కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 9/8 పేజీలు 14-15
  • కొత్త పేరుతోనున్న కాయ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొత్త పేరుతోనున్న కాయ
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాయను సేకరించేవాళ్ళ కథ
  • సేకరించిన తర్వాత
  • ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జీడిమామిడి చెట్టు
    తేజరిల్లు!—1995
  • భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో ఒక కాయ
    తేజరిల్లు!—2003
  • టాగ్వా విత్తనాలు—ఏనుగులను రక్షించగలవా?
    తేజరిల్లు!—1999
తేజరిల్లు!—1994
g94 9/8 పేజీలు 14-15

కొత్త పేరుతోనున్న కాయ

బొలీవియాలోని తేజరిల్లు! ప్రతినిధి

పోషకాలు గల, రుచికరమైన కాయ ఆమెజోన్‌లోని దట్టమైన వర్షపాత అడవుల్లో లభిస్తుంది. “బ్రెజిల్‌ కాయ” అని అంతకుముందు దానికున్న పేరు, యిక ఏ మాత్రం సరిపోదు, ఎందుకంటే దాని సరఫరాలో సగంకంటే ఎక్కువ కాయలు బ్రెజిల్‌ సరిహద్దుల్లోకన్నా ముఖ్యంగా యిప్పుడు అడవుల నుండి వస్తున్నాయి.

అందుకు అనుగుణంగా, బ్రెజిల్‌ నట్‌, క్రీమ్‌ నట్‌, బట్టర్‌ నట్‌ కాస్టనా డు పారా పారానస్‌, న్వా డ్య బ్రెసిల్‌ అని యీ కాయకున్న పాత పేర్లను మార్చడానికి, మే 18, 1992న ఇంటర్నేషనల్‌ నట్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఇప్పుడు యీ కాయను ఆమెజోనియా కాయ అని పిలవాలి.

కాయను సేకరించేవాళ్ళ కథ

ఈ అసాధారణమైన అడవి కాయను ఆరేండ్ల వయస్సు నుండి సేకరిస్తున్న కొర్నేలియో ఏమి చెబుతున్నాడో వినండి:

“దాదాపు అన్ని ఆమెజోనియా కాయలు అడవిలో సేకరించబడుతున్నాయి. వాటిని కనుగొనడానికి అడవి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. చుట్టుప్రక్కల ఉన్న నదులే దారి. మాకు అప్పజెప్పబడిన వనంలోని ఒక భాగానికి వెళ్ళడానికి, నేను, నా 19 ఏండ్ల కుమారుడు డబుల్‌ డెక్‌ పడవలో అనేక దినాలు ప్రయాణం చేస్తాము.

“పగటి వెలుతురును పూర్తిగా ఉపయోగించుకోడానికి, మేము పెందలకడనే 4:30 నిమిషాలకు లేచి, తెల్లవారేసరికి మా మకాముకు చేరుకుంటాము. కాయలను సేకరించి ఉంచే స్థలం నుండి, కొన్ని కిలోమీటర్ల వరకే దారి ఉంటుంది. అక్కడినుండి దట్టంగా పెరిగిన కలుపుమొక్కలను పెద్ద కత్తితో నరుక్కుంటూ, మేము ముందుకు సాగిపోవాలి. సరిహద్దు గుర్తులు లేవు. సూర్యుణ్ణి మార్గదర్శిగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి, లేకపోతే మనం ఆ దారిని యిక ఎన్నటికీ కనుక్కోలేము.

“అడవిలోని నిక్షిప్తాలకొరకు వెదుకుతున్న ఎవరికైనా ప్రమాదాలను అది ముందుంచుతుంది. మలేరియా వంటి రోగాలు, అలాగే నిత్యము పాముల ఎడతెగని బెడదలుంటాయి. మేము భయానకమైన బోవా కన్‌స్ట్రిక్టర్‌లను గూర్చి భయపడము—అవి మాకు హాని చెయ్యవు. కాని, నేల మీద పడివున్న ఎండిపోయిన ఆకుల కింద దాగివుండే చిన్న పాములు ప్రాణాంతకమైన విషం గలవి. వాటి రంగు, గీతలు మభ్యపెట్టేలా చేస్తాయి. మొదట్లో వాటి కాటు వలన ఎక్కువ నొప్పి ఉండదు, కాని కాటువేయబడిన వ్యక్తికి విషం వలన క్రమేణా పక్షవాతం వస్తుంది. చెట్టుకొమ్మల్లో దాక్కొని ఉండే ఆకుపచ్చని చిన్న పాములు కూడా అపాయకరమైనవే.

“కాయలు కాసే అల్‌మెండ్రోస్‌ అని పిలువబడే రమణీయమైన చెట్లు 30 నుండి 50 మీటర్ల వరకు ఏపుగా ఉండి, వనంలోని యితర చెట్లన్నింటికన్నా ఎత్తుగా ఉంటాయి గనుక వాటిని సులభంగా కనుగొనవచ్చు. అది అడవిలోని చెట్లన్నింటికన్నా ఎత్తుగా పెరిగేంతవరకూ దాని బోదెకు కొమ్మలుండవు. కొమ్మల శిఖరాగ్రాన 10 నుండి 15 సెంటీమీటర్ల వ్యాసం గల గట్టి టెంక గల కోకోలు కాస్తాయి. నారింజ పండులోని తొనలవలె, వీటిలో 10 నుండి 25 కాయలు ఒక్కొక్కటి పొట్టుతో సహా ఉంటాయి.

“నవంబరు నుండి ఫిబ్రవరి వరకు ఉండే వర్షా కాలంలో, కోకోలు నేల మీద పడతాయి. వాటిని వెంటనే ఏరుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. కోకోలు 15 అంతస్థుల భవనమంతటి ఎత్తు నుండి పడడం ప్రాణాపాయకరమైన మరో ప్రమాదం. ప్రమాదాన్ని నివారించడానికి కోకోలను ఆల్‌మెండ్రో చెట్టు నుండి కుప్పల్లోకి విసురుతూ, త్వరగా పని ముగించుకోవాలి. అయితే పాములున్నాయేమో కనిపెట్టుకోవాలి! అవి నిద్రపోయేటప్పుడు, గుండ్రంగా చుట్టుకొని, ఆ చుట్టపై తమ తల పెట్టుకొని పడుకుని, కోకోలాగే కనిపిస్తాయి. కొందరు పనివాళ్ళు కోకో అనుకుని పాములను తీసుకొని విసిరారు.

“కోకోను పగలగొట్టడానికి నేర్పు అవసరం. కాయలు పాడు కాకుండా బయటికి తీసేందుకు, సరైన స్థానంలో కత్తితో అనేకసార్లు గట్టిగా కొట్టవలసి ఉంది. మేము త్వరలో ఎన్నో బస్తాల బరువు గల కాయలతో తిరిగి వస్తాము. వాహనాలను గాని బరువులను మోసే జంతువును గాని ఉపయోగించము. కోత సంవత్సరంలోని వర్షాలు ఎక్కువగా ఉండే, అతి ఉష్ణ సమయాల్లో ఉంటుంది కాబట్టి, సేకరించేవాడు దృఢకాయుడును, బలిష్ఠుడునై ఉండాలి.”

సేకరించిన తర్వాత

సేకరించినప్పుడు కాయలు ఆకుపచ్చగా ఉంటాయి, అంటే, వాటిలో నీళ్ళు ఎక్కువగా (దాదాపు 35 శాతం) ఉంటాయి కాబట్టి అవి పాడు కాకుండా ఉండేందుకు, కుప్ప కింద ఉన్నవి ఎండేలా, వాటిని ప్రతిరోజు పారతో కలియబెట్టాలి. బొలీవియా కాయల్లో ఎక్కువ మటుకు ఎగుమతి చేయడానికి సిద్ధం చేయబడతాయి. ఈ పైరును శుభ్రం చేయడానికి ఆరు నెలలు పడుతుంది.

పెద్ద స్టీమ్‌ ప్రెషర్‌ కుక్కర్‌లో వేసి కాయలను ఉడకబెట్టడంతో శుభ్రం చేసే పని మొదలౌతుంది. టెంక నుండి గింజలను ఆ వేడి వేరుచేస్తుంది. కాబట్టి, దాదాపు గింజలన్నీ పూర్తిగా వస్తాయి.

తీగతో చేయబడిన పళ్ళెంలో గింజలను వేసి, సైజుల ప్రకారం వాటిని వర్గీకరిస్తారు, తర్వాత పొయ్యి మీద వేడి చేసి, వాటిలోని నీళ్ళ సాంద్రతను 4 నుండి 8 శాతం వరకు తగ్గిస్తారు. కొలిమిని వేడి చేయడానికి దొప్పలను యింధనంగా కాలుస్తారు. నీళ్ళ సాంద్రతను తగ్గించి, శీతలీకరించినట్లయితే, ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల వరకు వాటిని నిల్వ ఉంచవచ్చు. వాటి నాణ్యతను, రుచిని కాపాడడానికి, అల్యూమినియం కాగితాల్లో గాలిచొరబడకుండా ప్యాక్‌ చేసి ఎగుమతి చేస్తారు.

ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రజలు అనేక విధాలుగా ఆమెజోనియా కాయలను ఆస్వాదిస్తారు. కొంతమంది పప్పుదినుసులతో చేసే అల్పాహారంగా వాటిని ఉపయోగిస్తారు. మరి కొందరు చాక్లెట్లలోను, డ్రైడ్‌ ఫ్రూట్స్‌లోను కలుపుకొని తింటారు. మీరీసారి నోరూరించే యీ కాయను తినేటప్పుడు దీనికి, ఆమెజోనియా కాయ అనే కొత్త పేరుందని గుర్తుచేసుకోండి. (g94 8/22)

[15వ పేజీలోని చిత్రాలు]

ఆమెజోనియా కాయలు, వాటిని ఉత్పత్తిచేసే చెట్టు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి