కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 11/8 పేజీలు 10-14
  • ప్రపంచ జనాభా—భవిష్యత్తు సంగతేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ జనాభా—భవిష్యత్తు సంగతేమిటి?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చాలా ఎక్కువ మంది ప్రజలున్నారా?
  • చాలినంత ఆహారం ఉంటుందా?
  • పర్యావరణ సంగతేమిటి?
  • అసలు సమస్య
  • ఓ బంగారు భవిష్యత్తు ఉన్నదా?
  • ప్రపంచ జనాభా పెరుగుదల—ఒక ప్రధాన సమస్య
    తేజరిల్లు!—1992
  • గందరగోళపు వాతావరణం
    తేజరిల్లు!—1998
  • పిల్లలు—లాభమా నష్టమా?
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1992
g92 11/8 పేజీలు 10-14

ప్రపంచ జనాభా—భవిష్యత్తు సంగతేమిటి?

ఇండ్ల కొరత, పారిశుధ్య లోపం, ఆహారం, నీటి కొరత, వ్యాధి, కుపోషణ—ఇవి మరి ఇతర అనేక కష్టాలు ప్రపంచ జనాభాలోని అధికుల జీవితాలలో దినదినం సంభవించే వాస్తవాలు. అయినను మనం గమనించిన రీతిగా, అటువంటి పరిస్థితులలో జీవించే ప్రజలు ఏదోవిధంగా వాటిని అధిగమించి దైనందిన జీవితాన్ని గడుపుతున్నారు.

మరైతే భవిష్యత్తు సంగతేమిటి? ప్రజలు నిరంతరం జీవితంలో అటువంటి బాధలనను అనుభవించవలసిందేనా? వీటికి తోడు, జనాభా పెరుగుదల మూలంగా నాశవినాశములు కలుగునని పర్యావరణ శాస్త్రజ్ఞులును ఇతరులును భవిష్యత్తును గూర్చి చెప్పే విషయమేమిటి? మనమాధారపడి జీవిస్తున్న నేలను నీటిని, గాలిని కలుషితం చేయడంద్వారా మనం మన స్వంత గూటినే నాశనం చేసుకుంటున్నామని వారంటున్నారు. వారు హరితగృహ ప్రభావం (గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్టు)—అంటే భూవాతావరణమును అపాయకరంగా మార్చి పర్యావరణమునంతటిని ఉష్ణంగా మార్చగల గ్యాస్‌లు అనగా కార్బన్‌ డై ఆక్సైడ్‌, మిథేన్‌, క్లోరోఫ్లోరో కార్బన్‌లవంటి గ్యాస్‌లు వెలువడుతున్నవని కూడ వారు వేలెత్తి చూపిస్తున్నారు. మనకు తెలిసిన మానవ సమాజమునకు చివరికిది నాశనం తెస్తుందా? ముఖ్యాంశములను కొన్నింటిని మనం యింకా క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

చాలా ఎక్కువ మంది ప్రజలున్నారా?

అసలు ప్రపంచ జనాభా అనంతం పెరిగిపోతూనే వుంటుందా? ఎంతవరకు పెరుగుతుందనే సూచనేమైనా వున్నదా? కుటుంబ నియంత్రణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రపంచ జనాభా పెరుగుచున్నదనుట వాస్తవమే. సంవత్సరానికి 9 కోట్ల జనాభా పెరుగుతుంది (సంవత్సరానికి మరో మెక్సికో అంత). దానిని అరికట్టే మార్గమేది వెంటనే కనబడటం లేనట్లుంది. అయినను, జనాభా లెక్కల సేకరణ పండితులనేకులు అంగీకరించునదేమనగా జనాభా ఒకనాటికి పెరగకుండ నిలిచిపోతుంది. ఎంతవరకు, ఎప్పుడు అలా జరుగుతుంది అనేది వారి మనస్సులోని ప్రశ్న.

ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఊహాకల్పనల ప్రకారం ప్రపంచ జనాభా 1,400 కోట్లకు చేరి అప్పుడు నిలిచిపోతుంది. అయితే ఇతర అంచనా ప్రకారం అది 1,000 నుండి 1,100 కోట్లకే శిఖరాగ్ర స్థానానికి చేరవచ్చును. ఏదేమైనను ప్రధానమైన ప్రశ్న లేమనగా: చాలా ఎక్కువమంది ప్రజలుంటారా? ప్రస్తుత జనాభాకు రెండు మూడురెట్లు ప్రజలను భూమి భరించగలదా?

గణాంకముల ప్రకారం చూస్తే, ప్రపంచమంతట వుండబోవు 1,400 కోట్లమంది ప్రజలు ఒక చదరపు కిలోమీటరుకు సరాసరి 104 మంది వుంటారు. మనం ముందే గమనించినట్లు హాంకాంగ్‌ జనసాంద్రత చదరపు కిలోమీటరు ఒక్కంటికి 5,592 మంది ఉన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్‌ జనసాంద్రత 430 మంది, జపాన్‌ 327 మంది, మరి యీ దేశాలు సరాసరి కంటె ఉన్నతమై జీవన స్థితిగతులను అనుభవిస్తున్నాయి. గనుక ప్రపంచ జనాభా, ముందు అనుకున్నంత విస్తారంగా పెరిగినను ప్రజల సంఖ్య ఒక సమస్యగా పరిణమించదు.

చాలినంత ఆహారం ఉంటుందా?

మరి ఆహార సరఫరా సంగతేమిటి? 1,000 నుండి 1,400 కోట్ల జనాభాకు సరిపడేంత ఆహారాన్ని భూమి ఉత్పత్తి చేయగలదా? నిజానికి, ప్రస్తుత ప్రపంచ ఆహారోత్పత్తి అంత జనాభాకు సరిపోదనుకోండి. వాస్తవానికి మనం కరువు కాటకాలు, కుపోషణ, పస్తులుండే వార్తలు తరచూ వింటూవున్నాం. రెండుమూడురెట్ల జనాభా అటుంచి, అసలు ఇప్పుడున్న జనాభాకు సరిపడేంత ఆహారోత్పత్తి మనం చేయడంలేదని దీని భావమా?

దానికి సమాధానం కష్టమే, ఎందుకంటే “సరిపడునంత” అనేమాట భావం మీద దాని సమాధానం ఆధారపడివుంది. ప్రపంచంలో అతి బీద దేశాల్లోని కోటానుకోట్ల ప్రజలు ఒక్కపూట కూటికి లేదా పుష్టిగల ఆహారం లేక మాడి పోతుంటే, పారిశ్రామిక దేశాల్లోవున్న ధనవంతులు అధిక పుష్టిగల ఆహారాన్ని సేవిస్తూ—గుండెపోటు, కొన్నిరకాల క్యాన్సర్‌ వ్యాధులు, గుండెజబ్బు మొదలగు వాటివలన బాధననుభవిస్తున్నారు. ఇది ఆహార పరిస్థితిపై ఎట్టి ప్రభావం చూపుతుంది? ఒక లెక్కప్రకారం ఒక్క కిలో మాంసాన్ని ఉత్పత్తిచేయడానికి ఐదు కిలోల ధాన్యం కావాలి. ఆ విధంగా చూస్తే ప్రపంచములోని నాలుగోవంతు మాంసాహారులు ప్రపంచ ధాన్య ఉత్పత్తిలో దాదాపు సగభాగం తింటున్నారని అర్థం.

మొత్తం ఆహారోత్పత్తికి సంబంధించిన విషయానికొస్తే బ్రెడ్‌ ఫర్‌ ది వరల్డ్‌ అనే పుస్తకం చెప్పే విషయాన్ని గమనించండి: “ప్రస్తుత ప్రపంచ ఆహారోత్పత్తిని ప్రపంచ ప్రజలకు సమానంగా పంచిపెడితే, కొంచెం వృధాపోగా, అది ప్రతిఒక్కరికి సరిపోతుంది. బహుశా చాలినంతగా సరిపోతుంది.” ఇది 15 సంవత్సరముల క్రితం 1975 లో చెప్పిన మాట. మరి ఈనాటి పరిస్థితి ఏమిటి? ప్రపంచ వనరుల ఇన్‌స్టిట్యూట్‌ ప్రకారం, “గత రెండు దశాబ్దములనుండి ప్రపంచంలో మొత్తం ఆహారోత్పత్తి అవసరమైన దానికంటె అధికమైంది. తత్ఫలితంగా, ఇటీవలి సంవత్సరాలలో అంతర్జాతీయ మార్కెట్లలో ఆహార వస్తువుల ధరలు నిజంగా పడిపోయినవి.” ఇతర అధ్యయనములు చూపునదేమనగా అదేకాలంలో బియ్యం, జొన్న, సోయాచిక్కుళ్లు, ఇతర ధాన్యముల ధరలు సగాని కంటె ఎక్కువే తగ్గిపోయినవి.

దీనియంతటి భావమేమంటే, ఎంతమేరకు ఉత్పత్తి చేస్తున్నారనేది ప్రధాన ఆహార సమస్యకాదు, దాన్నెలా, ఎంతవరకు వినియోగిస్తున్నారు అనేదే సమస్య. ప్రస్తుత ఉత్పత్తిని రెండింతలు చేయగల్గే ఓ నూతన ఉత్పదనా సాంకేతిక పరిజ్ఞానం రకరకాల బియ్యాన్ని, గోదుమలను, మరియు ఇతర ధాన్యాన్ని తయారుచేయగల పద్ధతులను కనిపెట్టింది. అయినను, యీ రంగములో ఉపయోగించే పరిజ్ఞానమంతా ముఖ్యంగా వాణిజ్య పంటలమీద అనగా పొగాకు టమాట వంటి వాటిమీద కేంద్రీకరించి బీదవారి కడుపు నింపేబదులు ధనవంతుల కోరికలు తీర్చుతున్నారు.

పర్యావరణ సంగతేమిటి?

మానవుని భవిష్యత్తు క్షేమానికి ముప్పుగా పరిణమించే అనేకమైన వాటిలో యీ జనాభా పెరుగుదల ఒకటి మాత్రమేనని ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించే వారనేకులు గ్రహిస్తున్నారు. ఉదాహరణకు, ది పాపులేషన్‌ అనే పుస్తకంలో పాల్‌ మరియు ఆనీ ఎర్లిక్‌ అనువారు యీ సాధారణ సమీకరణ మూలంగా మన పర్యావరణం మీద మానవుని కార్యాచరణ పరిణామం యిలావుంటుందని సూచించారు: పరిణామం = జనాభా × సంపద స్థానం × పర్యావరణంపై ప్రస్తుత సాంకేత పరిజ్ఞానముల ప్రభావం.

ఈ కొలతనుబట్టి రచయితలు వాదించునదేమంటే అమెరికా వంటి దేశాలు అధిక జనాభాకలిగి వున్నాయి, వాటిలో చాలామంది ప్రజలుండుట వలన కాదు గానీ వారి సంపద స్థానమునుబట్టి పర్యావరణంపై అత్యధిక భారం మోపే విధంగా సాంకేతిక పరిజ్ఞానములను, సహజవనరులను అధికంగా వినియోగిస్తున్నారు.

ఇతర అధ్యయనములు దీనిని స్థిరపరస్తున్నవి. ‘హరిత గృహ పరిస్థితులు కలిగించే పదార్థాలను ఉత్పత్తిచేసే వారి సంఖ్యకంటె, వారి ఆర్థికపరమైన కార్యాక్రమముల స్థాయితో దగ్గర సంబంధం ఉంది. సగటు అమెరికా దేశీయుడు, సగటు భారతీయుని కంటె 19 రెట్లు ఎక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తయారు చేస్తున్నాడు. ఉదాహరణకు జనాభా పెరుగుదల అధికంగా వుంటూ పేద దేశంగా ఉండే బ్రెజిల్‌ కంటె, జనాభా పెరుగుదల నెమ్మదిగా వుండి ఆర్థిక సంపదతో తులతూగు బ్రెజిలే ఎక్కువ వేగంగా దాని ఉష్ణమండల అడవులను కాల్చివేయగలదు,’ అని ఆర్థిక శాస్త్రవేత్త డానియెల్‌ హామెర్‌ మెష్‌ చెప్పినట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌ వ్రాసింది.

వరల్డ్‌వాచ్‌ ఇస్టిట్యూట్‌కు సంబంధించిన అలెన్‌ డర్నిన్‌ అటువంటి విషయాన్నే తెల్పుచూ ఇలా అంటున్నాడు: “ప్రపంచంలో వున్న యీ నూరుకోట్ల ధనవంతులు నిర్లక్ష్యముగ ధనవ్యయం చేస్తూ, అభిలషణీయమైన నాగరికతను సృజించినందున యీ భూగోళం ప్రమాద స్థితిలో వున్నది. ఈ వర్గం యొక్క జీవిత సరళి—అనగా కారు డ్రైవర్లు, మాంసప్రియులు, సోడా త్రాగేవారు, వుపయోగించిన వస్తువులను పారవేసే వినియోగదారులు—అతి తీవ్రమైన రీతిగా, బహుశా జనాభా పెరుగుదలకంటె అధికంగా పర్యావరణ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మానవజాతి లోని యీ “ధనవంతులైన ఐదవభాగం,” దాదాపు పదిలో తొమ్మిది వంతుల క్లోరోఫ్లోరోకార్బన్‌లను, మరియు వాతావరణమునకు ప్రమాదకరమైయున్న ఇతర హరితగృహ గ్యాస్‌లలో సగంకంటె ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది.

అసలు సమస్య

పైచర్చ మూలంగా ఈనాడు మానవజాతి ఎదుర్కొంటున్న వేదనలకు జనాభా పెరుగుదలయే ముఖ్యకారణమనుటలో అసలు విషయాన్ని మరుగుచేయుటవంటిదని స్పష్టమౌతుంది. మన మెదుర్కొనే అసలు సమస్య మనకు స్థలం చాలడం లేదనిగానీ, లేక ప్రతి ఒక్కరికి కావలసిన ఆరోగ్యవంతమైన భోజనం కొరకు ఆహారాన్ని భూమి తయారుచేయజాలక పోతుందని గానీ లేక ఉన్న సహజవనరులన్ని త్వరలోనే వినియోగించబడతాయనే విషయం కాదు. ఇవి కొన్ని గుర్తులు మాత్రమే. అసలు సమస్యయేమంటే అనేకులు అత్యధికంగా వస్తువినియోగం చేయాలనే ఆశిస్తున్నారుగానీ అందు మూలంగా కలుగబోయే ఫలితాలను లెక్కచేయడంలేదు. అధిక వినియోగంచేయాలనే యీ పేరాశ మన పర్యావరణమును దెబ్బతీస్తుంది మరియు భూమి మోయగలిగే భారంకంటె మించిపోతుంది. మరోమాటలో చెప్పాలంటే అసలు సమస్య, మానవ జనాభా సంఖ్యతో లేదు గానీ వారు జీవించే విధానంలో ఉంది.

రచయిత ఆలెన్‌ డర్నిన్‌ ఈ విధంగా వివరిస్తున్నాడు: “పెళుసైన యీ జీవన చక్రంలో మానవజాతి మనుగడ మనం లోతైన ఆశానిగ్రహాన్ని అలవర్చుకొనగలమా లేదాయనే దాని మీద ఆధారపడియుండవచ్చు, ఆశా నిగ్రహం అనునది మితవినియోగం అనే సర్వవ్యాపిత నీతి సూత్రం మీదను, ధనాశ లేకుండ వుండుటయనే దానిమీదను ఆధారపడియున్నది.” అసలు విషయాన్ని సరిగ్గా అంగీకరించారు, గానీ ఓ ప్రశ్న అడుగ వలసివస్తుంది, ప్రతిచోట ప్రజలు స్వచ్ఛందంగానే ఆశా నిగ్రహం కల్గి, మితవినియోగంచేసి, ధనాశ లేకుండ వుండగలరా? కష్టమే. ఈనాటి స్వార్థపరాయణత్వం, ఆనందమే పరమానందంగా భావించే జీవన సరళినిబట్టి పరిశీలిస్తే, దానికి వ్యతిరేకం జరిగేదే ఖాయమనిపిస్తుంది. ఈనాడు అత్యధిక ప్రజలు యీ నియమం ప్రకారం జీవిస్తున్నట్లున్నారు: “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.”—1 కొరింథీయులు 15:32.

చాలామంది యీ సత్యాలను గ్రహించి వారి జీవిత విధానాన్ని మార్చుకొనుటకు ప్రారంభించినను అంతత్వరలో మనం పరిస్థితిని పూర్తిగా మార్పుచేయుటకు సాధ్యపడదు. అనేక పర్యావరణ ప్రచార గుంపులను, కొన్ని సంవత్సరాలుగా మారుతూ వస్తున్న జీవిత విధానములను గమనించండి. వాటిలో కొన్ని వార్తలకెక్కుటలో విజయం సాధించియుండవచ్చును, గానీ అధిక భాగమైన వారి విధానములలో నిజమైన ఫలితాన్ని సాధించగల్గినవా? లేదే. మరేమిటి సమస్య? అదేమనగా యీ విధానమంతా—వ్యాపార, సాంస్కృతిక, రాజకీయ విధానము—ప్రతిది క్రమేణ లయమైపోవునని, వినియోగించి పారవేయ వలసినవనే తలంపును వృద్ధి చేయుటకు నడుం కట్టుకుంది. ఇందునుబట్టి పునాది నుండే పూర్తిగా పునర్నిర్మించే పద్ధతిలేకుండా ఏ మార్పు జరుగదు. దానికి ఎంతో పునర్విద్య అవసరం.

ఓ బంగారు భవిష్యత్తు ఉన్నదా?

ఈ పరిస్థితిని ఓ దాత అన్ని వసతులున్న తన ఇంటికి ఓ కుటుంబానికిచ్చిన దానితో పోల్చవచ్చును. వారు స్వగృహంలో వున్నట్లే భావించులాగున వారు తనివితీర అందులోని అన్ని సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవచ్చుననే అనుమతిని పొందారు. అయితే ఆ కుటుంబము వస్తు సామాగ్రిని పాడుచేస్తూ, నేలను పగలగొడుతూ, కిటికీలను ముక్కలు చేస్తూ, పారిశుద్ధ్యపు గొట్టాలను నిండిపోనిస్తూ, అధికంగా కరెంటును ఉపయోగిస్తూవుంటే—క్లుప్తంగా చెప్పాలంటే—ఇంటిని పూర్తిగా ధ్వంసం చేస్తుంటే ఏమౌతుంది? యజమానుడు చూస్తూ ఊరకుంటాడా? బహుశా ఊరుకోడు. అద్దెకున్న అట్టి వినాశకరమగు వారిని తన ఇంటినుండి తీసివేయుటకు నిశ్చయంగా చర్యతీసికుని, దాన్ని యథాస్థితికి తెస్తాడు. అది న్యాయంకాదని ఎవరూ అనరు.

మరి మానవ కుటుంబం సంగతేమిటి? మనం సృష్టికర్తయైన యెహోవా దేవుడిచ్చిన నిండైన వస్తు సామాగ్రితో కళకళలాడే అందమైన గృహంలో అద్దెకున్నవారివలె లేమా? అవును, కీర్తనల రచయిత చెప్పినట్లే మనమలాగేవున్నాం: “భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.” (కీర్తన 24:1; 50:12) జీవితంలో మనకవసరమైన వాటన్నింటిని—వెలుతురు, గాలి, నీరు మరియు ఆహారమును—దేవుడు దయచేయుటయేగాక, జీవితం యింకా ఆనందభరితంగా వుండునట్లు వాటిని రకరకాలుగా సమృద్ధిగా అనుగ్రహించాడు. అయినను అద్దెకున్న వారిగా మానవజాతి ఎలా ప్రవర్తించారు? బాగుగా ప్రవర్తించలేదనుట దురదృష్టకరం. మనం నివసిస్తున్న యీ గృహాన్ని మనం అక్షరార్థంగా నాశనం చేస్తున్నాం. యజమానుడైన యెహోవా దేవుడు ఏం చేస్తాడు?

“భూమిని నశింపజేయువారిని నశింపజేస్తాడు.” అదే దేవుడుచేయనై యున్నది. (ప్రకటన 11:18) మరి ఎలా చేస్తాడు? బైబిలిట్లు సమాధానమిస్తుంది: “ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

నిరంతరం నిలిచే దేవుని రాజ్య పరిపాలనలో ఏమి జరుగునని మనం నిరీక్షించగలం? యెషయా ప్రవక్త చెప్పిన మాటలలో రానైయున్న పరిస్థితిని గూర్చిన వివరణ మనకు ఇవ్వబడింది:

“జనులు ఇండ్లుకట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు. వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.”—యెషయా 65:21-23

అది మానవజాతికి ఎంతటి మహోజ్వలమైన భవిష్యత్తైయున్నది! దేవుడు కలుగచేయబోవు నూతన లోకంలో ఇండ్లు, ఆహారం, నీళ్లు, ఆరోగ్యకొరత మరియు అలక్ష్యత అను సమస్యలతో మానవజాతి బాధింపబడరు. చివరకు, విధేయులైన మానవజాతి దేవుని నడిపింపు క్రింద అధిక జనాభా భయమంటూ లేకుండా భూమిని నింపి దానిని లోపరచుకొందురు.—ఆదికాండము 1:28. (g91 11/8)

[13వ పేజీలోని బాక్సు]

ఆహారమెందుకు తరచూ ఖరీదుగా వుంటుంది?

ఆహార ధర నిజంగా తగ్గిపోతున్నప్పటికి, ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నట్లు సాధారణంగా తెలిసిందే. అలా ఎందుకు జరుగుతుంది? ఒక కారణమేమంటే పట్టణాలలో జనాభా పెరిగిపోవుట. ప్రపంచంలో పెరిగే పట్టణాలలోని ప్రజలకు ఆహారం అందించడానికి వాటిని చాలా దూరప్రాంతాల నుండి తరలించాల్సివస్తుంది. ఉదాహరణకు అమెరికా దేశంలో “ఒక్క ముద్ద అన్నం పంట పొలంనుండి 2,100 కిలోమీటర్లు ప్రయాణంచేసి ప్లేటులో పడుతుంది,” అని వరల్డ్‌ వాచ్‌ స్టడీ తెల్పుతుంది. వినిమయదారుడు ఆహారపు ధర మాత్రమే కాకుండ దాన్ని తయారుచేసి నిల్వజేసి కట్టి, రవాణా చేసినందుకు కూడ విలువ కట్టవలసి వస్తుంది.

[10వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

భూమి చుట్టున్న వాతావరణం సూర్యుని ఉష్ణాన్ని అడ్డుకుంటుంది. గానీ ఉత్పన్నమయ్యే ఉష్ణం—అగోచరమగు విద్యుదయస్కాంత తరంగముల ద్వారా—హరిత గృహ గ్యాస్‌ల మూలంగా అంత సులభంగా తప్పించుకోలేదు, గనుక భూ ఉపరితలంపైనున్న వేడి పెరుగుతుంది

హరిత గృహ గ్యాస్‌లు

విద్యుదయస్కాంత తరంగప్రభావమును తప్పించుకొనుట

అడ్డుకొనబడిన అగోచరమగు విద్యుదయస్కాంత తరంగములు

[12వ పేజీలోని చిత్రాలు]

ఒక కిలో మాంసము తయారుకావడానికి ఐదుకిలోల ధాన్యం కావాలి. ఆ విధంగా, చూస్తే, ప్రపంచ జనాభాలోని నాలుగవ వంతు ఉన్న మాంసాహారులు ప్రపంచ ధాన్య ఉత్పత్తిలో సగం భాగం తింటున్నారన్నమాట

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి