుంసకులున్నారని బొంబాయి యొక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిస్తుంది. వారిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే అటువంటి స్థితిలో పుట్టారు. మిగతావాళ్లు నపుంసకులుగా చేయబడ్డారు. ఎక్‌ప్రెస్ ప్రకారంగా, చక్కగా కనబడే బాలురు ప్రలోభపెట్టబడి లేక కిడ్నాప్ చేయబడి, ఇండియాలోని నపుంసకులను తయారు చేసే ఒక కేంద్రానికి తీసుకొనిపోబడతారు. అక్కడ ఆ బాలురకు “రాజ మర్యాదలు” చేయబడి చివరకు వారి వృషణాలు తీసివేయబడటంతో అది ముగింపుకు వస్తుంది. ఆ తర్వాత క్రొత్తగా నపుంసకునిగా చేయబడిన వాడు, పూర్వమున్న నపుంసకునిచే దత్తత తీసుకోబడతాడు, వాళ్ల యిద్దరి మధ్య “తల్లి-కుమార్తెల” సంబంధం ఏర్పడుతుంది. ఈ నపుంసకులకు స్త్రీల పేర్లు పెట్టబడతాయి, అప్పటినుండి వాళ్లు స్త్రీల మాదిరిగానే వస్త్రాలను ధరిస్తూ, అలాగే ప్రవర్తించటం మొదలు పెడతారు. చాలామంది నపుంసకులు అధ్యక్షత వహించే ఒక దైవం గల ఒక మతశాఖగా ఏర్పడతారు. సంవత్సరంలో జరిగే ఒక పండుగలో ఈ నపుంసకులు దైవత్వం గలవారిగా గౌరవించబడి, పూజింపబడే దేవాలయాలు ఇండియా మొత్తంలో చాలా ఉన్నాయి. (g95 1/8)