కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 143
  • పొగతాగడం తప్పా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పొగతాగడం తప్పా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • ఉల్లాసంగా ఉండడం కోసం గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను ఉపయోగించే విషయంలో బైబిలు ఏమైనా చెప్తుందా?
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
    తేజరిల్లు!—1996
  • పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • పొగాకు ప్రతివాదుల మాటలు నీటిమూటలు
    తేజరిల్లు!—1995
  • లక్షలాది ప్రాణాలు పొగలోనే కలిసిపోతున్నాయి
    తేజరిల్లు!—1995
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 143
సిగరెట్‌ తాగడం

పొగతాగడం తప్పా?

బైబిలు ఇచ్చే జవాబు

పొగతాగడంa లేదా ఇతర విధానాల్లో పొగాకును ఉపయోగించడం గురించి బైబిలు ఏమి చెప్పట్లేదు. అయితే ఆరోగ్యాన్ని పాడుచేసే అపరిశుభ్రమైన అలవాట్లను దేవుడు ఏ మాత్రం ఇష్టపడడని తెలిపే కొన్ని సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే పొగతాగడం తప్పే అని అర్థమౌతుంది.

  • జీవాన్ని గౌరవించండి. “దేవుడు . . . అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు.” (అపొస్తలుల కార్యాలు 17:24, 25) జీవం దేవుడిచ్చిన బహుమానం, కాబట్టి మన ఆయుష్షును తగ్గించే పొగతాగడం లాంటి అన్నీ అలవాట్లకు మనం దూరంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది చనిపోవడానికి ఒక ముఖ్య కారణం పొగతాగడమే, ఒకవేళ పొగతాగకపోతే వాళ్లు ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు.

  • సాటిమనిషిని ప్రేమించండి. “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.” (మత్తయి 22:39) ప్రజలు ఉండే చోట పొగతాగితే వాళ్లను ప్రేమించినట్లు కాదు. పొగతాగడం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు, పొగతాగే వాళ్లకన్నా వాళ్ల దగ్గర్లో ఉండి తరచూ దాన్ని పీల్చే వాళ్లకే ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

  • పవిత్రంగా ఉండండి. “మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుకోండి.” (రోమీయులు 12:1) “మన శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.” (2 కొరింథీయులు 7:1) పొగతాగడం అంటే పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండడానికి పూర్తి విరుద్ధమైన పని. ఎందుకంటే పొగాకును ఉపయోగించేవాళ్లు ఉద్దేశపూర్వకంగా శరీరానికి హాని కలిగించే విష పదార్థాలను తీసుకుంటారు.

ఉల్లాసంగా ఉండడం కోసం గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను ఉపయోగించే విషయంలో బైబిలు ఏమైనా చెప్తుందా?

బైబిల్లో, గంజాయి (వీడ్‌, పాట్‌ అని కూడా పిలుస్తారు) లేదా అలాంటి మత్తుపదార్థాల పేర్ల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ మనల్ని బానిసలుగా చేసుకునే అలాంటి పదార్థాలను ఉల్లాసంగా ఉండడం కోసం తీసుకోకూడదని చెప్పే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. ఈ కింది సూత్రాలతోపాటు పైన చర్చించిన సూత్రాలు కూడా దీనికి వర్తిస్తాయి:

  • మన మానసిక సామర్థ్యాలను అదుపులో ఉంచుకోవాలి. “నువ్వు నీ దేవుడైన యెహోవాను . . . నీ నిండు మనసుతో ప్రేమించాలి.” (మత్తయి 22:37, 38) “మీ ఆలోచనా సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగించండి.” (1 పేతురు 1:13) ఒక వ్యక్తి మత్తు పదార్థాన్ని తీసుకున్నప్పుడు తన మనసును పూర్తిగా అదుపులో ఉంచుకోలేడు. వాటిని తీసుకునే చాలామంది వాటికి బానిసలైపోతారు. వాళ్ల మనసంతా మంచి విషయాల మీద కాకుండా మత్తు పదార్థాలను కొనడం, వాటిని ఉపయోగించడం మీదే ఎప్పుడూ ఉంటుంది.—ఫిలిప్పీయులు 4:8.

  • ప్రభుత్వ చట్టాలకు లోబడండి. ‘ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడి ఉండండి.’ (తీతు 3:1) చాలా దేశాల్లో కొన్నిరకాల మత్తు పదార్థాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలకు లోబడాలి.—రోమీయులు 13:1.

పొగాకు, మీ ఆరోగ్యం

పొగాకు తీసుకోవడం వల్ల వచ్చే జబ్బులతో ప్రతీ సంవత్సరం దాదాపు 60 లక్షలమంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అంతేకాదు, వాళ్లలో 6 లక్షల కంటే ఎక్కువమంది, పొగతాగడం వల్ల కాదుగానీ దాన్ని తాగేవాళ్ల పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల జబ్బులకు గురైయ్యారని ఆ అంచనా చెప్తుంది. పొగాకు తీసుకునేవాళ్లకే కాదు, అలాంటివాళ్ల పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్లకు కూడా ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో గమనించండి.

క్యాన్సర్‌. పొగాకు నుండి వచ్చే పొగలో క్యాన్సర్‌కు దారితీసే 50 రకాల రసాయనాలు ఉంటాయి. పొగాకు పొగ వల్లే “90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు వస్తున్నాయి” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. పొగాకు నుండి వచ్చే పొగ కారణంగా నోరు, వాయునాళం, ఆహారగొట్టం, గొంతు, స్వరపేటిక, కాలేయం, క్లోమం, మూత్రాశయం వంటి అవయవాలకు కూడా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

శ్వాసకోశ వ్యాధులు. పొగాకు నుండి వచ్చే పొగ వల్ల న్యూమోనియా, ఇన్‌ఫ్లూయెంజా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ పొగను తరచూ పరోక్షంగా పీల్చి చాలామంది పిల్లలు ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గు, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవడం వంటి రోగాలతో బాధపడుతున్నారు.

గుండెజబ్బు. పొగతాగడం వల్ల గుండెపోటు లేదా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. పొగాకు నుండి వచ్చే పొగలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉంటుంది. అది సులభంగా ఊపిరితిత్తుల నుండి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి, ఆక్సిజన్‌ స్థానంలో అది ప్రసరిస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ తక్కువైతే శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది.

పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కడుపుతో ఉన్న స్త్రీలు పొగతాగడం వల్ల, పిల్లలు నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం లేదా గ్రహణం మొర్రి వంటి లోపాలతో పుట్టడం జరుగుతుంది. అలాంటి పిల్లలకు శ్వాసకోశ సమస్యలు లేదా సడన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశం కూడా ఉంది.

a ఇక్కడ పొగతాగడం అంటే సిగరెట్టు, బీడీలు, చుట్టలు, గొట్టాలు ద్వారా పొగాకును ఇష్టపూర్వకంగా పీల్చడం. ఇప్పుడు చర్చించబోయే సూత్రాలు పొగాకు నమలడం, ముక్కుపొడి పీల్చడం, నికొటీన్‌ ఉండే ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు తాగడం అలాంటి మరితర వాటికి కూడా వర్తిస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి