మతగురువు సాక్షుల సద్గుణాలను అంగీకరిస్తున్నాడు
ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! ప్రతినిధి
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్నందలి యెహోవాసాక్షుల కెనడొబాలాన్ రాజ్యమందిరం 1991లో కాలిపోయింది. కొన్ని వారాల తర్వాత, స్థానిక ఆంగ్లికన్ మతగురువు చర్చికి తాను వ్రాసిన లేఖలో “ఆరాధనా స్థలాన్ని కోల్పోవడం” పట్ల సానుభూతిని వ్యక్తం చేశాడు. ఆయన ఉత్తరంలో యీ విధంగా ఉంది:
“మన ఆచారాలకు వాళ్ళ ఆచారాలకు స్పష్టమైన తేడాలున్నప్పటికీ, మంచివని నేను నమ్మే వారి విశ్వాసాల ఆచరణలోని అంశాలయెడల నాకు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మెప్పుదల ఉంది.” వీటిలో కొన్ని అనుకూలమైన అంశాలేవి?
“మొదటిది: వాళ్ళు విశ్వాసాన్ని బోధించడంలో చాలా శ్రద్ధ గలవారు. అందుకే వారు వారానికి రెండు లేదా మూడు సార్లు కూడుకుంటారు.” ఇది నిజం—యెహోవాసాక్షులది చదివే, బోధించే, ప్రకటించే మతం. వాళ్ళకు వారంలో మూడు కూటాలున్నాయి.
మతగురువు చెప్పే రెండవ అంశం: “వారు . . . క్రమంగా ప్రజల ఇండ్లను సువార్తతో సందర్శిస్తారు. . . . మతం వద్దని చెప్పే ప్రజల గుంపు (38,41,000 మంది ప్రజలు) ఆస్ట్రేలియాలోని మూడవ పెద్ద మతశాఖ అని మనం తెలుసుకోవాలని వారు కోరుకుంటారు. యెహోవాసాక్షులు తమ విశ్వాసాన్ని తమలోనే ఉంచుకుని తృప్తిపడరు, కాని వారు యితరులతో దాన్ని పంచుకోవాలని కోరుకుంటారు.” సువార్తను ప్రకటించడం ద్వారా తాము మత్తయి 24:14 మరియు మార్కు 13:10లకు తప్పని సరిగా ప్రతిస్పందించాలని యెహోవాసాక్షులకు తెలుసు.
మూడవ అంశం: “వీధుల్లో దుకాణాలు పెట్టి ప్రజల నుండి చందాలను సేకరించరు, మరి చందాలను సేకరించడానికి వేరే ప్రయత్నాలు చేయరు. వారికి డబ్బు [వారి] సంఘం నుండే లభిస్తుంది.” బైబిలు యిలా చెబుతుంది, ‘ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి,’ ‘పుచ్చుకొనుటకంటె ఇచ్చుటలోనే అధిక సంతోషము.’ కాబట్టి, వారు చందా సేకరించరు. వాళ్ళ మందిరాల్లో చందా పెట్టెలు యుక్తమైన చోట ఉంచబడతాయి.—మత్తయి 10:8; అపొస్తలుల కార్యములు 20:35.
ఆయన పేర్కొన్న ప్రశంసించదగిన చివరి అంశమేది? “వాళ్ళు తమ ఆరాధనా స్థలాలను అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నిర్మిస్తారు. . . . మీరు గమ్ బెండ్ లేక్ రోడ్డు దగ్గరనున్న స్థలాన్ని సందర్శించి . . . రాజ్యమందిర నిర్మాణంలో పని చేస్తున్న . . . స్థానిక యెహోవాసాక్షులను చూడవచ్చు. ఆ పని పూర్తి చేయడానికి వాళ్ళకు మూడు రోజులు పడుతుందని వాళ్ళు అంచనా వేశారు.” తర్వాత ఆయన తన చర్చిసభ్యులకు ఏమని సలహా యిచ్చాడు?
“నేను పైన చెప్పిన నాలుగు అంశాలను చదవాలని, మీ విశ్వాసాన్ని క్రియాత్మకంగా ఆచరించటానికి అవి మీకెలా సహాయపడతాయని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని, వాటిని గూర్చి మీరు తలంచాలని సలహా యిస్తున్నాను. . . . పేర్కొన్న నాలుగు అంశాలనుబట్టి యెహోవాసాక్షులను పోల్చి చూస్తే, సగటు ఆంగ్లికన్ మరియు యితర చర్చీలవారు మృతులుగా కనిపిస్తారని చెబుతున్నాను.”
మీరు ఒక రాజ్యమందిరాన్ని సందర్శించి, యెహోవాసాక్షులు ఎలా ఆరాధిస్తారో, వారు ఏమి నమ్ముతారో మీకై మీరే చూడడానికి యిష్టపడుతున్నట్లయితే మీకు సమీపముగా ఉన్న రాజ్యమందిరానికి వెళ్ళడానికి సంకోచించకండి, లేదా మీకు సమీపములో ఉన్న రాజ్యమందిర చిరునామా కొరకు మాకు వ్రాయండి.
[31వ పేజీలోని చిత్రం]
న్యూ సౌత్ వేల్స్లోని కెనడొబాలాన్నందలి రాజ్యమందిరము