కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 11/8 పేజీలు 8-9
  • ఒక ఆఫ్రికా నగరంలో పెరుగుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక ఆఫ్రికా నగరంలో పెరుగుట
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠశాలకు వెళ్లుట
  • బట్టలుతకడం, నీళ్లు తేవడం
  • పిల్లలే భద్రత
  • మీ పిల్లవాడు బోర్డింగ్‌ స్కూల్‌కు వెళ్లాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • దేవుని సేవలో ఐక్యమైయున్న పెద్ద కుటుంబాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పాఠశాలలో మీ పిల్లలు స్థిరంగా ఉంటున్నారా?
    మన రాజ్య పరిచర్య—1990
తేజరిల్లు!—1992
g92 11/8 పేజీలు 8-9

ఒక ఆఫ్రికా నగరంలో పెరుగుట

ప్రపంచంలోని అత్యధిక జనాభాగల దేశాలలో, సహారా ఎడారి పరిసర ప్రాంతాల్లోని ఆఫ్రికా దేశాల జనాభా పెరుగుదల చేరియున్నది. అక్కడ, ప్రతి స్త్రీ సరాసరి ఆరుగురు పిల్లలను కంటుంది. పేదరికం, పర్యావరణ క్షీణత, మరియు వనరుల కొరత దీనికింకా ఆజ్యం పోస్తుంది. ఆ ప్రాంతంలోని జీవనమెలా వుంటుందో ఇచ్చట మీకు ప్రత్యక్ష సమాచార మివ్వబడింది.

ఒక పెద్ద పశ్చిమాఫ్రికా నగరంలో నేను పెరిగాను, మా ఇంట్లో ఏడుగురం పిల్లలమున్నాం, గానీ ఇద్దరు బాల్యంలోనే చనిపోయారు. మా ఇల్లంతా అద్దెకు తీసికున్న ఒక పడక గది మరియు చావడి. అమ్మనాన్నలు పడక గదిలో పడుకునే వారు, మేం పిల్లలమంతా చావడిలో క్రింద చాపవేసుకుని ఆడపిల్లలొకవైపు మగపిల్లలొకవైపు పడుకునేవారం.

ఇరుగుపొరుగున అనేకులవలె మాకు కూడ డబ్బు ఎక్కువ ఉండేది కాదు. అన్నివేళలా మాకవసరమైన వాటిని పొందలేదు. కొన్నిసార్లు సరిగా అన్నమే దొరికేది కాదు. ఒక్కొక్కరోజు ప్రొద్దునపూట చద్ది అన్నం తప్ప మరేమి వుండేది కాదు. కొన్నిసార్లు అదీ దొరికేది కాదు. ఇంటిని పోషించేవాడు భర్తగనుక ముందు ఆయన, తర్వాత భార్య మిగిలింది పిల్లలు తినాలి అని కొందరు వాదించినట్లు కాకుండ మా అమ్మానాన్న వాళ్లేమి తినకుండ ఉన్నా ఆకాస్త మాకు ముందు తినబెట్టేవారు. వారి త్యాగాన్ని నేను మెచ్చుకొనేవాన్ని.

పాఠశాలకు వెళ్లుట

మగపిల్లలే బడికెళ్లాలని కొందరు ఆఫ్రికాలో నమ్ముతారు. ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకొని తమ భర్తల దగ్గరకు వెళ్తే వారే పోషిస్తారు గనుక వీరికి చదువక్కర్లేదని అనుకుంటారు. మా అమ్మానాన్నలు అటువంటి అభిప్రాయం చూపలేదు. మా ఐదుగురిని బడికి పంపించారు. అయితే ఆర్థికంగా మా తలిదండ్రులకు భారమే అయింది. పెన్‌, పెన్సిల్‌ లాంటివి అంత సమస్యకాదనుకోండి, గానీ పాఠ్య పుస్తకాలు చాలా ఖరీదైయుండెను, స్కూల్‌ యూనీఫారంలు కూడ అంతే.

నేను బడికి వెళ్లేటప్పుడు నాకు బూట్లు లేవు. నాకు 14 ఏండ్లు వచ్చేటప్పటికి గానీ అంటే సెకండరీ స్కూలుకు వచ్చినతర్వాతే మా తలిదండ్రులు నాకు బూటు కొని యివ్వగలిగారు. అంటే నాకెప్పుడు బూట్లు లేవని అర్థం కాదు. నాకున్న బూట్లు చర్చీకి తొడుక్కొని వెళ్లడానికి మాత్రమే గాని వేరే ఎక్కడికీ, స్కూలుకు కూడ వాటిని నేను వేసుకోకూడదు. వట్టికాళ్లతోనే వెళ్లవలసి వచ్చేది. కొన్నిసార్లు మానాన్న బస్‌ టికెట్లు కొని ఇచ్చేవాడు గానీ ఆయన ఇవ్వలేనప్పుడు మేము స్కూలుకు నడిచి వెళ్లి వచ్చేవారం. రానుపోను షుమారు ఆరు కిలోమీటర్లుంది.

బట్టలుతకడం, నీళ్లు తేవడం

మా బట్టలను మేము ఓ కాలువలో ఉతుక్కొనే వారం. మా అమ్మ ఓ పాత్ర, సబ్బు ముక్క బట్టలు తీసుకొని వెళ్తుంటే నేను కూడ వెళ్లేవాన్ని. అమ్మ పాత్రలో నీళ్లు తీసుకొని బట్టలు తడిపి సబ్బుపెట్టి ఒక నున్నని బండకేసి కొట్టి వాటిని ఉతికి కాలువలో ముంచి తీసేది. తడిసిన వాటిని ఇంటికి తీసికెళ్లడం బరువు గనుక బట్టలను వేరే బండలమీద ఆరబెట్టేది. నేను చిన్నవాన్ని గనుక ఆరిన బట్టలు ఎవరూ దొంగిలించకుండ నన్నక్కడ కావలిగా పెట్టేది. ఎక్కువపని అమ్మే చేసేది.

కొందరి ఇండ్లకు నీళ్ల కుళాయిలుండేవి, గనుక ఇంటి పనిలో భాగంగా నేను బకెట్‌ తీసుకుని వెళ్లి బయటవున్న కుళాయిలో నీళ్లు పట్టుకుని వచ్చేవాన్ని. ఎండాకాలములో చిక్కువచ్చేది, బయటవున్న నీళ్ల కుళాయిలన్నిటికి నీటిని భద్రపరచేందుకు తాళాలు వేసేవారు. ఒకసారి ఒక రోజంతా మేము నీళ్లే తాగలేదు. ఒక్క చుక్క నీళ్లు లేవు. ఒక్క బకెట్‌ నీళ్లకొరకు నేను కొన్నిసార్లు మైళ్ల తరబడి నడిచేవాన్ని. నా తలమీద పెట్టుకొని అంతదూరం నడిచేసరికి నా నెత్తిమీద వెంట్రుకలు వూడిపోయేవి. నా పదవ ఏటనే నాకు బట్టతలలాగ వచ్చింది. అయితే సంతోషకరంగా మరల తల వెంట్రుకలు పెరిగాయనుకోండి.

పిల్లలే భద్రత

గతాన్నిచూస్తే, ఆఫ్రికాలో మా ప్రాంతాన్ని పరిశీలిస్తే మా జీవనోపాధి ఇతరులకంటె సరాసరి మెరుగ్గావున్నట్లు బహుశా అంతకంటె ఎక్కువేనని చెప్పవచ్చును. మాకంటె హీనంగా వున్న చాలా కుటుంబాలు నాకు తెలుసు. నా మిత్రులలో అనేకమంది స్కూలుకు ముందు, అయిపోయిన తర్వాత ఏదో ఒకటి అమ్మి డబ్బుతెస్తేనే ఇల్లు గడిచేది. కొందరు బడికి రాకముందు ఏమి తినకుండానే వచ్చేవారు, ఏమి తినకుండానే బడిలో రోజంతా ఉండేవారు. ఇలా అనేకసార్లు వారిలో ఎవరో ఒకరు మధ్యాహ్నం పూట నా దగ్గరకు వచ్చి నేను తినే రొట్టెకొరకు బ్రతిమిలాడేవారు. అప్పుడు నేను ఒక ముక్కత్రుంచి ఇచ్చేవాన్ని.

అలాంటి కష్టాలు ఇబ్బందులున్నప్పటికీ అనేకమంది ప్రజలు యింకా పెద్ద కుటుంబాలు కావాలని కోరుకుంటున్నారు. “ఒకబిడ్డ బిడ్డే కాదు” అని ఇక్కడ ప్రజలంటారు. “ఇద్దరు పిల్లలంటే ఒక్కరు, నలుగురంటే ఇద్దరు.” అలా ఎందుకంటారంటే ప్రపంచంలోని శిశుమరణాల సంఖ్యలో ఇక్కడే అత్యధికులు చనిపోతున్నారు. తలిదండ్రులకు తెలుసువారి పిల్లలలో కొందరు చనిపోతారని, కొందరు బ్రతికి పెరిగి పెద్దవారై ఉద్యోగం సంపాదించుకొని ఇంటికొరకు డబ్బు తెస్తారు. అప్పుడు వారు వృద్ధులైన వారి తలిదండ్రులను పోషించగలరు. సాంఘిక భద్రతంటూ ఏమిలేని అటువంటి దేశంలో అదెంతో ప్రాముఖ్యం.—డోనాల్డ్‌ విన్సెంట్‌ చెప్పినది. (g91 11⁄8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి