కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 9/8 పేజీలు 16-18
  • నేను ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఎలా ఉండగలను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఎలా ఉండగలను?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకున్న స్నేహితులను గమనించండి
  • వినోదం—జాగ్రత్తగా ఎంపిక చేయవలసిన అవసరత
  • ఆ ఊహాకల్పితాలను విసర్జించండి!
  • నేనెందుకు ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఉండలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1994
  • సెక్స్‌ ఆలోచనల్లో మునిగితేలకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
  • సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • సెక్స్‌లో పాల్గొనమని తోటివాళ్లు ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 9/8 పేజీలు 16-18

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నేను ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఎలా ఉండగలను?

‘దినదినానికీ, వార్తాప్రసార విభాగం, లైంగికతను గురించిన ఎత్తిపొడుపులు, అవహేళనలతో యౌవనస్థుల నైతిక బలాన్ని క్షీణింపజేస్తుంది; లైంగిక సంబంధాలను గురించి రాక్‌ పాటలు వాళ్ల చెవులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి; బాగా అమ్ముడుపోయే ప్రేమకథలుండే నవలల దొంతర్లు లైంగిక వాస్తవాలను మీఠాయిలంత సులభంగా మింగేయగల తీయని కల్పితాలతో అల్లుతాయి.’ రచయిత్రి అయిన లెస్లే జేన్‌ నాన్‌కిన్‌ అలా చెప్పింది. అవును, యౌవనస్థులుగా, మీరు వ్యతిరేకలింగ వ్యక్తులను గురించి ఆలోచించడానికి వార్తాప్రచార విభాగం ద్వారా వచ్చే ప్రోద్బలంవలన ఉక్కిరిబిక్కిరి చేయబడుతున్నారు.

నిజమే, వ్యతిరేకలింగ వ్యక్తులపట్ల ఆసక్తి కలిగి ఉండడం సహజమే.a కానీ ప్రేమను గురించిన ఆలోచనలు, పగటి కలలు, ఊహలు మీ నిద్ర, ప్రార్థనలు, హోమ్‌వర్క్‌, బైబిలు పఠనం, లేక యింటి పనికి అభ్యంతరం కలిగించేంతగా మీ తలంపులను శాసిస్తే, కొంతకాలంనుండి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అది చూపుతుంది. వాస్తవానికి, అటువంటి అనారోగ్యకరమైన పూర్వాక్రమణం చెడు ప్రవర్తనకు కూడా దారితీయవచ్చు.—యాకోబు 1:14, 15.

అమ్మాయిలు—లేక అబ్బాయిలు—ఉనికిలో ఉన్నారనే విషయాన్ని కూడా గమనించడం మానేయమని దీనర్థం కాదు కానీ సామెతలు 23:12 చెబుతున్నట్లు, మీరు “ఉపదేశముమీద మనస్సు” నుంచాల్సిన అవసరం ఉంది. మీరలా చేయడానికి సహాయం చేసేందుకు ఏదో సులభ పరిష్కారం, లేక అద్భుతమైన మందేది లేదు. అయితే, ప్రయత్నం ద్వారా మీరు మీ ఆలోచనను సమతూకం చేసుకోగలరు. మీరు చేయగల ఆచరణాత్మక పద్ధతులు కొన్నింటిని యిప్పుడు చూద్దాము.

మీకున్న స్నేహితులను గమనించండి

మీకున్న స్నేహితులను ఒకసారి పరిశీలనగా వీక్షించండి. ఒక యౌవనస్థుడిలా ఒప్పుకున్నాడు: “మీ చుట్టూ ఉన్నవారంతా లైంగిక దుర్నీతిని గురించి, హోటల్లో భోజనం చేయడమంత సులభమైన విషయంలా మాట్లాడతారు.” అటువంటి సంభాషణను ఎడతెగక వినడం మిమ్మల్ని ప్రభావితం చేయగలదా? నిస్సందేహంగా చేయగలదు. యౌవనస్థులపై జరుపబడిన ఒక సర్వే ప్రకారం, “లైంగిక విషయాలపట్ల తమ ప్రవర్తనను, యితరుల్లా ఉండటం (లేక ఉండకపోవడమే) నడిపిస్తుందని,” మూడువంతుల మంది ఒప్పుకున్నారు.

మీ స్నేహితుల విషయమేమిటి? ప్రతి సంభాషణ వ్యతిరేక లింగానికి చెందిన వారిలో ఒకరిని గురించిన తీవ్రమైన చర్చకే దారి తీస్తుందా? అన్ని మాటలు హద్దులు మీరి, నీచంగా లేక చెడుగా మారుతున్నాయా? అలాగైతే, ఆ మాటల్లో పాల్పంచుకోడం—లేక కేవలం వినడం—మీరు మాన్యమైన సంగతులపై మనస్సును కేంద్రీకరించి ఉంచడాన్ని కష్టతరం చేస్తుంది. బైబిలిలా ప్రోత్సహిస్తుంది: “ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.”—కొలొస్సయులు 3:8.

ఒకవేళ మీ సహవాసులకు బైబిలు సూత్రాలంటే గౌరవం లేనప్పుడు, ఈ సలహాను పాటించడం కష్టమౌతుంది; సమయం గడిచే కొలది వాళ్ల ప్రవర్తనలు మీపై ప్రభావం చూపే అవకాశం ఎంతో ఉంది. (సామెతలు 13:20) ఒక క్రైస్తవ బాలిక అనుభవాన్ని గమనించండి, ఆమె యిలా చెప్పింది: “నేను యెహోవాసాక్షుల్లో ఒకరినని పాఠశాలలోని పిల్లలకు చెప్పాలని నేనిష్టపడలేదు. కాబట్టి వాళ్లు లైంగికతను గురించి నాతో ఎప్పుడూ ఎంతో చనువుగా మాట్లాడేవారు.” కొంతకాలానికే ఆమె లైంగిక దుర్నీతిలో పాల్గొని, గర్భవతి అయ్యింది. సామెతలు 9:6 జ్ఞానవంతంగా యిలా ప్రోత్సహిస్తుంది: “జ్ఞానములేని వారి సహవాసాన్ని విడిచిపెట్టి జీవించండి. జ్ఞానమార్గంలో నడవండి.” (టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌) అవును, మిమ్మల్ని ఆత్మీయంగా కూలదోసే వారు కాక నిర్మించే వారైన స్నేహితులతో, మీ వంటి క్రైస్తవ నైతిక సూత్రాలను, కట్టడలను కలిగియున్న స్నేహితులతో సహవసించండి.

నిజమే, సాధారణంగా దైవిక ప్రవర్తనను కనపర్చే యౌవన క్రైస్తవులు కూడా అప్పుడప్పుడూ “మాట యందు” తప్పిపోవచ్చు. (యాకోబు 3:2) అది జరిగి సంభాషణ తప్పు మార్గం వైపు వెళ్తున్నప్పుడు, మీరేమి చేయగలరు? రాజైన సొలొమోను ఒక యౌవన కాపరి బాలికను మోహించాడని బైబిలు చెబుతుంది, అయితే, ఆమెకు యితనంటే యిష్టంలేదు. కొంతమంది యౌవన సహచరులు ఆమెలో సొలొమోనుపట్ల వ్యామోహాన్ని రేకెత్తించాలని ప్రయత్నించినప్పుడు, ఆమె తాను ప్రేమను గూర్చిన మాటలచేత ముట్టడించబడడానికి అనుమతించలేదు. ఆమె యిలా వారించింది: “మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (పరమగీతము 2:7) అదే విధంగా, మాటలు హద్దు మీరితే మీరు మీ భావాలను దృఢంగా వ్యక్తపర్చాల్సిన అవసరం ఉండవచ్చు. లేదు, మీరు మీ స్నేహితులకు ఉపన్యాసమివ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు కేవలం అంశాన్ని మార్చి, సంభాషణను మంచి అంశంవైపు నడిపించవచ్చు.

వినోదం—జాగ్రత్తగా ఎంపిక చేయవలసిన అవసరత

శ్రద్ధ చూపవలసిన మరొక విషయం వినోదం. క్రొత్తగా వచ్చిన మూవీ, విడీయో, లేక కాంపాక్ట్‌ డిస్క్‌ చాలా మంచిగా అనిపించవచ్చు. అయితే, బైబిలు మనకిలా జ్ఞాపకం చేస్తుంది: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహాను 2:16) మొదట్లో ప్రస్తావించబడినట్లు, నేటి వినోదంలో చాలాశాతం లైంగిక భావాలను రేకెత్తించడానికే రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, ప్రసిద్ధ పాటలు, సినిమా, దుర్నీతిని చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి—తరచుగా పోర్నోగ్రఫీని చూపిస్తున్నాయి.

అటువంటి వినోదానికి మిమ్మల్ని మీరు గురిచేసుకుంటే అది మిమ్మల్నెలా ప్రభావితం చేయగలదు? రచయితైన జాన్‌ లాంగూన్‌ యిలా చెబుతున్నాడు: “మనం కామాన్ని కలిగించే సంగతులకు గురైతే, లైంగికతను గురించి ఎక్కువ మాట్లాడతామని . . . అనేక అధ్యయనాలు చూపించాయి. కొన్నిసార్లు, యిలా గురికావడం, మనం సాధారణంగా ప్రయత్నించని విషయాల కొరకు ప్రయత్నించేలా చేస్తుంది.” అవును, ‘శరీర విషయములపై మీ మనస్సునుంచడం’ కేవలం హానిని మాత్రమే కలిగిస్తుంది. (రోమీయులు 8:5) అది ప్రేమను, లైంగికతను గురించిన మీ దృష్టిని కలతపర్చి, మీ మనస్సును చెడు ఊహలతో నింపుతుంది. మరి బైబిలిచ్చే సలహా ఏమిటి? “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” (2 కొరింథీయులు 7:1) ప్రేమను గూర్చిన కోరికలను పురికొల్పే సినిమాలు, వీడియోలు, మరియు ఫోనోగ్రాఫ్‌ రికార్డులను తొలగించండి.

ఒక అవివాహితుడైన క్రైస్తవ పురుషుడు ఒకప్పుడు యిటువంటి ఆచరణాత్మక సలహానొకదాన్ని యిచ్చాడు: “పడుకునే ముందు చెడు విషయాలపై అవధానాన్ని నిలపకండి. దూరదర్శినిలో అర్థరాత్రి వచ్చే అనేక సినిమాలు చాలా చెడు నడిపింపునిచ్చేవిగా ఉంటాయి.” అనేక పుస్తకాలు కూడా అలాగే ఉన్నాయి. షెరీ అనే పేరుగల యౌవన క్రైస్తవురాలు యిలా చెబుతోంది: “నేను ప్రేమను గురించిన నవలలు చదివేదాన్ని. నేను లైంగికతను గురించి ఊహా స్వప్నాల్లో విహరించే దాన్ని, ఉల్లాసకరమైన జీవితాన్ని, అనేకమంది లైంగిక భాగస్వాములను గురించి కలలుకనేదాన్ని.” ప్రేమ ఊహలను మనస్సునిండా ఉంచుకుని, ఆమె ఒక యౌవన పురుషుని కౌగలించుకొని, ముద్దుపెట్టుకోడంలో సులభంగా నిమఘ్నమైంది. ఈ పత్రిక మరియు దీనితోపాటు వచ్చే కావలికోట—వంటి మంచి పత్రికలను చదివితే అటువంటి సమస్యలను నివారించవచ్చు. అలాంటివి చదవడం అనేకమంది యౌవనులు దిగజారిన శరీర విషయముల మీదకాక ‘ఆత్మవిషయములమీద మనస్సు’ నిలపడానికి సహాయం చేసింది.—రోమీయులు 8:5.

ఆ ఊహాకల్పితాలను విసర్జించండి!

కొన్నిసార్లు వ్యతిరేక లింగ వ్యక్తులను గురించిన తలంపులు హెచ్చరించకుండానే అనుకోకుండా మీ మదిలోకి వస్తాయి. పదిహేను సంవత్సరాల స్కాట్‌ యిలా చెబుతున్నాడు: “నా మనస్సులోనుండి లైంగిక విషయాలను తొలగించడం కొన్నిసార్లు మరీ కష్టమౌతుంది.” లేక బహుశా మీరు ఒక చక్కటి అబ్బాయినో లేక అమ్మాయినో చూస్తారు. మీరు గుర్తించక ముందే, మీరు అతను లేక ఆమెను గురించి ఆలోచిస్తుంటారు. ఎవరైనా ఆకర్షణీయంగా ఉన్నారని గమనించడం ఒక విషయమైతే, దానిని చేయకూడదని యేసు హెచ్చరించిన పనైన ‘ఒక స్త్రీని మోహపుచూపుతో చూచుట’ పూర్తిగా వేరే విషయం. (మత్తయి 5:28; మరి సామెతలు 6:25 పోల్చండి.) మీరు వివాహం చేసుకోడానికి వీలుపడనంత చిన్నవారైతే, మళ్లీ మళ్లీ జ్ఞాపకమొచ్చే ప్రేమ ఊహలను గురించి ఆలోచించడం మిమ్మల్ని కృంగదీసి నిరుత్సాహపర్చడం మాత్రమే చేయగలదు.—సామెతలు 13:12 పోల్చండి.

అందుకే స్కాట్‌ యిలా చెబుతున్నాడు: “అంశాన్ని మార్చి—నేను తొందరపడేలా చేసే ఆలోచనలను నా మదిలోనుండి తీసివేయడమే నాకు సహాయం చేసింది. ఈ భావాలు లేక తృష్ణ కొంత సమయానికి పోతాయని నాకు నేను చెప్పుకున్నాను.” (ఫిలిప్పీయులు 4:8 పోల్చండి.) అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “నా శరీరమును నలుగగొట్టి, దానిని లోబరచుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 9:27) అదే విధంగా, వ్యతిరేక లింగ వ్యక్తులను గురించిన తలంపులు మళ్లీ మొదలవ్వడానికి ప్రయత్నిస్తే మీరు కూడా మీపట్ల కఠినంగా ప్రవర్తించండి. ఒకవేళ ఆలోచనలు మొండిపట్టుపడితే, భౌతిక వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. “శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును,” మరి బ్రిస్క్‌వాక్‌ లేక కొద్ది నిమిషాలపాటు కసరత్తు చేయడం, మీరు మళ్లీ మంచి ఆలోచనలతో నింపబడడానికి అవసరం కావచ్చు.—1 తిమోతి 4:8.

“ప్రభువు కార్యాభివృద్ధియందు” ఎంతో చేయడం ప్రాముఖ్యంగా సహాయకరంగా ఉండగలదని అనేకమంది యౌవనులు తెలుసుకున్నారు. (1 కొరింథీయులు 15:58) యౌవనస్థురాలైన డెబ్రా యిలా చెబుతుంది: “మీకు నిస్సత్తువ కలిగేంత వరకు పని చేయడమే కిటుకని నేను కనుగొన్నాను.” క్రైస్తవ సంఘం, దాని అన్ని కార్యకలాపాలలో నిమఘ్నమవ్వడం, మీరు మీ ఆలోచనలను సమతూకంగా ఉంచుకోడానికి సహాయం చేయగలవు.

అయితే, మీరు ప్రయత్నం చేసినా, కొన్నిసార్లు వ్యతిరేక లింగ వ్యక్తులను గురించి తలంచకుండా ఉండటం మీకు చాలా కష్టం కావచ్చు. అలాగైతే, పెద్దవారి సహాయాన్ని అడగండి. బహుశా మీరు మీ తల్లిదండ్రులలో ఒకరితో విషయాన్ని చర్చించవచ్చు. యౌవనస్థుడైన కార్ల్‌ చెప్పేదాన్ని గమనించండి: “పెద్దవారు, అనుభవంగల వారితో మాట్లాడడం నాకు ఎంతో సహాయం చేసింది. ఎంత యథార్థంగా మాట్లాడితే అంత మంచిది.” అన్నిటికంటే మిన్నగా, మీ పరలోకపు తండ్రి సహాయాన్ని ఎన్నడూ చిన్నచూపు చూడకండి. “లైంగిక తృష్ణ ఎక్కువగా ఉందని నేను గమనించినప్పుడు, నేను తప్పక ప్రార్థించే వాడినని,” ఒక అవివాహితుడైన క్రైస్తవుడు చెబుతున్నాడు. బైబిలిలా చెబుతోంది: “మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.” (హెబ్రీయులు 4:16) దేవుడు వ్యతిరేక లింగ వ్యక్తులపట్ల మీ ఆసక్తిని తీసివేయడు. కానీ ఆయన సహాయంతో, ఆలోచించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని మీరు కనుగొంటారు. (g94 8/8)

[అధస్సూచీలు]

a ఆగస్టు 8, 1994 సంచికలోని, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేనెందుకు ఆ వ్యక్తిని గూర్చి తలంచకుండా ఉండలేకపోతున్నాను?” అనే శీర్షికను చూడండి.

17వ పేజీలోని చిత్రం]

వ్యతిరేక లింగ వ్యక్తులను గురించిన చర్చ హద్దు మీరితే, అంశాన్ని మార్చగల ధైర్యాన్ని కలిగి ఉండండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి